Used-Car Platform Spinny Raises $283 Million: భారత్‌లో స్టార్టప్స్ దూకుడు మీదున్నాయి. అతి తక్కువ కాలంలో యూనికార్న్ (ఒక బిలియన్ డాలర్ విలువ గల) స్టార్టప్స్‌గా అవతరిస్తున్నాయి. క్రియోటివ్ ఆలోచనలతో భారత మార్కెట్లను శాసిస్తున్నాయి. సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలను జరిపే బెంగళూరు బేస్డ్ స్టార్టప్ స్పిన్నీ కంపెనీ సరికొత్త విలువకు చేరుకుంది.
283 మిలియన్ డాలర్ల సేకరణ..!
అబుదాబికి చెందిన ఏడీక్యూ, టైగర్ గ్లోబల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్‌లో స్పిన్నీ సుమారు 283 మిలియన్ డాలర్లను సేకరించింది. దీంతో కంపెనీ విలువ 1.8 బిలియన్ డాలర్లకు చేరింది. కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరచడానికి , సాంకేతికత, పలు ఉత్పత్తులను అప్‌గ్రేడ్ చేయడానికి తాజా నిధులను ఉపయోగిస్తామని స్పిన్నీ ఒక ప్రకటనలో తెలిపింది.
పాత కార్లే వారి బిజినెస్..!
2015లో స్థాపించిన స్పిన్నీ కంపెనీ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉపయోగించిన కార్లను విక్రయించే అవకాశాన్ని కల్పిస్తోంది. 2,000 కంటే ఎక్కువ సెకండ్ హ్యాండ్ మోడల్స్ కొనుగోలు దారులకు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా టెస్ట్ డ్రైవ్‌ను బుక్ చేసుకోనే వీలును కూడా కల్పిస్తోంది.
ఇప్పటి వరకు కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం 20,000 సెకండ్ హ్యండ్ కార్లను విక్రయించింది. పాత కార్లను సొంతం చేసుకునేవారికోసం ఫైనాన్సింగ్‌ను కూడా స్పిన్నీ అందిస్తోంది. నామమాత్రపు వడ్డీరేట్లతో కొనుగోలుదారులకు రుణాలను ఇస్తోంది.
చదవండి: అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..!
Comments
Please login to add a commentAdd a comment