![Alluri Sitarama Raju District: Tribals Are Using Technology - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/18/Tribals-Are-Using-Technolog.jpg.webp?itok=w7ljgZ6U)
ఫోన్‌పే ద్వారా వాహనదారుడి నుంచి తాచేరు వసూలు చేస్తున్న యువతులు
చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా): కాలం ఎంతగామారింది.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని గిరిజనులు తమ సంప్రదాయ పండగలకు వినియోగిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఏటా ఈ నెలలో ఇటుకల పండగ నిర్వహిస్తారు. అందులో భాగంగా ప్రధాన రహదారుల్లో గేట్లు ఏర్పాటు చేసి వాహన చోదకుల వద్ద తాచేరు (డబ్బులు) వసూలు చేస్తుంటారు.
చదవండి: హిజ్రాల అందాల పోటీలు.. సందడే సందడి
అయితే చిల్లర లేదని చెప్పి కొందరు వాహనచోదకులు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో గిరిజన మహిళలు, యువతులు గేట్ల వద్ద ఫోన్ పేకు సంబంధించిన క్యూ ఆర్ కోడ్ స్కానర్‌ను ఉపయోగించి తాచేరు వసూలు చేస్తున్నారు. పురుషులు వేటకు అడవి బాట పడుతుండడంతో మహిళలే ఈ పనిలో నిమగ్నమవుతారు. ఒకప్పుడు ఫోన్‌లో సంభాషించడమే అంతగా తెలియని గిరిజనులు ఇప్పుడు స్కానర్ ద్వారా తాచేరు వసూలు చేయడం చూసి మైదాన ప్రాంతాలకు చెందిన వాహన చోదకులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment