ముంబై: మార్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం భారత్‌పే అరుదైన ఫీట్‌ను సాధించింది. కంపెనీ 370 మిలియన్ డాలర్లను సేకరించి యూనికార్న్ క్లబ్‌లోకి జాయిన్ అయ్యింది. ఈ నిధులను టైగర్ గ్లోబల్ సంస్థ నుంచి సేకరించింది. భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ఆయా స్టార్టప్‌లు గణనీయంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. భారత్‌పే ప్రస్తుత విలువ 2.85 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ఈ సంవత్సరం 19 వ యూనికార్న్ స్టార్టప్‌గా భారత్‌పే నిలిచింది. ఒక స్టార్టప్ విలువ ఒక బిలియన్ డాలరుకు చేరిన స్టార్టప్‌ను యూనికార్న్ స్టార్టప్‌గా పిలుస్తారు. డ్రాగోనీర్ ఇన్వెస్ట్‌మెంట్ గ్రూప్, స్టెడ్‌ఫాస్ట్ క్యాపిటల్ కంపెనీలో భారత్‌పే కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం భారత్‌పే సంస్థాగత పెట్టుబడిదారుల్లో కోటు మేనేజ్‌మెంట్, ఇన్‌సైట్ పార్ట్‌నర్స్, సీక్వోయా గ్రోత్, రిబ్బిట్ క్యాపిటల్, ఆంప్లో కంపెనీలు నిలిచాయి.
తొమ్మిది నెలల క్రితం భారత్‌పే విలువ 900 మిలియన్ డాలర్లుకు ఉండేది. ప్రస్తుతం 370 మిలియన్ల డాలర్ల పెట్టుబడిలో, సెకండరీ భాగం లో 20 మిలియన్ డాలర్లు కంపెనీ ఉద్యోగులకు క్యాష్ అవుట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. భారత్‌పే కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్‌లో రీఆరెంజ్‌మెంట్‌ను కూడా చేయనుంది. కంపెనీ కో-ఫౌండర్, సీఈవో..అష్నీర్ గ్రోవర్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నుకోనున్నారు. సుహైల్ సమీర్‌ను కంపెనీ కొత్త సీఈవోగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment