భారత్‌లో స్టార్టప్స్ వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. పలు స్టార్టప్స్ విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టుతున్నాయి. ఆయా స్టార్టప్‌లు అంతే వేగంగా యూనికార్న్(ఒక బిలియన్ డాలర్ విలువ గల) స్టార్టప్‌లుగా అవతరిస్తున్నాయి.
మాంసం ఉత్పత్తులతో...యూనికార్న్ క్లబ్‌లోకి..!
భారత్‌లో ఇప్పటివరకు 65 కంపెనీలు యూనికార్న్ జాబితాలోకి చేరాయి. ఈ ఏడాదిలోనే దాదాపు 28 స్టార్టప్స్ చేరాయి. తాజాగా ఢిల్లీకి చెందిన లైసియస్ స్టార్టప్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకొని యూనికార్న్ క్లబ్‌లో జాయిన్‌ఐనా 29 స్టార్టప్‌గా నిలిచింది. ఐఐఎఫ్‌ఎల్ ఏఎమ్‌సీ లేట్ స్టేజ్ టెక్ ఫండ్ రౌండ్‌లో లైసియస్ 52 మిలియన్ డాలర్లను సేకరించి యూనికార్న్‌గా అవతరించింది. గతంలో టెమాసెక్, 3వన్4 క్యాపిటల్, బెర్ట్‌ల్స్‌మెన్ ఇండియా నుంచి సుమారు 310 మిలియన్ డాలర్లను పెట్టుబడులను ఆకర్షించింది. లైసియస్‌ను అభయ్ హంజురా , వివేక్ గుప్తా 2015లో స్థాపించారు. ఈ కంపెనీలో సుమారు 3500 మంది పనిచేస్తున్నారు.
చదవండి: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...!
విజయ రహస్యమీదే...!
లైసియస్ బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కత్తా వంటి నగరాల్లో భారీగా ఆదరణను పొందింది. మాంసం, సీఫుడ్ ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు చేరవేసింది. ఆయా నగరాల్లోని ప్రజలకు మాంసం ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తూ అత్యంత ఖ్యాతిని ఆర్జించింది. నాణ్యమైన మాంసం, సీఫుడ్ ఉత్పత్తులను లైసియస్ అందించింది.
కంపెనీకి మాంసం కొనుగోలుదారులకు మధ్యవర్తి లేకుండా డైరక్ట్ టూ కస్టమర్ విధానాలను లైసియస్ అవలంభించింది. అంతేకాకుండా లైసియస్ యాప్ నుంచి మాంసాన్ని బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. లైసియస్ వెబ్‌సైట్ ప్రకారం..ప్రతినెలా ఒక మిలియన్ ఆర్డర్స్‌ను పొందుతుంది. వాటిలో 90 శాతం మేర రెగ్యూలర్ కొనుగోలుదారులే.
చదవండి: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్‌ఆర్‌ఆర్ బ్యూటీ..!
Comments
Please login to add a commentAdd a comment