పేరుకే బిలియన్‌ డాలర్ల స్టార్టప్‌లు..నష్టాలు మాత్రం..! | Unicorns Have Bigger Cumulative Losses Than Amazon | Sakshi
Sakshi News home page

పేరుకే బిలియన్‌ డాలర్ల స్టార్టప్‌లు..నష్టాలు మాత్రం..!

Published Thu, Jul 22 2021 9:42 PM | Last Updated on Thu, Jul 22 2021 9:45 PM

Unicorns Have Bigger Cumulative Losses Than Amazon - Sakshi

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్టార్టప్‌ కంపెనీల విలువ గణనీయంగా పెరిగి యునికార్న్‌ స్టార్టప్‌లుగా అవతరిస్తున్నాయి. యునికార్న్‌ స్టార్టప్‌ అనగా కంపెనీ విలువ సుమారు ఒక బిలియన్‌ డాలర్‌ విలువకు చేరితే ఆ స్టార్టప్‌లను యునికార్న్‌లుగా పిలుస్తారు. యునికార్న్‌ అనే పదాన్ని ఐలీన్‌ లీ ప్రతిపాదించారు.

విచిత్రమైన పరిస్థితి..
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పలు యునికార్న్‌ స్టార్టప్‌లు గణనీయమైన వృద్ధిని సాధించాయి.  కరోనా సమయంలో స్టార్టప్‌ల షేర్‌ ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. మరికొన్ని స్టార్టప్‌ల షేర్‌ ధరలు అమాంతం రెట్టింపు, మూడు రెట్లు కూడా పెరిగాయి. జూమ్‌, రోకు, స్వ్కేర్‌ వంటి స్టార్టప్‌లు షేర్లు బాగా వృద్ధిని నమోదుచేసిన అంతే నష్టాలను చవిచూశాయి. స్నాప్‌చాట్‌, ట్విలియో, పిన్‌ట్రెస్ట్‌, స్లాక్‌, యూబర్‌, లిఫ్ట్‌ షేర్లు భారీగా పెరిగాయి. ఆయా స్టార్టప్‌లు షేర్‌ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ అంతే స్థాయిలో స్టార్టప్‌లు నష్టాలను కూడా చవిచూశాయి. ఆయా స్టార్టప్‌లకు వెంచర్‌ క్యాపిలిస్టుల నుంచి ఫండింగ్‌ బలంగానే ఉంది. 2021 తొలి త్రైమాసికంలో గరిష్టంగా 125 బిలియన్‌ డాలర్లకు ఫండింగ్‌ చేరుకుంది. భారీ ఎత్తున వెంచర్‌ ఫండింగ్‌, అధిక షేర్‌ ధరలు ఉన్నపటీకి ఆయా స్టార్టప్‌లు నష్టాలనుంచి బయట పడలేదు. 

ఈ స్టార్టప్‌లతో పోల్చుకుంటే ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రారంభంలో గరిష్టమైన నష్టాలను చవిచూసినప్పటికి తిరిగి స్టార్టప్‌ లాభాలవైపు అడుగులు వేసింది. అమెరికాలో అత్యధికంగా నష్టాలను పొందిన సంస్థగా అమెజాన్‌ నిలిచింది. అమెజాన్‌ తన పదవో సంవత్సరం నుంచి లాభాలను పొందలేకపోయింది. ఈ లాభాలు 2016 సంవత్సరం వరకు స్టార్టప్‌ 3 బిలియన్‌ డాలర్ల నష్టాలను కవర్‌ చేయలేకపోయాయి. ప్రస్తుతం అమెజాన్‌ అత్యంత విలువైన స్టార్టప్‌గా నిలిచింది. పలు యునికార్న్‌ స్టార్టప్‌లను స్థాపించి సుమారు 10 నుంచి 20 సంవత్సరాలైనప్పటికీ అమెజాన్‌ తరహాలో లాభాలను పొందలేకపోతున్నాయి. 

వోల్ఫ్‌స్ట్రీట్‌ రిపోర్ట్‌ ప్రకారం..ఆయా స్టార్టప్‌ల ఫైలింగ్స్‌ను అమెజాన్‌తో పోల్చితో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. పలు యునికార్న్‌ స్టార్టప్‌లు స్థాపించి పది నుంచి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఉబర్‌ స్టార్టప్‌ 23 బిలియన్‌ డాలర్లు, స్నాప్‌ చాట్‌ 8 బిలియన్‌ డాలర్లు, ఎయిర్‌బీఎన్‌బీ, లిఫ్ట్‌ సుమారు 7 బిలియన్‌ డాలర్లు, పలన్‌టిర్‌ 6 బిలియన్‌ డాలర్లు, నూటానిక్స్‌ 5 బిలియన్‌ డాలర్లు కమ్యూలేటివ్‌ నష్టాలను ఆయా స్టార్టప్‌లు చవిచూశాయి. ఈ స్టార్టప్‌ల విలువ అత్యధికంగా ఉంది. ఇక్కడ ఆయా స్టార్టప్‌లకు వచ్చిన నష్టాలు అమెజాన్‌ స్టార్టప్‌కి వచ్చిన కమ్యూలేటివ్‌ నష్టాలకంటే అధికం. పలు స్టార్టప్‌ల నష్టాలు 2021లోను కొనసాగుతున్నాయి. 

కాగా ఈ స్టార్టప్‌లను అమెజాన్‌తో పోల్చే మోడల్‌ సరైనది కాదు..! అమెజాన్‌ కూడా ప్రారంభంలో కమ్యూలేటివ్‌ నష్టాలను చవిచూసినప్పటికీ తన పదవో సంవత్సరంలో అమెజాన్‌ లాభాలను ఆర్జించింది. అమెజాన్‌ స్టార్టప్‌ చరిత్ర ప్రకారం..అత్యధికంగా నష్టాలను ఎదుర్కొనే స్టార్టప్‌లు అమెజాన్‌ స్టార్టప్‌ లాగా కమ్యూలేటివ్‌ లాభాలను మాత్రం పొందలేవు. లాభాలను గడించడానికి ఎక్కువ సమయం తీసుకున్న ఆయా స్టార్టప్‌లకు ఏలాంటి నష్టం జరగదని నిపుణులు పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement