Unicorn startup Founders
-
సెలబ్రిటీలు ఇన్వెస్ట్ చేసిన యూనికార్న్‌లు ఇవే..
సమాజంలో పేరుప్రఖ్యాతలు ఉన్న సెల్రబిటీలు తాము సంపాదిస్తున్న డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారనే అనుమానం ఎప్పుడైనా కలిగిందా.. టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో సమీప భవిష్యత్తులో టెక్ కంపెనీలు అనూహ్యంగా వృద్ధి చెందుతాయని నమ్మి వాటికి వెంచర్కాపిటలిస్ట్లుగా, ఏంజిల్ ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. వాటిలో పెట్టుబడి పెట్టి తమ సంపదను మరింత పెంచుకుంటున్నారు. అప్పటికే వారి రంగాల్లో అన్నివిధాలా సక్సెస్ అయినవారు కేవలం ఆలోచనే వ్యాపారంగా మొదలయ్యే స్టార్టప్‌ల్లో పెట్టుబడి అంటే కాస్త రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అలాంటి వాటిలోనూ కొందరు క్రికెటర్లు, సినీ ప్రముఖులు విజయం సాధించారు. అంతేకాదు తాము ఇన్వెస్ట్ చేసిన కంపెనీలు యూనికార్న్ హోదాను సైతం దక్కించుకున్నాయి. ఈక్విటీకి బదులుగా చిన్న వ్యాపార సంస్థల్లో ఇన్వెస్ట్ చేసే వారిని ఏంజెల్ ఇన్వెస్టర్లు అంటారు. అలా సినీ, క్రికెట్ ప్రముఖులు ఏంజెల్ ఇన్వెస్టర్లుగా ఉన్న కొన్ని స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా(కంపెనీ విలువ రూ.8300 కోట్లు) మారాయి. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. విరాట్ కోహ్లీ-మొబైల్ ప్రీమియర్ లీగ్ మొబైల్ ప్రీమియర్ లీగ్ ఆన్లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్ 2018లో ప్రారంభమైంది. 2019లో కోహ్లీ ఇందులో ఇన్వెస్ట్ చేశారు. 2021లో 150 మిలియన్ డాలర్లు నిధులను కంపెనీ సమీకరించింది. దీంతో 2.3 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్ క్లబ్లో చేరింది. విరుష్క దంపతులు-డిజిట్ ఇన్సురెన్స్ డిజిటల్ ఇన్సురెన్స్ కంపెనీ అయిన ‘డిజిట్ ఇన్సురెన్స్’ 2016లో ప్రారంభమైంది. ఈ కంపెనీలో విరాట్-అనుష్కశర్మ దంపతులు 2020లో ఆ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. 2021లో 1.9 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో ఈ కంపెనీ యూనికార్న్‌గా అవతరించింది. మహేంద్ర సింగ్ ధోనీ-కార్స్24 కార్స్24 అనే ప్రీ ఓన్డ్ కార్స్ విక్రయాలు, ఫైనాన్సింగ్ చేపట్టే సంస్థను 2015లో మొదలుపెట్టారు. ఈ కంపెనీలో మహేంద్ర సింగ్ ధోనీ 2019లో ఇన్వెస్ట్ చేశారు. ఈ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ కూడా మహీనే. 2020లో 200 మిలియన్ డాలర్లను కంపెనీ సమీకరించింది. 1 బిలియన్ డాలర్ల వాల్యూషన్‌తో యూనికార్న్ స్టేటస్ సంపాదించింది. శ్రద్ధా కపూర్-మైగ్లామ్ ఆన్లైన్ మేకప్ బ్రాండ్ మైగ్లామ్ 2017లో మొదలుపెట్టారు. 2021 జూన్‌లో శ్రద్ధా కపూర్ పెట్టుబడి పెట్టారు. 2021 నవంబర్‌లో ఈ కంపెనీ యూనికార్న్ స్టార్టప్ హోదా సాధించింది. సచిన్ తెందూల్కర్-స్పిన్నీ పాత కార్లను విక్రయించే సంస్థ స్పిన్నీను 2015లో స్థాపించారు. సచిన్ తెందూల్కర్ 2021లో ఇందులో పెట్టుబడి పెట్టారు. ఈ కంపెనీకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. 2021 నవంబర్‌లో ఇది యూనికార్న్‌లో చేరింది. శిఖర్ ధావన్-అప్‌స్టాక్స్ ఆన్లైన్ స్టాక్‌బ్రోకర్ అయిన అప్‌స్టాక్స్‌ను 2012లో ప్రారంభించారు. క్రికెటర్ శిఖర్ ధావన్ 2022లో ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. ఆయన పెట్టుబడి పెట్టడానికి ఏడాది ముందే అంటే 2021 నవంబర్లోనే ఈ కంపెనీ యూనికార్న్ జాబితాలో చోటు దక్కించుకుంది. తాజాగా విడుదలైన హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2024 నివేదిక ప్రకారం.. 2023లో ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 171 అంకురాలు యూనికార్న్ హోదా సాధించాయి. అంటే ఏడాదిలో రెండు రోజులకు ఒక కొత్త యూనికార్న్ పుట్టుకొచ్చింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,453 యూనికార్న్‌లున్నాయి. 2022తో పోలిస్తే 7% అధికంగా కొత్త సంస్థలు ఈ జాబితాలో చేరినట్లు నివేదికలో తెలిపారు. -
ఇదీ ఇండియన్స్ సత్తా! ఆనంద్ మహీంద్రా ఆసక్తికర ట్వీట్
Anand Mahindra Tweet: సోషల్ మీడియాలో చరుగ్గా ఉండే మహింద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా విభిన్న అంశాలపై స్పందిస్తుంటారు. అధిక సంఖ్యలో ఉండే తన ఫాలోవర్లకు ఆయా అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటుంటారు. తాజాగా విదేశాల్లో భారతీయుల అభ్యున్నతికి సంబంధించిన అంశంపై స్పందించారు. అమెరికాలో బిలియన్ డాలర్ల కంపెనీలను స్థాపించిన విదేశీ వ్యక్తుల్లో భారతీయులే టాప్ లో ఉన్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ‘వల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్’ ఎక్స్ (ట్విటర్)లో షేర్ చేయగా దాన్ని ట్యాగ్ చేస్తూ ‘ఆశ్చర్యపరిచే గణాంకాలు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశాలకు ఎంత చేస్తున్నారో.. ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి’ అంటూ ట్వీట్ చేశారు. ఒక బిలియన్ డాలర్ అంత కంటే ఎక్కువ విలువైన అమెరికన్ కంపెనీలలో సగానికిపైగా విదేశాల్లో జన్మించి ఆ దేశానికి వలస వచ్చినవారే. వీరిలో భారత్ నుంచి వలస వెళ్లినవారే అత్యధికులు. విదేశీ వలసదారులు స్థాపించిన మొత్తం అమెరికన్ కంపెనీల్లో అత్యధికంగా భారతీయులు 66 కంపెనీలను స్థాపించారు. 54 కంపెనీలతో ఇజ్రాయిల్, 27 కంపెనీలతో యూకే ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. Astonishing figure. Demonstrates what value is brought by Indian Immigrants to a country of their adoption… https://t.co/TjcohqPsWP — anand mahindra (@anandmahindra) August 19, 2023 -
నెమ్మదించిన అంకురాలు.. బిలియన్ డాలర్లు దాటిన స్టార్టప్‌లు ఎన్నంటే..
ముంబై: దేశీయంగా స్టార్టప్ వ్యవస్థలో మందగమనాన్ని సూచిస్తూ 2023లో కొత్త యూనికార్న్‌ల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2022లో మొత్తం 24 అంకుర సంస్థలు ఒక బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ అందుకోగా ఈసారి కొత్తగా మూడు మాత్రమే ఆ హోదా దక్కించుకున్నాయి. మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 84 నుంచి 83కి తగ్గింది. ఆస్క్ ప్రైవేట్ వెల్త్ హురున్ ఇండియన్ ఫ్యూచర్ యూనికార్న్ సూచీ 2023 నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఇన్వెస్టర్లలో పెట్టుబడులపై ఆసక్తి మందగించడంతో అంకుర సంస్థలకు నిధుల లభ్యత తగ్గుతోందనడానికి తాజా పరిణామం నిదర్శనమని ఆస్క్ ప్రైవేట్ వెల్త్ సీఈవో రాజేష్ సలూజా తెలిపారు. పలు స్టార్టప్‌ల వ్యాపార విధానాలు పటిష్టమైనవిగా లేకపోవడం వేల్యుయేషన్ల తగ్గుదలకు దారితీసిందని, అయితే సరైన కంపెనీలకు మాత్రం పెట్టుబడులు లభిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బైజూస్ వంటి కొన్ని స్టార్టప్‌లలో సమస్యలు నెలకొన్నప్పటికీ భారతీయ స్టార్టప్ వ్యవస్థకు ఫండింగ్పై ప్రతికూల ప్రభావాలేమీ ఉండబోవని సలూజా చెప్పారు.భారత్‌లో అంకుర సంస్థల వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, వచ్చే అయిదేళ్లలో దేశీయంగా యూనికార్న్‌ల సంఖ్య 200కు చేరగలదని అంచనా వేస్తున్నట్లు హురున్ ఇండియా చీఫ్ రీసెర్చర్ అనాస్ రెహ్మాన్ జునైద్ చెప్పారు. చైనాలో 1,000కి పైగా యూనికార్న్‌లు ఉన్నాయని.. భారత్ ఆర్థికంగా ఎదగాలంటే స్టార్టప్‌లు చాలా కీలకమన్నారు. ♦ అంకుర సంస్థలను యూనికార్న్‌లు (ఒక బిలియన్ డాలర్ల వేల్యుయేషన్), గెజెల్స్ (500 మిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ కలిగి ఉండి, మూడేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే అవకాశం ఉన్నవి), చీతాలు (250 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్, అయిదేళ్లలో యూనికార్న్‌లుగా ఎదిగే అవకాశం ఉన్నవి)గా వర్గీకరించారు. ♦ 250 మిలియన్ డాలర్ల పైగా వేల్యుయేషన్ ఉన్న మొత్తం అంకుర సంస్థల సంఖ్య గతేడాది 122గా ఉండగా 2023లో 147కి చేరింది. -
ఏడాదిలో కొత్తగా 14 స్టార్టప్‌లకు యూనికార్న్ హోదా
సాక్షి, అమరావతి: యూనికార్న్ స్టార్టప్‌లు వేగంగా విస్తరిస్తున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గడిచిన ఏడాది కాలంలో కొత్తగా 14 స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను దక్కించుకున్నాయి. మొత్తం 68 యూనికార్న్‌లతో ఇండియా మూడో స్థానంలో నిలిచింది. కొత్తగా వ్యాపారం ప్రారంభించిన స్టార్టప్ కంపెనీ వ్యాపార విలువ 1 బిలియన్ డాలర్లు (రూ.8,200 కోట్లు) దాటితే ఆ సంస్థలను యూనికార్న్‌లుగా పిలుస్తారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 68 స్టార్టప్‌లకు ఈ హోదా దక్కినట్లు హూరన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ – 2023 వెల్లడించింది. ఇందులో అత్యధికంగా బైజూస్ 22 బిలియన్ డాలర్ల (రూ.1,80,400 కోట్లు)తో మొదటి స్థానంలో నిలిచింది. డ్రీమ్ 11, స్విగ్గీలు 8 బిలియన్ డాలర్ల (రూ.65,600 కోట్ల)తో తర్వాతి స్థానాల్లో ఉంటే, ఓలా, రాజోర్పేలు 7.5 బిలియన్ డాలర్లు (రూ. 61,500 కోట్లు)తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కానీ భారత సంతతికి చెందిన వారు ఏర్పాటు చేసిన యూనికార్న్ స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా 138 వరకు ఉన్నట్లు హూరన్ పేర్కొంది. భారతీయులు దేశంలోకంటే బయటి దేశాల్లో 70కి పైగా యూనికార్న్‌లను కలిగి ఉన్నట్లు హూరన్ పేర్కొంది. ఇండియాలో అత్యధికంగా యూనికార్న్‌లు బెంగళూరు, ముంబై నగరాల్లో ఉన్నాయి. బెంగళూరు కేంద్రంగా 33, ముంబై కేంద్రంగా 13 ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా యూనికార్న్‌ల విలువ రూ.352.6 లక్షల కోట్లు ప్రపంచవ్యాప్తంగా 1,361 యూనికార్న్‌లు ఉన్నట్లు హూరన్ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే కొత్తగా 303 స్టార్టప్‌లు యూనికార్న్ హోదాను దక్కించుకున్నట్లు తెలిపింది. మొత్తం యూనికార్న్‌ల వ్యాపార విలువ గతేడాదితో పోలిస్తే 17 శాతం పెరిగి రూ.352.6 లక్షల కోట్లు (4.3 ట్రిలియన్ డాలర్లు) దాటినట్లు పేర్కొంది. ఇందులో అత్యధికంగా అమెరికాలో 666 యూనికార్న్‌లు ఉండగా, 316 సంస్థలతో చైనా రెండో స్థానంలో ఉంది. నగరాల ప్రకారం చూస్తే శాన్ఫ్రాన్సిస్కో 181 యూనికార్న్‌లతో మొదటి స్థానంలో నిలిస్తే, న్యూయార్క్ 126, బీజింగ్ 79, షాంఘై 66 యూనికార్న్‌లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రస్తుతం 500 మిలియన్ డాలర్ల విలువకు (వీటిని గాజెల్స్ అంటారు) చేరుకొని వచ్చే మూడేళ్లలో బిలియన్ డాలర్ల మార్క్‌ను అందుకోవడం ద్వారా యూనికార్న్ హోదా పొందే సంస్థలు అత్యధికంగా బెంగళూరు కేంద్రంగా ఉన్నాయని తెలిపింది. గాజెల్స్ యూనికార్న్‌లుగా ఎదిగే నగరాల్లో బెంగళూరు ప్రపంచంలో 8వ స్థానంలో నిలిచింది. -
స్టార్టప్స్‌కు తగ్గిన నిధులు
భారతీయ స్టార్టప్స్ 2022 క్యూ1లో 12 బిలియన్ డాలర్ల నిధులను అందుకున్నాయి. 2023 జనవరి–మార్చిలో ఇది 3 బిలియన్ డాలర్లకు పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యూనికార్న్ కంపెనీల జాబితాలో 2023 జనవరి–మార్చిలో కొత్తగా ఏ కంపెనీ చోటు సంపాదించలేదు. 2022 క్యూ1తో పోలిస్తే నిధులు 75 శాతం పడిపోయాయి. డీల్స్ సంఖ్య 58 శాతం తగ్గింది. 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువ చేసే డీల్స్ 77 శాతం క్షీణించాయి. ఇదీ 2023 మార్చి త్రైమాసికంలో భారత స్టార్టప్స్ స్టోరీ. ఇంక్42 రూపొందించిన ఇండియన్ టెక్ స్టార్టప్ ఫండింగ్ నివేదికలో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి. ఫిన్‌టెక్ ముందంజలో.. మార్చి త్రైమాసికంలో అందుకున్న నిధుల విషయంలో ఫిన్‌టెక్ కంపెనీల వాటా ఏకంగా 44.9 శాతం ఉంది. ఈ–కామర్స్ 22.1 శాతం, ఎంటర్ప్రైస్టెక్ 6.8, కంన్జ్యూమర్ సర్విసెస్ 6.5, డీప్‌టెక్ 5.1, ఎడ్టెక్ 3.5, మీడియా, వినోదం 2.7, ఇతర కంపెనీలు 8.4 శాతం కైవసం చేసుకున్నాయి. డీల్స్ సంఖ్య పరంగా ఎంటర్ప్రైస్టెక్ 41, ఈ–కామర్స్ 40, ఫిన్‌టెక్ 25, డీప్‌టెక్ 21, ఎడ్టెక్ 17, మీడియా, వినోదం 16, హెల్త్‌కేర్ 13, ఇతర రంగాల కంపెనీలు 40 చేజిక్కించుకున్నాయి. విలీనాలు, కొనుగోళ్లు 2022 క్యూ1లో ఆల్‌టైమ్ హై రికార్డులతో 100 నమోదైతే, ఈ ఏడాది ఇదే కాలంలో 35కు వచ్చి చేరాయి. 2022 సెపె్టంబర్లో టాటా 1 ఎంజీ తర్వాత యూనికార్న్ కంపెనీల జాబితాలో కొత్త కంపెనీ చేరకపోవడం గమనార్హం. పడిన సీడ్ ఫండింగ్.. మందగమనం ఉన్నప్పటికీ భారత్ స్టార్టప్స్‌కు అత్యధిక సీడ్ ఫండింగ్ 2022లో సమకూరింది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికం. 2014 నుంచి 2022 మధ్య సేకరించిన 5 బిలియన్ డాలర్ల సీడ్ ఫండ్‌లో 2 బిలియన్ డాలర్లు 2022లో నమోదు కావడం విశేషం. సీడ్ ఫండింగ్ గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 2023 మార్చి త్రైమాసికంలో 81% క్షీణించి 180 మిలియన్ డాలర్లుగా ఉంది. స్టార్టప్ వ్యవస్థలో భారీ నిధుల దిద్దుబాటును ఇది సూచిస్తోంది. మార్కెట్లు పుంజుకున్న తర్వాత మంచి వాల్యుయేషన్‌తో నిధులను సేకరించాలని వ్యవస్థాపకులు యోచిస్తున్నారు. వర్కింగ్ క్యాపిటల్‌కు చివరి దశలో రుణ నిధుల సాధనాల వైపు పరిశ్రమ మళ్లాల్సి వస్తోంది. కారణం ఏమంటే.. కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, రూపాయి విలువ పడిపోవడం, సిలికాన్ వ్యాలీ బ్యాంక్ పతనం, ఆర్థిక అనిశ్చితి వంటి ఇతర విషయాల కారణంగా పెట్టుబడిదారులు భయపడుతున్నారు. అంతే కాకుండా భారతీయ స్టార్టప్‌ల ఆదాయాలు క్షీణించడం, వాటి పెరుగుతున్న నష్టాలు, వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకువెళ్లేందుకు వ్యవస్థాపకులు వ్యూహాలను కనుగొనడంలో విఫలం కావడం పెట్టుబడి సెంటిమెంట్‌ను స్పష్టంగా దెబ్బతీసింది. 2021 బుల్ రన్ తర్వాత నిధుల రాక తీరు చూస్తుంటే మహమ్మారి ముందస్తు స్థాయికి పడిపోయినట్టు అవగతమవుతోంది. ఈ సంవత్సరం వృద్ధి దశలో మూలధనాన్ని సేకరించడం సవాలుగా ఉంటుందని 84% పెట్టుబడిదారులు అభిప్రాయపడ్డారు. ఇవీ గణాంకాలు.. సిరీస్ సి–రౌండ్స్‌లో గరిష్ట కరెక్షన్తో ఈ ఏడాది జనవరి–మార్చిలో మెగా డీల్స్ 77 శాతం పడిపోయి ఏడుకు వచ్చి చేరాయి. 2022 క్యూ1లో ఈ సంఖ్య 30గా ఉంది. మెగా డీల్స్ సంఖ్య తగ్గడం 2023 క్యూ1లో భారతీయ స్టార్టప్‌లు సేకరించిన మొత్తం నిధులపై ప్రభావం చూపింది. ఫండింగ్ పరంగా ఈ ఏడాది క్యూ1లో టాప్–3లో నిలిచిన ఫోన్‌పే 650 మిలియన్ డాలర్లు, లెన్స్‌కార్ట్ 500 మిలియన్ డాలర్లు, ఇన్సూరెన్స్‌దేఖో 150 మిలియన్ డాలర్లు అందుకున్నాయి. గతేడాది జనవరి–మార్చిలో మొత్తం 506 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి క్వార్టర్లో ఈ సంఖ్య 213కు పరిమితమైంది. 2020 క్యూ1లో 3.4 బిలియన్ డాలర్ల విలువ చేసే 212 డీల్స్ నమోదయ్యాయి. 2023 మార్చి త్రైమాసికంలో లేట్ స్టేజ్ ఫండింగ్ 77 శాతం పడిపోయి 1.8 బిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. గ్రోత్ స్టేజ్ ఫండింగ్ 76% క్షీణించి 700 మిలియన్ డాలర్లకు వచ్చి చేరింది. సిరీస్–ఏ డీల్స్ 58 నుంచి 30కి, సిరీస్–బీ డీల్స్ 28 నుంచి 4కు పడిపోయాయి. -
యూనికార్న్‌ల కీలక భేటీ
న్యూఢిల్లీ: ఐపీవోకు రావాలనుకుంటున్న 10 యూనికార్న్‌లతో జేపీ మోర్గాన్, జపాన్‌కు చెందిన సాఫ్ట్ బ్యాంకు ఇటీవల సమావేశాన్ని నిర్వహించాయి. బెంగళూరులో ఈ నెల 3, 4వ తేదీల్లో ఇది జరిగింది. వచ్చే మూడేళ్లలో ఐపీవోకు వచ్చే సన్నాహాలతో ఉన్న స్విగ్గీ, అన్అకాడమీ తదితర యూనికార్న్లతోపాటు మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం ఇందులో పాల్గొన్నాయి. మామాఎర్త్, లెన్స్‌కార్ట్, అకో, మీషో, ఎలాస్టిక్‌రన్, ఇన్‌మొబి సైతం ఇందులో పాల్గొన్నాయి. హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, యాక్సిస్ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, యూటీఐ తదితర 14 దేశీయ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు సైతం పాలు పంచుకున్నాయి. పబ్లిక్ మార్కెట్ ఇన్వెస్టర్లను యూనికార్న్‌లు మెరుగ్గా అర్థం చేసుకునేందుకు, మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు, యూనికార్న్‌ల మధ్య మెరుగైన సమాచార సంప్రదింపులకు వీలుగా ఈ సమావేశం నిర్వహించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతేడాది వచ్చిన పేటీఎం, జొమాటో సెకండరీ మార్కెట్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో జరిగిన ఈ భేటీకి ప్రాధాన్యం నెలకొంది. -
రూ. 40కోట్ల జీతం ఇస్తామన్నా వద్దన్నాడు.. చివరికి..
య్యూట్యూబ్‌లో పాఠాలు చెబితే వేలల్లో చందాదారులు, లక్షల రూపాయల్లో ఆదాయం అని అందరూ అంటూనే విని ఆయన తన లెక్చరర్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు. ఇక యూట్యూబ్‌లో డబ్బులే డబ్బులు అనుకుంటే ఆరేళ్ల వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కిందామీద పడా అక్కడ డబ్బులొచ్చే సమయంలో ఏడాదికి రూ. 40 కోట్లతో జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంత గొప్ప ఆఫర్ వదులుకున్న అతని జీవితం చివరికి ఏ మలుపు తీసుకుందంంటే ? ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన అలఖ్ పాండే ఆర్థికంగా అంత గొప్ప కుటుంబం కాదు. ప్రతీ నెల చివర డబ్బుల కోసం జేబులు తడుముకోవాల్సి వచ్చేది. దీంతో తన ఖర్చుల కోసం 9వ తరగతి నుంచే ఐదారు తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలెట్టారు. అవసరం కోసం మొదలైన ట్యూషన్లు చివరికి వ్యాపకంగా మారిపోయాయి. ఇంటర్లో ఉంటూనే టెన్త్ స్టూడెంట్లకు పాఠాలు చెప్పాడు. ఐఐటీలో సీటు పొందడం లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక ఇబ్బందులు, గైడెన్స్ లేక ఆ కల నెరవేర్చుకోలేకపోయాడు. లక్షల్లో జీతం చిన్న తనం నుంచి టీచింగ్ అలవాటై పోవడంతో ఉద్యోగ ప్రయత్నాలు మాని ట్యూషన్లు చెప్పడం మొదలెట్టాడు అలఖ్ పాండే. ఆనోటా ఈనోటా అలఖ్ పాండే గురించి తెలియడంతో కార్పొరేటు కాలేజీలు కన్నేశాయి. లక్షల రూపాయల వేతనం ఇస్తామంటూ తమ కాలేజీల్లో చేర్చుకున్నాయి. ఇక అప్పటి నుంచి తీరిక లేకుండా క్లాసుల మీద క్లాసులు తీసుకోవడం అలఖ్ పాండే దినచర్యగా మారిపోయింది. ఇలా క్లాసుల వారీగా సెక్షన్ల వారీగా తీసుకోవడం కంటే ఒకేసారి వేలాది మందికి పాఠాలు చెప్పే వెసులుబాటు ఉందంటూ ఓ స్నేహితుడు చెప్పాడు అలోఖ్‌కి. యూట్యూబ్‌లో ఫిజిక్స్‌వాలా పేరుతో 2014లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడు అలోఖ్ ఆరంభంలోనే 10వేల మంది చందాదారులు. అయితే ప్రైవేటు కాలేజీలో పాఠాలు బోధించడం మానలేదు. ఏళ్లు గడుస్తున్నా యూట్యూబ్ ఛానల్‌కి ఆశించినంత స్పందన రాలేదు. అయితే 2016లో డేటా విప్లవం వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దీంతో 2017లో కాలేజీలో వస్తున్న మంచి సంపాదన వద్దనుకుని పూర్తిగా యూట్యూబ్‌కే అంకితమయ్యాడు. ఫిజిక్స్‌వాలా పేరుతో నీట్, జేఈఈ విద్యార్థులకు యూట్యూబ్‌లో కోచింగ్ షురూ చేశారు. రెండేళ్లు కష్టపడితే కానీ 2019లో యూట్యూబ్ ద్వారా ఆదాయం ఆశించినంతగా రాలేదు. బంపర్ ఆఫర్ ఇదే సమయంలో యూట్యూబ్‌ను నమ్ముకుని ఎన్నాళ్లు ఉంటావ్. అరటి పండు ఒలిచినట్టు పాఠాలు చెప్పే సత్తా నీకు ఉంది. మా సంస్థలో చేరమంటూ ఓ ఎడ్టెక్ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. నెలకు రూ. 3.30 కోట్ల వంతున ఏడాదికి రూ.40 కోట్ల వార్షిక వేతనం అందిస్తామంటూ ఆహ్వానం పలికింది. కానీ ఆ ఆఫర్‌ను 2019 చివర్లో సున్నితంగా తిరస్కరించాడు అలోఖ్. అతన్నో పిచ్చోడిలా చూశారంతా ఆ సమయంలో. ఫిజిక్స్వాలకు ప్రాణం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయడంతో ప్రపంచమంతా స్థంభించి పోయింది. అప్పుడు ఆన్లైన్ క్లాసులే విద్యార్థులకు దిక్కయ్యాయి. దీంతో 2020 జూన్‌లో ఫిజిక్స్‌వాలా పేరుతో యాప్ రిలీజ్ చేసి ఎడ్టెక్ రంగంలోకి అడుగు పెట్టాడు. మిగిలిన ఎడ్‌కంపెనీల కంటే తక్కువ ఫీజు ఆఫర్ చేయడం, అప్పటికే మార్కెట్లో అలోఖ్‌కి ఉన్న ఇమేజ్ తోడవటంతో అనతి కాలంలోనే ఫిజిక్స్ వాలా సక్సెస్ ట్రాక్ పట్టింది. త్వరలో యూనికార్న్ రెండేళ్లు గడిచే సరికి ఫిజిక్స్‌వాలా స్టార్టప్‌కి పది లక్షల మంది పెయిండ్ విద్యార్థులు ఎన్రోల్ అయ్యారు. గంటల కొద్ది పాఠాలు అప్లోడ్ అవుతున్నాయి. లాభాల పరంపర మొదలైంది. తొలి ఏడాది రూ.9 కోట్ల లాభం రాగా మలి ఏడాది రూ.24 కోట్ల లాభం నమోదు చేసింది. ఇన్వెస్టర్ల కన్ను పడింది. వెంటనే పెట్టుబడులు వరద మొదలైంది. తాజాగా జరుగుతున్న చర్చలతో గ్లోబల్ ఇన్వెస్టర్ల నుంచి వంద మిలియన్ డాలర్ల పెట్టుబడులకు హామీ సాధించింది. ఈ నిధులు కనుక వస్తే యూనికార్న్ హోదా సాధించిన ఏడో ఎడ్టెక్ కంపెనీగా ఫిజిక్స్‌వాలా రికార్డులకెక్కుతుంది. ఉద్యోగి కాదు యజమాని అంతా కలిపితే అలోఖ్ పాండే ప్రస్తుత వయస్సు 30 ఏళ్లు మాత్రమే. ఇండియాలో యూనికార్న్ హోదా సాధించిన స్టార్టప్‌లలో నూటికి 90 శాతం ఐఐటీ పూర్వ విద్యార్థులవే ఉన్నాయి. కానీ అలోఖ్‌కి ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పాలనే ఆసక్తి. యూట్యూబ్‌లో కామెంట్ సెక్షన్లలో వచ్చే ప్రతిస్పందన ఆధారంగా తన పాఠాలకు మెరుగులు పెట్టుకుంటో ముందుకు పోయాడు. కోట్లాది రూపాలయ వేతనం ఆఫర్ ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. దీంతో కోట్ల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగిగా కాకుంటా కోట్లాది రూపాయల విలువైన కంపెనీకి యజమానిగా నిలిచాడు. చదవండి: వేదాంత డైరీస్ 5: ఏ రిస్క్ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్ -
యూనికార్న్ స్టార్టప్స్ హబ్‌గా విశాఖ
దావోస్: యూనికార్న్ స్టార్టప్స్ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వివిధ స్టార్టప్స్‌కు చెందిన వ్యవస్థాపకులు, సీఓలు, వీటికి సంబంధించిన ముఖ్య అధికారులతో దావోస్‌లో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఏపీలో స్టార్టప్స్ కంపెనీల ఏర్పాటు, వాటి అభివృద్ధిపై చర్చించారు. విశాఖపట్నం కేంద్రంగా స్టార్టప్స్ కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సీఎం జగన్ తెలిపారు. ఇక్కడ పెట్టుబడులకు మీ అందరికీ ఏపీ ఆహ్వానం పలుకుతోందని ఆయన వెల్లడించారు. విధానపరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలపై వారితో సీఎం చర్చించారు. స్టార్టప్‌లు అభివృద్ధిచెందడానికి అన్నిరకాల చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. విద్యారంగం ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని బైజూస్ వైస్ ప్రెసిడెంట్, పబ్లిక్‌పాలసీ సుష్మిత్ సర్కార్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యకు సంబంధించి పరిశోధక, అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదే విధంగా బైజూస్ పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామన్నారు. భూ సర్వే ఏపీలో సమగ్ర భూసర్వే, రికార్డులు భద్రపరచడం.. ఈ అంశాలతో ముడిపడిన సాంకేతిక పరిజ్ఞానం తదితర విషయాలపై కాయిన్‌స్విచ్ క్యూబర్ కంపెనీ వ్యవస్థాపకుడు, గ్రూపు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ సింఘాల్‌తో సీఎం జగన్ చర్చించారు. అనంతరం సింఘాల్ మాట్లాడుతూ.. సమగ్ర భూ సర్వే రికార్డులు నిక్షిప్తం చేయడంతో ఏపీ సర్కారుకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. టూరిజం ఈజ్ మై ట్రిప్ సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్ పిట్టితో సీఎం సమావేశమయ్యారు. ఇందులో ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై వారి మధ్య చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రశాంత్ పిట్టి మట్లాడుతూ.. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి అభివృద్ధికి తమవంతు చేయూత అందిస్తామన్నారు. అంతేకాదు ఏపీలోని పర్యాటక స్థలాలకు మరింత గుర్తింపు తీసుకువస్తామని వెల్లడించారు. మరింత మంది దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసిన వారిలో మీషో వ్యవస్థాపకుడు, సీఈఓ విదిత్ ఆత్రేయ, వీహివ్.ఏఐ వ్యవస్థాపకుడు సతీష్ జయకుమార్, కొర్సెరా వైస్ ప్రెసిడెంట్ కెవిన్ మిల్స్ ఉన్నారు. చదవండి: CM YS Jagan Davos Tour: ఏపీకి మరో రూ.65 వేల కోట్లు -
అంకితి బోస్‌కు షాక్..సీఈవోగా తొలగించిన జిలింగో!
సింగపూర్ ఫ్యాషన్ టెక్నాలజీ కంపెనీ జిలింగో కోఫౌండర్, సీఈవో అంకితి బోస్‌కు భారీ షాక్ తగిలింది. సంస్థ నిధుల్ని దుర్వినియోగం చేశారని విచారణలో తేలడంతో జిలింగో అంకితి బోస్‌ను సంస్థ నుంచి తొలగించింది. బ్లూమ్ బర్గ్ కథనం ప్రకారం..8 దేశాల్లో వ్యాపార సామ్రాజ్యం..500మంది ఉద్యోగులు.. రూ7వేల కోట్ల రూపాయలకు పైగా లావాదేవీలు..ఇవన్నీ సాధించింది ఏ తలపండిన వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటు! భారత్‌కు చెందిన 23 ఏళ్ల యువతి. చిన్న వయసులోనే దేశం కానీ దేశంలో సంస్థను ఏర్పాటు చేసి ఇంతింతై వటుడింతై అన్న చందనా.. సంస్థను ముందుండి నడిపించారు. ఆసియా నుంచి తొలిసారిగా యూనికార్న్ క్లబ్లో అడుగుపెట్టేలా చేశారు. కానీ ఏమైందో ఏమో.. అంకితి బోస్ సీఈవో సాఫీగా సాగుతున్న వ్యాపారంలో అవినీతి మరక అలజడిని సృష్టించింది. జిలింగోలో పెట్టుబడిదారులైన టెమాసెక్, సీక్వోయా క్యాపిటల్ తో పాటు ఇతర సంస్థలు నిర్వహించిన అంతర్గత విచారణలో కంపెనీలో అవకతకలు జరిగినట్లు గుర్తించారు. ఆమెపై సస్పెన్షన్ విధించారు. ఈ నేపథ్యంలో మే 20న జిలింగో అంకింతి బోస్‌ను శాస్వతంగా విధుల నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నన్ను వేధించారు తనని జిలింగో అక్రమంగా విధుల నుంచి తొలగించిందంటూ బ్లూమ్ బర్గ్‌కు తెలిపింది. కంపెనీ నిర్వహించిన ఆడిట్ రిపోర్ట్‌లో జరిగిన అవకతవకలపై బ్లూమ్ బర్గ్ ఆమెను ప్రశ్నించింది. ఆ విషయాల గురించి ఆమె స్పందించలేదు. కానీ సీఈవో హోదాలో ఉన్న తనపై వేధింపులు ఎదురయ్యాయని, ఇదే విషయంపై యాజమాన్యాన్ని నిలదీసినట్లు చెప్పింది. అలా అడిగినందుకు తనని మార్చి 31న తనపై సస్పెన్షన్ విధించారని తెలిపింది. గతంలో తనని వేధించారని, ఆ హరాస్ మెంట్‌పై బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎదుట నిలదీశానని, అందుకే తనపై అవినీతి, లేనిపోని నిందలతో కుట్ర చేసి బయటకు పంపిచినట్లు ఆరోపించారు. చదవండి👉కష్టాల్లో అంకితి బోస్.. యంగ్‌లేడీ సీఈవోకి భారీ షాక్ ! -
మొగుడు పెళ్లాలయందు వీరి తీరు వేరు!
వాళ్లిద్దరు ఐఐటీలో చదువుకున్నారు. ఒకే కంపెనీలో ఉద్యోగం చేశారు. అక్కడైన పరిచయం పరిణయానికి దారి తీసింది. ఆ తర్వాతే వేర్వేరుగా బిజినెస్‌లు పెట్టుకున్నారు. చివరకు ఇద్దరూ మూడు నెలల తేడాతో తమ వ్యాపారాల్లో రాణించి బిలియనీర్లు అయ్యారు. వారే ఆశీష్ మహాపాత్ర, రుచి కల్రా. ఇప్పుడీ యూనికార్న్ దంపతుల జంట స్టార్టప్ వరల్డ్‌లో సెన్సేషన్‌గా మారారు. ఒకే కాలేజీ నుంచి పాసవుట్ స్టూడెంట్లుగా అశీష్ మహాపాత్ర (41), రుచి కల్రా (38)లు మెకెన్సీ కంపెనీలో ఉద్యోగులు చేరారు. అక్కడైన పరిచయం ప్రేమగా మారి ఇద్దరు ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. అనంతరం తమ మేథస్సుకు తగ్గట్టుగా వేర్వేరే స్టార్టప్‌లు ప్రారంభించారు. మహాపాత్ర దిల్లీ బేస్డ్గా ఆఫ్ బిజినెస్ పేరుతో రా మేటీరియల్ కొనుగులుకు సంబంధించిన టెక్ ప్లాట్‌ఫామ్‌గా పని చేస్తోంది. గత డిసెంబరులో 200 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట సాధించడంతో ఒక్కసారిగా ఆఫ్ బిజినెస్ మార్కెట్ వాల్యూ వన్ బిలియన్ డాలర్లు దాటింది. నయా యూనికార్న్‌గా మారింది. ఇక ఆక్సిజో పేరుతో ఫిన్‌టెక్ స్టార్టప్‌ను మొదలెట్టింది రుచికల్రా. తాజాగా ఆక్సిజోలో ఆల్ఫావేవ్ గ్లోబల్, టైగర్ గ్లోబల్, నార్వెస్ట్ వెంచర్స్ పార్టనర్స్, మ్యాట్రిక్స్ పార్టనర్స్, క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. మొత్తంగా 200 మిలియన్ డాలర్ల నిధులు సమీకరణ జరిగింది. దీంతో 2022 మార్చి 22న ఆక్సిజో మార్కెట్ విలువ వన్ బిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. దీంతో యూనికార్న్ కంపెనీల జాబితాలో ఆక్సిజో చేరింది. ఇప్పటి వరకు అనేక స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా మారాయి. ఆయా స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా రూపుదిద్దుకోవడంలో భార్తలకు భార్యలు సహాకారం అందిస్తూ వచ్చారు. కొన్ని సందర్భాల్లో భార్యలకు భర్తలు వెన్నుదన్నుగా ఉన్నారు. బైజూస్‌లో విషయంలో ఇదే జరిగింది. కానీ దేశంలో తొలిసారిగా భార్యభర్తలిద్దరు వేర్వేరుగా స్టార్టప్‌లు పెట్టి ఇద్దరూ సక్సెస్ అయ్యారు. -
బ్రిటన్‌ని వెనక్కి నెట్టిన భారత్.. నెక్ట్స్ టార్గెట్ చైనానే
ముంబై: అత్యధిక సంఖ్యలో యూనికార్న్ సంస్థలున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానానికి ఎగబాకింది. ఈ విషయంలో బ్రిటన్ను అధిగమించింది. ఈ ఏడాదే కొత్తగా మరో 33 అంకుర సంస్థలు యూనికార్న్‌లుగా ఎదగడంతో ఇది సాధ్యపడింది. 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 7,500 కోట్లు) వేల్యుయేషన్ దక్కించుకున్న సంస్థలను యూనికార్న్‌లుగా వ్యవహరిస్తారు. గతేడాది ఆఖరు నాటికి ఈ విషయంలో భారత్ నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుత ఏడాది ఈ సంఖ్య 54కి చేరింది. బ్రిటన్‌లో కొత్తగా 15 సంస్థలు యూనికార్న్‌లుగా మారడంతో.. అక్కడ మొత్తం సంఖ్య 39కి చేరింది. హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం అమెరికా, చైనా టాప్‌లో కొనసాగుతున్నాయి. భారత్ మూడో స్థానంలో ఉంది. ఇదే జోరు కొనసాగితే ఇండియా నెక్ట్స్ టార్గెట్ చైనాను అధిగమించడమే అవుతుంది. అమెరికా నంబర్ 1 ఈ ఏడాది కొత్తగా 254 యూనికార్న్‌లు పుట్టుకురాగా మొత్తం 487 కంపెనీలతో అమెరికా నంబర్ వన్‌గా నిల్చింది. ఇక చైనాలో మరో 74 సంస్థల రాకతో యూనికార్న్ హోదా దక్కించుకున్న స్టార్టప్‌ల సంఖ్య 301కి చేరింది. తద్వారా చైనా రెండో స్థానంలో నిల్చింది. మొత్తం యూనికార్న్ ప్రపంచంలో ఈ రెండు దేశాల వాటా ఏకంగా 74 శాతంగా ఉంది. 673 కొత్త సంస్థలు ఈసారి లిస్టులో 673 కొత్త సంస్థలు స్థానం దక్కించుకోగా, 201 సంస్థలు చోటు కోల్పోయాయి. వేల్యుయేషన్స్ 1 బిలియన్ డాలర్ల దిగువకి పడిపోవడంతో 39 కంపెనీలు హోదా కోల్పోయాయి. స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ కావడం లేదా ఇతర సంస్థలు కొనుగోలు చేయడం వంటి కారణాలతో 162 సంస్థలను యూనికార్న్ లిస్టు నుంచి తప్పించారు. అగ్రస్థానంలో బైజూస్.. దేశీ యూనికార్న్‌ల జాబితాలో 21 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఎడ్టెక్ స్టార్టప్ బైజూస్ నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇన్‌మొబి (12 బిలియన్ డాలర్లు), ఓయో (9.5 బిలియన్ డాలర్లు), రేజర్‌పే (7.5 బిలియన్ డాలర్లు) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఇక నగరాలవారీగా చూస్తే బెంగళూరులో అత్యధికంగా యూనికార్న్‌లు ఉన్నాయి. ‘భారత్ ప్రస్తుతం స్టార్టప్ బూమ్ మధ్యలో ఉంది. అధికారికంగా యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపైంది‘ అని హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ అనాస్ రెహ్మాన్ జునైద్ తెలిపారు. ఈ శతాబ్దంలో ప్రారంభమై యూనికార్న్‌లుగా ఎదిగిన సంస్థలను ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకున్నారు. చదవండి: -
సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! యూకేను వెనక్కి నెట్టి...!
India Overtakes UK To Third Spot With 54 Unicorns Hurun Index: భారత్‌లో స్టార్టప్స్ దూసుకెళ్తున్నాయి. తక్కువ సమయంలోనే ఒక బిలియన్ డాలర్ల విలువైన యూనికార్న్ స్టార్టప్స్‌గా అవతరిస్తున్నాయి. హురున్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ 2021 ప్రకారం....యూనికార్న్ స్టార్టప్స్ విషయంలో భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. యూకేను వెనక్కి నెట్టి..మూడోస్థానంలో.. 2021లో భారత స్టార్టప్స్ అదరగొట్టాయి. హురున్ గ్లోబల్ యునికార్న్ ఇండెక్స్ 2021 ప్రకారం...భారత్ 54 యునికార్న్‌లను కలిగి ఉంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక యూనికార్న్ స్టార్టప్స్‌ను కల్గిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోల్చితే భారత్‌లో యునికార్న్‌ల సంఖ్య అధికంగా పెరిగింది. యూనికార్న్ స్టార్టప్ విషయంలో యూకేను వెనక్కి నెట్టి భారత్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇకపోతే విదేశాలలో భారతీయులు స్థాపించిన మరో 65 యునికార్న్‌లు ఉన్నాయి. ప్రధానంగా సిలికాన్ వ్యాలీలో, స్వదేశీ యునికార్న్‌ల శాతం మూడింట ఒక వంతు నుండి 45 శాతానికి పెరిగిందని హురున్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ రీసెర్చర్ అనస్ రెహమాన్ జునైద్ అన్నారు. ప్రపంచంలోనే 15వ యూనికార్న్‌గా బైజూస్... హురున్ ఇండియా ప్రకారం...భారత యునికార్న్‌ల జాబితాలో ఎడ్టెక్ ప్లాట్‌ఫారమ్ బైజూస్ 21 బిలియన్ డాలర్లతో భారత్‌లో తొలిస్ధానంలో ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద 15వ యూనికార్న్ స్టార్టప్‌గా బైజూస్ అవతరించింది. భారత్‌లో 12 బిలియన్ డాలర్లతో యాడ్-టెక్ ప్లాట్‌ఫారమ్ ఇన్మొబీ రెండో స్థానంలో, 9.5 బిలియన్ డాలర్లతో ఓయో మూడో స్థానంలో నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ-కామర్స్ రంగంలో 122 యునికార్న్‌లు ఉన్నాయని, వాటిలో 15 భారత్‌లో ఉన్నాయని హురున్ నివేదిక పేర్కొంది. ఈ-కామర్స్ రంగంలో భారత్ మూడో అతి పెద్ద మార్కెట్ కల్గి ఉంది. చదవండి: కాలేజ్ డ్రాప్‌అవుట్స్..! చిన్న వయసులోనే రూ. 4310 కోట్లకు అధిపతులైన కుర్రాళ్లు..! -
పాత కార్లతో వ్యాపారం..! వేల కోట్లను తెచ్చిపెట్టింది..!
Used-Car Platform Spinny Raises $283 Million: భారత్‌లో స్టార్టప్స్ దూకుడు మీదున్నాయి. అతి తక్కువ కాలంలో యూనికార్న్ (ఒక బిలియన్ డాలర్ విలువ గల) స్టార్టప్స్‌గా అవతరిస్తున్నాయి. క్రియోటివ్ ఆలోచనలతో భారత మార్కెట్లను శాసిస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను జరిపే బెంగళూరు బేస్డ్ స్టార్టప్ స్పిన్నీ కంపెనీ సరికొత్త విలువకు చేరుకుంది. 283 మిలియన్ డాలర్ల సేకరణ..! అబుదాబికి చెందిన ఏడీక్యూ, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్లో స్పిన్నీ సుమారు 283 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో కంపెనీ విలువ 1.8 బిలియన్ డాలర్లకు చేరింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి , సాంకేతికత, పలు ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడానికి తాజా నిధులను ఉపయోగిస్తామని స్పిన్నీ ఒక ప్రకటనలో తెలిపింది. పాత కార్లే వారి బిజినెస్..! 2015లో స్థాపించిన స్పిన్నీ కంపెనీ ఆన్లైన్ పోర్టల్‌లో ఉపయోగించిన కార్లను విక్రయించే అవకాశాన్ని కల్పిస్తోంది. 2,000 కంటే ఎక్కువ సెకండ్ హ్యాండ్ మోడల్స్ కొనుగోలు దారులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేసుకోనే వీలును కూడా కల్పిస్తోంది. ఇప్పటి వరకు కంపెనీ వెబ్సైట్ ప్రకారం 20,000 సెకండ్ హ్యండ్ కార్లను విక్రయించింది. పాత కార్లను సొంతం చేసుకునేవారికోసం ఫైనాన్సింగ్‌ను కూడా స్పిన్నీ అందిస్తోంది. నామమాత్రపు వడ్డీరేట్లతో కొనుగోలుదారులకు రుణాలను ఇస్తోంది. చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..! -
స్టార్టప్ రంగంలో భారత్ అగ్రస్థానం: మోదీ
ప్రస్తుతం ప్రపంచంలో స్టార్టప్‌ల యుగం నడుస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో అన్నారు. ఈ స్టార్టప్ రంగంలో భారతదేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తోంది అని అన్నారు. దేశంలో గల 70కి పైగా స్టార్టప్‌ల విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి అని తెలిపారు. యువత జనాభా అధికంగా ఉన్న ఏ దేశంలోనైనా, మూడు అంశాలు- ఆలోచనలు-ఆవిష్కరణలు, రిస్క్ తీసుకునే సామర్థ్యం, ఏదైనా చేయగలమనే స్ఫూర్తి చాలా ముఖ్యమైనవని అని "మన్ కీ బాత్" రేడియో కార్యక్రమంలో మోదీ అన్నారు. ఈ మూడు విషయాలు కలిసి వచ్చినప్పుడు, అపూర్వమైన ఫలితాలు వస్తాయని, అద్భుతాలు జరుగుతాయని పేర్కొన్నారు. "ఈ రోజుల్లో మన చుట్టూ స్టార్టప్, స్టార్టప్, స్టార్టప్ వింటాము. ఇది స్టార్టప్‌ల శకం, ఈ స్టార్టప్‌ల రంగంలో ఒక విధంగా భారతదేశం ప్రపంచాన్ని నడిపిస్తోంది అనేది కూడా నిజం" అని మోదీ అన్నారు. ప్రతి ఏడాది స్టార్టప్‌లు రికార్డు స్థాయిలో పెట్టుబడులు ఆకర్షిస్తున్నాయని, ఈ రంగం వేగంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. "దేశంలోని చిన్న నగరాల్లో కూడా స్టార్టప్‌ల వ్యాప్తి పెరిగింది. ఈ రోజుల్లో యునికార్న్ అనే పదం చాలా చర్చలో ఉంది. యునికార్న్ స్టార్టప్‌ల విలువ ఒక బిలియన్ డాలర్లు(సుమారు రూ.7,000 కోట్లు)" అని మోడీ అన్నారు. (చదవండి: పెన్షనర్లకు హై అలర్ట్.. ! రెండు రోజులే గడువు..లేదంటే..) "2015 సంవత్సరం వరకు దేశంలో 9 నుంచి పది యునికార్న్స్ ఉండేవి, ఇప్పుడు భారతదేశం యునికార్న్స్ పరంగా ప్రపంచంలో అగ్రగామిగా ఉంది అనే విషయం తెలుసుకుంటే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం 10 నెలల్లో ప్రతి 10 రోజులకు భారతదేశంలో ఒక స్టార్టప్ యునికార్న్ గా మారింది" అని ఆయన చెప్పారు. కోవిడ్ మహమ్మారి వంటి కష్ట కాలంలో దేశంలోని యువత ఈ గొప్ప విజయాన్ని సాధించారని ఆయన అన్నారు. "నేడు, భారతదేశంలో 70కి పైగా యునికార్న్స్ ఉన్నాయి అని, వీటి విలువ 1 బిలియన్ డాలర్లను దాటాయి" అని మోడీ అన్నారు. -
అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..!
భారత్‌లో స్టార్టప్స్ వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. పలు స్టార్టప్స్ విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టుతున్నాయి. ఆయా స్టార్టప్‌లు అంతే వేగంగా యూనికార్న్(ఒక బిలియన్ డాలర్ విలువ గల) స్టార్టప్‌లుగా అవతరిస్తున్నాయి. మాంసం ఉత్పత్తులతో...యూనికార్న్ క్లబ్‌లోకి..! భారత్‌లో ఇప్పటివరకు 65 కంపెనీలు యూనికార్న్ జాబితాలోకి చేరాయి. ఈ ఏడాదిలోనే దాదాపు 28 స్టార్టప్స్ చేరాయి. తాజాగా ఢిల్లీకి చెందిన లైసియస్ స్టార్టప్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకొని యూనికార్న్ క్లబ్లో జాయిన్ఐనా 29 స్టార్టప్‌గా నిలిచింది. ఐఐఎఫ్ఎల్ ఏఎమ్‌సీ లేట్ స్టేజ్ టెక్ ఫండ్ రౌండ్లో లైసియస్ 52 మిలియన్ డాలర్లను సేకరించి యూనికార్న్‌గా అవతరించింది. గతంలో టెమాసెక్, 3వన్4 క్యాపిటల్, బెర్ట్ల్స్మెన్ ఇండియా నుంచి సుమారు 310 మిలియన్ డాలర్లను పెట్టుబడులను ఆకర్షించింది. లైసియస్ను అభయ్ హంజురా , వివేక్ గుప్తా 2015లో స్థాపించారు. ఈ కంపెనీలో సుమారు 3500 మంది పనిచేస్తున్నారు. చదవండి: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...! విజయ రహస్యమీదే...! లైసియస్ బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కత్తా వంటి నగరాల్లో భారీగా ఆదరణను పొందింది. మాంసం, సీఫుడ్ ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు చేరవేసింది. ఆయా నగరాల్లోని ప్రజలకు మాంసం ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తూ అత్యంత ఖ్యాతిని ఆర్జించింది. నాణ్యమైన మాంసం, సీఫుడ్ ఉత్పత్తులను లైసియస్ అందించింది. కంపెనీకి మాంసం కొనుగోలుదారులకు మధ్యవర్తి లేకుండా డైరక్ట్ టూ కస్టమర్ విధానాలను లైసియస్ అవలంభించింది. అంతేకాకుండా లైసియస్ యాప్ నుంచి మాంసాన్ని బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. లైసియస్ వెబ్సైట్ ప్రకారం..ప్రతినెలా ఒక మిలియన్ ఆర్డర్స్‌ను పొందుతుంది. వాటిలో 90 శాతం మేర రెగ్యూలర్ కొనుగోలుదారులే. చదవండి: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..! -
‘కుబేర్’కు యూనికార్న్ హోదా
ముంబై: క్రిప్టో ఎక్సే్ఛంజీ నిర్వాహక స్టార్టప్ కాయిన్‌స్విచ్ కుబేర్ యూనికార్న్‌గా అవతరించింది. కంపెనీ విలువ బిలియన్ డాలర్లను తాకడంతో ఈ హోదాను పొందింది. పీఈ దిగ్గజాలు ఇతర సంస్థల నుంచి తాజాగా 26 కోట్ల డాలర్లు(రూ. 1,943 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ 1.9 బిలియన్ డాలర్ల(రూ. 14,198 కోట్లు)కు బలపడింది. వెరసి క్రిప్టో ఎక్సే్ఛంజీ సంస్థలలో రెండో యూనికార్న్‌గా నిలిచింది. ఇంతక్రితం కాయిన్‌డీసీఎక్స్ సైతం బిలియన్ డాలర్ల విలువను అందుకున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ కేలండర్ ఏడాది(2021)లో క్వాయిన్‌స్విచ్ కుబేర్ 30వ యూనికార్న్ స్టార్టప్‌గా ఆవిర్భవించడం విశేషం! క్రిప్టో కరెన్సీలపై నియంత్రణ సంస్థలు సానుకూలంగా లేనప్పటికీ పెట్టుబడులు వెల్లువెత్తడం గమనార్హం! కాయిన్‌స్విచ్ కుబేర్‌లో ఆండ్రిస్సేన్ హోరోవిట్జ్(ఏ16జెడ్), కాయిన్‌బేస్ వెంచర్స్ తాజాగా ఇన్వెస్ట్ చేశాయి. వీటితోపాటు కంపెనీలో ఇప్పటికే వాటాదారులుగా కొనసాగుతున్న పారాడిగ్‌్మ, రిబ్బిట్ క్యాపిటల్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, టైగర్ గ్లోబల్ సైతం నిధులు అందించాయి. కాగా.. బిట్‌కాయిన్ తదితర ప్రయివేట్ క్రిప్టోకరెన్సీలపై ఆర్బీఐ పలుమార్లు ఆందోళనలు వ్యక్తం చేయడంతోపాటు.. ఇటీవల ప్రభుత్వ దృష్టికి సైతం తీసుకెళ్లింది. వీటి ట్రేడింగ్‌లో అత్యధిక హెచ్చుతగ్గులు, పారదర్శకత లోపించడం వంటి అంశాలను ప్రస్తా వించింది. తాజాగా సమీకరించిన నిధులను క్రిప్టోకు ప్రాచుర్యాన్ని కలి్పంచడం, 5 కోట్ల మందికి ప్లాట్‌ఫామ్‌ను చేరువ చేయడం తదితర లక్ష్యాలకు వెచి్చంచనున్నట్లు కాయిన్‌స్విచ్ కుబేర్ తెలియజేసింది. లిషియస్ సైతం.. తాజా మాంసం, సీఫుడ్ బ్రాండ్ ఆన్లైన్ విక్రయాల స్టార్టప్ లిషియస్ సైతం యూనికార్న్ హోదాను పొందింది. 5.2 కోట్ల డాలర్లు(రూ. 389 కోట్లు) సమీకరించడంతో కంపెనీ విలువ తాజాగా బిలియన్ డాలర్లకు(రూ. 7,473 కోట్లు) చేరినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. తద్వారా ఈ బెంగళూరు సంస్థ డైరెక్ట్ టు కన్జూమర్(డీటూసీ) విభాగంలో తొలి స్టార్టప్‌గా ఈ హోదాను సాధించినట్లు తెలియజేశాయి. సిరీస్ జీలో భాగంగా ముంబై సంస్థ ఐఐఎఫ్ఎల్ అధ్యక్షతన పలు సంస్థలు నిధులు అందించినట్లు లిషియస్ వెల్లడించింది. మూడు నెలల క్రితమే కంపెనీ 3వన్4 క్యాపిటల్, టెమాసెక్ తదితరాల నుంచి 19.2 కోట్ల డాలర్లు సమకూర్చుకున్నట్లు టెక్‌క్రంచ్ తెలియజేసింది. దీంతో 65 కోట్ల డాలర్ల విలువను కంపెనీ అందుకున్నట్లు తెలియజేసింది. కంపెనీ దేశవ్యాప్తంగా 14 నగరాలలో మాంసం, సీఫుడ్‌ను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్...!
Over 100 Companies in India Raised Series A Funding for Startups in the Past Year: భారత్‌లో స్టార్టప్స్ సంస్కృతి గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలను భారత స్టార్టప్స్ రూపోందిస్తున్నాయి. ఫండింగ్‌లో అగ్రరాజ్యాలకే పోటీగా భారత్ నిలుస్తోంది. స్టార్టప్స్ దూకుడు... భారత్‌లో పలు స్టార్టప్ కంపెనీలు దూకుడు మీదున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 100కు పైగా యూనికార్న్ స్టార్టప్‌లుగా అవతరించాయి. ఇండియన్ స్టార్టప్‌లు సిరీస్ ఏ ఫండింగ్‌లో భాగంగా పలు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సిరీస్ ఏ ఫండింగ్‌లో విషయంలో డేటా రిసెర్చ్ అండ్ అనాలిటిక్స్ ఫ్రీమ్ లాంచ్ గ్రావిటీ సహా వ్యవస్థాపకుడు డ్రేక్ డ్యూక్ స్టార్టప్ కంపెనీలపై పలు ఆసక్తి కర విషయాలను తెలియజేశారు. చదవండి: 75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్ బచ్చన్ ఎంట్రీ...! గత ఏడాది స్టార్టప్‌ల ‘సిరీస్ ఏ ఫండింగ్ ’ విషయంలో భారత్ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండుస్ధానాల్లో అమెరికా, యూనైటేడ్ కింగ్డమ్ నిలిచాయి. భారత్‌కు చెందిన సుమారు 109 స్టార్టప్స్ పలు దిగ్గజం కంపెనీల నుంచి సిరీస్ ఏ ఫండింగ్‌ను పొందాయి. గత ఏడాది భారత స్టార్టప్స్ సుమారు 1820.3 మిలియన్ డాలర్ల సిరీస్ ఏ ఫండింగ్‌లో పెట్టుబడులను ఆకర్షించాయని డ్రేక్ పేర్కొన్నారు. The US is in the lead with 1.2K companies with Series A deals Here’s the breakout of the other countries: United Kingdom 🇬🇧 - 225 India 🇮🇳 - 109 Germany 🇩🇪 - 105 France 🇫🇷 - 86 Canada 🇨🇦 - 82 Israel 🇮🇱 - 72 Brazil 🇧🇷 - 42 Switzerland 🇨🇭- 39 Spain 🇪🇸 - 38 Others (283) — Drake Dukes (@DDukes12) September 30, 2021 సిరీస్ ఏ ఫండింగ్‌లో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెక్కిన్సీ, గోల్డ్‌మన్ సాక్స్, ఐబీఎమ్, ఐడీఎఫ్, బీసీజీ, బెయిన్‌ఆలర్ట్స్, యూబర్, ఫేస్బుక్ కంపెనీలు నిలిచాయి. ఈ కంపెనీలు సాఫ్ట్వేర్, ఐటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, సాస్, ఫిన్‌టెక్, హెల్ద్‌కేర్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్‌చెయిన్, ఈ-కామర్స్ రంగాలోని స్టార్టప్‌లకు భారీ పెట్టుబడులను అందిస్తున్నాయి. Series A founders hold prior experiences from these companies: 1. @Google 2. @Microsoft 3. @McKinsey 4. @GoldmanSachs 5. @IBM 6. @IDF 7. @BCG 8. @BainAlerts 9. @Uber 10. @Facebook Other Notables:@salesforce (18th), @Apple (20th), @amazon (28th) — Drake Dukes (@DDukes12) September 30, 2021 చదవండి: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..! -
యూనికార్న్ క్లబ్‌లోకి వేదాంతు ఆన్లైన్ ట్యూటరింగ్ కంపెనీ..!
కరోనా రాకతో విద్యారంగంలో భారీ మార్పులే వచ్చాయి. పాఠశాలలు విద్యార్ధులకు పూర్తిగా ఆన్లైన్ క్లాసులనే నిర్వహించాయి. ఆన్లైన్ ట్యూటరింగ్ సర్వీసులు భారీ వృద్దినే నమోదు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్లైన్ ట్యూటరింగ్ సర్వీస్ సంస్ధ వేదాంతు యునికార్న్ స్టార్టప్‌గా అవతరించింది. సింగపూర్‌కు చెందిన ఏబీసీ వరల్డ్ ఆసియా కంపెనీ నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో వేదాంతు స్టార్టప్ వాల్యూయేషన్ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. వేదాంతుకు టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్, కోట్ మేనేజ్మెంట్, జీజీవీ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లుగా నిలిచాయి. చదవండి: బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా? బైజూస్, ఆన్అకాడమీ, అప్‌గ్రేడ్, ఏరుడిటస్ తరువాత ఐదో భారతీయ ఎడ్టెక్ యునికార్న్ సంస్థగా వేదాంతు నిలిచింది. వేదాంతు ఏడు సంవత్సరాల క్రితం తన లైవ్-ట్యూటరింగ్ సేవలను ప్రారంభించింది.2022 మార్చి నాటికి 500,000 యూజర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండు లక్షల మంది విద్యార్థులు వేదాంతులో ఎన్రోల్ చేసుకున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. కరోనా రాకతో పలు ప్రైవేటు టీచర్ల దుస్థితి దయనీయంగా మారింది. వేదాంతు సహాయంతో పలువురు ప్రైవేటు టీచర్లు వేదాంతులో ట్యూటర్‌గా జాయిన్ అయ్యారని కృష్ణ వెల్లడించారు. చదవండి: ఒక్క నెలలో రూ.900 కోట్లు సంపాదించిన బిగ్ బుల్! -
పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం
ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ప్రశాంతతే లక్ష్యంగా ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడపండంటూ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇచ్చింది. అంతేకాదు ఈ సెలవులు స్పెషల్‌గా ప్లాన్ చేసుకునేందుకు వీలుగా రెండు నెలల ముందే హాలిడే షెడ్యూల్ సైతం ప్రకటించింది. పది రోజుల సెలవులు సోషల్కామర్స్ రంగంలో స్టార్టప్‌గా మొదలై యూనికార్న్ కంపెనీగా ఎదిగింది మీషో సంస్థ. ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేయడంతో అనతి కాలంలోనే ఈ సంస్థ మార్కెట్ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. దీంతో తమ కంపెనీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను యాజమాన్యం తీసుకుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని భావించింది. దీంతో కంపెనీ ఉద్యోగులందరికీ ఒకేసారి పది రోజుల పాటు సామూహికంగా సెలవులు ప్రకటించింది. ఎప్పుడంటే గత రెండు నెలలుగా కరోనా సంక్షోభ సమయంలోనూ తమ కంపెనీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడినట్టు మీషో యాజమాన్యం ప్రకటించింది. దీనికి తోడు రాబోయే దసరా, దీపావళి సీజన్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా ముందే తెలిపింది. ఎంతో ఒత్తిడిలో సంస్థ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పీక్ సీజన్ ముగిసిన తర్వాత 2021 నవంబరు 4 నుంచి 14 వరకు సంస్థలోని ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు ఆ పది రోజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపండి అంటూ ఉద్యోగులకు సూచించింది. మీషో ప్రస్థానం విదిత్ ఆత్రేయ్ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త 2016లో మీషోను ప్రారంభించారు. చిన్న కళాకారులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా మీషోను వేదికగా మార్చారు. బయ్యర్లు, అమ్మకం దార్ల మధ్య మీషోను ప్లాట్‌ఫామ్‌గా చేశారు. కేవలం ఐదేళ్లలోనే ఈ మీషో స్టార్టప్ నుంచి యూనికార్న్‌గా ఎదిగింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో మీషో ఎల్లప్పుడు జాగ్రత్తగానే ఉంటుందనే పేరుంది. ఈ కంపెనీ అంతకు ముందు 64 ఆప్షనల్ హలిడేస్ను ఉద్యోగుల కోసం ప్రకటించింది. Meesho is going on a company-wide break from November 4-14th. Yes, you read that right. We are going to completely unplug from work — right after our busy and frenetic festive sale season, so that we are back to doing what we love — relaxed and rejuvenated. (1/2)#Meesho pic.twitter.com/CGusDZZyfw — Life@Meesho (@meeshoapp) August 30, 2021 చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్ఆఫర్ ప్రకటించిన జెరోదా..! -
రేసు గుర్రాల్లా యూనికార్న్‌లు
ముంబై: మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇటీవల స్టార్టప్‌లు దూకుడు చూపుతున్నాయి. అవకాశాలను అందిపుచ్చుకుంటూ పలు విభాగాలలో కంపెనీలు ఆవిర్భవిస్తున్నాయి. వెరసి దేశీయంగా స్టార్టప్‌ల హవా నెలకొంది. ఇప్పటికే బిలియన్ డాలర్ల (రూ. 7,300 కోట్లు) విలువను అందుకున్న స్టార్టప్‌లు 60కు చేరాయి. వీటిని యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో సాగుతున్నాయి. దీంతో ప్రైమరీ మార్కెట్ ఎన్నడూలేని విధంగా కళకళలాడుతోంది. ఈ బాటలో స్టార్టప్ యూనికార్న్‌లు సైతం పబ్లిక్ ఇష్యూల బాటపడుతున్నాయి. రానున్న రెండేళ్లలో 18 పెద్ద స్టార్టప్‌లు ఐపీవోలకు రానున్నట్లు వాల్‌స్ట్రీట్ బ్రోకింగ్ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ అమెరికా(బీవో ఎఫ్ఏ) ఒక నివేదికలో పేర్కొంది. 12 బిలియన్ డాలర్లు... ఈ ఏడాదిలోనే దేశీయంగా 20 స్టార్టప్‌లు కొత్తగా యూనికార్న్ హోదాను అందుకున్నాయి. ఫలితంగా వీటి సంఖ్య 60ను తాకింది. స్టార్టప్‌లలో కొద్ది నెలలుగా భారీ స్థాయిలో పెట్టుబడులు తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా వీటి సంఖ్య 100 మార్క్‌ను చేరవచ్చని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి. గ్లోబల్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ సైతం ఈ మార్చిలో ఇదే తరహా అంచనాలు వెలువరించడం గమనార్హం! రానున్న 24 నెలల్లో పబ్లిక్ ఇష్యూ ద్వారా నిధులను సమీకరించేందుకు దిగ్గజాలు బైజూస్, ఫ్లిప్‌కార్ట్, పేటీఎమ్, ఓలా, ఓయో తదితరాలు ప్రణాళికలు వేశాయి. అంతేకాకుండా పాలసీబజార్, పెప్పర్ఫ్రై, ఇన్మోబి, గ్రోఫర్స్, మొబిక్విక్, నైకా, ఫ్రెష్‌వర్క్స్, పైన్‌ల్యాబ్స్, ఫార్మ్ఈజీ, డెలివరీ, డ్రూమ్, ట్రాక్సన్ సైతం ఇదే బాటలో నడవనున్నాయి. తద్వారా సుమారు 18 కంపెనీలు 12 బిలియన్ డాలర్లు(రూ. 88,000 కోట్లు) వరకూ సమీకరించే యోచనలో ఉన్నట్లు బీవోఎఫ్‌ఏ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎండీ గౌరవ్ సింఘాల్ తెలియజేశారు. భారీ ఇష్యూలు.. ఇప్పటికే సెబీ వద్ద పలు స్టార్టప్ దిగ్గజాలు ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. వీటిలో పేటీఎం(రూ. 16,600 కోట్లు), ఓలా(రూ. 11,000 కోట్లు), పాలసీబజార్ (రూ. 6,000 కోట్లు), నైకా(రూ. 4,000 కోట్లు), మొబిక్విక్(రూ. 1,900 కోట్లు) ఉన్నాయి. ఇటీవల రూ. 6,300 కోట్లు సమీకరించిన జొమాటో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. దేశీయంగా యూనికార్న్‌లు ఐపీవోలు చేపట్టడం ద్వారా సంప్రదాయ కుటుంబ బిజినెస్‌ల ట్రెండ్‌లో మార్పులను తీసుకువచ్చే వీలున్నట్లు సింఘాల్ అభిప్రాయపడ్డారు. దేశీ స్టాక్ మార్కెట్ల క్యాపిటలైజేషన్(విలువ)లో ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల వాటా 1 శాతానికంటే తక్కువేనని పేర్కొన్నారు. యూఎస్ మార్కెట్లో 40 శాతం మార్కెట్ వాటాను ఇవి ఆక్రమిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం దేశీ ఈక్విటీ మార్కెట్ల విలువ రూ. 250 లక్షల కోట్లను తాకిన సంగతి తెలిసిందే. రానున్న ఐదేళ్ల కాలంలో యూనికార్న్‌ల సంఖ్య రెట్టింపుకావచ్చని అంచనా వేశారు. ఈ ఏడాది యూనికార్న్ హోదాకు చేరిన కంపెనీలలో షేర్‌చాట్, గ్రో, గప్‌షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, ఆఫ్‌బిజినెస్, క్రెడ్, మోగ్లిక్స్, జెటా, మైండ్టికిల్, బ్రౌజర్‌స్టాక్, ఆప్‌గ్రేడ్ తదితరాలున్నాయి. త్వరలో మరో 32... ఫ్యూచర్ యూనికార్న్ జాబితాలో చేరగల మరో 32 కంపెనీలను హురున్ ఇండియా తాజాగా ప్రస్తావించింది. ఇవి ఇప్పటికే 50 కోట్ల డాలర్ల విలువను అందుకున్నట్లు తెలియజేసింది. ఈ బాటలో 20 కోట్ల డాలర్ల విలువను సాధించిన మరో 54 సంస్థలు సైతం జోరు మీదున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో యూనికార్న్‌లుగా ఆవిర్భవించగల కంపెనీల విలువను 36 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. దేశీయంగా 60 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నట్లు తెలియజేసింది. 2025కల్లా ఈ సంఖ్య 90 కోట్లను తాకనున్నట్లు వివరించింది. ప్రస్తుతం అత్యధిక యూనికార్న్‌లున్న దేశాల జాబితాలో అమెరికా(396), చైనా(277) తదుపరి మూడో ర్యాంకులో భారత్ నిలుస్తున్నట్లు పేర్కొంది. -
అప్‌గ్రేడ్ సంస్థకు యూనికార్న్ హోదా
ముంబై: ఆన్లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అప్‌గ్రేడ్ మూడోసారి భారీగా నిధులను సమీకరించింది. ఐఐఎఫ్ఎల్ గ్రూప్ నుంచి తాజాగా 185 మిలియన్ డాలర్లు(రూ.1,376 కోట్లు) సమీకరించింది. దీంతో కంపెనీ విలువ 1.2 బిలియన్ డాలర్లకు(రూ.8,912 కోట్లు) చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి టెమాసెక్ హోల్దింగ్స్ నుంచి 12 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది. తదుపరి ఇదే నెలలో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంస్థ ఐఎఫ్‌సీ నుంచి 4 కోట్ల డాలర్లు లభించాయి. దీంతో కంపెనీ విలువ 85 కోట్ల డాలర్లను తాకింది. స్టార్టప్‌ల రంగంలో 100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా... ఈ కేలండర్ ఏడాది(2021)లో ఆగస్ట్ 2 వరకూ 17 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా ఆవిర్భవించాయి. 60 సంస్థలకు యూనికార్న్ హోదా ఈ బాటలో సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన విజన్ ఫండ్-2 నుంచి 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమకూర్చుకున్న మైండ్టికిల్తో కలిపి మొత్తం 60 సంస్థలు ఈ స్థాయికి చేరువకోవడం ప్రస్తావించదగ్గ విషయం!. ఈ ఏడాది యూనికార్న్ జాబితాలో చేరిన సంస్థలలో షేర్‌చాట్, గ్రో, గప్ షుప్, మీషో, ఫార్మ్ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, 'ఆఫ్‌బిజినెస్, క్రైడ్, మాగ్లిక్స్, జెటా, బ్రౌజర్‌స్టాక్ తదిర సంస్థలు చేరాయి. క్రెడిట్ స్వీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా 100కు మించిన స్టార్దప్లు యూనికార్న్ హోదాను పొందాయి. -
అరుదైన ఘనతను సాధించిన భారత్‌పే..!
ముంబై: మార్చంట్ పేమెంట్ ప్లాట్‌ఫాం భారత్‌పే అరుదైన ఫీట్‌ను సాధించింది. కంపెనీ 370 మిలియన్ డాలర్లను సేకరించి యూనికార్న్ క్లబ్‌లోకి జాయిన్ అయ్యింది. ఈ నిధులను టైగర్ గ్లోబల్ సంస్థ నుంచి సేకరించింది. భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ఆయా స్టార్టప్‌లు గణనీయంగా అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. భారత్‌పే ప్రస్తుత విలువ 2.85 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భారత స్టార్టప్ ఎకో సిస్టమ్‌లో ఈ సంవత్సరం 19 వ యూనికార్న్ స్టార్టప్‌గా భారత్‌పే నిలిచింది. ఒక స్టార్టప్ విలువ ఒక బిలియన్ డాలరుకు చేరిన స్టార్టప్‌ను యూనికార్న్ స్టార్టప్‌గా పిలుస్తారు. డ్రాగోనీర్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్, స్టెడ్‌ఫాస్ట్ క్యాపిటల్ కంపెనీలో భారత్‌పే కొత్త భాగస్వామ్యాలను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం భారత్‌పే సంస్థాగత పెట్టుబడిదారుల్లో కోటు మేనేజ్మెంట్, ఇన్సైట్ పార్ట్నర్స్, సీక్వోయా గ్రోత్, రిబ్బిట్ క్యాపిటల్, ఆంప్లో కంపెనీలు నిలిచాయి. తొమ్మిది నెలల క్రితం భారత్‌పే విలువ 900 మిలియన్ డాలర్లుకు ఉండేది. ప్రస్తుతం 370 మిలియన్ల డాలర్ల పెట్టుబడిలో, సెకండరీ భాగం లో 20 మిలియన్ డాలర్లు కంపెనీ ఉద్యోగులకు క్యాష్ అవుట్ చేయడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. భారత్‌పే కంపెనీ టాప్ మేనేజ్మెంట్లో రీఆరెంజ్‌మెంట్‌ను కూడా చేయనుంది. కంపెనీ కో-ఫౌండర్, సీఈవో..అష్నీర్ గ్రోవర్‌ను మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎన్నుకోనున్నారు. సుహైల్ సమీర్‌ను కంపెనీ కొత్త సీఈవోగా ఉండనున్నట్లు తెలుస్తోంది. -
పేరుకే బిలియన్ డాలర్ల స్టార్టప్‌లు..నష్టాలు మాత్రం..!
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్టార్టప్ కంపెనీల విలువ గణనీయంగా పెరిగి యునికార్న్ స్టార్టప్‌లుగా అవతరిస్తున్నాయి. యునికార్న్ స్టార్టప్ అనగా కంపెనీ విలువ సుమారు ఒక బిలియన్ డాలర్ విలువకు చేరితే ఆ స్టార్టప్‌లను యునికార్న్లుగా పిలుస్తారు. యునికార్న్ అనే పదాన్ని ఐలీన్ లీ ప్రతిపాదించారు. విచిత్రమైన పరిస్థితి.. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పలు యునికార్న్ స్టార్టప్‌లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. కరోనా సమయంలో స్టార్టప్‌ల షేర్ ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. మరికొన్ని స్టార్టప్‌ల షేర్ ధరలు అమాంతం రెట్టింపు, మూడు రెట్లు కూడా పెరిగాయి. జూమ్, రోకు, స్వ్కేర్ వంటి స్టార్టప్‌లు షేర్లు బాగా వృద్ధిని నమోదుచేసిన అంతే నష్టాలను చవిచూశాయి. స్నాప్‌చాట్, ట్విలియో, పిన్ట్రెస్ట్, స్లాక్, యూబర్, లిఫ్ట్ షేర్లు భారీగా పెరిగాయి. ఆయా స్టార్టప్‌లు షేర్ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ అంతే స్థాయిలో స్టార్టప్‌లు నష్టాలను కూడా చవిచూశాయి. ఆయా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిలిస్టుల నుంచి ఫండింగ్ బలంగానే ఉంది. 2021 తొలి త్రైమాసికంలో గరిష్టంగా 125 బిలియన్ డాలర్లకు ఫండింగ్ చేరుకుంది. భారీ ఎత్తున వెంచర్ ఫండింగ్, అధిక షేర్ ధరలు ఉన్నపటీకి ఆయా స్టార్టప్‌లు నష్టాలనుంచి బయట పడలేదు. ఈ స్టార్టప్‌లతో పోల్చుకుంటే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రారంభంలో గరిష్టమైన నష్టాలను చవిచూసినప్పటికి తిరిగి స్టార్టప్ లాభాలవైపు అడుగులు వేసింది. అమెరికాలో అత్యధికంగా నష్టాలను పొందిన సంస్థగా అమెజాన్ నిలిచింది. అమెజాన్ తన పదవో సంవత్సరం నుంచి లాభాలను పొందలేకపోయింది. ఈ లాభాలు 2016 సంవత్సరం వరకు స్టార్టప్ 3 బిలియన్ డాలర్ల నష్టాలను కవర్ చేయలేకపోయాయి. ప్రస్తుతం అమెజాన్ అత్యంత విలువైన స్టార్టప్‌గా నిలిచింది. పలు యునికార్న్ స్టార్టప్‌లను స్థాపించి సుమారు 10 నుంచి 20 సంవత్సరాలైనప్పటికీ అమెజాన్ తరహాలో లాభాలను పొందలేకపోతున్నాయి. వోల్ఫ్స్ట్రీట్ రిపోర్ట్ ప్రకారం..ఆయా స్టార్టప్‌ల ఫైలింగ్స్‌ను అమెజాన్‌తో పోల్చితో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. పలు యునికార్న్ స్టార్టప్‌లు స్థాపించి పది నుంచి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఉబర్ స్టార్టప్ 23 బిలియన్ డాలర్లు, స్నాప్ చాట్ 8 బిలియన్ డాలర్లు, ఎయిర్‌బీఎన్‌బీ, లిఫ్ట్ సుమారు 7 బిలియన్ డాలర్లు, పలన్టిర్ 6 బిలియన్ డాలర్లు, నూటానిక్స్ 5 బిలియన్ డాలర్లు కమ్యూలేటివ్ నష్టాలను ఆయా స్టార్టప్‌లు చవిచూశాయి. ఈ స్టార్టప్‌ల విలువ అత్యధికంగా ఉంది. ఇక్కడ ఆయా స్టార్టప్‌లకు వచ్చిన నష్టాలు అమెజాన్ స్టార్టప్‌కి వచ్చిన కమ్యూలేటివ్ నష్టాలకంటే అధికం. పలు స్టార్టప్‌ల నష్టాలు 2021లోను కొనసాగుతున్నాయి. కాగా ఈ స్టార్టప్‌లను అమెజాన్‌తో పోల్చే మోడల్ సరైనది కాదు..! అమెజాన్ కూడా ప్రారంభంలో కమ్యూలేటివ్ నష్టాలను చవిచూసినప్పటికీ తన పదవో సంవత్సరంలో అమెజాన్ లాభాలను ఆర్జించింది. అమెజాన్ స్టార్టప్ చరిత్ర ప్రకారం..అత్యధికంగా నష్టాలను ఎదుర్కొనే స్టార్టప్‌లు అమెజాన్ స్టార్టప్ లాగా కమ్యూలేటివ్ లాభాలను మాత్రం పొందలేవు. లాభాలను గడించడానికి ఎక్కువ సమయం తీసుకున్న ఆయా స్టార్టప్‌లకు ఏలాంటి నష్టం జరగదని నిపుణులు పేర్కొన్నారు. -
దూసుకుపోతున్న షేర్‌చాట్, ఇతర స్టార్టప్ కంపెనీలు
ముంబై: భారత్‌లో స్టార్టప్ కంపెనీలు దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీలు యూనికార్న్ క్లబ్‌లోకి చేరగా, ఈ సారి 2021 మొదటి నాలుగు నెలల్లో మరో ఐదు స్టార్టప్ కంపెనీలు యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించాయి. మీషో, గ్రోవ్, షేర్‌చాట్, ఏపీఐ హోల్డింగ్స్, గప్‌షుప్ కంపెనీలు యూనికార్న్ కంపెనీలుగా అవతారమెత్తాయి. ప్రస్తుతం ఈ కంపెనీల వాల్యూ సుమారు ఒక బిలియన్ డాలర్ల వరకు చేరింది. భారత్‌లో కామర్స్ రంగంలో దూసుకుపోతున్న మీషో కంపెనీ ప్రస్తుతం సాఫ్ట్‌బ్యాంక్ విజన్ నుంచి సుమారు 300 మిలియన్ డాలర్ల ఫండ్‌ను సేకరించడంతో కంపెనీ వాల్యూ 2.1 మిలియన్ డాలర్లకు చేరింది. 2017లో స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం గ్రోవ్ కంపెనీ టైగర్ గ్లోబల్ నుంచి సుమారు 83 మిలియన్ డాలర్లును సేకరించడంతో కంపెనీ వాల్యూ బుధవారం రోజున ఒక బిలియన్ డాలర్లకు చేరింది. భారత్‌లో 2017లో ప్రారంభమైన గ్రోవ్ 1.5 కోట్లకు పైగా నమోదైన వినియోగదారులతో ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా మారింది. గ్రోవ్‌లో వినియోగదారులు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇటిఎఫ్‌లు, ఐపిఓలు, బంగారంలో సరళమైన, ఏలాంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడులు పెట్టవచ్చు. ఆన్లైన్ ఫార్మసీ సంస్థ ఫార్మ్ ఈజీ ఏపీఐ హోల్డింగ్ వ్యవస్థాపకుడు బుధవారం యునికార్న్ క్లబ్‌లోకి ప్రవేశించమని తెలిపారు. ప్రోసస్ వెంచర్స్, టీపీజీ గ్రోత్ నుంచి సుమారు 350 మిలియన్ డాలర్లను సమీకరించిన తరువాత స్టార్టప్ వాల్యూ 1.5 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. మరో మేసేజింగ్ కంపెనీ గప్‌షుప్ గురువారం టైగర్ గ్లోబల్ మేనేజ్మెంట్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులను సేకరించడంతో, కంపెనీ విలువ 1.4 బిలియన్ డాలర్లకు చేరింది. చదవండి: SBI Card: ఎస్బీఐ కార్డ్ లాభాలు రెట్టింపు -
యూనికార్న్.. ధనాధన్
స్టార్టప్‌లకు సంబంధించి అంతర్జాతీయంగా మూడో స్థానంలో భారత్‌లో యూనికార్న్‌ల (1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్ గల అంకుర సంస్థలు) సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇటీవల కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆరు అంకుర సంస్థలు యూనికార్న్‌ల హోదా అందుకున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫాం గ్రో సుమారు 1 బిలియన్ డాలర్లకు పైగా వేల్యుయేషన్‌తో నిధులు సమీకరించింది. మెసేజింగ్ బాట్స్ స్టార్టప్ సంస్థ గప్‌షప్ 1.4 బిలియన్ డాలర్ల స్థాయిని అందుకుంది. డిజిటల్ ఫార్మసీ ఏపీఐ హోల్డింగ్స్ 1.5 బిలియన్ డాలర్లు, యాప్ డెవలపర్ మొహల్లా టెక్ 2.1 బిలియన్ డాలర్లు, సోషల్ కామర్స్ స్టార్టప్ మీషో 2.1 బిలియన్ డాలర్లు, ఫైనాన్షియల్ టెక్నాలజీ సేవల సంస్థ క్రెడ్ 2.2 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్ దక్కించుకోవడం దేశీ స్టార్టప్‌ల సత్తాను చాటుతోంది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ సీబీ ఇన్సైట్స్ ప్రకారం 2020లో కొత్తగా ఏడు యూనికార్న్‌లు పుట్టుకురాగా, 2019లో ఆరు అంకుర సంస్థలు యూనికార్న్‌లుగా ఎదిగాయి. ప్రస్తుతం దేశీయంగా మొత్తం యూనికార్న్‌ల సంఖ్య 40 దాకా ఉన్నట్లు అంచనా. ఇదే ఊపు కొనసాగితే 2021 ముగిసే నాటికి ఈ సంఖ్య 50ని కూడా దాటేసే అవకాశం ఉందంటూ దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ అంచనా వేస్తోంది. సిద్ధమవుతున్న మరో ఆరు అంకురాలు . రాబోయే కొన్ని నెలల్లో కొత్తగా మరో ఆరు స్టార్టప్ సంస్థలు యూనికార్న్‌లుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమవర్గాలు తెలిపాయి. కోవిడ్–19 మహమ్మారి ధాటితో దేశీయంగా ఆన్లైన్ టెక్నాలజీల వినియోగం భారీగా పెరిగింది. కరోనా వైరస్ కట్టడి కోసం కఠినతరమైన లాక్డౌన్లు అమలు చేసిన గతేడాది ఏకంగా 1,600 పైచిలుకు కొత్త స్టార్టప్‌లు ఏర్పడ్డాయి. దీనితో దేశీయంగా మొత్తం స్టార్టప్‌ల సంఖ్య 12,500కి చేరినట్లు ఈ ఏడాది జనవరిలో నాస్కామ్ ఓ నివేదికలో వెల్లడించింది. వీటిలో సుమారు 55 స్టార్టప్‌లు త్వరలోనే యూనికార్న్‌ల స్థాయికి ఎదిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. అమెరికాలో స్టార్టప్‌లకు కేంద్రంగా ఉంటున్న సిలికాన్ వేలీ తరహాలోనే ఇక్కడ కూడా బడా స్టార్టప్‌లలో పనిచేసిన ఉద్యోగులు ఆ అనుభవంతో తమ సొంత సంస్థలను ఏర్పాటు చేస్తున్నారు. విజయవంతంగా నిష్క్రమించిన ఎంట్రప్రెన్యూర్లు కొత్తగా మరో స్టార్టప్ ఏర్పాటులో నిమగ్నమవుతున్నారు. సత్తా చాటుతున్న స్టార్టప్‌లు.. డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం 16 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో దేశీయంగా అత్యంత విలువైన స్టార్టప్‌గా మారగా, ఆన్లైన్–ఎడ్యుకేషన్ స్టార్టప్ సంస్థ బైజూస్ 15 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే నిధులు సమీకరించింది. అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ 35 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన ఈ–కామర్స్ దిగ్గజం త్వరలో పబ్లిక్ ఇష్యూకి వచ్చే ప్రణాళికల్లో ఉంది. భారత్‌లో ఈ–కామర్స్ మొదలుకుని ఫిన్‌టెక్, ఎడ్యుకేషన్, లాజిస్టిక్స్, ఫుడ్–డెలివరీ దాకా వివిధ విభాగాల్లో అసంఖ్యాకంగా యూనికార్న్‌లు ఉన్నాయని, వీటి మొత్తం మార్కెట్ విలువ 240 బిలి యన్ డాలర్లకు పైగా ఉంటుందని క్రెడిట్ సూసీ గ్రూప్ ఏజీ ఈ మధ్య ఒక నివేదికలో లెక్కగట్టింది. పుష్కలంగా నిధులతో ఇన్వెస్టర్లు.. వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను ఆకర్షించడంలో అమెరికా, చైనాతో పోలిస్తే భారత స్టార్టప్‌లు చాలా వెనుకబడే ఉంటున్నాయి. 2020 గణాంకాలు చూస్తే అమెరికన్ స్టార్టప్‌లు 143 బిలియన్ డాలర్లు సమీకరించగా, చైనా అంకుర సంస్థలు 83 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. కానీ దేశీ స్టార్టప్‌లకు సంబంధించి 11.8 బిలియన్ డాలర్ల విలువ చేసే డీల్స్ మాత్రమే కుదిరాయి. అయితే, దేశీ స్టార్టప్ సంస్థల్లో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, దక్షిణాఫ్రికా సంస్థ నాస్పర్స్ వంటి అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజాలు ఆసక్తి చూపుతున్నాయి. వీటి దగ్గర పుష్కలంగా నిధులు ఉన్నాయని కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ వర్గాలు తెలిపాయి. ఇటీవలి కాలంలో స్మార్ట్ఫోన్ల వినియోగం, చౌక ఇంటర్నెట్ సేవల విస్తృతి వంటి అంశాలు కొత్త తరం ఔత్సాహిక వ్యాపారవేత్తలకు ఊతంగా ఉంటున్నాయని వివరించాయి. సులువుగా 200 మిలియన్ డాలర్ల సమీకరణ.. అయిదేళ్ల క్రితం 20 మిలియన్ డాలర్ల సమీకరణ రౌండ్లు గొప్పగా ఉండేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అయితే, ప్రస్తుతం స్టార్టప్‌లు అత్యంత వేగంగా ఎదుగుతున్నాయని.. ప్రతీ విడతలో అలవోకగా 100 మిలియన్ డాలర్లు.. 200 మిలియన్ డాలర్లు సమీకరించడం సాధారణ విషయంగా మారిపోతోందని వివరించాయి. ఇక ఇన్వెస్టర్లు ప్రతీ నెలా కొన్ని వందల సంఖ్యలో స్టార్టప్‌లను మదింపు చేస్తున్నారని తెలిపాయి. 9యూనికార్న్స్ రూ. 298 కోట్ల సమీకరణ న్యూఢిల్లీ: ప్రారంభ దశలో ఉన్న స్టార్టప్‌లకు ఆర్థిక తోడ్పాటు అందించే యాక్సిలరేటర్ ఫండ్ ద్వారా మూడో విడతలో 40 మిలియన్ డాలర్లు (రూ. 298 కోట్లు) సమీకరించినట్లు 9యూనికార్న్స్ సంస్థ వెల్లడించింది. దీనితో మూడో విడత సమీకరణ పూర్తయినట్లు పేర్కొంది. ఈసారి దేశ, విదేశాలకు చెందిన పలు దిగ్గజ పారిశ్రామికవేత్తలు, వ్యాపార సంస్థలు ఇన్వెస్ట్ చేసినట్లు వివరించింది. ఇండియన్ బ్యాంక్, హల్దీరామ్స్ తదితర సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు 9యూనికార్న్స్ తెలిపింది. మొత్తం ఫండ్ 70 మిలియన్ డాలర్లని (సుమారు రూ.520 కోట్లు) పేర్కొంది.. బోట్లో క్వాల్కామ్ పెట్టుబడులు న్యూఢిల్లీ: కంన్యూమర్ టెక్ ప్రొడక్ట్స్ బ్రాండ్ బోట్ తాజాగా క్వాల్కామ్ వెంచర్స్ నుంచి నిధులు సమీకరించింది. క్వాల్‌కామ్‌కు చెందిన పెట్టుబడి కంపెనీ క్వాల్కామ్ వెంచర్స్ ఎంత ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడించలేదు. భారత్‌తోపాటు అంతర్జాతీయ విపణి కోసం కొత్త ఆడియో, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, పరిశోధన, అభివృద్ధికి, తయారీ సామర్థ్యం పెంపునకు ఈ నిధులను వెచ్చించనుంది. సాంకేతిక సహకారం, ఆర్అండ్డీ సామ ర్థ్యం పెంపునకు బోట్ తెలిపింది. 2021 జనవరిలో ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం వార్బర్గ్ పింకస్ నుంచి సుమారు రూ.730 కోట్లను బోట్ సమీకరించింది.