Meat products
-
నీట్‌గా మీట్
ఆహారం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో రోజురోజుకు అవగాహన పెరుగుతోంది. ప్రజల అభిరుచికి తగ్గట్లే వ్యాపారస్తులు కూడా అధునాతన సదుపాయాలు అందుబాటులోకి తెస్తున్నారు. ఇప్పటికే పట్టణాల్లో సంతలు సూపర్ మార్కెట్లలోకి వచ్చాయి. ఇక మాంసం దుకాణాలు కూడా నీట్‌గా మారుతున్నాయి. బహుళజాతి సంస్థలతో పాటు స్థానిక వ్యాపారులు కూడా కస్టమర్లను ఆకర్షించడానికి నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. అలాంటి మాంసాహార ఉత్పత్తులు కొనడానికే ప్రజలు కూడా ఆసక్తి చూపుతున్నారు. మాంసాహార ఉత్పత్తులను కొన్ని సంస్థలు ఇప్పటికే ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చాయి. వీటికి దీటుగా పట్టణ ప్రాంతాల్లో తాజా, ఫ్రోజెన్ ఉత్పత్తులు అందించడానికి నాన్ వెజ్ స్టోర్స్, మార్ట్ల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకొస్తున్నారు. – సాక్షి, అమరావతిమీట్ మార్ట్‌కు రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఔత్సాహికులు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు నేరుగా మార్టులు నడుపుతుంటే.. మరి కొందరు ఫ్రాంచైజీ తరహాలో ఈ మార్ట్లను విస్తరిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ముందుకొస్తున్నారు. కేవలం చేపలు, కోడి, మేక మాంసాలకే పరిమితం కాకుండా అన్ని రకాల మాంసాహార ఉత్పత్తులు ఒకే చోట అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మార్ట్లు రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 50కు పైగా ఉన్నాయి. ఈ మార్టుల ద్వారా రాష్ట్రంలో రోజుకు సగటున ఐదారు కోట్ల రూపాయలకు పైగా వ్యాపారం జరుగు తోందని అంచనా వేస్తున్నారు. ఉన్నత, ఎగువ మధ్య తరగతి ప్రజలుండే ప్రాంతాలే లక్ష్యంగా మార్టుల యజమానులు షాప్స్ ఓపెన్ చేస్తు న్నారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి వంటి నగరాల్లో ఇవి బాగా విస్తరిస్తున్నాయి.మీట్ మార్టుల ప్రత్యేకతలు ఇవే.. » కబేళాలతో పాటు డ్రెస్సింగ్, ప్యాకింగ్ ఇలా ప్రతీ దాంట్ అంతర్జాతీయ ప్రమాణాలు» పరిసరాలన్నీ అత్యంత పరిశుభ్రంగా ఉంచడంతో పాటు సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్» వచ్చే ప్రతీ కస్టమర్ కళ్లెదుటే వారికి కావాల్సినట్టుగా కట్ చేసి ప్యాకింగ్» మటన్, చికెన్, ఫిష్ తదితరాలకు ఏ పార్ట్ (భాగం) కావాలంటే ఆ పార్టులు వేరుగా విక్రయం » బిర్యానీ, తందూరీ వంటి వంటకాలకు తగినట్టుగా కట్ చేసి ప్యాకింగ్» రెడీ టూ కుక్కు వీలుగా మసాలాలు అద్ది మరీ అందించడండోర్ డెలివరీకి ప్రత్యేకంగా కాల్ సెంటర్» రాష్ట్రంలో మీట్ మార్టులు 50» రోజుకు సగటున జరుగుతున్న వ్యాపారం (రూ. కోట్లలో) 5- 6 » ఒక్కో మీట్ మార్టుకు పెట్టుబడి (రూ.ల్లో) 30 - 50 లక్షల వరకుశుచి, శుభ్రత ముఖ్యంశుచి, శుభ్రత ఉంటే కాస్త ధర ఎక్కువైనా వెనుకాడడం లేదు. విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున ఫిష్, మటన్ మార్ట్లు అందుబాటులోకి వచ్చాయి. బ్రతికున్న చేపలే కాదు.. శుభ్రమైన వాతావరణంలో కోడి, మేక మాంసంతో పాటు తాజాగా బతికి ఉన్న అన్ని రకాల రొయ్యలు ఈ మార్టుల్లో దొరుకుతున్నాయి. –ఎం.హరినాథ్, రిటైర్డ్ డీఈ, పంటకాలవ రోడ్, విజయవాడప్రజల్లో ఆదరణ బాగుందిగత కొన్నేళ్లుగా మత్స్య ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాను. రెండేళ్ల క్రితం ఈ రంగంలోకి అడుగు పెట్టా. తొలుత విశాఖలో ది హైపర్ మీటన్ స్టోర్ ఏర్పాటు చేశాను. ప్రస్తుతం విశాఖలో నాలుగు, కాకినాడ, విజయవాడల్లో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి. ఒక్కో మార్ట్‌కు రూ. 40 లక్షల వరకు పెట్టుబడి పెట్టాను. 50 మందికి ఉపాధి కల్పించా. నెలకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. ఆదరణ బాగానే ఉంది. ఆన్లైన్లో బుకింగ్‌కు కూడా అవకాశం ఉంది. డోర్ డెలివరీ చేస్తున్నాం. భవిష్యత్‌లో మిగిలిన నగరాల్లో కూడా విస్తరించే దిశగా ముందుకెళ్తున్నాం. – పసల పర్వేష్, ఎం.డీ, హైపర్ మీటన్ స్టోర్ -
ఇది విన్నారా.. చికెన్ పండిస్తున్నారు.. మార్కెట్లోకి సెల్ కల్చర్డ్ కోడి మాంసం!
మాయా లేదు.. మర్మం లేదు.. అబ్రకదబ్ర అనక్కర్లేదు. కోడి లేకుండానే కోడి మాంసం.. అది కూడా బోన్‌లెస్‌గా మీ ముందుకు వచ్చేస్తుంది. ఇట్టే ఆకలి తీర్చేస్తుంది. ఇదేదో విఠలాచార్య సినిమాలో సరదా సీన్ అనుకోకండి. ఈ ఏడాది నుంచే అమెరికన్ రెస్టారెంట్స్‌లో ఈ తరహా చికెన్ అందుబాటులోకి రానుంది. భారతీయులు దీనిని రుచి చూడాలంటే కనీసం ఐదారేళ్లు ఆగాల్సిందే. 2028 నాటికి భారతీయ కిరాణా దుకాణాల్లోనూ (గ్రోసరీ స్టోర్స్) ఇలాంటి చికెన్ అందుబాటులోకి వస్తుందని అంచనా. సాక్షి, అమరావతి: చికెన్ కోసం కోడిని చంపనవసరం లేదు. చూడటానికి మృదువుగా.. తినడానికి రుచికరంగా ఉంటుంది. అదే సెల్ కల్చర్డ్ చికెన్. కృత్రిమంగా పండిస్తున్న ఈ కోడి మాంసం తినడానికి ఎంతో సురక్షితమంటూ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఇటీవల ధ్రువీకరించింది. కోడి స్టెమ్ సెల్స్ నుంచి ఉత్పత్తి అయ్యే సెల్ కల్చర్డ్ చికెన్ త్వరలో అమెరికన్ మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. భవిష్యత్‌లో మేక, గొర్రె స్టెమ్ సెల్స్ నుంచి మటన్, పీత, బాతు వంటి స్టెమ్ సెల్స్ నుంచి ఆయా మాంసాలను కూడా ఉత్పత్తి చేసే ప్రక్రియ కూడా అందుబాటులోకి రానుంది. విశ్వవ్యాప్తంగా 27.60 కోట్ల కిలోల వినియోగం ప్రపంచ వ్యాప్తంగా రోజుకు 27.60 కోట్ల కిలోల చికెన్ వినియోగిస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ప్రజల్లో నూటికి 95 శాతం మంది బ్రాయిలర్ కోళ్లనే ఇందుకు వినియోగిస్తున్నారు. కోళ్లకు బదులుగా ప్రత్యామ్నాయ పద్ధతిలో మాంసాన్ని పండించే సాంకేతికత అందుబాటులోకి వస్తోంది. ఇకపై మాంసం కోసం ఏ జీవిని వ«ధించనవసరం లేకుండా.. సంబంధిత జంతువు కణాల (స్టెమ్ సెల్స్) ద్వారా ఆయా రకాల మాంసాలను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానాన్ని సెల్ కల్చర్డ్ చికెన్/సెల్ కల్చర్డ్ మీట్ అంటారు. ఈ విధానంలో కోడి స్టెమ్ సెల్‌ను వినియోగించి చికెన్‌ను ఉత్పత్తి చేస్తారు. తొలివిడత చికెన్ ఉత్పత్తికి 14 రోజుల సమయం పడితే.. ఆ తరువాత దాని నుంచి ప్రతి 18, 24 గంటలకు రెట్టింపయ్యే కణాల ద్వారా మాంసం ఉత్పత్తి అవుతుంది. విప్లవాత్మక మార్పు ఇది నిజంగా ఆహార చరిత్రలో విప్లవాత్మక పరిణామమని, ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తగినంత కొవ్వుతో పాటు కావాలి్సన స్థాయిలో ప్రొటీన్స్, విటమిన్స్ ఈ కృత్రిమ మాంసంలో ఉంటాయని ఎఫ్‌డీఏ గుర్తించింది. పూర్తిగా బోన్‌లెస్ చికెన్ మాదిరిగా ఉండే ఈ చికెన్ శాఖాహారులకు, వివిధ కారణాలతో మాంసం తినడం మానేసిన, మానాలనుకునే వారికి ప్రత్యామ్నాయంగా ఉంటుందని చెబుతున్నారు. ఎఫ్‌డీఏ అనుమతితో అమెరికాలో ‘అప్‌సైడ్ ఫుడ్స్’ అనే సంస్థ ‘సెల్ కల్చర్డ్ చికెన్’ను ఉత్పత్తి చేస్తోంది. పలు స్టార్టప్ ఫుడ్ కంపెనీలు ఈ తరహా మాంసం ఉత్పత్తికి సన్నాహాలు చేస్తున్నాయి. భవిష్యత్‌లో కల్చర్డ్ మాంసం ఉత్పత్తులు సింహభాగం మార్కెట్‌ను ఆక్రమిస్తాయని, ఈ రంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జీవహింస చేయక్కర్లేదు ఈ విధానం అందుబాటులోకి వస్తే మాంసాహారం కోసం జీవాలను వధించే ముప్పు తప్పుతుందని, భవిష్యత్‌లో మిగిలిన మాంసాహార ఉత్పత్తుల్ని కూడా ఇదే తరహాలో తయారు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. కణం నుంచి ఉత్పత్తి అయ్యే కల్చర్డ్ చికెన్‌లో ఎలాంటి యాంటీబయాటిక్స్ మందుల్ని ఉపయోగించరు. ఈ విధానాన్ని సెల్యులర్ వ్యవసాయం అని పిలుస్తున్నారు. సెల్ కల్చర్డ్ మాంసాన్ని సృష్టించే ప్రక్రియ ఒక కణంతో మొదలవుతుంది. ఒక కోడి నుండి బయాప్సీ ద్వారా కణాలను వేరు చేసి సెల్ బ్యాంక్ రూపొందిస్తారు. వాటిని ఉక్కు పాత్రలో పరిపక్వం చేస్తారు. పూర్తి స్థాయిలో చికెన్ తయారవడానికి కనీసం 14 రోజుల సమయం పడుతుంది. ఆ తరువాత ప్రతి 18 నుంచి 24 గంటలకు ఆ మాంసం రెట్టింపవుతుంది. అమెరికన్లలో 10 శాతం మంది ఆసక్తి ప్రస్తుతం అమెరికన్లలో నూటికి 10 శాతం మంది కణాల ద్వారా ఉత్పత్తి అయ్యే ఆహారం తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మార్కెట్ పరిశోధన సంస్థ మింటెల్ అసోసియేట్ పేర్కొంది. కోళ్లను వదించగా వెలువడే 10–12 శాతం గ్రీన్హౌస్, వా యు ఉద్గారాలకు ఈ సెల్ కల్చర్డ్ చికెన్ ద్వారా చెక్ పెట్టవచ్చంటున్నారు. కల్చర్డ్ లేదా మొక్కల ఆధారిత మాంసం ఉత్పత్తులకు భవిష్యత్‌లో మంచి డి మాండ్ ఉంటుందని, మాంసం మార్కెట్లో కనీ సం 10 శాతం వాటా ఆక్రమిస్తుందని చెబుతున్నా రు. అమెరికాలో ఈ ఏడాదే పూర్తిస్థాయిలో మార్కెట్లోకి అందుబాటులోకి రానుండగా.. 2028 నాటికి మన దేశంలోనూ దర్శనమివ్వనుంది. ఎఫ్‌డీఏ అనుమతి పొందిన తొలి సంస్థ మాదే పండించిన మాంసం కోసం ఎఫ్‌డీఏ నుంచి అనుమతి పొందిన మొదటి కంపెనీగా మా సంస్థ నిలవడం ఆనందంగా ఉంది. ఈ మాంసం తినడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు సంభవించలేదని పరిశోధనల్లో వెల్లడైంది. భవిష్యత్‌లో ఇదే తరహాలో పశు మాంసం, ఎండ్రకాయలు, బాతు మాంసంతో పాటు ఇతర ఆహారాలను కూడా తయారు చేసే ఆలోచనలో ఉన్నాం. పేటెంట్ హక్కు కోసం కూడా దరఖాస్తు చేశాం. – ఉమా వాలేటి, సీఈవో, అప్‌సైడ్ ఫుడ్స్, యూఎస్ఏ. -
పులసను మించి క్రేజ్.. ‘రామలు’ రాలేదేంటో!
‘రామలు’.. గోదావరి జిల్లాల్లో పులసలకు మించి క్రేజ్ ఉండే చిన్నపాటి చేపలివి. 9 అంగుళాల పొడవున.. పాము ఆకారంలో ఉండే ఈ జాతి చేపలు ఏ ప్రాంతంలో ఉన్నా.. నదుల ద్వారా ప్రయాణం సాగించి సీతారాముల కల్యాణం (శ్రీరామనవమి)లోగా భద్రాచలం చేరి తరిస్తాయన్నది ఓ కథనం. అందుకే వీటికి ‘రామ’లు అనే పేరొచ్చిందని చెబుతారు. ఈ ఏడాది ఎక్కడా రామల జాడ కనిపించలేదు. సీజన్ ముగిసిపోతున్నా గోదావరి ఏ పాయలోనూ వాటి ఆచూకీ నేటికీ లభించలేదు సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదావరి జిల్లాల్లో మాత్రమే లభించే అరుదైన చేప జాతుల్లో ఒకటైన ‘రామలు’ జాడ ఈ ఏడాది ఎక్కడా కనిపించకపోవడంతో మాంసాహార ప్రియులు అల్లాడిపోతున్నారు. సముద్ర తీరాన గోదావరి పరీవాహక ప్రాంతంలోని మడ అడవులు, ఉప్పునీటి ఏరుల్లో మాత్రమే ఇవి అరుదుగా లభిస్తాయి. వీటికి సుడపోక్రిప్టస్, ఇలాంగాటస్ అనే శాస్త్రీయ నామాలు ఉన్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లభించే ఈ అరుదైన చేపలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతోమంది ప్రియులున్నారు. కోనసీమ జిల్లా రాజోలు దీవిలోని గూడపల్లి, కాట్రేనిపాడు, గోగన్నమఠం, పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు తదితర ప్రాంతాలు రామలకు ప్రసిద్ధి. అక్టోబర్, నవంబర్ నెలల్లో రామలు లభిస్తాయి. నాచునే ఆహారంగా తీసుకుంటాయి. పులసను మించి క్రేజ్ ఏడాదికి ఒకసారి మాత్రమే లభించే పులసలకు మించిన క్రేజ్ రామలకు ఉంది. రుచిలో మరే చేపలకు లభించని ఆదరణ వీటి సొంతం. రామల కూరకు ఈ ప్రాంతంలో మంచి డిమాండ్ ఉంది. మసాలా దట్టించి ఇగురు.. అదే సీజన్లో కాసే లేత చింతకాయలతో కలిపి పులుసు పెడితే ఆహా ఏమి రుచి అంటూ మాంసాహార ప్రియులు లొట్టలేసుకుని వీటిని ఆరగిస్తారు. చింతకాయలతో కలిపి వీటిని కూర వండితే ఆ వాసన ఊరి పొలిమేర దాటాల్సిందే. సీజన్ ముగిసిపోతున్నా గోదావరిలో ఏ పాయలోనూ రామలు ఆచూకీ ఇంతవరకు లభించలేదు. రామ సైజును బట్టి ధర పలుకుతుంది. సాధారణంగా రామ సైజు 9 అంగుళాల వరకు ఉంటుంది. ఒక్కో రామ ధర రూ.40 నుంచి రూ.50 పలుకుతుంది. సైజు చిన్నవైతే తక్కువ పరిమాణంలో ఉంటే రామ ఒక్కొక్కటీ రూ.18 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తారు. ఈ ఏడాది వీటి జాడ లేదు కొంతకాలంగా రామలు తగ్గిపోతున్నాయి. ఈ ఏడాది గోదావరి, సముద్ర తీరం చెంతన ఎలాంటి జల వనరుల్లోనూ వీటి జాడ కనిపించలేదు. ఈ మధ్య కాలంలో చేపల చెరువుల్లోనూ రామలను పెంచుతున్నారు. అయితే, గోదావరి వెంట సెలయేరులు, బోదెల్లో సహజంగా పెరిగే రామలకు ఉండే రుచి వీటికి రావడం లేదు. చేదు కట్టుకు డిమాండ్ ఎక్కువ సాధారణంగా చేపలలో ఉండే చేదు కట్టును తొలగించాకే వంటకు వినియోగిస్తారు. అయితే, రామలను చేదు కట్టుతోనే కూర వండుతారు. రామలలో ఉండే చేదు కట్టు జీర్ణాశయానికి, శరీర పటుత్వానికి ఉపయోగపడుతుందని మత్స్యశాఖ అధికారులు, మత్స్యకారులు చెబుతున్నారు. ఇంటికొచ్చే వరకు బతికే ఉంటుంది అక్టోబర్ నుంచి డిసెంబర్ మొదటి వారంలోపు మాత్రమే రామలు లభిస్తాయి. పులసలు మాదిరిగానే ఇవి రుచిలో మేటిగా ఉంటాయి. ఇటీవల వీటి జాడ తగ్గిపోయింది. అక్కడక్కడా చెరువుల్లో పెంచుతున్నా వాటికి పెద్దగా రుచి ఉండదు. చేప ఒకసారి రుచి చూస్తే ఇక వదలరు. రామలను నీటిలోనే ఉంచి విక్రయిస్తారు. ఇంటికి తీసుకువెళ్లే వరకు బతికి ఉండే అరుదైన చేప ఇది. – చిట్టూరి గోపాలకృష్ణ, శాస్త్రవేత్త, మత్స్యశాఖ రామలు అంతరించిపోతున్నాయి రామలు అంతరించిపోతున్నాయి. మాకు రామల సీజన్లో ఆదాయం బాగా వచ్చేది. వాటి ఆవాసాలకు ఇబ్బంది కలగడంతోపాటు చైనా గొరకలు విపరీతంగా పెరిగి ఇలాంటి చేపలను తినేస్తున్నాయి. దీనివల్ల అరుదైన రామల చేప అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది. – ఓలేటి అమావాస్యరాజు, మత్స్యకారుడు, గోగన్నమఠం -
అమ్మేది మాంసం..! సుమారు ఒక బిలియన్ డాలర్లు వారి సొంతం..!
భారత్‌లో స్టార్టప్స్ వృద్ధి గణనీయంగా పెరుగుతోంది. పలు స్టార్టప్స్ విదేశీ ఇన్వెస్టర్ల నుంచి కూడా పెట్టుబడులను రాబట్టుతున్నాయి. ఆయా స్టార్టప్‌లు అంతే వేగంగా యూనికార్న్(ఒక బిలియన్ డాలర్ విలువ గల) స్టార్టప్‌లుగా అవతరిస్తున్నాయి. మాంసం ఉత్పత్తులతో...యూనికార్న్ క్లబ్‌లోకి..! భారత్‌లో ఇప్పటివరకు 65 కంపెనీలు యూనికార్న్ జాబితాలోకి చేరాయి. ఈ ఏడాదిలోనే దాదాపు 28 స్టార్టప్స్ చేరాయి. తాజాగా ఢిల్లీకి చెందిన లైసియస్ స్టార్టప్ విలువ ఒక బిలియన్ డాలర్లకు చేరుకొని యూనికార్న్ క్లబ్లో జాయిన్ఐనా 29 స్టార్టప్‌గా నిలిచింది. ఐఐఎఫ్ఎల్ ఏఎమ్‌సీ లేట్ స్టేజ్ టెక్ ఫండ్ రౌండ్లో లైసియస్ 52 మిలియన్ డాలర్లను సేకరించి యూనికార్న్‌గా అవతరించింది. గతంలో టెమాసెక్, 3వన్4 క్యాపిటల్, బెర్ట్ల్స్మెన్ ఇండియా నుంచి సుమారు 310 మిలియన్ డాలర్లను పెట్టుబడులను ఆకర్షించింది. లైసియస్ను అభయ్ హంజురా , వివేక్ గుప్తా 2015లో స్థాపించారు. ఈ కంపెనీలో సుమారు 3500 మంది పనిచేస్తున్నారు. చదవండి: కోకాకోలా ఇప్పుడు సరికొత్తగా ...! విజయ రహస్యమీదే...! లైసియస్ బెంగుళూరు, హైదరాబాద్, ఢిల్లీ, కోల్కత్తా వంటి నగరాల్లో భారీగా ఆదరణను పొందింది. మాంసం, సీఫుడ్ ఉత్పత్తులను నేరుగా కస్టమర్లకు చేరవేసింది. ఆయా నగరాల్లోని ప్రజలకు మాంసం ఉత్పత్తులను డోర్ డెలివరీ చేస్తూ అత్యంత ఖ్యాతిని ఆర్జించింది. నాణ్యమైన మాంసం, సీఫుడ్ ఉత్పత్తులను లైసియస్ అందించింది. కంపెనీకి మాంసం కొనుగోలుదారులకు మధ్యవర్తి లేకుండా డైరక్ట్ టూ కస్టమర్ విధానాలను లైసియస్ అవలంభించింది. అంతేకాకుండా లైసియస్ యాప్ నుంచి మాంసాన్ని బుక్ చేసుకుంటే ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది. లైసియస్ వెబ్సైట్ ప్రకారం..ప్రతినెలా ఒక మిలియన్ ఆర్డర్స్‌ను పొందుతుంది. వాటిలో 90 శాతం మేర రెగ్యూలర్ కొనుగోలుదారులే. చదవండి: ఆ కంపెనీలో భారీగా ఇన్వెస్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ బ్యూటీ..! -
వచ్చేస్తున్నాయి ‘మటన్ మార్ట్’లు
సాక్షి, అమరావతి: మాంసాహార ప్రియులకు శుభవార్త. అందుబాటు ధరల్లో ఆరోగ్యకరమైన మాంసాహారాన్ని అందించడమే లక్ష్యంగా దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో మాంసం దుకాణాలు (మటన్ మార్టు) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. తొలిదశలో నగరాలు, పట్టణాల్లో ఇవి ఏర్పాటవుతాయి. మలిదశలో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు వీటిని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నారు. మేక మాంసం, గొర్రె మాంసం అంటే నోరూరని మాంసాహారులుండరు. తలకాయ మాంసం, కాళ్ల పులుసు, బోటీ కూర ఉంటే లొట్టలేసుకుని తింటారు. అనారోగ్యం అనంతరం వేగంగా కోలుకునేందుకు పెద్దల నుంచి వైద్యుల వరకు మటన్ తినమని ప్రోత్సహిస్తారు. నూటికి 85 శాతం మంది మాంస ప్రియులుంటే అందులో మటన్ ఇష్టపడే వారు 90 శాతానికిపైనే ఉంటారు. మాంసాహార ఉత్పత్తుల వినియోగంలో 13.53 శాతం మేక, గొర్రె మాంసానిదే. ధర ప్రియమైనా ఆదివారం వచ్చిందంటే కోడి మాంసం, చేపలు, రొయ్యలకు దీటుగా మటన్ విక్రయాలు జరుగుతుంటాయి. 2.31 కోట్ల మేకలు/గొర్రెల సంపద కలిగిన మన రాష్ట్రం మాంసం ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానంలో ఉంది. ఎగుమతుల్లో కూడా టాప్–10లోనే ఉంది. స్థానిక వినియోగం పెంచడమే లక్ష్యం ఏటా ఉత్పత్తిలో ఆశించిన స్థాయిలో వృద్ధి రేటు సాధిస్తున్నప్పటికీ స్థానిక వినియోగం పెరగడం లేదు. దీనికి ప్రధాన కారణం ధర సామాన్యులకు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో వధశాలలు, దుకాణాలు లేకపోవడమే. ఈ పరిస్థితికి చెక్ పెడుతూ పోర్టబుల్ మాంసం ఉత్పత్తి, రిటైల్ సౌకర్యం (పీ – మార్ట్) అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. భారతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం (ఐసీఏఆర్) అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానంతో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ప్రమాణాలకనుగుణంగా అత్యంత ఆరోగ్యకరమైన వాతావరణంలో మొబైల్ మటన్ దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. సబ్సిడీపై మంజూరు ఏపీ మీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో యూనిట్ రూ.10 లక్షల అంచనా వ్యయంతో తొలిదశలో మహానగరాలు, నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 112 యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. విశాఖ, విజయవాడ నగరాల్లో నాలుగు, మిగిలిన కార్పొరేషన్ల పరిధిలో రెండు, ఇతర మునిసిపాల్టీల పరిధిలో ఒక్కటి చొప్పున సబ్సిడీతో కూడిన గ్రాంట్‌తో వీటిని ఏర్పాటు చేస్తారు. మటన్ మార్ట్‌ల్లో ఎన్నో ప్రత్యేకతలు 4 అడుగుల పొడవు, 4 అడుగుల వెడల్పు, 7 అడుగుల ఎత్తు కలిగిన మొబైల్ మటన్ విక్రయాల వాహనాన్ని ఎక్కడికైనా సులభంగా తరలించేందుకు వీలుగా డిజైన్ చేశారు. 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో పరిశుభ్రమైన వాతావరణంలో కనీసం 10 జీవాలను వధించేందుకు వీలుగా వధశాలతో పాటు డ్రెస్సింగ్, జీవాల అవయవాల (గ్రేడ్స్) వారీగా కటింగ్, డ్రెస్సింగ్, ప్యాకేజింగ్, రిటైల్ విక్రయాలు జరిపేందుకు వీలుగా రూపొందించారు. వధించేటప్పుడు కానీ, కాల్చేటప్పుడు కానీ వ్యర్థాలు కాదు కనీసం వాసన కూడా బయటకు రాదు. విద్యుత్, మంచినీరు తదితర సౌకర్యాలతో కూడిన ఈ వాహనంలో ప్రాసెసింగ్ చేసిన తాజా మాంసాన్ని నిల్వ చేసేందుకు అత్యాధునిక రిఫ్రిజరేటర్లు, 100కి పైగా స్టైయిన్‌లెస్ స్టీల్ బాక్స్‌లు (500 గ్రాములు) ఉంటాయి. వైద్యులు పరీక్షించిన పూర్తి ఆరోగ్యకరమైన జీవాలను మాత్రమే ఇక్కడ విక్రయిస్తారు. వ్యర్థ పదార్థాలను నిల్వ చేసేందుకు వాహనంలోనే డంపింగ్ సౌకర్యం ఉంటుంది. జీరో పొల్యూషన్‌తో పర్యావరణ హితంగా తీర్చిదిద్దారు. లిక్విడ్ వేస్ట్ కోసం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) కూడా వాహనంలోనే ఉంటుంది. మొబైల్ మార్ట్ నిర్వహణపై హైదరాబాద్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విధి విధానాల రూపకల్పన ‘పోర్టబుల్ మీట్ ప్రొడక్షన్ అండ్ రిటైలింగ్ ఫెసిలిటీ (పీ – మార్ట్) అని వ్యవహరించే మటన్ మార్ట్లు తొలుత నగరాలు, పట్టణ ప్రాంతాల్లో అందుబాటులోకి వస్తాయి. తర్వాత మండల కేంద్రాలు, పంచాయతీల్లో ఏర్పాటు కానున్నాయి. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పన జరుగుతోంది. త్వరలోనే వీటిని ఆచరణలోకి తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నాం’ – జేపీ వెంకటేశ్వర్లు, ఎండీ, ఏపీఎండీసీ -
హరీశ్ చొరవతో ఆ 9 మంది జీవితాలు మారాయి
సాక్షి, సిద్దిపేట: ఆరోగ్యంగా ఉండే గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్లను కొని, పశువైద్యుడి చేత పరీక్షలు చేయిస్తారు. ఆయన ఓకే అంటే.. హలాల్ చేయిస్తారు. ఆపై మాంసం నుంచి బోన్స్ వేరుచేసి శుద్ధిచేస్తారు. మాంసాన్ని చిన్నచిన్న ముక్కలుచేసి ఉప్పు, కారం, అవసరమైన ఇతర మసాలా దినుసుల్ని దట్టించి.. ఇలా ఒక్కరోజే వంద కిలోల మాంసంతో అవలీలగా పచ్చడి పెట్టేస్తారు. దీని ప్యాకింగ్‌లో అనుసరించే పద్ధతులతో 3 నెలలైనా రుచిలో తేడారాదు. ఇదంతా చేసేది ఇర్కోడ్ మహిళా సమాఖ్యలోని 9మంది మహిళలు. మాంసంతో పచ్చళ్లు, స్నాక్స్ తయారీలో చేయితిరిగిన వీరు.. స్టార్ హోటళ్ల చెఫ్‌లకు ఏమాత్రం తీసిపోరు. ఈ ఫేమస్ సిద్దిపేట పచ్చళ్లు వెనుక కథ తెలుసుకోవాలంటే.. ఓ ఏడాది వెనక్కి వెళ్లాల్సిందే.. చలో మరి.. జీవితాలు మారాయిలా.. సిద్దిపేట జిల్లా ఇర్కోడ్ మహిళా సమాఖ్యలోని 20 మంది మహిళలు ఏడాది క్రితం మంత్రి హరీశ్‌రావును కలిశారు. ‘బీడీలు చుడుతూ, కూలీ పనులకు వెళ్తూ రెక్కలు ముక్కలు చేసుకుంటున్నా పూట గడవట్లేదు. వంటలు బాగా వచ్చు. ఊరగాయలు బాగా పెడతాం. ఏదైనా ఉపాధి చూపించండి’ అని వేడుకున్నారు. ‘ఊరగాయలు అన్నిచోట్లా దొరుకుతున్నాయి.మాంసంతో పచ్చళ్లు, వంటకాలు చేయడం నేర్చుకుంటానంటే శిక్షణనిప్పిస్తా.. మీరు నిలదొక్కుకునే వరకు ఆర్థిక ప్రోత్సాహమిస్తా.. సరేనా?’ అన్నారు మంత్రి. చివరకు వారిలో 9మందే మిగిలారు. వీరంతా మంత్రి సూచనతో హైదరాబాద్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ మీట్ (ఎన్ఆర్సీఎం)లో నెలపాటు మాంసాహార ఉత్పత్తుల తయారీలో శిక్షణ పొందారు. యూనిట్‌ను ప్రారంభించడానికి ప్రభుత్వం ఆర్థిక మద్దతుకు తోడు ఇర్కోడ్ సర్పంచ్ రూ.2 లక్షలు పెట్టుబడిగా సమకూర్చారు. మాంసం పచ్చళ్ల తయారీలో వీరి ప్రతిభను చూసిన ఎన్ఆర్సీఎం.. రూ.2 లక్షల విలువచేసే అధునాత కుకింగ్ మెషీన్లు అందించింది. అలా మొదలైంది.. తమకున్న వంటల పరిజ్ఞానానికి తోడు హైదరాబాద్‌లో పొందిన శిక్షణతో ‘సిద్దిపేట పచ్చళ్లు’ బ్రాండ్‌తో గతేడాది ఫిబ్రవరిలో మాంసం పచ్చళ్ల తయారీ ప్రారంభమైంది. మొదట చుట్టుపక్కల గ్రామాల్లోనే విక్రయాలు సాగాయి. డిమాండ్ పెరగడంతో.. పచ్చళ్లతో పాటు వీరు తయారుచేసే మాంసం స్నాక్స్ కూడలి ప్రాంతాల్లో విక్రయించడానికి వీలుగా రూ.10 లక్షల విలువైన ‘మీట్ ఆన్ వీల్స్’ మొబైల్ వాహనాన్ని మంత్రి హరీశ్‌రావు సమకూర్చారు. సిద్దిపేట మోడల్ రైతుబజార్లో వీరి ఉత్పత్తుల విక్రయ స్టాల్ ఏర్పాటైంది. అయితే, ప్రారంభమైన నెలకే కరోనా దెబ్బకు యూనిట్ మూతపడింది. తిరిగి ఈ ఏడాది గడిచిన మూడు నెలలుగా యూనిట్ నడుస్తోంది. మొత్తం నాలుగు నెలల్లో రూ.20 లక్షల మేరకు విక్రయాలు సాగించి ‘సిద్దిపేట మటన్, చికెన్ పచ్చడి’ రుచేంటో చూపించారీ మహిళలు. అంతా వాట్సాప్ ద్వారానే.. మాంసం పచ్చళ్లకు మంచి పేరొచ్చినా.. మార్కెటింగ్ సమస్యగా మారింది. దీంతో వీరంతా వాట్సాప్ గ్రూపుల్లో, స్టేటస్లు పెట్టడం ద్వారా తమ ఉత్పత్తుల ఖ్యాతిని ఎల్లలు దాటించారు. కేవలం వాట్సాప్ ద్వారానే రూ.20 లక్షల విలువైన ఉత్పత్తులను విక్రయించారు. సిద్దిపేటతో పాటు కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల తదితర జిల్లాల నుంచి ఎడారి దేశాలకు వలస వెళ్లిన వారు తమ వారి ద్వారా పచ్చళ్లను తెప్పించుకోవడంతో వీరి ఉత్పత్తులకు గల్ఫ్ దేశాలు ప్రధాన మార్కెట్‌గా మారాయి. అలాగే, అమెరికా ఇతర దేశాల్లో స్థిరపడిన తమ పిల్లలకు ఇక్కడి వారు పచ్చళ్లను పంపసాగారు. ప్రస్తుతం ఆన్లైన్ అమ్మకాల కోసం గూగుల్‌తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ‘హాట్..హాట్’గా అమ్మకాలు వీరు తయారుచేసే 230 గ్రాముల మటన్ పచ్చడి రూ.300, చికెన్ పచ్చడి రూ.230, స్నాక్స్ 100 గ్రాములు రూ.80 చొప్పున విక్రయిస్తున్నారు. వీరు తయారుచేసే చికెన్ నగిడ్స్, పకోడీ, సమోసా, రోల్స్, ఎన్రోబెడ్ ఎగ్ వంటివి రోజూ సాయంత్రం కాగానే సిద్దిపేటలో హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సిద్దిపేటతో పాటు హైదరాబాద్‌లో జరిగే పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ స్నాక్స్ భారీగా సరఫరా అవుతున్నాయి. ఇంకా వీరు తయారుచేసే కాకరకాయ, చింతకాయ, టమాటా, మిరపపండ్ల పచ్చళ్లకూ వడిమాండ్ ఉంది. హైదరాబాద్‌లోని పేరొందిన స్వీట్స్ సంస్థ.. ఇక్కడ తయారైన చింతకాయ పచ్చడిని ల్యాబ్‌లో పరీక్షించుకుని, నాణ్యమైనదని తేలడంతో క్వింటాళ్ల కొద్దీ ఆర్డర్ ఇచ్చింది. -
నాన్‌వెజ్ నడిచొస్తుంది..
సాక్షి, సిద్దిపేట: ఇకమీదట మటన్, చికెన్, మాంసాహార ఉత్పత్తులు (పచ్చళ్లు) కొనుగోలు దారుల ఇంటి వద్దకే వస్తాయని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా ఇర్కొడు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తయారు చేసిన చికెన్ పచ్చళ్లు, శుభ్రమైన, ఆరోగ్యకరమైన చికెన్, మటన్ సరఫరా వాహనాన్ని (మీట్ ఆన్ వీల్స్) మంగళవారం సిద్దిపేట కూరగాయల మార్కెట్లో జాతీయ మాంసం ఉత్పత్తుల పరిశోధనా కేంద్రం డైరెక్టర్ వైద్యనాథ్‌తో కలసి ప్రారంభించారు. పల్లెపల్లెకూ ఈ వాహనం తిరిగి విక్రయాలు జరపనుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇర్కొడులో తయారవుతున్న నాన్‌వెజ్ పచ్చళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయని తెలిపారు. ఇది రాష్ట్రంలోనే తొలి వాహన మని చెప్పారు. -
ఇక్కడే లాగించేస్తున్నారు !
-
ఇక్కడే లాగించేస్తున్నారు !
రాష్ట్రంలో భారీగా పెరిగిన మాంసం ఉత్పత్తి.. దారుణంగా తగ్గిన ఎగుమతులు ఉత్పత్తిలో సగం రాష్ట్రంలోనే వినియోగం మాంసాహారంవైపే 80 శాతం యువత మూడేళ్ళ క్రితం వరకూ మాంసం ఎగుమతుల్లో మన రాష్ట్రానిదే మొదటి స్థానం. కానీ ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. ఐదేళ్ళ క్రితం రూ. 35,100 కోట్ల ఎగుమతులుంటే, గడచిన ఆర్థిక సంవత్సరంలో అది రూ. 17,400 కోట్లే!! అంటే ఎగుమతులు సగానికి పడిపోయాయి. ఉత్పత్తి పెరిగింది.. ఎగుమతులు మాత్రం తగ్గాయి.. మరి ఉత్పత్తవుతున్న మిగతా మాంసమంతా ఎటుపోతున్నట్టు చెప్మా అంటే.. మనోళ్లే లాగించేస్తున్నారని తేలింది! సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దశాబ్దకాలం క్రితం 25.81 కోట్ల కిలోల మాంసం మాత్రమే ఉత్పత్తి అయ్యేది. ఇది 2011-12 నాటికి 8.24 లక్షల టన్నులకు, 2012-13లో 9.30 లక్షల టన్నులకు చేరింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి 10.30 లక్షల టన్నులు దాటుతుందని అంచనా. అంటే పదేళ్ళలోనే మాంసం ఉత్పత్తులు దాదాపు 113 శాతం అంటే.. 75 కోట్ల కిలోల మేర పెరిగాయి. ఇది దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం మాంసంలో ఐదో వంతు. వాస్తవానికి 1998-2005 మధ్య మాంసం ఉత్పత్తిలో పశ్చిమ బెంగాల్ మొదటి స్థానంలో ఉండేది. అక్కడ పరిస్థితులు తారుమారవ్వడం, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు కుంచించుకుపోవడం, పారిశ్రామికీకరణ ప్రభావం కారణంగా మాంసం ఉత్పత్తి తగ్గింది. కానీ మన రాష్ట్రంలో మాత్రం కోళ్ళు, గిత్తలు, దున్నలు, గొర్రెలు, మేకల పెంపకం పెరిగింది. ఫలితంగా శరవేగంగా మాంసం ఉత్పత్తి జరిగింది. దీంతో ఉత్పత్తిలో మన రాష్ట్రమే అగ్రస్థానానికి చేరింది. ఇంత ఉత్పత్తి జరిగినా, ఇది దేశ ఆర్థిక పురోగతిపై ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. రాష్ట్రంలో మాంసం వినియోగం భారీగా పెరడగమే దీనికి కారణం. ఆధునిక సంప్రదాయ పోకడలు, విదేశీ సంస్కృతి అనుకరణ ఆహార అలవాట్లలో మార్పు తెచ్చింది. ఫలితంగా మాంసాహారుల సంఖ్య పట్టణాలు, నగరాల్లో పెరుగుతోంది. దీంతో ఉత్పత్తయ్యే మాంసంలో అధికశాతం రాష్ట్రంలోనే వినియోగమైపోతోంది. దీంతో ఎగుమతుల్లో మూడేళ్ళ కిందటి వరకు నెంబర్ వన్‌గా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఉంది. జోరుగా గొడ్డు మాంస విక్రయాలు: గొడ్డు మాంసం ఎగుమతులు దేశంలో 2001-2002లో 2,40,980 టన్నులు ఉంటే, ఇందులో మన రాష్ట్రం వాటా 10 శాతం. 2009-10 నాటికి 513.668 టన్నులకు చేరినా, మన రాష్ట్రం నుంచి 12 శాతం ఎగుమతులు జరిగాయి. కానీ ఆ తర్వాత కాలంలో క్రమంగా 5 శాతంకు పడిపోయింది. కాగా రాష్ట్రంలో గొడ్డు మాంసం విక్రయ కేంద్రాలు మూడేళ్ళ క్రితం 2 వేలు మాత్రమే ఉంటే, ఇప్పుడు 7వేలకు చేరాయి. పెరిగిన మాంసం.. తగ్గిన చేపలు తలసరి మాంసం వినియోగంలోనూ భారీ వ్యత్యాసాలే కన్పిస్తున్నాయి. 2004-05లో 61వ జాతీయ నమూనా సర్వే ప్రకారం గొర్రెలు, మేకల మాంసం తలసరి వినియోగం నెలకు 86 గ్రాములు మాత్రమే. కోడి మాంసం మాత్రం 136 గ్రాములుగా ఉంది. ఇదిప్పుడు మూడు రెట్లు పెరిగినట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. చేపల తలసరి వినియోగం మాత్రం బాగా తగ్గింది. నెలకు 71 గ్రాములే తింటున్నట్టు సర్వే తేల్చింది. ఉరుకులు, పరుగుల పట్టణీకరణలో చేపలను వండుకోవడం కష్టంగా ఉంది. దీనికి తోడు రవాణా ఖర్చుల పెరుగుదల చేపల అమ్మకాలపై పడింది. గత పదేళ్ల గణాంకాలు.. 40 శాతం పెరిగిన మాంసాహార హోటళ్ళు 60 శాతం పెరిగిన బిర్యానీ అమ్మకాలు 20 శాతం శాఖాహారం వైపు మళ్లిన వృద్ధులు 80 శాతం నాన్-వెజ్ వైపు మొగ్గుతున్న యువత 176 అనుమతి ఉన్న కబేళాల సంఖ్య 580 పనిచేస్తున్న కబేళాలు