Bill and Melinda Gates Foundation
-
మలేరియా వ్యాప్తిని నిరోధించే దోమలు
లండన్: మలేరియా.. మానవాళికి పెనుముప్పుగా మారిన అతిపెద్ద వ్యాధి. దోమల నుంచి వ్యాపించే మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. వ్యాధి నివారణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. మలేరియా వ్యాప్తిని అరికట్టే దోమలను పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇందుకోసం సాధారణ దోమల్లో జన్యుపరమైన మార్పులు చేశారు. మలేరియాకు కారణమయ్యే పారాసైట్లు జన్యుపరంగా మార్పు చేసిన ఈ దోమల్లో వేగంగా పెరగవని చెబుతున్నారు. మలేరియాను అరికట్టడంలో ఇదొక శక్తివంతమైన ఆయుధం అవుతుందని పేర్కొంటున్నారు. యూకేలోని ఇంపీరియల్ కాలేజీ లండన్‌తోపాటు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూట్ ఫర్ డిసీజ్ మోడలింగ్’ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. ఈ వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు. మలేరియా సోకిన వ్యక్తిని కుట్టిన ఆడ దోమ మరో వ్యక్తిని కుడితే అతడికి కూడా వ్యాధి సోకుతుంది. అంటే దోమల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. మలేరియా పారాసైట్లు తొలుత దోమ ఆంత్రంలోకి చేరుకుంటాయి. అక్కడే ఇన్ఫెక్షన్ కలిగించే స్థాయికి ఎదుగుతాయి. అనంతరం లాలాజల గ్రంథుల్లోకి చేరుకుంటాయి. ఆంత్రంలో పారాసైట్లు ఎదగడానికి ఎక్కువ సమయం పట్టేలా చేశారు. పారాసైట్లు అభివృద్ధి చెంది, మనిషిని కుట్టే లోపే దోమల జీవితకాలం ముగుస్తుందని చెబుతున్నారు. ప్రపంచంలో సగం జనాభాకు మలేరియా రిస్క్ పొంచి ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2021లో ప్రపంచవ్యాప్తంగా 24.10 కోట్ల మలేరియా కేసులు నమోదయ్యాయి. 6,27,000 మంది ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నారు. -
కోవిడ్ కట్టడిలో భారత్ భేష్. మరి మరణాలు?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడిలో విఫలమై ప్రపంచ దేశాలు అల్లాడుతుంటే కోవిడ్ సంక్షోభాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ ప్రశంసించింది. ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో ఒక వేళ కోవిడ్ సమర్థ నిర్వహణ అంశం ఉండి ఉంటే భారత్ ఈ విషయంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్‌ను పొంది ఉండేదని బిల్, మిలిందా గేట్స్ ఫౌండేషన్ సీఈఓ మార్క్ సుజ్మాన్ వ్యాఖ్యానించారు. ఫౌండేషన్ ఆరో వార్షిక లక్ష్య సాధకుల (గోల్‌కీపర్స్) నివేదిక విడుదల సందర్భంగా మంగళవారం ఆయన పీటీఐ వారాసంస్థతో మాట్లాడారు. ‘‘దేశ సమస్యలను పరిష్కరించుకుంటూనే హఠాత్తుగా వచ్చిపడిన కోవిడ్ మహమ్మారి అదుపులో భారత్ విజయం సాధించింది. కోవిడ్ కట్టడికి అవలంబించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ఆదర్శనీయం. 200 కోట్ల కరోనా టీకాల పంపిణీ, ఏకంగా 90 శాతం వ్యాక్సినేషన్ రేటుతో ఎన్నో విషయాల్లో దిక్సూచీగా మారింది.. దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయించి వ్యాక్సిన్ తయారీ రంగంలో పెద్దన్న పాత్ర కొనసాగిస్తోంది. వచ్చే ఏడాది జీ20 కూటమికి అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటూ ఎన్నో అంతర్జాతీయ వేదికలపై భారత్ సత్తా చాటుతోంది. పేదరిక నిర్మూలన, నవజాత శిశు మరణాల రేటు తగ్గుదల వంటి అంశాల్లోనూ మంచి పురోగతి సాధించింది. కోవిన్ యాప్ ద్వారా త్వరితగతిన కోట్లాది వ్యాక్సిన్ల పంపిణీని సుసాధ్యంచేసింది. భారత్‌లో స్వయం ఉపాధి బృందాల ద్వారా మహిళలు సాధించిన సాధికారత, ప్రగతి అమోఘం’ అని సుజ్మాన్ అన్నారు. ఆక్సిజన్ కొరతతో కోవిడ్ మరణాలపై ఆడిట్ కరోనా రెండో వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరతతో సంభవించిన మరణాలపై ఆడిట్ చేయించాలని పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి సిఫారసు చేసింది. ఆక్సిజన్ కొరతతో మరణాలు సంభవించాయన్న వాదనను ఆరోగ్య శాఖ కొట్టిపారేయడం దురదృష్టకరమని పేర్కొంది. బాధిత కుటుంబాలకు పరిహారమివ్వాలని పేర్కొంది. కమిటీ తన 137వ నివేదికను సోమవారం రాజ్యసభకు సమర్పించింది. కేసులు భారీగా పెరిగిపోవడంతో ఆరోగ్య మౌలిక వసతులపై తీవ్ర ఒత్తిడి ఏర్పడిందని తెలిపింది. రాష్ట్రాలకు అవసరాలను అనుగుణంగా సిలిండర్లను పంపిణీ చేయలేక తీవ్ర సంక్షోభానికి కేంద్రం కారణమైందని తప్పుబట్టింది. క్యాన్సర్‌ను గుర్తించదగిన వ్యాధిగా పేర్కొనాలని మరో నివేదికలో కేంద్రానికి సూచించింది. ఇదీ చదవండి: రేపిస్ట్ ఇల్లు నేలమట్టం! -
ఆయన చేస్తున్న పనులు చూస్తే కన్నీళ్లు ఆగడం లేదు - బిల్‌గేట్స్
వారిద్దరు ప్రపంచ కుబేరులు. ఒకే సమయంలో వ్యాపార సామ్రాజ్యంలో పోటీ పడ్డారు. వారిలో ఒకరు వారెన్ బఫెట్ అయితే, మరొకరు బిల్‌గేట్స్. సంప్రదాయ వాణిజ్యం, స్టాక్మార్కెట్లో వారెన్ బఫెట్ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటే.. టెక్నాలజీ బాట పట్టి మైక్రోసాఫ్ట్‌తో ప్రపంచ గమనాన్నే మార్చేశాడు బిల్‌గేట్స్. వ్యాపారంలో ఇద్దరి దారులు వేరైనా వాటి ద్వారా వచ్చిన సంపద ఖర్చు పెట్టడంలో ఇద్దరూ ఒక్కటే. తమ దగ్గరున్న సంపదను సేవా కార్యక్రమాలను వెచ్చించడంలో వీళ్లద్దరూ ఎప్పుడూ ముందుంటారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడిగా వెలుగొందుతున్న కాలంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ గేట్స్ - మిలిండా ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి తన సంపాదనలో సింహభాగం అటు తరలించాడు. ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ దేశాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆహారం, విద్యా, వైద్యం మొదలు వ్యాక్సిన్ల వరకు ఉచితంగా అందిస్తున్నారు. బిల్‌గేట్స్ ఉద్దేశాలు నచ్చి వారెన్ బఫెట్ సౌతం గేట్స్ - మిలిందా ఫౌండేషన్‌కి భారీ ఎత్తున విరాళం అందిస్తున్నాడు. తాజాగా గేట్స్ - మిలిందా ఫౌండేషన్‌కి నాలుగు బిలియన్ డాలర్లు అందించాడు వారెన్ బఫెట్. దీంతో ఇప్పటి వరకు ఈ ఫౌండేషన్‌కు వారెన్ బఫెట్ అందించిన సాయం ఏకంగా 36 బిలియన్ డాలర్లకు చేరింది. కీర్తి కోసం పాకులాడకుండా తన మిత్రుడు నడిపిస్తున్న స్వచ్చంధ సంస్థకు వారెన్ బఫెట్ భారీగా విరాళం అందిస్తున్నాడు. దీంతో మంచి పనులు చేసేందుకు సేవా కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగేందుకు వారెన్ బఫెట్ అందిస్తున్న సహకారం చూస్తుంటే తన కళ్ల వెంట ఆనంద భాష్పాలు రాలుతున్నాయంటూ గేట్స్ పేర్కొన్నారు. I’m grateful for Warren’s gifts to support the foundation’s work and for our many years of friendship. When he decided in 2006 to make these gifts, it moved me to tears. It still does. https://t.co/JVfF4aUCZv — Bill Gates (@BillGates) June 14, 2022 చదవండి: బిల్‌గేట్స్ చెబుతున్నాడు.. ఈ సలహా పాటిద్దామా? -
గేట్స్ ఫౌండేషన్‌కు బఫెట్ రాజీనామా
న్యూఢిల్లీ: షేర్ మార్కెట్ దిగ్గజం, బెర్క్‌షైర్ హాథ్‌వే చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ బఫెట్(90) ‘బిల్ అండ్ మెలిండా గేట్స్(బీఎంజీ) ఫౌండేషన్’ ట్రస్టీ పదవికి రాజీనామా చేశారు. ‘‘చాలా ఏళ్లుగా బీఎంజీ ఫౌండేషన్ ట్రస్టీగా కొనసాగుతున్నా. కొన్నాళ్లుగా ఈ పోస్టులో నేను చురుగ్గా వ్యవహరించడం లేదు. చాలా కార్పొరేట్ సంస్థల బోర్డులకు రాజీనామా చేసినట్లుగానే బీఎంజీ ఫౌండేషన్ ట్రస్టీ పదవి నుంచి తప్పుకుంటున్నా. ఫౌండేషన్ సీఈవోగా మార్క్ సుజ్మన్ చక్కగా పనిచేస్తున్నారు. ఇటీవలే ఎన్నికైన ఆయనకు నా పూర్తి మద్దతు ఉంటుంది. నా లక్ష్యాలు, ఫౌండేషన్‌లోని పెద్దల లక్ష్యాలు ఒక్కటే. ఈ లక్ష్యాలను సాధించడానికి ఇక నా భౌతికపరమైన భాగస్వామ్యం అవసరం లేదు’’ అని బఫెట్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తాను పెట్టుబడి పెట్టిన మొత్తం షేర్లను దానం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో సగం దూరం ప్రయాణం చేశానని తెలిపారు. అలాగే మరో 4.1 బిలియన్ డాలర్లను (రూ.30,413 కోట్లు) సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తానని వెల్లడించారు. అయితే, ట్రస్టీ పోస్టు నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ఆయన బయటపెట్టలేదు. 27 ఏళ్ల వివాహ బంధం నుంచి వైదొలిగామని, విడాకులు తీసుకుంటామని బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ప్రకటించిన కొన్ని వారాల్లోనే వారెన్ బఫెట్ నుంచి రాజీనామా ప్రకటన రావడం గమనార్హం. ప్రపంచంలో అతిపెద్ద దాతృత్వ సంస్థల్లో ఒకటిగా పేరుగాంచిన బీఎంజీ ఫౌండేషన్‌లో ఇకపైనా కలిసి పనిచేస్తామని బిల్ గేట్స్, మెలిండా గేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ డైరెక్టరుగా ఆర్థికవేత్త కల్పన కొచర్
వాషింగ్టన్: ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త కల్పన కొచర్ తాజాగా బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో డైరెక్టరుగా (డెవలప్మెంట్ పాలసీ అండ్ ఫైనాన్స్ విభాగం) చేరనున్నారు. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో మానవ వనరుల విభాగం హెడ్‌గా ఉన్నారు. ఐఎంఎఫ్‌లో దాదాపు మూడు దశాబ్దాల పాటు వివిధ హోదాల్లో సుదీర్ఘ కాలంపాటు సేవలు అందించిన కొచర్ ఈ ఏడాది జూలై 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌లో చేరతారు. గడిచిన 33 ఏళ్లుగా సంస్థ పట్ల ఆమె అంకితభావంతో పనిచేశారని, అంతర్జాతీయ ద్రవ్య నిధి లక్ష్యాల సాధనకు ఎంతో కృషి చేశారని ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా ప్రశంసించారు. 1988లో ఆర్థికవేత్తగా ఐఎంఎఫ్‌లో కొచర్ కెరియర్ ప్రారంభించారు. -
‘2021 మే నాటికి కరోనా అంతం’
వాషింగ్టన్: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిని సమానంగా చూస్తోంది. వైరస్‌ను తుదముట్టించే వ్యాక్సిన్ కోసం ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. మన దగ్గర ఆగస్టు 15 నాటికి వ్యాక్సిన్ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్, బిలియనీర్ బిల్ గేట్స్ కరోనా అంతానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2021 మే నాటికి చాలా దేశాల్లో కరోనా కనుమరుగవుతుంది అన్నారు. ఓ ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్ మాట్లాడుతూ.. ‘త్వరలోనే కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. ధనిక దేశాల్లో 2021 మే నాటికి మహమ్మారి అంతం అవుతుంది. మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి వైరస్ తుడిచిపెట్టుకుపోతుంది. కరోనా వల్ల కలిగిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడం అంత తేలిక కాదు. కాకపోతే ఈ వైరస్ వైద్యరంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు వెలుగులోకి రావడానికి సాయం చేసింది. నూతన చికిత్స విధానాలు, వ్యాక్సిన్ పరిశోధనల్లో పురోగతి జరిగింది’ అన్నారు బిల్ గేట్స్. (కరోనా వ్యాక్సిన్ : గరిష్ట ధర రూ. 225) కరోనా వ్యాక్సిన్ కోసం బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నిధులు సమకూర్చతున్నది. ఈ క్రమంలో గతవారం పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్.. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ నుంచి 150 మిలియన్ డాలర్ల నిధులు.. అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గేవ్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులు అందాయని ప్రకటించిన సంగతి తెలిసిందే. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసే కొన్ని వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ రెండింటికి గాను ఒక డోస్‌కి 3 డాలర్ల ధర నిర్ణయించబడింది. ఇది 90 కి పైగా దేశాలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌తో పాటు దీని మద్దతు ఉన్న గవి కూడా ప్రపంచ దేశాలన్నింటికి వేగంగా.. సమానంగా కరోనా వ్యాక్సిన్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..!
2016 నవంబర్ 8న.. రాత్రి 8 గంటల సమయంలో టీవీపై ప్రత్యక్షమైన ప్రధాని మోదీ ఆ రోజు అర్ధరాత్రి నుంచి 1000... 500 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. రొటీన్ ప్రసంగాన్ని అంతే రొటీన్‌గా చూస్తున్న జనానికది ఊహించని షాక్. ఇలా.. చెప్పుకుంటూ పోతే ఆ కష్టాలకు అంతే ఉండదు. ఈ అవకాశాన్ని పేటీఎం వంటి డిజిటల్ పేమెంట్ యాప్‌లు అందిపుచ్చుకున్నాయి. ఇతర యాప్‌లూ వచ్చాయి. ప్రభుత్వం భీమ్ యాప్‌ను తెచ్చింది. డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. కానీ ఇప్పుడు.. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే ఈ లావాదేవీలన్నీ స్మార్ట్ ఫోన్లలోనే జరుగుతున్నాయి. దేశంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్నప్పటికీ.. ఇంకా 50 కోట్ల ఫీచర్ ఫోన్ల వినియోగదారులున్నారని ఎన్‌సీపీఎల్ అంచనా. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! ఫీచర్ ఫోన్లలో కూడా యూపీఐ సౌకర్యాన్ని కల్పించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని భారత్‌లో యూపీఐను నిర్వహించే ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంకల్పించింది. బిల్ అండ్ మిలిందా గేట్స్ పౌండేషన్, సీఐఐ సీవో కలిసి ఎన్పీసీఐ ఉమ్మడిగా ఓ ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా యూపీఐ సౌకర్యాన్ని ఫీచర్ ఫోన్లలో ఉపయోగించుకునేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించినవారికి 50 వేల డాలర్ల (రూ.35.85 లక్షలు) బహుమతిని ప్రకటించింది. రెండో బహుమతిగా 30 వేల డాలర్లు (రూ.21.5 లక్షలు), మూడో బహుమతిగా 20 వేల డాలర్లు (రూ.14.34 లక్షలు) నిర్ణయించింది. తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందేందుకు దేశంలోని టెక్కీలకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు. ఈ పోటీ ఈ నెల 12న ముగియనుంది. విజేతలను మార్చి 14న ప్రకటిస్తామని యూపీఐ నిర్వహణ సంస్థ పేర్కొంది. చదవండి: భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..! -
కేరళ కుట్టి ఉద్యమానికి సోషల్ ప్రోగ్రెస్ ‘ఆస్కార్’
’ఇది ప్రతి స్త్రీ జీవితంలో అనుభవమయ్యే పునరుత్పత్తి పునాది ప్రక్రియ. కానీ ఏ దేశంలోనైనా చర్చించడానికి ససేమిరా ఇష్టపడని విషయం కూడా ఇదే. రక్తస్రావమనే అత్యంత సహజక్రియకి స్త్రీలంతా శిక్షింపబడుతున్నారు.’ అంటూ పట్టుమని పద్దెనిమిదేళ్ళు కూడా లేని కేరళ కుట్టి అమికా జార్జ్ బ్రిటన్ వీధుల్లో ప్రారంభించిన ’’ఫ్రీ పీరియడ్స్’’ ఉద్యమం ఆమెకు గోల్‌కీపర్స్ గ్లోబల్ అవార్డు దక్కేలా చేసింది. సామాజిక అభివృద్ధి రంగంలో ఈ అవార్డును ఆస్కార్ అవార్డుతో పోలుస్తారు. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల ప్రగతిని పర్యవేక్షించే కార్యక్రమంలో భాగంగా బిల్, మెలిండా ఫౌండేషన్ 2017లో గోల్‌కీపర్స్ అనే సామాజిక చైతన్య ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 18 ఏళ్ళ అమికా జార్జ్ పేద బాలికలకు ఉచిత సానిటరీ ప్యాడ్స్ కోసం బ్రిటన్ వీధుల్లో పూరించిన శంఖారావం ఆమెకు ఈ అవార్డు దక్కేలా చేసింది. సోషల్ మీడియా వేదికగా ప్రారంభమైన ఈ ఉద్యమం చివరకు బ్రిటన్ పురవీధుల్లో స్త్రీపురుష భేదాన్ని మరిపిస్తూ సాగింది. దాదాపు 2000 మంది యువతీయువకులు ఉద్యమంలో పాల్గొన్నారు. చివరకు బ్రిటన్ ప్రభుత్వం పేద బాలికల రుతుక్రమావసరాలను తీర్చే ఉచితి సానిటరీ ప్యాడ్స్ కోసం 1.5 మిలయన్ పౌండ్లు వెచ్చించేలా చేసింది. అభివృద్ధిచెందిన బ్రిటన్‌లాంటి దేశాల్లోనే ప్రతి పదిమంది బాలికల్లో ఒకరు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుగోలు చేయలేని పేదరింకలో మగ్గుతున్నారని ప్లాన్ ఇంటర్నేషల్ సర్వేలో చదివిన 18 ఏళ్ల భారతీయ యువతి అమికా జార్జ్ ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమ క్రమంలో బ్రిటన్ పేద బాలికలు సానిటరీ ప్యాడ్స్‌ని కొనుక్కోలేని స్థితిలో ఆ అవసరానికి కాగితాలనూ, పాత న్యూస్ పేపర్స్‌నీ, సాక్స్‌నూ వాడుతుండడం తన హృదయాన్ని కలిచివేసిందంటారు అమికా జార్జ్. దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఆమె దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఇదే ఆమె చేపట్టిన ’’ఫ్రీ పీరియడ్’’ ఉద్యమానికి పునాది అన్నారు కేంబ్రిడ్జి యూనివర్సిటీలో చరిత్ర చదవడానికి వెళ్ళి చరిత్ర సృష్టించిన∙అమికా జార్జ్. 2017 డిసెంబర్లో జరిగిన ఈ ఉద్యమం ఫలితంగా అక్కడి పేద బాలికలకు దక్కిన ఫలితాన్ని గుర్తించిన గోల్‌కీపర్స్ సోషల్ ప్రోగ్రెస్ ఆస్కార్ అవార్డుతో సత్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇలా సమాజాన్ని చైతన్యయుతం చేసిన ముగ్గురు మహిళలను ఈ అవార్డుకి ఎంపిక చేస్తే అందులో అమికా జార్జ్ ఒకరు. ఫ్రెంచ్ అధ్యక్షలు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, మహిళల పిల్లల హక్కుల కార్యకర్త గ్రేస్ మైఖస్త్ల్, రచయిత, సామాజిక కార్యకర్త రిచర్డ్ కర్టిస్ తదితర ప్రముఖులు ఈ అవార్డుల కార్యక్రమంలో ఉపన్యసించారు. న్యూయార్క్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఇరాక్ కి చెందిన 24 ఏళ్ళ నదియా మురద్, కెన్యాకి చెందిన 28 ఏళ్ళ డిస్మస్ కిసిలు లకి సైతం అమికా జార్జ్‌తో సహా ఈ అవార్డులు అందుకున్నారు. -
ప్రముఖులను కలవరపెడుతున్న ట్రంప్ బడ్జెట్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురాబోతున్న తొలి బడ్జెట్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాలకు సహాయం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం పలువురు ప్రముఖులను కలవర పెడుతోంది. ట్రంప్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్ ను కనుక ఆమోదిస్తే, ప్రపంచంలో అమెరికానే తక్కువ సుసంపన్నమైన, తక్కువ సురక్షితమైన దేశంగా ఉంటుందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. బడ్జెట్ ప్రతిపాదనలతో తాము పూర్తిగా సమస్యల ఉచ్చులో కూరుకుపోతామని, ఇది పేద ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని ఫౌండేషన్ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ల్మన్ అన్నారు. దేశంలో ఉన్నవారిని, విదేశీయులను ఎంతో ప్రభావితం చేయనుందన్నారు. ట్రంప్ బడ్జెట్ ఎక్కువగా రక్షణ వ్యవహారాలకు సహాయపడుతుందని, మిగతా వాటిని పట్టించుకోవడం లేదని వాపోయారు. విద్యుత్, రవాణా, వ్యవసాయం, పర్యావరణం వంటి డిపార్ట్ మెంట్లను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజలను ఆరోగ్యవంతంగా, సుస్థిరమైన సంఘాలలో జీవించే విధంగా సహకరించాలని, ఇది జాతి భద్రతకంటే కూడా ఎంతో క్లిష్టతరమైన అంశమని గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. గురువారం ట్రంప్ బడ్జెట్ బ్లూప్రింట్ ను విడుదల చేశారు. అమెరికా ఫస్ట్ పేరుతో వచ్చిన ఈ బడ్జెట్లో విదేశీ సహాయాలు తగ్గిస్తున్నట్టు ప్రతిపాదించారు. -
అత్యంత సంపన్న ట్రస్టు... గేట్స్‌దే!
ఆస్తుల విలువ 43.4 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ : ఏకంగా 43.4 బిలియన్ డాలర్ల ఆస్తులతో అత్యంత సంపన్న ప్రైవేట్ చారిటబుల్ సంస్థల జాబితాలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అగ్రస్థానం దక్కించుకుంది. ఈ మొత్తం మన కరెన్సీలో రూ.2.75 లక్షల కోట్లపైమాటే. 8.1 బిలియన్ డాలర్ల ఆస్తులతో లీ కా షింగ్ ఫౌండేషన్ రెండో స్థానం, గోర్డన్ అండ్ బెట్టీ మూర్ (6.4 బిలియన్ డాలర్లు) మూడో స్థానం దక్కించుకున్నాయి. ప్రస్తుతం జీవించి ఉన్న అత్యంత సంపన్నులు స్థాపించిన సామాజిక సేవా సంస్థలతో కూడిన ఈ జాబితాను వెల్త్-ఎక్స్ రూపొందించింది. లిస్టులోని మొత్తం 10 సంస్థల ఆస్తులన్నీ కలిపి చూసినా కూడా బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు సమానంగా లేవు. సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆయన సతీమణి మిలిందా గేట్స్ పేరిట ఇది ఏర్పాటైంది. ఇక రెండో స్థానంలో ఉన్న లీ కా షింగ్ ఫౌండేషన్‌ను హాంకాంగ్‌కు చెందిన వ్యాపార దిగ్గజం లీ కా షింగ్ నెలకొల్పారు. దీన్ని తన మూడో కుమారుడిగా చెప్పుకునే షింగ్... తన ఆస్తుల్లో మూడో వంతును ఫౌండేషన్‌కు రాసిచ్చారు. లిస్టులోని మొత్తం 10 సంస్థల ఆస్తుల విలువ 83.1 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇది వాటిని స్థాపించిన వారి మొత్తం ఆస్తుల విలువలో సుమారు 29.7%. వెల్త్-ఎక్స్ నివేదిక ప్రకారం అత్యంత సంపన్నులు నెలకొల్పిన ఫౌండేషన్లు 5,000 పైచిలుకు ఉన్నాయి. వీటన్నింటి ఆస్తుల విలువ 560 బిలియన్ డాలర్ల పైగా ఉంటుంది. -
దాతృత్వంలో బఫెట్ నంబర్ వన్
2.1 బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ గురు వెల్త్-ఎక్స్ టాప్ 10లో అగ్రస్థానం న్యూఢిల్లీ: వివిధ కార్యక్రమాల కోసం ఈ ఏడాది అత్యధికంగా విరాళాలిచ్చిన దాతల్లో ఇన్వెస్ట్మెంట్ గురు వారెన్ బఫెట్ అగ్రస్థానంలో నిల్చారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు ఏకంగా 2.1 బిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. తన కంపెనీ బెర్క్‌షైర్ హాథ్వేలోని 16.6 మిలియన్ షేర్ల రూపంలో ఇది ఇచ్చారు. వెల్త్-ఎక్స్ సంస్థ రూపొందించిన 10 మంది దాతల జాబితాలో బఫెట్ ఈ విధంగా అగ్రస్థానంలో ఉన్నారు. ఈ లిస్టులోని 10 మందిలో 8 మంది అమెరికన్ దాతలే. హాంకాంగ్‌కి చెందిన రియల్టీ దిగ్గజాలు రోనీ, జెరాల్డ్ చాన్‌లు మాత్రమే అమెరికాయేతరులు. సిలికాన్ వ్యాలీ కమ్యూనిటీ ఫౌండేషన్‌కి 497.5 మిలియన్ డాలర్ల విరాళం ఇవ్వడం ద్వారా గోప్రో సంస్థ వ్యవస్థాపకుడు నికొలస్ ఉడ్మ్యాన్ దంపతులు రెండో స్థానంలో ఉన్నారు. రోనీ.. జెరాల్డ్ చాన్ వరుసగా 3,4 స్థానాల్లో ఉన్నారు. ఈ ఇద్దరు సోదరులు హార్వర్డ్ యూనివర్సిటీకి 350 మిలియన్ డాలర్లు ఇచ్చారు. 2014 టాప్ టెన్ విరాళాల్లో ఆరింటిని విద్యా సంస్థలు దక్కించుకున్నాయి. -
జన ధన యోజనకు
బిల్‌గేట్స్ ఫౌండేషన్ తోడ్పాటు న్యూఢిల్లీ: ప్రధానమంత్రి జన ధన యోజ న పథకం పురోగతి సమీక్షలో తోడ్పాటును అందించడానికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. ఈ కా ర్యక్రమం విజయవంతానికి సహకరిస్తామని తెలిపింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా బిల్ గేట్స్, ఆయన సతీమణి మెలిండా గేట్స్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అటు స్వచ్ఛ్ భారత్ అభియాన్ సహా ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ఇతర పథకాల అమల్లోనూ ఫౌండేషన్ సహకరిస్తుందన్నారు. -
జమ్మూ వరద బాధితులకు గేట్స్ భారీ విరాళం!
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మెలిండా గేట్స్ తో కలిసి ప్రధాని నరేంద్రమోడీని శుక్రవారం భేటి అయ్యారు. పారిశుద్ధ, శిశు ఆరోగ్యం, మహిళల భద్రత, చైతన్యం తదితర కార్యక్రమాలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక దృష్టిని గేట్స్ దంపతులు ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి జనధన యోజన కార్యక్రమం గురించి బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. పేదల ప్రజల అర్ధిక పటిష్టతకు మోడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని గేట్స్ కొనియాడారు. జమ్మూ,కాశ్మీర్ వరద బాధిత కుటుంబాలకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ 700000 డాలర్ల విరాళాన్ని ప్రకటించింది. ప్రధాన మంత్రి కార్యాలయంలోని కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ కు విరాళాన్ని అందించారు. -
త్వరలో చర్మంలాంటి కండోమ్: గేట్స్
న్యూఢిల్లీ: మహిళలు ఉపయోగించగల అత్యంత ఆధునికమైన, సులభతరమైన గర్భ నిరోధక సాధనాలతో పాటు చర్మంలాంటి పదార్ధంతో తయారయ్యే అత్యంత పలుచనైన కండోమ్‌ల తయారీ సంవత్సరం లోపు సాధ్యమవుతుందని భావిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ఆ ప్రాజెక్టులకు బెల్ అండ్ మెలిండా గేట్ ఫౌండేషన్ల తరఫున తాము నిధులను సమకూరుస్తున్నామని వెల్లడించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన, తన భార్య మెలిండాతో కలసి పాల్గొన్నారు. అత్యంతాధునిక కండోమ్‌ల తయారీ సాధ్యమవుతోంది కానీ వాటిని చవక ధరలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన సవాలని ఆయన పేర్కొన్నారు.