యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవలు విస్తరణ చాలా వేగంగా జరుగుతోంది. ఇప్పటికే పలుదేశాల్లో అందుబాటులో ఉన్న 'ఫోన్ పే' ఇప్పుడు తాజాగా 'లంకాపే'తో చేతులు కలిపింది. ఇది భారతీయ పర్యాటకులకు పెద్ద శుభవార్త అనే చెప్పాలి.
శ్రీలంకకు వెళ్లే భారతీయులు ఇకపై ఫోన్ పే యాప్‌తో లంకాపే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ పే చేయవచ్చు. ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో భారతీయ పర్యాటకులు శ్రీలంకకు వెళ్ళేటప్పుడు ప్రత్యేకంగా డబ్బు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే ఫోన్ పే సేవలు సింగపూర్, నేపాల్ వంటి దేశాల్లో అమలులో ఉన్నాయి. ఇప్పుడు తాజాగా శ్రీలంక దేశంలో కూడా అందుబాటులోకి వచ్చేసింది.
శ్రీలంకలో ప్రారంభమైన ఫోన్ పే సేవల సందర్భంగా.. లంకాపే సీఈఓ చన్నా డి సిల్వా మాట్లాడుతూ, భారతీయ పర్యాటకులు, బిజినెస్ ప్రయాణీకులకు శ్రీలంక పర్యటన సమయంలో చెల్లింపు అనుభవాన్ని మెరుగుపరిచే దిశలో ఇది కీలక అడుగు అన్నారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంక గవర్నర్ నందలాల్ వీరసింగ్ స్పందిస్తూ.. పోటీతత్వాన్ని, శ్రీలంక వ్యాపారులకు ప్రయోజనాలను పెంపొందించడానికి చాలా ఉపయోగకరంగా ఉండదని అన్నారు. ఈ కార్యక్రమానికి బ్యాంకింగ్ అండ్ టూరిజం రంగాల ప్రతినిధులు, వ్యాపార సంఘాల ప్రతినిధులతో సహా శ్రీలంకకు చెందిన ముఖ్య వాటాదారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment