Venture Capitalists
-
వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు
Shivon Zilis:వెంచర్ క్యాపిటల్ ప్రపంచం స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్విటర్, టెస్లా ,స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్‌గా తన ప్రత్యకతను చాటు కుంటున్నారు జిలిస్. అయితే బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ పుస్తకం రిలీజ్ కాబోతున్న తరుణంలో జిలిస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. టెక్సాస్‌లోని ఆస్టిన్లోని జిలిస్ నివాసంలో తీసిన రైటర్ వాల్టర్ ఐజాక్సన్ కవల పిల్లలతో మస్క్ ,జిలిస్ ఫోటోలను షేర్ చేయడం అప్పట్లో పెద్ద సంచలన క్రియేట్ చేసింది.అయితే ఈ జంట ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి (ఐవీఎఫ్) ద్వారా 2021లో నవంబరులో వీరికి జన్మనిచ్చారు. ఈ కవలల పేర్లు స్ట్రైడర్ (కొడుకు), అజూర్ (కుమార్తె) గా ఇటీవల వెల్లడైంది. దీంతో మస్క్ సంతానం తొమ్మిదికి చేరింది. ఏప్రిల్ 2022లో, కవలల పేర్లను మార్చాలని మస్క్, జిలిస్ ఒక పిటిషన్‌ను మే 2022లో టెక్సాస్ న్యాయమూర్తి ఆమోదించారు. మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌తో.. గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే ఐదుగురు సంతానం ఉన్నారు. వీరితోపాటు సింగర్ గ్రిమ్స్‌తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే పిల్లలున్నారు. (రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?) షివోన్ జిలిస్ ఎవరు? ఎలాన్ మస్క్, జిలిస్ సంబంధం, అలాగే జిలిస్ గురించి చాలామందికి పెద్దగా తెలియదు. జిలిస్ కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో కె ఫిబ్రవరి 8, 1986న పంజాబీ భారతీయ తల్లి శారద , కెనడియన్ తండ్రి రిచర్డ్‌కి జన్మించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం IBMలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సుపై దృష్టి సారించే వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఉన్నారు. 2015లో మస్క్ సహ-స్థాపించిన లాభాపేక్ష రహిత సంస్థ OpenAIతో జిలిస్ మస్క్ మధ్య పరిచయం ఏర్పడింది. పలు మస్క్ కంపెనీలలో సీనియర్ పాత్రలలో పనిచేశారు. మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెస్లాలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. 2016 జూలైలో మస్క్ స్థాపించిన న్యూరాలింక్, ఇంప్లాంటబుల్ బ్రెయిన్-మెషిన్ ఇంటర్ ఫేస్‌లను అభివృద్ధి చేసే న్యూరోటెక్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా పేరు పొందారు.ప్రస్తుతం న్యూరాలింక్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ OpenAI బోర్డు మెంబర్‌గాఉన్నారు. జిలిస్ ప్రత్యేకతలు ♦ 2015లో వెంచర్ క్యాపిటల్ విభాగంలో ఫోర్బ్స్ 30 అండర్ 30కి ఎంపికయ్యారు. ♦ అవర్ లేడీ పీస్ అనే కెనడియన్ రాక్ బ్యాండ్ ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషీన్స్ అనే పుస్తకం తనకు ప్రేరణ అంటారు. కంప్యూటర్లు, మానవ మేథస్సును అథిగమిస్తున్న తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మానవాళి , భవిష్యత్తు గురించి తనకు తెలిపిందని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా జిలిస్ తెలిపారు. అప్పటి నుండే కృత్రిమ మేధస్సు అధ్యయనంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. ♦ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్-టైమ్ బెస్ట్. ఆమె గిటార్ , డ్రమ్స్ కూడా ప్లే చేసేది. ♦ అంతేకాదు మస్క్ తండ్రి తండ్రి ఎర్రోల్ షివోన్పై ప్రశంసలు కురిపించాడు. 2022లో ఒక ఇంటర్వ్యూలోఆ ఆమో IQ 170 అని ప్రకటించడం విశేషం. కాగా స్టీవ్ జాబ్స్ , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల ప్రశంసలు పొందిన జీవిత చరిత్రల రచయిత ఐజాక్సన్ రాసిన మస్క్ బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్ కానుంది. ఆయన రాసిన బయోగ్రఫీలు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మరి మస్క్ బయోగ్రఫీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాలి. -
వెంచర్ క్యాటలిస్ట్స్ నుంచి మూడు యూనికార్న్‌లు
ముంబై: దేశంలోనే మొదటి స్టార్టప్ ఇంక్యుబేటర్ ‘వెంచర్ క్యాటలిస్ట్స్ గ్రూపు’.. తన పోర్ట్‌ఫోలియోలోని 54 స్టార్టప్‌లు ఈ ఏడాది 50 మిలియన్ డాలర్ల విలువను (రూ.405 కోట్లు) అధగమించినట్లు ప్రకటించింది. ఈ ఏడాది ఫండింగ్ 70 శాతం పడిపోయిన సవాళ్ల వాతావరణంలోనూ ఈ సానుకూల పరిణామం చోటుచేసుకన్నట్టు పేర్కొంది. వెంచర్ క్యాట లిస్ట్స్ ఇప్పటి వరకు 33 సూనికార్న్లు, 100కు పైగా మినీకార్న్లకు వేదికగా నిలిచింది. విడిగా చూస్తే రెండు డజన్లకు పైగా కంపెనీలు 100 మిలియన్ డాలర్ల వ్యాల్యూషన్‌ను అధిగమించినట్టు సంస్థ తెలిపింది. ఇందులో షిప్ రాకెట్, భారత్ పే, వేదాంతు గత ఏడాది కాలంలో యూనికార్న్ హోదా పొందినట్టు వెల్లడించింది. చదవండి: బాబోయ్, హైదరాబాద్‌లో పెరిగిన ఇళ్ల ధరలు.. కారణం ఎంటంటే! -
భారత్‌లో టెక్ పెట్టుబడులు భేష్
లండన్: వెంచర్ క్యాపిటలిస్ట్ (వీసీ) పెట్టుబడులపరంగా దేశీ టెక్నాలజీ రంగానికి గతేడాది జోరుగా సాగింది. 2020లో నమోదైన 14.9 బిలియన్ డాలర్లతో పోలిస్తే 2021లో దాదాపు మూడు రెట్లు పెరిగి 44.6 బిలియన్ డాలర్లకు చేరింది. తద్వారా అంతర్జాతీయంగా భారీగా వీసీ పెట్టుబడులు ఆకర్షించిన దేశాల జాబితాలో నాలుగో స్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. లండన్ అండ్ పార్ట్నర్స్, డీల్‌రూమ్‌డాట్‌కో సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం గతేడాది ప్రపంచవ్యాప్తంగా వీసీ పెట్టుబడులు 675 బిలియన్ డాలర్ల స్థాయిలో నమోదయ్యాయి. అత్యధికంగా 328.8 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 61.8 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 39.8 బిలియన్ డాలర్లతో బ్రిటన్ నాలుగో స్థానాల్లో నిల్చాయి. నగరాలవారీగా బెంగళూరు టాప్.. దేశీయంగా అత్యధికంగా వీసీ పెట్టుబడులు ఆకర్షించిన నగరంగా బెంగళూరు టాప్‌లో ఉంది. 18.6 బిలియన్ డాలర్లు దక్కించుకుంది. తద్వారా ప్రపంచంలో టాప్ నగరాల జాబితాలో అయిదో స్థానంలో నిల్చింది. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా (101 బిలియన్ డాలర్లు), న్యూయార్క్ (47.5 బిలియన్ డాలర్లు), గ్రేటర్ బోస్టన్ రీజియన్ (30 బిలియన్ డాలర్లు), లండన్ (25.5 బిలియన్ డాలర్లు) తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఇక యూనికార్న్‌లపరంగా కూడా బెంగళూరు అగ్రస్థానంలో ఉంది. మొత్తం 16 కొత్త యూనికార్న్‌లకు కేంద్రంగా నిల్చింది. ‘బ్రిటన్, భారత్‌లో రికార్డు స్థాయి వీసీ పెట్టుబడుల గణాంకాలు .. ఈ రెండు దేశాల టెక్నాలజీ, నవకల్పనల సామర్థ్యాలపై ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని సూచిస్తున్నాయి. యూనికార్న్‌లు, టెక్ స్టార్టప్‌లపరంగా ఇన్వెస్ట్ చేయడానికి అత్యుత్తమమైన అతికొద్ది నగరాల జాబితాలో లండన్, బెంగళూరు మొదలైన వాటిని వీసీలు పరిగణిస్తున్నారు‘ అని లండన్ అండ్ పార్ట్నర్స్ భారత విభాగం కంట్రీ డైరెక్టర్ హేమిన్ భరూచా తెలిపారు. -
గెలుపు బాటలో మరో స్టార్టప్.. ఓఫోర్‌ఎస్‌లోకి పెట్టుబడుల వరద
న్యూఢిల్లీ: బిజినెస్‌కి సంబంధించి సప్లై చైయిన్ వ్యవస్థలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా సేవలు అందిస్తోన్న ఓఫోర్‌ఎస్ (O4S) సంస్థ ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా దేశాలకు తమ సేవలను విస్తరించనుంది. ఇటీవల ఓఫోర్‌ఎస్‌లో పెట్టుబడులు పెట్టేందుకు థింక్ ఇన్వెస్ట్మెంట్స్, వెంచర్‌హైవే వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. మొత్తంగా 6 మిలియన్ డాలర్లను (రూ. 45 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు. అంతకు ముందు జరిగిన చర్చల్లో రూ. 25 కోట్ల పెట్టుబడులు ఈ సంస్థలోకి వచ్చాయి. భారీ మొత్తంలో నిధులు రావడంతో విస్తరణ బాటలో ఉంది ఓఫోర్‌ఎస్ సంస్థ. దివయ్ కుమార్, శ్రేయస్ సిపానీలు ఓఫోర్‌ఎస్‌ని 2017లో స్టార్టప్‌గా ప్రారంభించారు. ప్రధాన కార్యాలయం గురుగ్రామ్‌లో ఉండగా బెంగళూరు, హైదరాబాద్‌లలో రీజనల్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పటికే ఈ సంస్థకు కష్లమర్లుగా ఐటీసీ, కోకకోల, హనీవెల్, ఆక్‌జోనోబెల్, మెండల్‌లెజ్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సప్లై చెయిన్‌కి సంబంధించి 500లకు పైగా సంస్థలు ఓఫోర్‌ఎస్‌కి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్‌లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లతో పాటు ఎస్ఏఏఎస్ (SaaS) సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగిస్తున్నాయి. ఇటీవల ఫోర్బ్స్ ప్రకటించిన ఏషియన్ అండర్ 30 ఎంట్రప్యూనర్స్ జాబితాలో దివయ్ కుమార్, శ్రేయస్ సిపానీలు చోటు దక్కించుకున్నారు. -
సాయిధరమ్ తేజ్... చిత్రలహరిలో చెప్పింది ఇదే..
Sai Dharam Tej : టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచిన విషయం తెలిసిందే. యాక్సిడెంట్ జరిగిన వెంటనే స్థానికులు 108కి సమాచారం అందించడంతో గోల్డెన్ అవర్‌లో చికిత్స అంది ప్రాణపాయం తప్పింది. నిజ జీవితానికి దగ్గర అన్నట్టుగానే సరిగ్గా ఏడాది కిందట ప్రమాదంలో గాయపడినప్పుడు చుట్టు పక్కల ఎవ్వరూ లేకపోయినా తక్షణ సాయం ఎలా పొందాలనే కాన్సెప్టుతో యాప్‌ను డెవలప్ చేసే యువకుడిగా తేజ్ చిత్రలహరి అనే సినిమా వచ్చింది. యాక్సిడెంట్ అలెర్ట్ సిస్టమ్ పేరుతో ఓ స్టార్టప్ నెలకొల్పే న్యూ ఎంట్రప్యూనర్‌గా తేజ్ అందులో కనిపించారు. ఒక ఐడియా ఎంతోమంది జీవితాల్లో మార్పు తెస్తుంది. అయితే ఆ ఐడియా కార్యరూపం దాల్చే క్రమంలో ఎదురయ్యే ఒడిదుడుకులు, ఆటుపోట్లు, అవకాశాలు ఎలా ఉంటాయినే వివరాలు... స్టార్టప్ ఒకప్పుడు వ్యాపారం అనేది కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉండేది. అది కూడా సంప్రదాయ పద్దతిలోనే కొనసాగేది. కానీ కొత్త వాళ్లు ఆ రంగంలో ప్రవేశించడం దుర్లభంగా ఉండేంది. వచ్చినా నిలదొక్కుకోవడం కష్టంగా ఉండేది. అయితే ఇంటర్నెట్ యాక్సెస్ పెరగడం, స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రావడంతో వ్యాపారంలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. మంచి కాన్సెప్టు ఉంటే చాలు తక్కువ పెట్టుబడితో స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సక్సెస్ మంత్ర స్టార్టప్‌ల విజయాల గురించి చర్చిస్తే ఫ్లిప్‌కార్ట్ మొదలు బైజూస్, అన్ అకాడమీ, జోమాటో, స్విగ్గీ, పేటీఎం, ఓయో, ఓలా ఒక్కటేమికి వరుసగా అనేక కంపెనీలు మన కళ్లేదుటే ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. ఈ స్టార్టప్‌లు ప్రారంభమై కష్టనష్టాలు ఎదుర్కొని వేల కోట్ల మార్కెట్ విలువను సొంతం చేసుకునేందుకు సంప్రదాయ పద్దతిలో ఏళ్లకు ఏళ్లు తీసుకోలేదు. జస్ట్ ఐదు నుంచి పదేళ్లలోనే వేల కోట్లకు చేరుకున్నాయి. కారణం కొత్త దనం, ఈజీ యాక్సెస్. స్టార్టప్ కంపెనీలకు ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. అయితే ఈ రెండు ఉంటేనే కంపెనీలు సక్సెస్ అవుతాయా అంటే కాదనే చెప్పాలి. స్టార్టప్ పుట్టుకకు కారణమైన కాన్సెప్టుకి వెన్నుదన్నుగా నిలిచే వెంచర్ క్యాపిటలిస్టులది ముఖ్య పాత్ర, వెంచర్ క్యాపిటలిస్టులు ఒకప్పుడు వ్యాపారం మొదలు పెట్టాలంటే రుణం కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అనేక రూల్స్, నిబంధనలు, అధికారుల అలసత్వం, బంధుప్రీతి, రాజకీయ జోక్యం తదితర కారణాల వల్ల ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు రుణాల మంజూరు తలకు మించిన భారం అయ్యేది. కానీ వెంచర్ క్యాపిటలిస్టులు పెరిగిన తర్వాత ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. ఒప్పించడం సవాలే వ్యాపారం రంగంలో సక్సెస్ అయ్యే కాన్సెప్టులకి సహాకారం అందించేందుకు వెంచర్ క్యాపిటలిస్టులు ఎప్పుడూ రెడీగా ఉంటారు. అయితే వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గరికి చేరుకోవడం, అక్కడ వారిని కాన్సెప్టుకి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకోవడమనేది మరో యజ్ఞం లాంటింది. కాన్సెప్టులో దమ్ముండి, వెంచర్ క్యాపిటలిస్టుల అండ లభిస్తే ఇక ఆ వ్యాపారానికి తిరుగు ఉండందు. మన దగ్గర దేశీ కంపెనీలతో విదేశీ సంస్థలకు చెందిన అనేక వెంచర్ క్యాపిటిలస్టులు పెట్టుబడులకు రెడీగా ఉన్నారు. అయితే వెంచర్ క్యాపిటలిస్టుల దగ్గరికి చేరడం కష్టం. దీనికి సంబంధించిన కష్టాలు ఎలా ఉంటాయనే అంశాలు మనకు చిత్రలహరి, ఆకాశమేన ఈ హద్దురా సినిమాల్లో పూసగుచ్చినట్టు వివరించారు. వాళ్లే వస్తున్నారు విభిన్నతకు నిలయమైన భారత్‌లాంటి దేశంలో పెట్టుబడుల అవసరాలు గుర్తించిన అనేక మంది వెంచర్ క్యాపిటలిస్టులు తమ రూటు మార్చుకున్నారు. టెక్ దిగ్గజ కంపెనీలు సైతం స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, ఫేస్బుక్, గూగుల్ వంటి సంస్థలు స్టార్టప్‌లకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ముందుకు వచ్చాయి. ప్రత్యేకంగా స్టార్టప్ కాంపిటీషన్లు నిర్వహిస్తున్నాయి. ప్రభుత్వ పరంగా స్టార్టప్‌లకు చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వ పరంగా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం టీ హబ్ పేరుతో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇంక్యుబేషన్ సెంటర్‌ను నిర్మించింది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాల్లోనూ ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. మంచి కాన్సెప్టుతో ఇక్కడికి వెళితే ప్లగ్ అండ్ ప్లే మోడ్‌లో పని చేసుకోవచ్చు. ప్రైవేటు పరంగా స్టార్టప్‌లకు ఉండే పరిమిత వనరులను దృష్టిలో ఉంచుకుని అతి తక్కువ ఖర్చుతో వర్క్‌స్పేస్‌ను అందించే సంస్థలు సైతం పుట్టుకొచ్చాయి. ఇవి కాఫీ లాంజ్ తరహాలో ఉంటాయి. మన కంప్యూటర్/లాప్‌ట్యాప్‌లతో అక్కడికి వెళితే చాలు టేబుల్, ఇంటర్నెట్, కాఫీ, లంచ్ తదితర సౌకర్యాలు కల్పిస్తారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్లిపోవచ్చు. అతి తక్కువ ఖర్చుతో ఈ తరహా ఆఫీస్ స్పేస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్‌లో ఈ తరహా స్టార్టప్‌లోనే సుచిత్ర మొదట పని చేస్తుంది. చదవండి : Bigg Boss: బాస్‌లకే బాస్ అసలైన బిగ్‌బాస్ ఇతనే -
పేరుకే బిలియన్ డాలర్ల స్టార్టప్‌లు..నష్టాలు మాత్రం..!
వాషింగ్టన్: ప్రపంచ వ్యాప్తంగా స్టార్టప్‌లు గణనీయంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంతింతై వటుడింతై అన్న చందంగా స్టార్టప్ కంపెనీల విలువ గణనీయంగా పెరిగి యునికార్న్ స్టార్టప్‌లుగా అవతరిస్తున్నాయి. యునికార్న్ స్టార్టప్ అనగా కంపెనీ విలువ సుమారు ఒక బిలియన్ డాలర్ విలువకు చేరితే ఆ స్టార్టప్‌లను యునికార్న్లుగా పిలుస్తారు. యునికార్న్ అనే పదాన్ని ఐలీన్ లీ ప్రతిపాదించారు. విచిత్రమైన పరిస్థితి.. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి పలు యునికార్న్ స్టార్టప్‌లు గణనీయమైన వృద్ధిని సాధించాయి. కరోనా సమయంలో స్టార్టప్‌ల షేర్ ధరలు 50 శాతానికి పైగా పెరిగాయి. మరికొన్ని స్టార్టప్‌ల షేర్ ధరలు అమాంతం రెట్టింపు, మూడు రెట్లు కూడా పెరిగాయి. జూమ్, రోకు, స్వ్కేర్ వంటి స్టార్టప్‌లు షేర్లు బాగా వృద్ధిని నమోదుచేసిన అంతే నష్టాలను చవిచూశాయి. స్నాప్‌చాట్, ట్విలియో, పిన్ట్రెస్ట్, స్లాక్, యూబర్, లిఫ్ట్ షేర్లు భారీగా పెరిగాయి. ఆయా స్టార్టప్‌లు షేర్ విలువ గణనీయంగా పెరిగినప్పటికీ అంతే స్థాయిలో స్టార్టప్‌లు నష్టాలను కూడా చవిచూశాయి. ఆయా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిలిస్టుల నుంచి ఫండింగ్ బలంగానే ఉంది. 2021 తొలి త్రైమాసికంలో గరిష్టంగా 125 బిలియన్ డాలర్లకు ఫండింగ్ చేరుకుంది. భారీ ఎత్తున వెంచర్ ఫండింగ్, అధిక షేర్ ధరలు ఉన్నపటీకి ఆయా స్టార్టప్‌లు నష్టాలనుంచి బయట పడలేదు. ఈ స్టార్టప్‌లతో పోల్చుకుంటే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రారంభంలో గరిష్టమైన నష్టాలను చవిచూసినప్పటికి తిరిగి స్టార్టప్ లాభాలవైపు అడుగులు వేసింది. అమెరికాలో అత్యధికంగా నష్టాలను పొందిన సంస్థగా అమెజాన్ నిలిచింది. అమెజాన్ తన పదవో సంవత్సరం నుంచి లాభాలను పొందలేకపోయింది. ఈ లాభాలు 2016 సంవత్సరం వరకు స్టార్టప్ 3 బిలియన్ డాలర్ల నష్టాలను కవర్ చేయలేకపోయాయి. ప్రస్తుతం అమెజాన్ అత్యంత విలువైన స్టార్టప్‌గా నిలిచింది. పలు యునికార్న్ స్టార్టప్‌లను స్థాపించి సుమారు 10 నుంచి 20 సంవత్సరాలైనప్పటికీ అమెజాన్ తరహాలో లాభాలను పొందలేకపోతున్నాయి. వోల్ఫ్స్ట్రీట్ రిపోర్ట్ ప్రకారం..ఆయా స్టార్టప్‌ల ఫైలింగ్స్‌ను అమెజాన్‌తో పోల్చితో భారీ వ్యత్యాసాలు కనిపించాయి. పలు యునికార్న్ స్టార్టప్‌లు స్థాపించి పది నుంచి ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నాయి. ఉబర్ స్టార్టప్ 23 బిలియన్ డాలర్లు, స్నాప్ చాట్ 8 బిలియన్ డాలర్లు, ఎయిర్‌బీఎన్‌బీ, లిఫ్ట్ సుమారు 7 బిలియన్ డాలర్లు, పలన్టిర్ 6 బిలియన్ డాలర్లు, నూటానిక్స్ 5 బిలియన్ డాలర్లు కమ్యూలేటివ్ నష్టాలను ఆయా స్టార్టప్‌లు చవిచూశాయి. ఈ స్టార్టప్‌ల విలువ అత్యధికంగా ఉంది. ఇక్కడ ఆయా స్టార్టప్‌లకు వచ్చిన నష్టాలు అమెజాన్ స్టార్టప్‌కి వచ్చిన కమ్యూలేటివ్ నష్టాలకంటే అధికం. పలు స్టార్టప్‌ల నష్టాలు 2021లోను కొనసాగుతున్నాయి. కాగా ఈ స్టార్టప్‌లను అమెజాన్‌తో పోల్చే మోడల్ సరైనది కాదు..! అమెజాన్ కూడా ప్రారంభంలో కమ్యూలేటివ్ నష్టాలను చవిచూసినప్పటికీ తన పదవో సంవత్సరంలో అమెజాన్ లాభాలను ఆర్జించింది. అమెజాన్ స్టార్టప్ చరిత్ర ప్రకారం..అత్యధికంగా నష్టాలను ఎదుర్కొనే స్టార్టప్‌లు అమెజాన్ స్టార్టప్ లాగా కమ్యూలేటివ్ లాభాలను మాత్రం పొందలేవు. లాభాలను గడించడానికి ఎక్కువ సమయం తీసుకున్న ఆయా స్టార్టప్‌లకు ఏలాంటి నష్టం జరగదని నిపుణులు పేర్కొన్నారు. -
చిన్న సంస్థల లాభాలకు ఆన్లైన్ బూస్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ-కామర్స్‌కి ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎస్ఎంబీ) వెబ్సైట్లు ఏర్పాటు చేసుకునేందుకు ప్రత్యేక తోడ్పాటు అందిస్తున్నట్లు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ గూగుల్ వైస్ ప్రెసిడెంట్ అలాన్ థిగ్నెస్ తెలిపారు. సాధారణ సంస్థలతో పోలిస్తే ఆన్లైన్ మాధ్యమంలో కూడా ఉన్న సంస్థల ఆదాయాలు 51 శాతం, లాభాలు 49 శాతం అధికంగా ఉంటున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే గడిచిన రెండేళ్లలో 3 లక్షల పైగా చిన్న సంస్థలు వెబ్సైట్లు ఏర్పాటు చేసుకునేందుకు తోడ్పాటునిచ్చినట్లు అలాన్ మంగళవారమిక్కడ విలేకరులకు చెప్పారు. ఈ-కామర్స్ వృద్ధి... డొమైన్, వెబ్సైట్ హోస్టింగ్ మొదలైనవి ఏడాది పాటు ఉచితంగానే అందిస్తున్నామని, రెండో ఏడాది నుంచి గూగుల్‌తోనే కొనసాగాలా వద్దా అన్నది ఆయా సంస ్థల అభీష్టంపై ఆధారపడి ఉంటుందని గూగుల్ ఇండి యా చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార విభాగ హెడ్ కె. సూర్యనారాయణ చెప్పారు. దేశీయంగా 4.7 కోట్ల పైగా ఎస్ఎంబీలు ఉండగా.. కేవలం 5 శాతం సంస్థలకు మాత్రమే వెబ్సైట్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం 10 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్.. 2020 నాటికి 80-100 బిలియన్ డాలర్ల దాకా చేరగలదన్నారు. అలాగే, 2015 నాటికి ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 20 కోట్ల నుంచి సుమారు 35 కోట్లకు చేర గలదని అంచనాలు ఉన్నట్లు పేర్కొన్నారు.