Tez
-
నీట్ అండ్ క్లీన్ మూవీ
‘‘క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో 35 సంవత్సరాల క్రితం నుంచి సినిమాలు తీస్తున్నా. మా సంస్థ నుంచి ఇప్పటివరకు 44 సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు తీస్తున్న ‘తేజ్’ 45వ సినిమా. ఇంకా వైవిధ్యమైన మంచి సినిమాలు ప్రేక్షకులకు అందించాలని ఆరాట పడుతున్నా. నా చివరి శ్వాస వరకూ సినిమాలు తీస్తూనే ఉంటా’’ అని నిర్మాత కె.ఎస్. రామారావు అన్నారు. సాయిధరమ్ తేజ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘తేజ్’. ‘ఐ లవ్ యు’ అన్నది ఉపశీర్షిక. కె.ఎస్. రామారావు, వల్లభ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా కె.ఎస్. రామారావు మాట్లాడుతూ– ‘‘మంచి లవ్, ఫ్యామిలీ డ్రామా ఇది. డబుల్ మీనింగ్ డైలాగ్స్, సెన్సార్ కట్స్కి వీలు లేకుండా నీట్‌గా, క్లీన్‌గా సెంటిమెంట్, ఎమోషన్స్‌ని కలగలిపి కరుణాకరన్ అత్యద్భుతంగా చిత్రీకరించారు. ఎంత పెద్ద హీరో అయినా కరుణాకరన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటారని నా నమ్మకం. అలాంటి ఆయనతో ‘వాసు’ చిత్రం తర్వాత నేను రెండో సినిమా ‘తేజ్’ తీశా. ఈ చిత్రంలోని మొదటి పాటని క్రికెట్ మ్యాచ్ ద్వారా రేపు రిలీజ్ చేస్తున్నాం. 9న పాటలు విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘ఈ బేనర్లో ఇంత మంచి సినిమా చేసినందుకు గర్వంగా ఉంది. క్యూట్ లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ‘తేజ్’ చిత్రం అందరికీ నచ్చుతుంది. తేజ్, అనుపమ సూపర్బ్‌గా చేశారు’’ అన్నారు కరుణాకరన్. -
దిగ్గజాలకు షాక్: ఫోన్ పేలో భారీ పెట్టుబడులు
సాక్షి,ముంబై: డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పేకు మాతృసంస్థ నుంచి భారీ నిధులు సమకూరాయి. ఆన్లైన్ రిటైల్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ ఫోన్ పేకు రూ. 518 కోట్ల నిధులను అందించింది. డిజిటల్ పేమెంట్స్‌కు దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ ఈ చర్య తీసుకుంది. తద్వారా దేశంలో టాప్ కంపెనీగా ఎదగాలని పథకాలు రచిస్తోంది. ముఖ్యంగా ప్రత్యర్థులు గూగుల్ తేజ్ పేటీఎం, అమెజాన్ పే లాంటి దిగ్గజ సంస్థలకు షాకిచ్చేలా ఈ నిర్ణయం తీసుకుంది. సింగపూర్‌కు చెందిన పేరెంట్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ చెల్లింపుల ప్లాట్‌ఫాం ఫోన్ పే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (సిఆర్సీ) తో దాఖలు చేసిన తాజా రెగ్యులేటరీ డాక్యుమెంట్ల ప్రకారం 518 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఈ తాజా క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ మార్చి 19 న జరిగింది. రాబోయే సంవత్సరాల్లో తన చెల్లింపుల వ్యాపారం కోసం ఈ పెట్టుబడులను వెచ్చించినట్టు ఫోన్ పే తెలిపింది. -
చార్జీల భారం లేకుండా చెల్లింపులు
న్యూఢిల్లీ: తేజ్ యాప్ వినియోగదారులకు శుభవార్త. ఒక బ్యాంక్ ఖాతా నుంచి మరొక బ్యాంక్ ఖాతాకు డబ్బుల్ని పంపడం, పొందటం వంటి డిజిటల్ పేమెంట్స్ కోసం గూగుల్ ఇండియా గతేడాది సెప్టెంబర్‌లో ఒక మొబైల్ వాలెట్ యాప్ ‘తేజ్’ను మార్కెట్లో ఆవిష్కరించింది. సంస్థ ఇప్పుడు ఈ యాప్‌ను సరికొత్త ఫీచర్‌తో అప్డేట్ చేసింది. యుటిలిటీ బిల్ పేమెంట్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో యూజర్లు తేజ్ యాప్ ద్వారా వాటర్, ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్, మొబైల్ బిల్లులను చెల్లించొచ్చు. అది కూడా ఎటువంటి ట్రాన్సాక్షన్ చార్జీలు లేకుండా. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేసే తేజ్ యాప్ ద్వారా దాదాపు 90 యుటిలిటీ సంస్థల కస్టమర్లు వారి బిల్లులను ఆన్లైన్లో చెల్లించొచ్చని సంస్థ పేర్కొంది. ‘మా డిజిటల్ పేమెంట్స్ యాప్‌కి కొత్తగా బిల్ పే ఫీచర్‌ను జోడించాం. దీంతో ఎలక్ట్రిసిటీ, వాటర్, గ్యాస్, డీటీహెచ్, ఇన్సూరెన్స్ ప్రీమియం సహా వివిధ రకాల బిల్లులను చెల్లించొచ్చు’ అని గూగుల్ నెక్స్ బిలియన్ యూజర్స్ (కామర్స్ అండ్ పేమెంట్స్ విభాగం) వైస్ ప్రెసిడెంట్ డయానా లేఫీల్డ్ వివరించారు. బిల్లు గడువు దగ్గరకు వచ్చినప్పుడు తేజ్ యాప్ నోటిఫికేషన్ ద్వారా ఆ విషయాన్ని యూజర్లకు గుర్తు చేస్తుందని తెలిపారు. -
భారత్‌లోకి గూగుల్ పేమెంట్ యాప్
సాక్షి, న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు అనంతరం భారత్‌లో పేమెంట్ యాప్‌లకు భారీగా డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అన్ని కంపెనీలు యూపీఏ ఆధారిత పేమెంట్ యాప్‌లను వినియోగదారులకు ఆవిష్కరిస్తున్నాయి. తాజాగా సెర్చింజిన్ దిగ్గజం గూగుల్ కూడా పేమెంట్ యాప్‌ను లాంచ్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే వారంలో యూపీఐ ఆధారిత డిజిటల్ పేమెంట్ సర్వీసు ''తేజ్''ను గూగుల్ లాంచ్ చేయబోతుంది. సెప్టెంబర్ 18న గూగుల్ భారత్‌లోకి వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టమ్‌లోకి అడుగుపెట్టబోతుందని ది-కెన్.కామ్ రిపోర్టు చేసింది. గూగుల్ లాంచ్ చేయబోతున్న తేజ్ అంటే హిందీలో వేగవంతం అని అర్థం. ఇది అచ్చం ఆండ్రాయిడ్ పే లాగా పనిచేస్తోంది. యూపీఐ పేమెంట్ సిస్టమ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. ఈ పేమెంట్ సిస్టమ్‌ను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేస్తుంది. మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా రెండు బ్యాంకు అకౌంట్ల మధ్య వెనువెంటనే ఫండ్ ట్రాన్సఫర్ చేసుకోవడానికి ఈ సిస్టమ్ ద్వారా వీలవుతుంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ కూడా ఈ డిజిటల్ పేమెంట్‌లోకి అడుగుపెట్టబోతుంది. ఎన్పీసీఐతో ఈ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ సంప్రదింపులు జరుపుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. వీచాట్, హైక్ మెసెంజర్ వంటి కొన్ని మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్స్ ఈ యూపీఐ ఆధారిత పేమెంట్ సర్వీసులను సపోర్టు చేస్తున్నాయి.