అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్‌...! | 100 Companies In India Raised Series A Funding For Startups In 2020 | Sakshi
Sakshi News home page

అగ్రరాజ్యాలకు పోటీగా నిలుస్తోన్న భారత్‌...!

Published Mon, Oct 4 2021 5:37 PM | Last Updated on Mon, Oct 4 2021 9:27 PM

100 Companies In India Raised Series A Funding For Startups In 2020 - Sakshi

Over 100 Companies in India Raised Series A Funding for Startups in the Past Year: భారత్‌లో స్టార్టప్స్‌ సంస్కృతి గణనీయంగా అభివృద్ధి చెందుతుంది. నూతన టెక్నాలజీలను అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలను భారత స్టార్టప్స్‌ రూపోందిస్తున్నాయి. ఫండింగ్‌లో అగ్రరాజ్యాలకే పోటీగా భారత్‌ నిలుస్తోంది. 

స్టార్టప్స్‌ దూకుడు...
భారత్‌లో పలు స్టార్టప్‌ కంపెనీలు దూకుడు మీదున్నాయి. భారత్‌లో ఇప్పటివరకు 100కు పైగా యూనికార్న్‌ స్టార్టప్‌లుగా అవతరించాయి. ఇండియన్‌ స్టార్టప్‌లు సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా పలు దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. సిరీస్‌ ఏ ఫండింగ్‌లో విషయంలో డేటా రిసెర్చ్‌ అండ్‌ అనాలిటిక్స్‌ ఫ్రీమ్‌ లాంచ్‌ గ్రావిటీ సహా వ్యవస్థాపకుడు డ్రేక్‌ డ్యూక్‌ స్టార్టప్‌ కంపెనీలపై పలు ఆసక్తి కర విషయాలను తెలియజేశారు.
చదవండి: 75వేల కోట్ల కంపెనీ ..! అందులో అమితాబ్‌ బచ్చన్‌ ఎంట్రీ...!

గత ఏడాది స్టార్టప్‌ల  ‘సిరీస్‌ ఏ ఫండింగ్‌  ’ విషయంలో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. తొలి రెండుస్ధానాల్లో అమెరికా, యూనైటేడ్‌ కింగ్‌డమ్‌ నిలిచాయి. భారత్‌కు చెందిన సుమారు 109 స్టార్టప్స్‌ పలు దిగ్గజం కంపెనీల నుంచి సిరీస్‌ ఏ ఫండింగ్‌ను పొందాయి. గత ఏడాది భారత స్టార్టప్స్‌ సుమారు 1820.3 మిలియన్‌ డాలర్ల సిరీస్‌ ఏ ఫండింగ్‌లో పెట్టుబడులను ఆకర్షించాయని డ్రేక్‌ పేర్కొన్నారు. 

సిరీస్‌ ఏ ఫండింగ్‌లో గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌, మెక్‌కిన్సీ, గోల్డ్‌మన్‌ సాక్స్‌, ఐబీఎమ్‌, ఐడీఎఫ్‌, బీసీజీ, బెయిన్‌ఆలర్ట్స్, యూబర్‌, ఫేస్‌బుక్‌ కంపెనీలు నిలిచాయి. ఈ కంపెనీలు సాఫ్ట్‌వేర్‌, ఐటీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, సాస్‌, ఫిన్‌టెక్‌, హెల్ద్‌కేర్‌, మెషిన్‌ లెర్నింగ్‌,  బ్లాక్‌చెయిన్‌, ఈ-కామర్స్‌ రంగాలోని స్టార్టప్‌లకు భారీ పెట్టుబడులను అందిస్తున్నాయి. 


చదవండి: ఆ వెబ్‌సిరీస్‌తో నెట్‌ఫ్లిక్స్‌కు కొత్త తలనొప్పి..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement