
ఫోన్‌పే
ఫోన్‌పే అనేది ఒక మొబైల్ పేమెంట్స్ యాప్. యూపీఐ ట్రాన్సాక్షన్ల దగ్గరి నుంచి రీచార్జ్‌ల వరకు, నగదు బదిలీ నుంచి ఆన్‌లైన్ బిల్లుల చెల్లింపుల వరకు అన్నింటినీ ఈ యాప్ ద్వారా నిర్వహించొచ్చు. ‘ఫోన్‌పే’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ఈ యాప్‌ను యస్ బ్యాంక్ ప్రమోట్ చేస్తోంది. ఫోన్‌పే అనేది ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ అనుబంధ కంపెనీ.
ప్రత్యేకతలు
► డబ్బుల్ని ఏ సమయంలోనైనా పంపొచ్చు, పొందొచ్చు.
► డేటా కార్డులు, డీటీహెచ్, మొబైల్ ఫోన్‌లను రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్‌పెయిడ్ ఫోన్/డేటా కార్డు/ల్యాండ్‌లైన్ బిల్లులను కట్టేయవచ్చు.
► ఎలక్ట్రిసిటీ, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా చెల్లించవచ్చు.
► బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు.
► రిఫండ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా వచ్చే మొత్తాన్ని వెంటనే పొందొచ్చు. ఇది వాలెట్‌కు వస్తుంది. దీన్ని తర్వాత బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
► ఫోన్‌పే వాలెట్‌ను డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ద్వారా నింపుకోవచ్చు.
► ఈ యాప్ తెలుగు సహా పలు స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది.
► ఫోన్‌పే యాప్ ద్వారా త్వరితగతి సురక్షితమైన లావాదేవీలను నిర్వహించవచ్చని కంపెనీ భరోసా ఇస్తోంది.