సాక్షి, న్యూఢిల్లీ: మెరిసే దంతా బంగారం కాదంటూ ప్రత్యర్థి కంపెనీపై ప్రముఖ చెల్లింపుల యాప్ ఫోన్ పే తీవ్ర విమర్శలకు దిగింది. తానే మార్కెట్ లీడర్‌నంటూ పేటీఎం అన్నీ గప్పాలు కొడుతోందని తన ప్రధాన ప్రత్యర్ధి, మరో డిజిటల్ మనీ పేమెంట్స్ ప్లాట్‌ఫాం పేటీఎంపై దాడికి దిగింది. డిజిటల్ పేమెంట్స్ మార్కెట్ లీడర్‌గా చెప్పుకుంటున్న పేటీఎంవి అన్ని అబద్ధాలే అంటూ ఆరోపిస్తోంది ప్లిప్‌కార్ట్‌కు చెందిన ఫోన్‌పే.
అయితే ఈ మధ్య పేటియం యుపీఐ అధారిత డబ్బు చెల్లింపుల్లో తమే ముందున్నట్టు చెప్పుకుంది. దీంతో తమకు తామే నెంబర్ వన్‌గా పేటీయం చెప్పుకోవడం ఫోన్‌పేకు ఆగ్రహం తెప్పించింది. లావాదేవీల పరంగా చూస్తే పేటీయం చెల్లింపుల మార్కెట్‌లో ముందున్నట్టు కనిపిస్తున్నా.. దాని మొత్తం లావాదేవీల సగటు విలువతో పోల్చుకుంటే లావాదేవీల విలువ రూ.40 తక్కువగా ఉందని తెల్పింది. అసలు దాని వద్ద లావాదేవీల వివరాలు సరిగ్గా లేవని విమర్శించింది. యుపీఐను అధారిత సమాచారాన్ని పేటీయం తప్పుదోవ పట్టిస్తుందిని ఆరోపించింది. మొత్తం 21 మిలియన్ లావాదేవీలు పేటీయం వినియోగదారుల నుంచి ఫోన్ పే కు జరగగా అందులో 40వేల ప్రత్యేక వినియోగదారులు 500 లావాదేవీలను రూ.40 కంటే తక్కువగా జరిపారని తెలిపింది. మెరిసేదంతా బంగారం కాదు అంటు పేటీయం ను ఉద్దేశించి తన బ్లాగ్‌లో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం తర్వాత డిజిటల్ లావాదేవీలకు ప్రాధాన్యత పెరిగింది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఆన్‌లైన్ చెల్లింపు యాప్‌లను వాడుతుండటంతో ప్రస్తుతం వీటికి డిమాండ్ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇద్దరికి పోటీ తీవ్ర స్థాయిలో నడుస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment