X-ray
-
Lok sabha elections 2024: ‘ఎక్స్–రే’పై మాట మార్చిన రాహుల్
న్యూఢిల్లీ: కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే ప్రజల స్థిర చరాస్తులపై ఆర్థిక, సంస్థాగత సర్వే(ఎక్స్–రే) నిర్వహిస్తామంటూ ఈ నెల 7న తాను చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారడంతోపాటు తీవ్ర విమర్శలు వస్తుండడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వెనక్కి తగ్గారు. బుధవారం ఢిల్లీలో సామాజిక న్యాయ సదస్సులో మాట్లాడుతూ మాట మార్చేశారు. ఈ సర్వే ప్రజల ఆస్తులను గుర్తించడానికి కాదని పేర్కొన్నారు. ప్రజలకు ఏ మేరకు అన్యాయం జరిగింది అనేది తెలుసుకోవడమే సర్వే ఉద్దేశమని స్పష్టం చేశారు.సర్వే విషయంలో తన ప్రకటనను ప్రధాని నరేంద్ర మోదీ వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక, సంస్థాగత సర్వే చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తాను ఏనాడూ చెప్పలేదని పేర్కొన్నారు. సర్వేపై తాను మాట్లాడగానే ప్రధాని మోదీ తీవ్రంగా స్పందిస్తున్నారంటే సంపద పంపిణీలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని అర్థం చేసుకోవచ్చని తెలిపారు. అన్యాయానికి గురైన వర్గాలకు న్యాయం చేకూర్చాలన్నదే తన ఉద్దేశమని వివరించారు.ఆర్థిక, సంస్థాగత సర్వే చేపట్టడం దేశాన్ని కూల్చేసే కుట్ర ఎలా అవుతుందో చెప్పాలని నిలదీశారు. సర్వే జరిగితేనే అసలు సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. దేశభక్తులం అని చెప్పుకుంటున్న కొందరు ప్రబుద్ధులు సర్వే అనగానే వణికిపోతున్నారని ఎద్దేవా చేశారు. దేశ జనాభాలో 90 శాతం మందికి అన్యాయం జరిగిన మాట నిజమేనని, వారికి న్యాయం జరగాల్సిందేనని తేలి్చచెప్పారు. దేశంలో ప్రజల మధ్య సంపద పంపిణీ ఏ రీతిలో జరిగిందో నిర్ధారించడానికి తమ ప్రభుత్వ హయాంలో ఎక్స్–రే నిర్వహిస్తామని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. -
మనిషి కడుపులో ఇయర్ ఫోన్లు, తాళం, బోల్టులు.. వైద్యుల అవాక్కు
పంజాబ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కడపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి స్కానింగ్ చేసి పరీక్షించిన వైద్యులు అతని కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కయ్యారు. వ్యక్తి కడుపులో ఏకంగా ఇయర్ ఫోన్స్, లాకేట్స్, బోల్టులు, నట్స్, ఇలా వందకు పైగా వస్తువును చూసి ఖంగుతున్నారు. వివరాలు.. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా వాంతులు, కడుపు నొప్పి, తీవ్రవైన జ్వరం ఉండటంతో మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు మెడిసిన్ ఇచ్చినా నొప్పి తగ్గకపోవడంతో.. స్టమక్ ఎక్స్‌రే చేయాలని నిర్ణయించారు. స్కాన్ చేసిన తర్వాత వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వ్యక్తి కడుపులో అనేక ఇనుప, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్లు తేలింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి అతడి శరీరంలోని వస్తువులను విజయవంతంగా బయటకు తీశారు. వ్యక్తి కడుపులో నుంచి తీసిన అనేక వస్తువుల్లో ఇయర్ ఫోన్లు, వాషర్లు, నట్స్, సేఫ్టీపిన్స్, బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు, తాళం, తాళం చెవి లాకెట్లు, బటన్లు, రేపర్లు, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్, ఇలా ఎన్నో ఉన్నాయి. చదవండి: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కొత్త కూటమికి సిద్ధమవుతున్న అన్నా డీఎంకే! సర్జరీపై మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ.. తన కెరీర్లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఇదే మొదటిదని అన్నారు. రెండు ఏళ్లుగా ఈ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడని తెలిపారు. దాదాపు 3 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు వ్యక్తి కడుపులోని వస్తువుల్ని తొలగించారు.అతని శరీరంలో నుంచి వస్తువులన్నీ తీసేసినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కుదుటపడలేదని చెప్పారు. వ్యక్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. బాధితుడి కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా షాక్ అయ్యామని చెప్పారు. అవన్నీంటిని అతడు ఎలా, ఎప్పుడూ మింగాడో తెలీదని అన్నారు. కానీ అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, కడుపు నొప్పి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడని తెలిపారు. ఆసుపత్రిలో చేరే కొన్ని రోజుల ముందు నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించినట్లు చెప్పారు. ఎంతమంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా, వారు అతని నొప్పి వెనుకగల కారణాన్ని నిర్ధారించలేకపోయారని పేర్కొన్నారు. -
ఎక్స్‌రే నుంచి సీటీ స్కాన్ దాకా..
లబ్బీపేట(విజయవాడతూర్పు): గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్, కడుపునొప్పి ఇలా వ్యాధి ఏదైనా నిర్ధారించేది రేడియాలజిస్టులే. గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యం నుంచి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధుల వరకూ నిర్ధారణలో రేడియాలజిస్టుల పాత్ర కీలకం. ఎక్స్‌రే నుంచి డిజిటల్ ఎక్స్‌రేలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, ఆ్రల్టాసౌండ్ స్కాన్ ఇలా అనేక ఇమేజింగ్ పరికరాలు నేడు వైద్య రంగంలో ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. నవంబరు 8న ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... రక్తనాళాల్లో పూడికలనూ... ఒకప్పుడు గుండె రక్తనాళాల్లో పూడికలు గుర్తించాలంటే యాంజియోగ్రామ్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆస్పత్రిలో అడ్మిషన్ అవసరం లేకుండానే కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ(సీటీ)స్కాన్ అందుబాటులోకి వచ్చింది. సంప్రదాయక సింగిల్ స్కాన్‌తో ప్రారంభమై డ్యూయల్, 4, 6, 8, 16 స్లయిస్ నుంచి నేడు 256, 320 స్లయిస్ సీటీ స్కాన్ పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. సంపూర్ణ దేహానికి వర్తించేలా నాన్ ఇన్వేసిన్ యాంటియోగ్రఫీ 3డీ సీటీ వంటివి వేగం, నాణ్యత, వైవిధ్యం విషయంలో ఎన్నో రకాలుగా వ్యాధి నిర్ధారణకు దోహదపడుతున్నాయి. గుండె, కిడ్నీ, మెదడు, లివర్ వ్యాధులతో పాటు, రక్తనాళాల్లోని లోపాలను గుర్తించే అత్యాధునిక సీటీ స్కాన్లు జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. జీజీహెచ్‌లో సమగ్ర రేడియాలజీ సేవలు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో సమగ్ర రేడియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంఆర్ఐ, రెండు సీటీ స్కానింగ్ యంత్రాలతో పాటు, పది ఆల్ట్రాసౌండ్ యూనిట్లు ఉన్నాయి. అత్యాధునిక డిజిటల్ ఎక్స్‌రే యూనిట్లు ఉన్నాయి. ఇక్కడకు వచ్చే రోగుల వ్యాధి నిర్ధారణకు అవసరమైన స్కానింగ్‌లు చేస్తూ రిపోర్టులు అందిస్తున్నారు. ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇలా 10 మంది రేడియాలజిస్టులు ఇక్కడ పనిచే స్తున్నారు. కణజాలాల తేడాలను గుర్తించే ఎంఆర్ఐ శరీరంలోని అంతర్గత తేడాలను గుర్తించడంలో ఎంఆర్ఐ(మాగ్నటిక్ రిసోనెన్స్ ఇమేజింగ్) ఎంతగానో దోహదపడుతుంది. సూక్ష్మమైన లోపాలను సైతం ఈ స్కానింగ్‌లో గుర్తించగలుగుతున్నారు. వెన్నుపూస, అబ్డామిన్, మెదడు వంటి అనేక లోపాలను గుర్తించడంలో ఎంఆర్ఐ స్కాన్ కీలకంగా మారింది. ఈ స్కానింగ్ పరికరం 0.2 టెస్లాతో ప్రారంభమై ప్రస్తుతం 1.5 టెస్లా అందుబాటులోకి వచ్చింది. దీని స్కానింగ్ ఇమేజీలు వ్యాధి నిర్ధారణలో కీలకంగా ఉన్నాయి. ఆ్రల్టాసౌండ్తో విప్లవాత్మక మార్పులు మహిళల్లో పెనుముప్పుగా పరిణమించిన రొమ్ము క్యాన్సర్ నిర్ధారణలో ఆ్రల్టాసౌండ్ కీలకభూమిక పోషిస్తుంది. సూక్ష్మదశలో గుర్తించే ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కిడ్నీలు, పిత్తాశయంలో రాళ్లు గుర్తించడం, 24 గంటల కడుపునొప్పి, లివర్ పనితీరు ఇలా ఎన్నో రకాల వ్యాధులను సకాలంలో గుర్తించగలుగుతున్నారు. రోగి ప్రమాదం నుంచి బయట పడేందుకు తమ వంతు కృషి చేస్తున్నారు. -
చాయ్ తాగుతూ గ్లాస్ మింగేశాడా? పొట్టలోకి అది ఎలా వెళ్లింది, డాక్టర్లు ఏం చెప్పారు?
పట్నా: చిన్న పిల్లలు తెలిసి తెలియక నాణేలు, చిన్న చిన్న వస్తువులు మింగుతుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. ఈ మధ్యకాలంలో కొందరు బంగారం, మొబైల్ ఫోన్లను కూడా కడుపులో దాచేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా గ్లాస్‌నే మింగేశాడనే వార్త వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఆసుపత్రిలో చేరగా.. అతన్ని పరిశీలించిన వైద్యులు అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. 55 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో ఆదివారం బీహార్లోనిని ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వెంటనే వైద్యులు ఎక్స్‌రే తీయగా బాధితుడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా పురీషనాళం నుంచి గ్లాస్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో ఆపరేషన్ చేసి బయటకు తీశారు. అయితే అది కడుపులోకి ఎలా వెళ్లిందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. చదవండి: Singer Parvathi: ఒక్క పాటతో కదిలిన యంత్రాంగం.. వెంటనే ఊరికి బస్సు తీసుకొచ్చింది గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లిందనే విషయంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా తాను చాయ్ తాగేటప్పుడు గ్లాస్‌ను కూడా మింగినట్లు బాధితుడు చెబుతుండగా.. అది నమ్మశక్యంగా లేదని వైద్యులు కొట్టిపారేశారు. ఆహారనాళంలో గ్లాస్ పట్టదని, మలద్వారం నుంచే వెళ్లి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. బాధితుడు వైశాలి జిల్లాలోని మహువాకు చెందినవాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. చదవండి: 62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు -
వీధికుక్కకు ఎక్స్‌రే..!
బంజారాహిల్స్: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వీధికుక్కను చేరదీయడమే కాకుండా ఆస్పత్రికి తీసుకెళ్లి ఎక్స్‌రే తీయించి చికిత్స నిర్వహించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు ఆ వీధికుక్క ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద విధి నిర్వహణలో ఉండే ఇంటర్‌సెప్టర్ వెహికిల్ పోలీస్ కానిస్టేబుల్ కె.ప్రవీణ్‌కుమార్, హోంగార్డ్ ఎ.నరేష్ ఇద్దరు గత మూడు వారాల నుంచి పార్కు వద్ద అనారోగ్యంతో బాధపడుతున్న వీధికుక్కను చూస్తూ నిఘా ఉంచారు. ఆహారం తినకుండా దగ్గుతూ గొంతులో ఏదో ఇరుక్కున్నట్లుగా అవస్థలు పడుతున్న ఆ కుక్కను చూసి చలించిపోయారు. సోమవారం ఉదయం వీరు ఆ కుక్కను తమ వాహనంలో తీసుకెళ్లి బంజారాహిల్స్ రోడ్ నంబర్.3లోని సాగర్‌సొసైటీలో ఉన్న పెట్ క్లినిక్‌లో ఎక్స్‌రే తీయించారు. వైద్యపరీక్షలు నిర్వహించేలా చేశారు. ఎక్స్‌రేలో దాని ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలియడంతో సంబంధిత డాక్టర్ వ్యాధి తగ్గుదల కోసం మందులు రాసిచ్చాడు. పెట్ క్లినిక్‌లో ఫీజులు చెల్లించిన ఈ పోలీసులు మందులను కూడా తమ సొంత డబ్బులతోనే కొనుగోలు చేసి మళ్లీ కేబీఆర్ పార్కు వద్ద వదిలిపెట్టారు. ‘బ్రౌనీ’ అని ఈ వీధికుక్కకు పేరుపెట్టుకున్న ఈ పోలీసులు ప్రతిరోజు బిస్కెట్లు, ఇతర ఆహార పదార్థాలు తీసుకొచ్చి పెడుతుంటారు. ఒక్కసారిగా అనారోగ్యానికి గురైన ఈ కుక్కను చూసి చలించిపోయి తమ సొంత డబ్బులతోనే వైద్యపరీక్షలు నిర్వహించిన వీరి గొప్పదనాన్ని అధికారులు సైతం ప్రశంసించారు. ఈ కుక్క ఆరోగ్యం ఇంకో రెండు వారాల్లో మెరుగుపడుతుందని వైద్యులు చెప్పడంతో పోలీసులిద్దరూ దాని ఆరోగ్యంపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు. -
రెండోసారి కూడా నెగెటివ్ వస్తే.. ఇది తప్పనిసరి!
న్యూఢిల్లీ: కరోనా లక్షణాలున్న వారికి నిజంగా వైరస్ సోకిందో లేదో తెలుసుకోవడానికి సాధారణంగా ఆర్టీ–పీసీఆర్ టెస్టులు చేస్తున్నారు. అయితే, ఈ టెస్టుల్లో కొన్నిసార్లు తప్పుడు ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా సోకినప్పటికీ ఫలితం మాత్రం నెగటివ్ అని చూపుతోందని అంటున్నారు. ఆర్టీ–పీసీఆర్ పరీక్షల్లో 80 శాతం సరైన ఫలితమే వస్తోంది. మిగతా 20 శాతం తప్పుడు ఫలితం రావడం ఆందోళనకరమే. కరోనా బారినపడినప్పటికీ నెగటివ్ అని వస్తే సదరు బాధితులు చికిత్సకు దూరంగా ఉండే అవకావం ఉంది. అది చివరకు ప్రాణాంతకంగా మారొచ్చు. కాబట్టి కరోనా లక్షణాలు కొనసాగుతుండగా ఆర్టీ–పీసీఆర్ టెస్టులో నెగటివ్ వస్తే 24 గంటల తర్వాత మరోసారి అదే టెస్టు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రెండోసారి కూడా నెగటివ్ వస్తే సీటీ స్కాన్/చెస్ట్ ఎక్స్–రే తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు. కరోనా సోకినప్పటికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలో నెగెటివ్‌గా రావడానికి పలు కారణాలున్నాయి. నమూనాను(శాంపిల్) సక్రమంగా సేకరించకపోవడం, అందులో వైరల్ లోడ్ తక్కువగా ఉండగానే త్వరగా పరీక్ష చేయడం వల్ల ఇలా జరిగే అవకాశం ఉందంటున్నారు. అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వేరియంట్లను కూడా ఆర్టీ–పీసీఆర్ టెస్టుల్లో గుర్తించగలుగుతున్నామని ఐసీఎంఆర్ ప్రతినిధి డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో 40 శాతం ఫలితమే తెలుస్తుందని సీనియర్ డాక్టర్ ఒకరు చెప్పారు. చదవండి: సర్జికల్ మాస్కుపై క్లాత్ మాస్కు ధరిస్తే.. -
మరింత అందుబాటులో ఎక్స్‌రే, సీటీస్కాన్
సాక్షి, అమరావతి: ఎక్స్‌రే, సీటీస్కాన్‌ల కోసం గతంలో రోగులు ఇబ్బందిపడే వారు. జిల్లా ఆస్పత్రులు లేదా బోధనాస్పత్రుల్లో మాత్రమే అవి అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. సెకండరీ కేర్ ఆస్పత్రులైన వైద్య విధాన పరిషత్ ఆస్పత్రుల్లో మొత్తం 115 చోట్ల ఈ సేవలు అందుతున్నాయి. ► రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 1,531 మంది ఎక్స్‌రే సేవలను, నెలకు ఆరు వేల మందికి పైగా సీటీస్కాన్ సేవలను వినియోగించుకుంటున్నారు. ► మొత్తం 71 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 36 ఏరియా ఆస్పత్రులు, ఆరు జిల్లా ఆస్పత్రులు రెండు ఎంసీహెచ్ సెంటర్లలో ఈ సేవలు అందుబాటులో ఉండగా, మరిన్ని ఆస్పత్రులకు విస్తరించేలా చర్యలు చేపడుతున్నారు. ► ఈ 115 ఆస్పత్రుల్లో మొత్తం 1,350 ఎక్స్‌రే మెషీన్లున్నాయి. ఎమర్జెన్సీ కేసులకు ప్రాధాన్యమిస్తున్నారు. ► రేడియోగ్రాఫర్స్‌కు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. -
5 సెకన్లలో కరోనా నిర్ధారణ పరీక్ష
న్యూఢిల్లీ: ఐఐటీ రూర్కీకి చెందిన ఓ ప్రొఫెసర్ కేవలం 5 సెకన్లలో కోవిడ్ ఉందో లేదో తెలిపే ఎక్స్ రే ఆధారిత నిర్థారణ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ కమల్ జైన్ దీనిని తయారు చేశారు. ఇందులో భాగంగా కోవిడ్ కేసులు సహా ఇతర ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న 60 వేల ఎక్స్‌రే స్కాన్లను డేటాబేస్ రూపంలో స్టోర్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో నడిచేలా తయారు చేసినట్లు చెప్పారు. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిశీలనకు పంపినట్లు తెలిపారు. -
తలలోకి డ్రిల్లింగ్ మెషీన్ దింపేశారు!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు... వ్యతిరేకిస్తున్న వారు... మంగళవారం కూడా రెచ్చిపోయారు. రెండు వర్గాలూ పెట్రేగిపోయి అవతలివర్గం తాలూకు దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని తగలబెట్టేయడంతో స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ్మేసింది. ఈనేపథ్యంలో తాజాగా బయటికొచ్చిన ఓ ఎక్స్‌రే రిపోర్టు ఆందోళనకారుల వెర్రి చేష్టలను కళ్లకు కడుతోంది. ఎక్స్‌రే ప్రకారం.. మంగళవారం ఢిల్లీలో చోటుచేసుకున్న సీఏఏ ఘర్షణల్లో వివేక్ అనే వ్యక్తి తల్లోకి డ్రిల్లింగ్ మెషీన్ చొచ్చుకెళ్లింది. అతడు తన దుకాణంలో పనిచేసుకుంటున్న సమయంలో అల్లరి మూకలు దాడికి తెగబడ్డాయి. ఆందోళనకారుల దాడిలో వివేక్ చేతిలో ఉన్న డ్రిల్ మెషీన్ అతని తల్లోకి దిగింది. (చదవండి: ట్రంప్ పర్యటిస్తున్న వేళ... సీఏఏపై భగ్గుమన్న ఢిల్లీ) దీంతో అతన్ని హుటాహుటిన జీటీబీ ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన ఫొటోను పాయల్ మెహతా అనే యూజర్ ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్ అయింది. అయితే, బాధితుడి గాయం వద్ద ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించకపోవడం..ఎక్స్‌రేలో ఒక చోట ఫిబ్రవరి 25, 2020 అని ఉన్నప్పటికీ.. మరో చోట మార్చి 23, 2020 అని ఉండటంతో సందేహాలకు తావిచ్చింది. కాగా, ఢిల్లీలో అల్లరి మూకలు మారణాయుధాలతో వీధుల్లో స్వేచ్ఛగా స్వైరవిహారం చేశాయి. ఈ ఘర్షణల్లో సోమవారం 5 మంది, మంగళవారం మరో 8 మంది బలైపోయారు. మరో 200 మంది వరకూ గాయపడగా... వారిలో 48 మంది పోలీసులే కావడం గమనార్హం! (చదవండి: కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) -
మానవ మూత్రంతో ఇటుకలు!
మానవ మూత్రం అనగానే.. ఛీ అని అనుకుంటాంగానీ.. ఈ రోజుల్లో మొబైల్ ఛార్జింగ్ మొదలుకొని హైడ్రోజన్ ఉత్పత్తి వరకూ రకరకాలుగా వాడుకుంటున్న విషయం తెలిసిందే. కేప్‌టౌన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల పుణ్యమా అని ఇప్పుడీ జాబితాలోకి బయో కాంక్రీట్ కూడా వచ్చి చేరింది. సముద్రతీరంలో దొరికే పెంకులు ఉంటాయి చూశారు.. అచ్చం అలాగే ఈ బయో కాంక్రీట్‌ను తయారు చేయవచ్చు. అంతేకాదు.. అవసరాన్ని బట్టి ఎంత దృఢంగా ఉండాలో కూడా మనమే నిర్ణయించుకుని అందుకు తగ్గట్టుగా బయో కాంక్రీట్ ఇటుకలను తయారు చేసుకోవచ్చునని అంటున్నారు డైలన్ రాండల్. ప్రత్యేకమైన బ్యాక్టీరియా, కొంత ఇసుక, మానవ మూత్రాలను ఉపయోగించడం ద్వారా ఈ బయో కాంక్రీట్ తయారవుతుంది. ఈ ప్రత్యేక బ్యాక్టీరియా ఇసుక రేణువులను గుళికలుగా మారుస్తుంది. ఆ తరువాత యూరేజ్ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది. మానవ మూత్రం తాకినప్పుడు ఈ యూరేజ్ కాస్తా యూరియాగా మారిపోతుంది. అదే సమయంలో ఈ రసాయన చర్య కాస్తా కాల్షియం కార్బొనేట్ ఏర్పడేందుకు కారణమవుతుంది. ఈ పదార్థాన్ని అచ్చుల్లో పోస్తే ఇటుకలు తయారవుతాయి. ఈ ప్రక్రియ మొత్తం గది ఉష్ణోగ్రతలోనే జరగడం వల్ల ఇటుకలు కాల్చేందుకు ఉపయోగించే ఇంధనం మొత్తాన్ని ఆదా చేయవచ్చునని డైలన్ వివరించారు. అంతేకాకుండా.. మానవ మూత్రంలోని పొటాసియం, నైట్రోజన్ ఫాస్పరస్‌లను ఎరువులుగా వాడుకునేందుకూ ఈ ప్రక్రియ అవకాశం కల్పిస్తుందని వివరించారు. మరింత స్పష్టమైన ఎక్స్‌రేలు... టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. మనిషి లోపలి వ్యవహారాల గురించి తెలుసుకునేందుకు ఇప్పటికీ ఎక్స్రేలే చౌకైన మార్గం. అయితే వీటితో కొన్ని చిక్కులున్నాయి. చిత్రాల స్పష్టత కొంచెం తక్కువ. అదే సమయంలో రేడియోధార్మికత ముప్పు కొంత ఉంటుంది. ఈ రెండు సమస్యలను అధిగమించడంలో సింగపూర్‌లోని నేషనల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు విజయం సాధించారు . నానోస్థాయి స్ఫటికాలను ఉపయోగించడం ద్వారా ఎక్స్‌రే స్పష్టతను పెంచడమే కాకుండా.. రేడియోధార్మికత మోతాదును తగ్గించగలిగారు కూడా. సంప్రదాయ ఎక్స్‌రే యంత్రాల్లో ఎక్స్‌రే శక్తిని దృశ్య కాంతిగా మార్చేందుకు స్ఫటికాల్లాంటివి వాడతారు. సైంటిలేటర్లు అని పిలిచే ఈ స్ఫటికాలను అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద తయారు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వీటికి ప్రత్యామ్నాయంగా లెడ్ హాలైడ్ పెరోవిస్కైట్ నానో స్ఫటికాలు తయారయ్యాయి. వీటి వాడకం వల్ల ఎక్స్‌రేల నాణ్యత పెరగడంతోపాటు దుష్ప్రభావం తగ్గుతుందని చెన్ ఖుయిషూయి అంటున్నారు. -
భారతీయుడి నమ్మకమే ‘పార్కర్‌కు’ పునాది
న్యూఢిల్లీ: 60 ఏళ్ల క్రితం సౌర గాలులు ఉన్నాయంటూ పార్కర్ ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని భారత సంతతి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ గుర్తించకుం టే తాజా ప్రయోగం సాకారమయ్యేదే కాదు. సూర్యుడి నుంచి ఆవేశపూరిత కణాలు నిరంతరం అంతరిక్షంలోకి ప్రసారమవుతూ.. అక్కడి ప్రాంతాన్ని నింపుతున్నాయని 1958లో పార్కర్ గుర్తించారు. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి విశ్లేషణలతో కూడిన థియరీ పేపర్‌ను ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌కు సమర్పించారు. అయితే, ఇద్దరు పరిశోధకులు దీనిని తిరస్కరించారు. దీనికి కారణం అంతరిక్షాన్ని కేవలం శూన్య ప్రదేశంగా భావించే రోజులవి. అయితే ఆ సమయంలో జర్నల్‌కు సీనియర్ ఎడిటర్‌గా ఉన్న చంద్రశేఖర్.. పార్కర్ సిద్ధాంతాన్ని పబ్లిష్ చేయాలని నిర్ణయించారు. చంద్రశేఖర్ ఆ నిర్ణయం తీసుకోకుంటే ఈ ప్రయోగం జరిగేది కాదని ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ సోలార్ స్టెల్లార్ ఎన్విరాన్మెంట్కు చైర్మన్‌గా పనిచేస్తున్న నంది వెల్లడించారు. నక్షత్రాల నిర్మాణ, పరిమాణ క్రమంలో భౌతిక ప్రక్రియల ప్రాముఖ్యతపై చేసిన పరిశోధనలకు గాను 1983లో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతిని విలియమ్ ఏ ఫోలర్తో కలసి సంయుక్తంగా ఆయన అందుకున్నారు. అలాగే చంద్రశేఖర్ సేవలకు గుర్తుగా 1999లో చంద్రశేఖర్ పేరుతోనే ‘చంద్ర ఎక్స్ రే అబ్జర్వేటరీ’అనే అంతరిక్ష ప్రయోగాన్ని నాసా చేపట్టింది. -
రంగుల ఎక్స్‌రే...
వైద్యం ఎంతో అభివృద్ధి చెందింది అనుకున్న ఈ కాలంలో కూడా ఎక్స్‌రే నలుపు తెలుపుల్లోనే ఉండటం ఏమిటని మీకెప్పుడైనా అనిపించిందా? త్వరలోనే ఈ పరిస్థితి మారిపోనుంది. శరీరం లోపలి భాగాలను రంగుల్లో చూసుకునేందుకు రంగం సిద్ధమైంది. మార్స్ బయో సెన్సింగ్ అనే న్యూజిల్యాండ్ కంపెనీ పరిశోధనల పుణ్యమా అని అందుబాటులోకి రానున్న త్రీడీ స్కానర్ ఎముకలు, కండరాలతో పాటు కొవ్వులను కూడా రంగుల్లో చూపుతుంది. స్విట్జర్లాండ్ సరిహద్దుల్లోని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయోగశాల సీఈఆర్ఎన్ శాస్త్రవేత్తలు ఈ స్కానర్ కోసం ప్రత్యేకమైన మైక్రోప్రాసెసర్‌ను తయారు చేయడం విశేషం. సంప్రదాయ సీటీ స్కాన్ల ద్వారా శరీరం లోపలికి ఎక్స్‌రే కిరణాలు ప్రసరించినప్పుడు దాని తీవ్రతలో వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా ఎక్స్‌రే తయారవుతుంది. ఎముకల గుండా ప్రయాణించినప్పుడు శక్తి తగ్గిపోతుంది కాబట్టి ఆ ప్రాంతం తెల్లగానూ, తగ్గని కండరాల ప్రాంతం నల్లగానూ ఉంటుందన్నమాట. ఇలా కాకుండా లోపలి పదార్థాన్ని బట్టి తగు తరంగ దైర్ఘ్యమున్న కిరణాలను పంపగల స్పక్ట్రల్ స్కానర్లను వాడటం ద్వారా మార్స్ బయో సెన్సింగ్ కలర్ ఎక్స్‌రే యంత్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఓ నమూనా యంత్రాన్ని విజయవంతంగా పరీక్షించిన ఈ కంపెనీ త్వరలోనే దీన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
ఎక్స్‌రే గదికి తాళం!
ఇబ్రహీంపట్నంరూరల్ : యాచారం మండల కేంద్రానికి చెందిన మేరాజ్‌అంజూ అనే మహిళా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. ఎక్స్‌రే ఎక్కడ తీస్తారని సాధారణ రోగులను అడగడంతో మాకు తెలియదని చెప్పారు. ఆమెకు ఎదురుగా ఓ నర్సు వచ్చి ఇక్కడ ఎక్స్‌రే మిషన్ ఉంది కానీ ఎక్స్‌రే తీసే వారు లేరని వ్యంగంగా సమాధానం ఇచ్చింది. ప్రజా వైద్యంపై నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయానికి ఇది నిలువెత్తు నిదర్శనం. బాధ్యతాయుతంగా నడుచుకోవాల్సిన సిబ్బంది రోగులను, ప్రభుత్వాన్ని అబాసుపాలు చేసేలా వ్యవహరిస్తున్నారు. ఆరునెలలుగా వేసిన తాళం తీయ్యలే... ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మండలాలతో పాటు ఇతర ప్రజలకు పెద్ద దిక్కైన పెద్దాస్పత్రి ఇబ్రహీంపట్నం ప్రభుత్వ దవాఖాన. ప్రజలకు నిరంతరం సేవలందిండచానికి గతంలో జిల్లా కలెక్టర్‌గా పని చేసిన వాణిప్రసాద్ చొరవతో పాత పెద్దాస్పత్రి బాగుపడింది. సకల సౌకర్యాలతో ఆదర్శ ఆస్పత్రిగా తీర్చిదిద్దితే మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంలాగా తయారైంది. అప్పట్లో అన్ని విభాగాలు పని చేసే విధంగా ఎక్స్‌రే మిషన్ తీసుకొచ్చి పెట్టారు. గతంలో డిజిటల్ ఎక్స్‌రే లేకపోవడంతో సంవత్సర కాలంగా రూ.లక్షల్లో వెచ్చించి డిజిటల్ ఎక్స్‌రే ఏర్పాటు చేశారు. పట్టుమని పది కాలాలు గడవక ముందే ఎక్స్‌రే గదికి తాళం వేశారు. శామీర్‌పేట్ నుంచి డిప్యూటేషన్ విధానంతో ఇబ్రహీంపట్నంలో విధులు నిర్వర్తించేవారు. జిల్లాల విభజన తర్వాత మేడ్చెల్‌కు కేటాయించడంతో వారు తిరిగి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆరు నెలల కాలంగా ఇబ్రహీంపట్నం ఎక్స్‌రే యంత్రానికి అతిగతి లేకుండా పోయింది. పేద ప్రజలకు ఎక్స్‌రేలు తీసేవారు కరువయ్యారు. ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే రూ.200–600 వరకు తీసుకుంటారు. పేదలకు ప్రభుత్వ ఆస్పత్రి దిక్కవుతుందని అనుకుంటే టెక్నిషియన్ కొరత తీరడం లేదని వాపోతున్నారు. నిత్యం 600నుంచి 1000 రోగుల వచ్చే ప్రభుత్వఆస్పత్రికి వెంటనే ఎక్స్‌రే టెక్నిషియన్ మంజూరు చేయాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేస్తాం స్థానిక ఆస్పత్రిలో ఇన్నాళ్లుగా ఎక్స్‌రే తీయడానికి ఆపరేటర్ లేకపోవడం చాలా బాధకరం. రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల నిర్వహణకు అధిక నిధులు కేటాయిస్తుంది. ఆస్పత్రి యాజమాన్య కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వెంటనే సమస్య పరిష్కరం అయ్యేలా చూస్తాం. పేద ప్రజలకు ఇలాంటి సమస్యలు మళ్లి పునరావృత్తం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆరోగ్యశాఖదే.– జెర్కొని రాజు, ఇబ్రహీంపట్నం -
హైపర్ అసిడిటీ తగ్గుతుందా?
నా వయసు 35 ఏళ్లు. ఉద్యోగరీత్యా మార్కెటింగ్ జాబ్‌లో ఉన్నాను. తరచూ ప్రయాణాలు చేస్తుంటాను. కడుపులో నొప్పి, వికారంగా ఉంటున్నాయి. సమయానికి భోజనం తీసుకోకపోతే బాధ పెరిగిపోతోంది. తీసుకున్న తర్వాత పుల్లటి లాలాజలం ఊరుతూ ఉంటుంది. హోమియోలో ఏదైనా పరిష్కారం చెప్పండి. – రమేశ్, ఏలూరు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు హైపర్ అసిడిటీతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మనం ఆహారం వేళకు తీసుకోనప్పుడు పైన మీరు చెప్పిన లక్షణాలతో పాటు అజీర్తి, ఛాతీలో మంట వంటి లక్షణాలతో ఇది కనిపిస్తుంది. హైపర్ అసిడిటీ అన్నది సాధారణంగా మన కడుపులో యాసిడ్ ఎక్కువగా స్రవించడం వల్ల వస్తుంటుంది. మన కడుపులో హైడ్రోక్లోరిక్ ఆమ్లం విడుదల వల్ల మనకు స్టమక్ అల్సర్స్, యాసిడ్ రిఫ్లక్స్ డిసీజ్, స్టమక్ క్యాన్సర్ వంటివి కూడా కనిపించే అవకాశం ఉన్నా ఇంత తీవ్రతతో కనిపించే పై వ్యాధులు కాస్త అరుదుగా వస్తాయి. కారణాలు: మానసిక ఒత్తిడి ఎక్కువగా టీ, కాఫీలు తాగడం నిద్రలేమి స్థూలకాయం ఎక్కువగా మసాలాలు తీసుకోవడం జంక్‌ఫుడ్, ఆల్కహాల్ అధిక ఆందోళన ఎక్కువ మోతాదులో కారం, మిర్చి తీసుకోవడం వల్ల శీతల పానీయాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల లక్షణాలు: ఛాతీలో, గొంతులో మంట కడుపునొప్పి తేన్పులు చెమటలు పట్టడం కోపం, చిరాకు విరేచనాలు నీరసం అధిక దాహం ఔ ఆయాసం వ్యాధి నిర్ధారణ: ఎక్స్–రే రక్తపరీక్షలు మూత్ర పరీక్ష ఎండోస్కోపీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ జాగ్రత్తలు: స్వచ్ఛమైన, శుద్ధమైన ఆహారం సరైన సమయానికి తీసుకోవడం n అతిగా నూనె, మసాలా పదార్థాలు తీసుకోకుండా ఉండటం చికిత్స: హైపర్ అసిడిటీ సమస్యకు హోమియోలో అద్భుతమైన పరిష్కారం ఉంది. శరీర తత్వాన్ని బట్టి, కారణాలను బట్టి కాలేయ జీర్ణకోశాలను సరిచేస్తూ హైపర్ అసిడిటీకి మంచి మందులను వైద్యులు సూచిస్తారు. హోమియోలో నక్స్‌వామికా, యాసిడ్ సల్ఫ్, చైనా, లైకోపోడియమ్, పల్సటిల్లా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. -
మణికట్టులో నొప్పి...
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 30 ఏళ్లు. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిగా వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. పరిష్కారం చెప్పండి. - చంద్రశేఖర్, విజయవాడ మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. నా వయసు 58 ఏళ్లు. నేను గత ఐదేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. నేను ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని డాక్టర్ చెప్పారు. గత కొంతకాలంగా క్యాల్షియమ్ ఇస్తున్నారు. అయినా నాకు నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. అప్పట్నుంచి చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. రమాసుందరి, నిడదవోలు ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇచ్చే మందుల్లో భాగంగా ఆయన క్యాల్షియమ్‌ను సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా...‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు మరోసారి మీ డాక్టర్ గారిని సంప్రదించండి. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, హైదరాబాద్ పంచకర్మ చికిత్స... ఆయుర్వేద కౌన్సెలింగ్ పంచకర్మ చికిత్సలతో చాలా రకాల (సాధారణంగా మందులతో పూర్తిగా నయం కాని పక్షవాతం, సెరెబ్రల్పాల్సీ, సెరిబెల్లార్ అటాక్సియా, పార్కిన్సోనిజం వంటి) వ్యాధులను నయం చేయవచ్చని విన్నాం. పంచకర్మ అంటే ఏమిటో వివరించండి. - సుచిత్ర, విశాఖపట్నం ఐదు విశిష్టమైన ప్రత్యేక చికిత్స ప్రక్రియల్ని ‘పంచకర్మలు’గా ఆయుర్వేదం వర్ణించింది. అవి ‘వమన, విరేచన, నస్య, వస్తి, రక్తమోక్షణ’ ప్రక్రియలు. సుశ్రుతాచార్యుడు చెప్పిన రక్తమోక్షణకు బదులుగా ‘వస్తి’ కర్మలోనే రెండు రకాలు చెప్పాడు చరకమహర్షి (అనువాసనవస్తి, నిరూహవస్తి). వీటినే శోధన కర్మలని కూడా అంటారు. అంటే శరీరాన్ని శుద్ధిచేయటానికి ఉపకరిస్తాయన్నమాట. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా సందర్భోచితంగా వీటిని ఆచరించుకోవచ్చు. దాని వల్ల దేహదారుఢ్యం కలిగి, మానసిక ఉల్లాసంతో, పంచజ్ఞానేంద్రియ పటుత్వంతో సంపూర్ణ ఆయుష్కుడుగా జీవిస్తాడు. అదేవిధంగా వ్యాధి లక్షణాలన్ని తాత్కాలికంగా తగ్గించే శమన చికిత్సలతో బాటు, అవసరమైన పంచకర్మల్ని చేస్తే వ్యాధి సంపూర్ణంగా తగ్గిపోవడానికి దోహదపడుతుంది. ఇదీ శోధన కర్మకి అర్థం. అయితే ఏ వ్యాధి ఎంత మేరకు తగ్గుతుందన్నది వ్యాధి లక్షణాలు, రోగబలం, రోగి బలం, ఉపద్రవాస్థలపై ఆధారపడి ఉంటుంది. ఏ వ్యక్తికి, ఏ రోగంలో, ఏ విధమైన పంచకర్మ చేయాలో నిర్ణయించడం, కేవలం అనుభజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులకు మాత్రమే సాధ్యం. చాలా సహేతుకంగా, శాస్త్రబద్ధంగా ఆచరింపజేయాలి. లేకపోతే ప్రాణాలకు కూడా ప్రమాదకరం. వీటికి ముందుగా చేసే పూర్వకర్మలు (స్నేహస్వేదకర్మలు, ఆయిల్ మసాజ్, స్టీమ్‌బాత్), పంచకర్మ అనంతరం చేసే పశ్చాత్ కర్మల (జఠరాగ్నివర్ధక, బలవర్ధక ఆహారవిహారాల) గురించి ఎంతగానో వివరించింది ఆయుర్వేదం. అదేవిధంగా ధారాచికిత్స, శిరోవస్తి, కటివస్తి, గ్రీవావస్తి, ఉత్తరవస్తి మొదలగు వాటి వల్ల చాలా ప్రయోజనాలు సమకూరుతాయి. ఉదాహరణకు నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి, స్పాండిలైటిస్, కీళ్లనొప్పులు, కండరాల వ్యాధులు, సంతానలేమి, శుక్రకణ క్షీణత మొదలైన వికారాలలో పైన పేర్కొన్న చికిత్స మార్గాల ద్వారా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే పైన చెప్పిన స్నేహ, స్వేదకర్మలనే (పూర్వకర్మలు) పంచకర్మలని భావిస్తుంటారు. కానీ అది సరికాదు. ఇవి కూడా మంచి ఫలితాలనిస్తాయి. వస్తి కర్మ : మలమార్గంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్కి ఏ ద్రవ్యాన్నైనా అతివేగంగా పీల్చుకునే శోషణ క్రియా సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ మార్గం ద్వారా కొన్ని ఔషధ తైలాలని, కషాయాలని... క్రమబద్ధంగా ప్రవేశపెట్టడాన్ని వస్తికర్మ అంటారు. ఈ మందుల్ని లోనికి పంపడానికి, ప్రాచీనకాలంలో ఒక పరికరం వాడుతుండేవారు. అది మేక తాలూకు ‘మూత్రాశయం’. (యూరినరీ బ్లాడర్‌ను సంస్కృతంలో ‘వస్తి’ అంటారు. అందువల్ల ఈ ప్రక్రియకు వస్తికర్మ అని పేరు పెట్టారు). వాతరోగాలకు వస్తికర్మ అద్భుతమైన చికిత్స. పిత్తరోగాలలో ‘విరేచన కర్మ’, కఫరోగాలకు ‘వమనకర్మ’ లను పేర్కొన్నారు. మీరు ఉదాహరించిన పక్షవాతం, పార్కిన్సోనిజం, సెరెబెల్లార్ ఎటాక్సియా మొదలైనవి ఆయుర్వేద శాస్త్రం వాతరోగాలుగా పరిగణించింది. వీటిలో కేవలం మందులకు అంతగా గుణం కనిపించదు. వస్తికర్మను, సుశిక్షితుడైన ఆయుర్వేద నిపుణులు శాస్త్రోక్తంగా (అంటే పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మలను... ప్రీఆపరేటివ్, ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్) అమలు చేస్తే చాలావరకు మంచి ఫలితాలతో గుణం కనిపిస్తుంది. ఏదిఏమైనా, వస్తికర్మని నెలలో వారం రోజుల పాటు, కనీసం, ఆరునెలల నుంచి ఒక ఏడాది వరకు ప్రయోగించాల్సిన అవసరం ఉండవచ్చు. కాబట్టి ఇది చేయించుకోవాలంటే రోగికి అవగాహన, సహనం, ఆశావహదృక్పథం చాలా అవసరం. వీటితో బాటు ఆహార, విహార, వ్యాయామాలు, కొన్ని ఔషధాలు కూడా వైద్యుడు నిర్ణయిస్తాడు. అప్పుడే సరైన ఫలితం కనిపిస్తుంది. గమనిక : పంచకర్మలు సునాయాసంగా తమకు తాముగా ఆచరించే చికిత్సలు కావు. ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలోనే చేయాల్సిన చికిత్సలవి. డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రిఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ మంచి నిద్రకోసం చేయాల్సినవి... స్లీప్ కౌన్సెలింగ్ ఈమధ్య నాకు నిద్ర బాగా తగ్గింది. రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. టాబ్లెట్లు వాడకుండా నేచురల్‌గానే నిద్రపట్టే మార్గాలు చెప్పండి. - శరత్‌కుమార్, ఒంగోలు రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి. బెడ్రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. సాయుంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకండి. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి. {పతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి. పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. పగలు వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు. గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోరుున రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
గొంతులో ఉన్నదేమిటి?
‘సాక్షి’ చేతికి శశికుమార్ పుర్రె ఎక్స్‌రే గొంతులో కనిపిస్తున్న బంతిలాంటి వస్తువు విశాఖపట్నం: ఏఎస్పీ శశికుమార్ మృతిలో సంచలనం కలిగించే అత్యంత కీలక ఆధారం ‘సాక్షి’ సేకరించింది. శశికుమార్‌ని హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారనేందుకు బలం చేకూర్చే ప్రధాన సాక్ష్యంగా మారే అవ కాశం ఉంది. అటు ప్రభుత్వం, ఇటు ఉన్నతాధికారులు ఏదో రహస్యాన్ని దాస్తున్నారని ముందే పసిగట్టిన ‘సాక్షి’ ఆ దిశగా అడుగులు వేసింది. అత్యంత లోతుగా చేసిన పరిశోధనలో శశికుమార్ పుర్రె ఎక్స్‌రేలు సంపాదించింది. శవ పరీక్షకు ముందు ఫోరెన్సిక్ నిఫుణులు శశికుమార్ మృతదేహంపై గాయాలను పరిశీలించారు. అతని తలపై గాయం ఉండటంతో పుర్రెను ఎక్స్‌రే తీయించారు. సాధారణంగా శవ పరీక్షలకు ముందు ఎక్స్‌రే తీసే సంప్రదాయాన్ని ఫోరెన్సిక్ వైద్యులు పెద్దగా పట్టించుకోరు. కానీ శశికుమార్ మరణం అనుమానాస్పదం కావడంతో ముందు జాగ్రత్త చర్యగా ఎక్స్‌రే తీశారు. దీన్ని చూసిన తరువాత మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి . శశికుమార్ కంఠముడి(గొంతు)లో ఒక బంతి వంటి వస్తువేదో ఉన్నట్లు ఈ ఎక్స్‌రేలో స్పష్టంగా కనిపిస్తోంది. అతను చనిపోవడానికి ముందు మాట బయటకు రాకుండా ఆ వస్తువును గొంతులో కుక్కినట్లు అనిపిస్తోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. రిపోర్ట్‌ను రహస్యంగా నమోదు చేశారు. అదే విధంగా శశికుమార్ పుర్రెపై అనేక పగుళ్లు ఉన్నట్లు ఎక్స్‌రేలో వెలుగుచూసింది. బుల్లెట్ వల్లే అలా జరిగిందా లేక తలపై వేరే బలమైన ఆయుధంతో కొట్టడం వల్ల పుర్రె పగిలిందా అనేది తేలాల్సి ఉంది. -
చిన్నపేగుల్లో అల్సర్... మందులతో తగ్గుతుంది
హోమియో కౌన్సెలింగ్ నాకు కొంతకాలంగా మోచేతి నొప్పి వస్తోంది. చిన్న బరువును కూడా ఎత్తలేకపోతున్నాను. ఎక్స్‌రే తీయిస్తే, ఇది టెన్నిస్ ఎల్బో అన్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? - ఎస్వీఆర్, గుంటూరు టెన్నిస్ ఎల్బో అన్న మాట వినగానే ఇది క్రీడాకారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యగా అనుకుంటారు. క్రీడాకారులకేగాక చాలామంది మోచేతితో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యలు చూస్తుంటాము. ఇది కొన్ని భంగిమలలో పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి తీవ్రంగా ఉంటుంది. కొన్ని పరిశోధనలలో తేలిన విషయమేమిటంటే, ఈఎల్ఆర్బీ అనే కండరం బలహీనపడటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 30 నుంచి యాభై సంవత్సరాల వారికి వస్తుంది. టెన్నిస్ ఎల్బో పార్శ్వ మోచేతి ముడుకు శోధను ల్యాటరల్ ఎపికాన్ డైలిటిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా నలభై నుండి 60 ఏళ్ల వయసు వారికి వస్తుంది. ఇది మోచేతి చుట్టూ నొప్పిని కలిగిస్తుంది. మోచేతి ఎముక భాగం బయట నొప్పిని కలిగిస్తుంది. ఇది ఎక్కువగా కుడిచేతిని వాడే వారిలో వస్తుంది. ఒక్కోసారి రెండు మోచేతుల్లోనూ సంభవించవచ్చు. ఎల్బో సాధారణంగా క్రీడాకారులకు, వెయిట్‌లిఫ్టింగ్‌లో పాల్గొనేవారికి, కార్పెంటింగ్ పనులు చేసేవారికి, పెయింటర్లకు, రోడ్డు నిర్మాణ కార్మికులకు, అల్లికల పని చేసేవారికి, చెఫ్‌లకు, వెయిటర్లకు వస్తుంది. టెన్నిస్ క్రీడాకారుల్లోనే కాకుండా రిపీటెడ్ మూవ్మెంట్స్ ఎక్కువగా చేసేవారిలో కనిపిస్తుంది. కారణాలు: టెన్నిస్ రాకెట్‌తో ఆడటం, ఎక్కువ బరువులు ఎత్తటం, కార్పెంటింగ్ పని చేయడం, టైపింగ్ ఎక్కువగా చేయటం, రోడ్డు నిర్మాణ పనులు చేయడం. లక్షణాలు: మోచేయి చుట్టూ నొప్పి, చేతులు వణకటం, చేయి కింది నుంచి పై వరకు తీవ్రమైన నొప్పి, కొన్ని వస్తువులు (కత్తి, ఫోర్క్, టూత్‌బ్రష్ వంటివి) మోచేతిలో నొప్పి, బలంగా డబ్బా మూతలు తెరిచినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు నిర్ధారణ: ఎక్స్‌రే, ఎమ్మారై, రక్తపరీక్షలు, ఈఎంజీ హోమియో చికిత్స: హోమియోపతిలో టెన్నిస్ ఎల్బోకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి, వైద్యులు అందుకు తగిన మందులను సూచిస్తుంటారు. దీనికి సాధారణంగా ఆర్నికా యెన్టానా, బెల్లడోనా, బ్రయోనియా, ఫెరమ్ ఫాస్పారికమ్, కాల్మియా ల్యాటిఫోలియా, రస్ టాక్సికోడెన్, రస్టాక్సికోడెన్ డ్రావ్, సాన్గునేరియా, సల్ఫర్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. వీటితోపాటు ఫిజియోథెరపీ కూడా చేయిస్తే మంచిది. తద్వారా టెన్నిస్ ఎల్బోకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 28 ఏళ్లు. నా కళ్లు చిన్నప్పట్నుంచీ పచ్చగా ఉంటాయి. మా దగ్గరలోని డాక్టర్‌కు చూపిస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డామినల్ స్కానింగ్ చేయించి, ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. పుట్టుకతోనే కళ్లు పచ్చగా ఉన్నాయి. వాటి వల్ల సమస్య ఏమీ ఉండదని చెప్పారు. నిజమేనా? భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదంటారా? - జలజ, ఈ-మెయిల్ మీరు ‘గిల్బర్ట్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారిలో కామెర్ల శాతం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు కామెర్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు కామెర్లు ఎక్కువ కావడం, ఆ తర్వాత వాటంతట అవే తగ్గడం జరుగుతుంటుంది. ఒక్కోసారి కామెర్లు 5 ఎంజీ/డీఎల్ వరకూ వెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా రాదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు. నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా నాకు కడుపులో మంట, నొప్పి వస్తోంది. ఒక నెల రోజులుగా వాంతులు కూడా అవుతున్నాయి. ఎండోస్కోపీ చేయించుకుంటే చిన్నపేగుల్లో అల్సర్ ఉందని చెప్పారు. నేను ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేక నా సమస్య మందులతో తగ్గుతుందా తెలియజేయగలరు. - సుధాకర్, శ్రీకాకుళం మీరు చెప్పిన లక్షణాలు ‘క్రానిక్ డియోడినల్ అల్సర్’ అనే వ్యాధితో బాధపడుతున్నవారిలో కనిపిస్తాయి. ఈ అల్సర్ సాధారణంగా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. దీన్ని పూర్తిగా నశింపజేయడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు... ఈ మందుల వల్ల మళ్లీ మళ్లీ అల్సర్ వచ్చే అవకాశాలతో పాటు అల్సర్ వల్ల వచ్చే ఇతర సమస్యలూ తగ్గుతాయి. ఎండోస్కోపీలో చిన్నపేగుల్లోని దారి మూసుకుపోయినట్లయితే ఈ చికిత్స ద్వారా అది తగ్గుతుంది. ఆపరేషన్ అవసరం లేదు. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మందులు వాడితే సరిపోతుంది. డాక్టర్ భవానీరాజు సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ కేర్ హాస్పిటల్స్ బంజారాహిల్స్ హైదరాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సుదర్శన్ రావు, నిడదవోలు మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్ఓఎమ్ఏ-ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది. బరువు తగ్గించుకోవడం జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... ఆర్బుటిన్ - లికోరైస్ - కోజిక్ యాసిడ్ పైన పేర్కొన్న మందులతో పాటు క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి. యాభైకు ఎక్కువగా ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాన్నం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి. ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్స్యూల్ వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్ఫార్మిన్ -500ఎంజీ ప్రతిరోజూ వాడాలి. ఇతర ప్రక్రియలు: ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 - 6 సెషన్ల పాటు చేయించుకోవాలి లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
ఎన్నాళ్లీ నిర్లక్ష్యం
సాక్షి, గుంటూరు: జిల్లాలో వ్యాధి నిర్ధారణకు ఏర్పాటు చేసే రక్త పరీక్ష కేంద్రాలు, ఎక్స్‌రే, స్కానింగ్ సెంటర్లు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని లెసైన్స్ కలిగి ఉండాలి. పెరుగుతున్న వ్యాధులకు సమానంగా పరీక్ష కేంద్రాలు పుట్టుకొచ్చాయి. మండల కేంద్రాలతోపాటు, గ్రామాల్లో కూడా వెలుస్తున్నాయి. ఇవి రోగులకు అందుబాటులో ఉంటున్నా వైద్య, ఆరోగ్య శాఖ నిబంధనలకు విరుద్ధంగా లెసైన్స్‌లు లేకుండా నిర్వహించడమే ప్రాణాంతకంగా మారుతున్నాయని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ల్యాబ్‌లు, ఎక్స్‌రే సెంటర్లు ఏర్పాటు చేయాలంటే సంబంధిత పారామెడికల్ కోర్సులు పూర్తిచేసి సర్టిఫికెట్ పొందాలి. ఆ తరువాతే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి లెసైన్స్ మంజూరు చేస్తారు. లెసైన్స్ ఫీజుతోపాటు అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పాల్సి రావడంతో వ్యయం ఎక్కు వ అవుతుందని భావిస్తున్న అనేక మంది అనుమతుల జోలికి వెళ్లడం లేదు. మరి కొందరు వేరొకరి సర్టిఫికెట్తో లెసైన్స్ పొంది అర్హత లేని వ్యక్తులతో పరీక్షలు చేయిస్తున్నారు. వ్యాధి నిర్ధారణలో వైద్య పరీక్షలు కీలకంగా మారిన తరుణంలో అర్హత లేని వ్యక్తులు ఇస్తున్న రిపోర్టులు ఏ మేరకు వాస్తవమనేది ఆలోచించాల్సిన విషయమే. అర్హత లేకుండా తప్పుడు నివేదికలు ఇవ్వడం వల్ల సరైన వైద్యం అందక రోగులు మరణిస్తున్న సందర్భాలు ఉన్నాయని వైద్యులే అంగీకరిస్తున్నారు. మెడికల్ దుకాణాలు ఇంతే.. మెడికల్ షాపులు సైతం లెసైన్స్ లేకుండా నడుస్తున్నాయి. మరికొందరు వేరేవారి బీఫార్మ్సీ సర్టిఫికెట్తో లెసైన్స్ సంపాదించి ఎలాంటి అర్హత లేని నలుగురు యువకులను నియమించుకుని వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. డాక్టర్లు రాసిన మందులు అర్థంకాక చేతికొచ్చినవి ఇచ్చి పంపుతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. రోగాలు తగ్గడం మాట అటుంచి కొత్త రోగాలు వస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు. మామూళ్లు అందుకుంటూ... జిల్లాలో లెసైన్స్‌లు లేని ల్యాబ్‌లు, ఎక్స్‌రే కేంద్రాలు, మెడికల్ షాపులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నప్పటికీ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, ఔషధ నియంత్రణ శాఖ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏదోఒక సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి చేతులు దులుపుకోవడం వీరికి పరిపాటిగా మారిందనే విమర్శలు వినవస్తున్నాయి. నెలనెలా మామూళ్లు వసూలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోకుండా మిన్నకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అధికారులే మామూళ్లు తీసుకుంటూ, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే ఇక తమగోడు ఎవరికి చెప్పుకోవాలంటూ రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటే రోగుల ప్రాణాలు నిలిపిన వారవుతారు. -
మెడకు బదులుగా...మనిషే తిరగాల్సి వస్తే!
బహుశా మనలో చాలామందికి తలకు- దేహానికి మధ్య మెడ అనే కీలకమైన భాగం ఉందనే విషయం పెద్దగా గుర్తుండదు. మెడకు ప్రాధాన్యత కూడా తక్కువే. సర్వైకల్ స్పాండిలోసిస్ వంటి సమస్య ఏదో వచ్చి, తల తిప్పాల్సి వచ్చినప్పుడు ఆ పని సాధ్యం కాక మనిషి తిరగాల్సి వచ్చినప్పుడు మెడ ఎంత కీలకమైనదో తెలిసి వస్తుంది. దీనికి చికిత్స సులభమే కానీ దానికి ముందు ఒక నిర్ధారణకు రావడానికి కొన్ని పరీక్షలు అవసరమవుతాయి. ప్రాథమికంగా ఎక్స్-రే తీస్తారు. ఇందులో మెడ ఎముక ఒక చోట ములుకులా పొడుచుకురావడం, లేదా ఎముకకు సంబంధించి ఇతర అపసవ్యతలు తలెత్తినా తెలుసుకోవచ్చు. ఎక్స్-రే ద్వారా కచ్చితంగా నిర్ధారించలేని సందర్భాలలో కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ స్కాన్ (సి.టి. స్కాన్) ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు మాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా నరాల స్థానాల్లో వెంట్రుక వాసి తేడా వచ్చినా కూడా స్పష్టంగా తెలుస్తుంది మైలోగ్రామ్ పరీక్షలో ఇంజక్షన్ ద్వారా రంగును వెన్నులోకి పంపించి ఆ తర్వాత సి.టి స్కాన్ లేదా ఎక్స్-రే పరీక్షలు చేస్తారు. రంగు విస్తరించడంతో ఏర్పడిన ఆకారాన్ని బట్టి వెన్నుపూసలలో వచ్చిన తేడాను తెలుసుకుంటారు. మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి వస్తే నరాల పనితీరును కూడా పరీక్షిస్తారు. వీటిలో... ఎలక్ట్రో మయోగ్రామ్ (ఇఎమ్జి) పరీక్ష ద్వారా కండరాలకు కొన్ని సంకేతాలను పంపించి నరాల స్పందనను అధ్యయనం చేస్తారు. దాంతో నరాల పనితీరు సాధారణంగానే ఉందా, తేడా ఉందా అనే వివరాలు తెలుస్తాయి. చికిత్స: నొప్పి నివారణకు, నరాలు శక్తిమంతం కావడానికి మందులు వాడుతూ ఫిజియోథెరపీ (మెడకు వ్యాయామం) చేస్తే సమస్య తగ్గిపోతుంది. చాలా కొద్ది సందర్భాలలో శస్త్రచికిత్స అవసరమవుతుంది. -
కీళ్లు కదలకపోతే...
నిర్ధారణ! కీళ్ల నొప్పులు, కదిలించినప్పుడు టకటకమని విరిగినట్లు శబ్దం రావడం లేదా కిర్రుమని ఒకదానికొకటి రాసుకుంటున్నట్లు శబ్దం రావడం, ఎముకలో వాపు, కీళ్ల దగ్గర నీరు చేరడం, కీళ్ల కదలికలు కష్టంగా అనిపించడం, కీళ్ల దగ్గర కండరం సన్నబడిపోవడం, కీళ్లు బలంగా లేక బరువు మోపడానికి ధైర్యం చాలకపోవడం వంటి లక్షణాలు అన్నీ కానీ, కొన్ని కానీ ఉంటే ఆస్టియో ఆర్థరైటిస్‌గా గుర్తిస్తారు. ఈ లక్షణాలు కనిపించినప్పటికీ దానిని నిర్ధారించడానికి కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఎక్స్‌రే: ఇది ఆస్టియో ఆర్థరైటిస్‌ను నిర్ధారించడానికి చేసే తొలి పరీక్ష. ఈ పరీక్ష ద్వారా ఎముక ములుకులా ఏర్పడడం, రెండు ఎముకల మధ్య ఖాళీ తగినంత లేక ఎముకలు దగ్గరగా జరగడం, కీళ్లలో క్యాల్షియం నిక్షిప్తమై ఉండడం వంటి ప్రాథమిక అంశాలను తెలుసుకోవచ్చు. ఎంఆర్ఐ స్కాన్: దీని పూర్తి పేరు మ్యాగ్నటిక్ రిజొనెన్స్ ఇమేజింగ్ స్కాన్. ఈ పరీక్ష ద్వారా ఎముకల మధ్య ఉండే కార్టిలేజ్, కండరాలు, ఎముకను కండరాన్ని కలిపే టెండాన్స్ పరిస్థితితోపాటు ఎముకలో వచ్చిన చిన్న పాటి తేడాను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. సాధారణంగా ఏ రకమైన అనారోగ్యమైనా సరే మొదట రక్తపరీక్షను సూచిస్తుంటారు. కానీ ఇందులో రక్తపరీక్ష చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఆస్టియో ఆర్థరైటిస్తోపాటు రక్తహీనత వంటి ఇతర అనారోగ్య లక్షణాలు కూడా ఉన్నప్పుడు రక్తపరీక్ష చేయించాల్సి ఉంటుంది. -
పాజిటివ్ డెంటిస్ట్
ఆర్థోడాంటిక్స్ అంటే ఏమిటి? ఎత్తు పళ్ళ సమస్యను సరిచేయుటకు సంబంధించిన బ్రాంచ్ని ఆర్థోడాంటిక్స్ అంటారు. దీనిలో వంకరపళ్ళను కూడా సరిచేయవచ్చు. ఎత్తుపళ్ళ సమస్యను ఎలా అరికట్టవచ్చు? ఎత్తు పళ్ళ సమస్య వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముందుగా ఒక ఎక్స్‌రే తీయవలసి ఉంటుంది. దానివల్ల ఎత్తు పళ్ళ సమస్య దంతాలకు సంబంధించినదా లేక ఎముకకు సంబంధించినదా అని నిర్థారిస్తారు. అది ఎముకలకు సంబంధించినదైతే స్కెలిటల్ ఎనామలీ అంటారు. ఒకవేళ స్కెలిటల్ ఎనామలీ అయితే ఆర్థోగ్నాతిక్ సర్జరీ చేయవలసి ఉంటుంది. ఎత్తు పళ్ళను ఆర్థో ద్వారా సరిచేయుటకు ఎంత కాలం పడుతుంది? ఇది నిర్థారించుటకు రెండు ఎక్స్‌రేలు తీయవలసి ఉంటుంది. ఒకటి - ఆర్థోపెంటమొగ్రామ్. రెండవది - లెటరల్ సెఫలోగ్రామ్. దాన్ని బట్టి నిపుణులు ఎంతకాలం పడుతుందో నిర్థారిస్తారు. ఆర్థోడాంటిక్ ప్రొసీజర్ని ఎలా చేస్తారు? దీనికి ముందుగా ఒక పళ్ళ నమునా తీసి మోడల్ ఎనాలిసిస్ చేస్తారు. దానివల్ల పళ్ళు తీయవలసిన అవసరం ఉంటుందా లేదా అని నిర్థారిస్తారు. తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాని తరువాత బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. కాంపోసిట్ అనే మెటీరియల్‌తో బ్రెసెస్ని పళ్ళకి అమర్చుతారు. ఈ ప్రాసెస్‌ని బౌండింగ్ అంటారు. దీనికి ఒక గంట సమయం పడుతుంది. దాని తరువాత నెలకి ఒకసారి అపాయింట్మెంట్స్ ఉంటాయి. ఆర్థోడాంటిక్ బ్రెసెస్ ఎన్ని రకాలు ఉంటాయి? స్టెన్‌లెస్ స్టీల్ బ్రెసెస్ ఒక రకం. ఇప్పుడు ఆధునికంగా వచ్చిన వాటిలో సిరమిక్ బ్రెసెస్ ఒకటి. ఇందులో బ్రెసెస్ పళ్ళ రంగులో ఉంటాయి. దీనివల్ల బ్రెసెస్ పెట్టినట్టు కనిపించవు. ఇంకో ఆధునిక పద్ధతి ఏమనగా లింగువల్ ఆర్థోడెంటెక్స్. దీనిలో బ్రెసెస్ పంటి మీద అంటే పంటి ముందు భాగం మీద కాకుండా వెనుక భాగంలో అమర్చుతారు. దానివల్ల బ్రెసెస్ అసలు కనబడవు. ఒకసారి ఎత్తుపళ్ళు సరిచేసిన తరువాత తిరిగి యథాస్థానంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఇది జరుగకుండా ఉండడానికి ఆర్థోట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే రీటేనర్స్ ఇస్తారు. రీటేనర్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి రీమూవబుల్, ఇంకొకటి ఫిక్సెడ్. దీనిని ఆరు నెలల వరకు వాడాల్సి ఉంటుంది. వీటివల్ల ఎత్తు పళ్ళు తిరిగి వచ్చే సమస్య అనగా రిలాప్స్ని నివారించవచ్చు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఏ వయస్సు వారికి చేయవచ్చు? పదిహేనేళ్ళు దాటిన తరువాత ఆర్థోడాంటిక్స్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. డా. సృజనారెడ్డి గారు, సీనియర్ డెంటల్ సర్జన్ www.positivedental.com హైదరాబాద్: ఎస్.ఆర్. నగర్ దిల్సుఖ్నగర్, మాదాపూర్, కెపిహెచ్బి, నిజాంపేట, కర్నూల్ 9246567874 -
వెంట్రుక కన్నా పదివేల రెట్లు పలుచనైన ఎక్స్ రే!
బెర్లిన్: మనిషి శరీరంలో ఎముకలతోపాటు అనేక పదార్థాల నిర్మాణాన్ని చిత్రాల రూపంలోకి మలచేందుకు ఉపయోగించే ఎక్స్ రేల్లో అత్యంత పలుచనైన కిరణాన్ని యూనివర్సిటీ ఆఫ్ గోటిన్‌జెన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. ప్రపంచంలోనే అతి పలుచనైన ఈ ఎక్స్ కిరణం మనిషి వెంట్రుక కన్నా 10 వేల రెట్లు పలుచగా ఉండటం విశేషం.ప్రస్తుత పద్ధతుల్లో సృష్టిస్తున్న ఎక్స్ కిరణాలు కనీసం 20 నానోమీటర్ల మందంలో ఉంటున్నాయని, తాము మాత్రం 5 నానోమీటర్ల వ్యాసంలోనే ఎక్స్ కిరణాన్ని సృష్టించగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ చెప్పారు. సోలార్ సెల్స్ లో ఉపయోగించే నానోస్థాయి తీగలపై, రసాయన పదార్థాల్లో అతిసూక్ష్మ స్థాయి విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయన్నారు.