యూపీఐ చెల్లింపుల్లో ఎదురు లేకుండా దూసుకుపోతున్న ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే అరుదైన ఘనత సాధించింది. వార్షిక మొత్తం చెల్లింపు విలువ రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లు (రూ. 84 లక్షల కోట్లు) సాధించినట్లు ఫోన్‌పే తెలిపింది.
దేశంలోని టైర్ 2, 3, 4 నగరాలే కాకుండా దాదాపు అన్ని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో సేవలందిస్తూ మూడున్నర కోట్ల మందికిపైగా ఆఫ్‌లైన్ వ్యాపారులను డిజిటలైజ్ చేసినట్లు కంపెనీ పేర్కొంది.
ఇదీ చదవండి: రైళ్లలో సూపర్ సౌకర్యాలు.. ఇక అంతా ఆటోమేటిక్కే!
టోటల్ పేమెంట్ వ్యాల్యూ(టీపీవీ) రన్ రేట్ 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకోవడం సంతోషంగా ఉందని ఫోన్‌పే కన్స్యూమర్ బిజినెస్ హెడ్ సోనికా చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. యూపీఐ లైట్, యూపీఐ ఇంటర్నేషనల్, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి ఆఫర్‌లతో దేశంలో కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు.
పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్‌కు ఆమోదం?
యూపీఐ చెల్లింపు విభాగంలో 50 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉండటంతోనే తమకు ఈ ఘనత సాధ్యమైందని కంపెనీ తెలిపింది. మరోవైపు పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment