భారత్‌లోకి గూగుల్ పేమెంట్ యాప్
భారత్‌లోకి గూగుల్ పేమెంట్ యాప్
Published Thu, Sep 14 2017 3:24 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం భారత్‌లో పేమెంట్ యాప్‌లకు భారీగా డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని కంపెనీలు యూపీఏ ఆధారిత పేమెంట్ యాప్‌లను వినియోగదారులకు ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా పేమెంట్ యాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే వారంలో యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ సర్వీసు ''తేజ్''ను గూగుల్ లాంచ్ చేయబోతుంది. సెప్టెంబర్ 18న గూగుల్ భారత్‌లోకి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టబోతుందని ది-కెన్.కామ్ రిపోర్టు చేసింది.
గూగుల్ లాంచ్ చేయబోతున్న తేజ్ అంటే హిందీలో వేగవంతం అని అర్థం. ఇది అచ్చం ఆండ్రాయిడ్ పే లాగా పనిచేస్తోంది. యూపీఐ పేమెంట్ సిస్టమ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ పేమెంట్ సిస్టమ్‌ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు బ్యాంకు అకౌంట్ల మధ్య వెనువెంటనే ఫండ్ ట్రాన్సఫర్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ ద్వారా వీలవుతుంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ కూడా ఈ డిజిటల్ పేమెంట్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఎన్‌పీసీఐతో ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సంప్రదింపులు జరుపుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీచాట్, హైక్ మెసెంజర్ వంటి కొన్ని మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులను సపోర్టు చేస్తున్నాయి.
Advertisement
Advertisement