న్యూఢిల్లీ: ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ కేవలం 5 సెకన్లలో కోవిడ్ ఉందో లేదో తెలిపే ఎక్స్ రే ఆధారిత నిర్థారణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ దీనిని తయారు చేశారు. ఇందులో భాగంగా కోవిడ్ కేసులు సహా ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 వేల ఎక్స్‌రే స్కాన్లను డేటాబేస్ రూపంలో స్టోర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచేలా తయారు చేసినట్లు చెప్పారు. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలనకు పంపినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment