కరోనా రాకతో విద్యారంగంలో భారీ మార్పులే వచ్చాయి. పాఠశాలలు విద్యార్ధులకు పూర్తిగా ఆన్‌లైన్ క్లాసులనే నిర్వహించాయి. ఆన్‌లైన్ ట్యూటరింగ్ సర్వీసులు భారీ వృద్దినే నమోదు చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ ఆన్‌లైన్ ట్యూటరింగ్ సర్వీస్ సంస్ధ వేదాంతు యునికార్న్ స్టార్టప్‌గా అవతరించింది. సింగపూర్‌కు చెందిన ఏబీసీ వరల్డ్ ఆసియా కంపెనీ నుంచి సుమారు 100 మిలియన్ డాలర్లను సేకరించడంతో వేదాంతు స్టార్టప్ వాల్యూయేషన్ ఒక బిలియన్ డాలర్లకు చేరుకుంది. వేదాంతుకు టైగర్ గ్లోబల్ మేనేజ్‌మెంట్, కోట్ మేనేజ్‌మెంట్, జీజీవీ క్యాపిటల్ వంటి ఇన్వెస్టర్లుగా నిలిచాయి.
చదవండి: బంగారాన్ని బట్టి ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా?
బైజూస్, ఆన్‌అకాడమీ, అప్‌గ్రేడ్, ఏరుడిటస్ తరువాత ఐదో భారతీయ ఎడ్‌టెక్ యునికార్న్ సంస్థగా వేదాంతు నిలిచింది. వేదాంతు ఏడు సంవత్సరాల క్రితం తన లైవ్-ట్యూటరింగ్ సేవలను ప్రారంభించింది.2022 మార్చి నాటికి 500,000 యూజర్లను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం రెండు లక్షల మంది విద్యార్థులు వేదాంతులో ఎన్‌రోల్ చేసుకున్నట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వంశీ కృష్ణ అన్నారు. కరోనా రాకతో పలు ప్రైవేటు టీచర్ల దుస్థితి దయనీయంగా మారింది. వేదాంతు సహాయంతో పలువురు ప్రైవేటు టీచర్లు వేదాంతులో ట్యూటర్‌గా జాయిన్ అయ్యారని కృష్ణ వెల్లడించారు.
చదవండి: ఒక్క నెలలో రూ.900 కోట్లు సంపాదించిన బిగ్ బుల్!
Comments
Please login to add a commentAdd a comment