ముంబై: ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సంస్థ అప్‌గ్రేడ్ మూడోసారి భారీగా నిధులను సమీకరించింది. ఐఐఎఫ్‌ఎల్ గ్రూప్ నుంచి తాజాగా 185 మిలియన్ డాలర్లు(రూ.1,376 కోట్లు) సమీకరించింది. దీంతో కంపెనీ విలువ 1.2 బిలియన్ డాలర్లకు(రూ.8,912 కోట్లు) చేరింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి టెమాసెక్ హోల్దింగ్స్ నుంచి 12 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది. తదుపరి ఇదే నెలలో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ సంస్థ ఐఎఫ్‌సీ నుంచి 4 కోట్ల డాలర్లు లభించాయి. దీంతో కంపెనీ విలువ 85 కోట్ల డాలర్లను తాకింది. స్టార్టప్‌ల రంగంలో 100 కోట్ల డాలర్ల విలువను చేరిన కంపెనీలను యూనికార్న్‌గా వ్యవహరించే సంగతి తెలిసిందే. కాగా... ఈ కేలండర్ ఏడాది(2021)లో ఆగస్ట్ 2 వరకూ 17 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా ఆవిర్భవించాయి.
60 సంస్థలకు యూనికార్న్ హోదా
ఈ బాటలో సాఫ్ట్ బ్యాంక్‌కు చెందిన విజన్ ఫండ్-2 నుంచి 10 కోట్ల డాలర్ల పెట్టుబడులు సమకూర్చుకున్న మైండ్‌టికిల్‌తో కలిపి మొత్తం 60 సంస్థలు ఈ స్థాయికి చేరువకోవడం ప్రస్తావించదగ్గ విషయం!. ఈ ఏడాది యూనికార్న్ జాబితాలో చేరిన సంస్థలలో షేర్‌చాట్, గ్రో, గప్ షుప్, మీషో, ఫార్మ్‌ఈజీ, బ్లాక్‌బక్, డ్రూమ్, 'ఆఫ్‌బిజినెస్, క్రైడ్, మాగ్లిక్స్, జెటా, బ్రౌజర్‌స్టాక్ తదిర సంస్థలు చేరాయి. క్రెడిట్ స్వీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా 100కు మించిన స్టార్దప్‌లు యూనికార్న్ హోదాను పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment