న్యూఢిల్లీ: గ్రోసరీ డెలివరీ స్టార్టప్ జెప్టో భారీగా పెట్టుబడులను అందుకుంది. త్వరలో పబ్లిక్ ఇష్యూకి రానున్న కంపెనీ 66.5 కోట్ల డాలర్ల (రూ. 5,550 కోట్లు) నిధులను సమీకరించింది. దీంతో ఈ క్విక్ కామర్స్ సంస్థ విలువ 3.6 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 30,000 కోట్లు)కు ఎగసింది. వెరసి ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, బ్లింకిట్ (జొమాటో), స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్‌బాస్కెట్ (టాటా గ్రూప్)లతో పోటీ పడనుంది.
గ్రోసరీ డెలివరీ విభాగంలో తీవ్ర పోటీ కారణంగా అధిక పెట్టుబడులు, తక్కువ మార్జిన్లు నమోదయ్యే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జెప్టోలో తాజా పెట్టుబడులకు ప్రాధాన్యత ఏర్పడింది. 2021 ఏప్రిల్‌లో ప్రారంభమైన స్టార్టప్ జెప్టోలో కొత్త సంస్థలు ఎవెనీర్ గ్రోత్ క్యాపిటల్, లైట్‌స్పీడ్, అవ్రా క్యాపిటల్‌సహా ప్రస్తుత ఇన్వెస్టర్లు గ్లేడ్ బ్రూక్, నెక్సస్, స్టెప్‌స్టోన్ గ్రూప్ తాజా పెట్టుబడులను అందించాయి.
కాగా.. జెప్టో నిర్వహణస్థాయిలో లాభాలు ఆర్జించేందుకు సిద్ధంగా ఉన్నదని, సమీప భవిష్యత్‌లో స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యే అవకాశముందని సంబంధిత వర్గా లు తెలిపాయి. గ్రోసరీస్‌ను 10 నిమిషాల్లో డెలివరీ చేసే సంస్థల్లో కంపెనీ 29% వాటాను ఆక్రమిస్తుండగా..40% వాటాతో బ్లింకిట్ టాప్‌లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment