Mobile Payments App
-
గూగుల్ పే వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: నగదు లావాదేవీలకోసం గూగుల్ పే యాప్‌వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్ పే యాప్ కార్యకలాపాలను సాగిస్తోందట. కేంద్ర బ్యాంకు అనుమతి లేకుండా యధేచ్చగా అక్రమంగా కార్యకలాపాలు నిర్వహిస్తోందా? తాజా పరిణామం ఈ సందేహాలనే రేకెత్తిస్తోంది. గూగుల్ పే పై దాఖలైన పిటీషన్‌ను విచారించిన ఢిల్లీ హైకోర్టు రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, గూగుల్ సంస్థలకు నోటీసులు జారీచేసింది. ఎలాంటి అధికారిక ధృవీకరణ లేకుండానే గూగుల్ యాప్ కార్యకలాపాలు ఎలా సాగిస్తోందని కోర్టు ప్రధానంగా ఆర్బీఐని ప్రశ్నించింది. దీనిపై తమ స్పందన తెలియజేయాలని ఆర్బీఐ, గూగుల్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి రాజేంద్ర మీనన్, జస్టిస్ ఎ.జె. భంభాని నేతృత్వంలోని బెంచ్ ఆదేశించింది. డిమానిటైజేషన్ తరువాత డిజిటల్ లావాదేవీలకు పెరిగిన ప్రాధాన్యత నేపథ్యంలో డిజిటల్ పేమెంట్ యాప్‌లు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఆ కోవలోదే గూగుల్‌కు చెందిన మొబైల్ పే మెంట్ యాప్ గూగుల్ పే. అయితే గూగుల్ పే యాప్ పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీకి సంబంధించి ఈ యాప్‌కు కేంద్ర బ్యాంకు నుంచి సరైన ధ్రువీకరణ లేదంటూ అభిజిత్ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అలాగే ఈ ఏడాది మార్చి 20న ఆర్బీఐ విడుదల చేసిన అధికారిక పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ జాబితాలో గూగుల్ పే పేరు లేదని కూడా ఆయన పేర్కొన్నారు. మిశ్రా పిటిషన్‌పై దర్యాప్తు చేపట్టిన న్యాయస్థానం బుధవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఫోన్‌పే
ఫోన్‌పే అనేది ఒక మొబైల్ పేమెంట్స్ యాప్. యూపీఐ ట్రాన్సాక్షన్ల దగ్గరి నుంచి రీచార్జ్‌ల వరకు, నగదు బదిలీ నుంచి ఆన్లైన్ బిల్లుల చెల్లింపుల వరకు అన్నింటినీ ఈ యాప్ ద్వారా నిర్వహించొచ్చు. ‘ఫోన్‌పే’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్లాట్‌ఫామ్‌పై పనిచేసే ఈ యాప్‌ను యస్ బ్యాంక్ ప్రమోట్ చేస్తోంది. ఫోన్‌పే అనేది ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ అనుబంధ కంపెనీ. ప్రత్యేకతలు ► డబ్బుల్ని ఏ సమయంలోనైనా పంపొచ్చు, పొందొచ్చు. ► డేటా కార్డులు, డీటీహెచ్, మొబైల్ ఫోన్లను రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్‌పెయిడ్ ఫోన్/డేటా కార్డు/ల్యాండ్‌లైన్ బిల్లులను కట్టేయవచ్చు. ► ఎలక్ట్రిసిటీ, గ్యాస్ వంటి యుటిలిటీ బిల్లులను కూడా చెల్లించవచ్చు. ► బ్యాంక్ ఖాతా బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవచ్చు. ► రిఫండ్, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల ద్వారా వచ్చే మొత్తాన్ని వెంటనే పొందొచ్చు. ఇది వాలెట్‌కు వస్తుంది. దీన్ని తర్వాత బ్యాంక్ ఖాతాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ► ఫోన్‌పే వాలెట్‌ను డెబిట్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ద్వారా నింపుకోవచ్చు. ► ఈ యాప్ తెలుగు సహా పలు స్థానిక భాషలను సపోర్ట్ చేస్తుంది. ► ఫోన్‌పే యాప్ ద్వారా త్వరితగతి సురక్షితమైన లావాదేవీలను నిర్వహించవచ్చని కంపెనీ భరోసా ఇస్తోంది.