జమ్మూ వరద బాధితులకు గేట్స్ భారీ విరాళం!
జమ్మూ వరద బాధితులకు గేట్స్ భారీ విరాళం!
Published Fri, Sep 19 2014 9:51 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన భార్య మెలిండా గేట్స్ తో కలిసి ప్రధాని నరేంద్రమోడీని శుక్రవారం భేటి అయ్యారు. పారిశుద్ధ, శిశు ఆరోగ్యం, మహిళల భద్రత, చైతన్యం తదితర కార్యక్రమాలపై మోడీ ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక దృష్టిని గేట్స్ దంపతులు ప్రశంసించారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి జనధన యోజన కార్యక్రమం గురించి బిల్ గేట్స్ అడిగి తెలుసుకున్నారు. పేదల ప్రజల అర్ధిక పటిష్టతకు మోడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని గేట్స్ కొనియాడారు.
జమ్మూ,కాశ్మీర్ వరద బాధిత కుటుంబాలకు బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ 700000 డాలర్ల విరాళాన్ని ప్రకటించింది. ప్రధాన మంత్రి కార్యాలయంలోని కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ కు విరాళాన్ని అందించారు.
Advertisement
Advertisement