
సాక్షి, నాగోలు : వ్యాపారస్తులను లక్ష్యంగా చేసుకుని కేవైసీ వెరిఫికేషన్ అంటూ పేటీఎంలలో పాస్‌వర్డ్‌లను మార్చి డబ్బులు కాజేస్తున్న పేటీఎం మాజీ ఉద్యోగిని రాచకొండసైబర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనగాం జిల్లాకు చెందిన ఒకడోతు అనిల్‌కుమార్ ఉప్పల్‌లో ఉంటున్నాడు. గతంలో గచ్చిబౌలిలోని పేటీఎం కార్యాలయంలో ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన ఇతను పేటీఎం కేవైసీ వ్యాలెట్‌పై వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ పాస్‌వర్డ్‌లను మార్చి తనకు అనుకూలంగా నెంబర్లు పెట్టేవాడు. పేటీఎంపై పూర్తి అవగాహన పెంచుకున్న అనిల్‌కుమార్ వినియోగదారుల నుంచి డబ్బు లు కాజేయాలని పథకం పన్నాడు.
ఈ క్రమంలో మీర్‌పేట టీకేఆర్ కాలనీలో కిరాణా దుకా ణం నిర్వహిస్తున్న వినోద్‌కుమార్‌కు ఫోన్ చేసి పేటీఎంలో మీకు క్యాష్‌బ్యాక్ వస్తుందని, అందుకు కేవైసీ అప్‌డేట్ చేయాలని అతని మొబైల్ తీసుకుని పేటీఎం పాస్‌వర్డ్ మార్చేసి తన పాస్‌వర్డ్ పెట్టుకున్నాడు. అనంతరం రూ.5వేలు తన ఖాతాలోకి బదిలీ చేసుకున్నా డు. ఇదే తరహాలో పలువురిని మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన రాచకొండ సైబర్ క్రైం పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment