పంజాబ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. కడపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ వ్యక్తికి స్కానింగ్ చేసి పరీక్షించిన వైద్యులు అతని కడుపులో ఉన్న వస్తువులను చూసి అవాక్కయ్యారు. వ్యక్తి కడుపులో ఏకంగా ఇయర్ ఫోన్స్, లాకేట్స్, బోల్టులు, నట్స్, ఇలా వందకు పైగా వస్తువును చూసి ఖంగుతున్నారు. వివరాలు.. మోగాకు చెందిన 40 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. రెండు రోజులుగా వాంతులు, కడుపు నొప్పి, తీవ్రవైన జ్వరం ఉండటంతో మెడిసిటీ ఆసుపత్రిలో చేరారు.
డాక్టర్లు మెడిసిన్ ఇచ్చినా నొప్పి తగ్గకపోవడంతో.. స్టమక్ ఎక్స్‌రే చేయాలని నిర్ణయించారు. స్కాన్ చేసిన తర్వాత వైద్యులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. వ్యక్తి కడుపులో అనేక ఇనుప, ప్లాస్టిక్ వస్తువులు ఉన్నట్లు తేలింది. దీంతో దాదాపు మూడు గంటలపాటు శస్త్రచికిత్స చేసి అతడి శరీరంలోని వస్తువులను విజయవంతంగా బయటకు తీశారు. వ్యక్తి కడుపులో నుంచి తీసిన అనేక వస్తువుల్లో ఇయర్ ఫోన్‌లు, వాషర్లు, నట్స్, సేఫ్టీపిన్స్, బోల్ట్‌లు, వైర్లు, రాఖీలు, తాళం, తాళం చెవి లాకెట్‌లు, బటన్‌లు, రేపర్‌లు, హెయిర్‌క్లిప్‌లు, జిప్పర్ ట్యాగ్, మార్బుల్, ఇలా ఎన్నో ఉన్నాయి.
చదవండి: బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కొత్త కూటమికి సిద్ధమవుతున్న అన్నా డీఎంకే!
సర్జరీపై మెడిసిటీ డైరెక్టర్ డాక్టర్ అజ్మీర్ కల్రా మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇలాంటి కేసు ఎప్పుడూ చూడలేదని ఇదే మొదటిదని అన్నారు. రెండు ఏళ్లుగా ఈ వస్తువులు బాధితుడి కడుపులో ఉండటంతో అనారోగ్యానికి గురయ్యాడని తెలిపారు. దాదాపు 3 గంటలపాటు శస్త్ర చికిత్స చేసి డాక్టర్లు వ్యక్తి కడుపులోని వస్తువుల్ని తొలగించారు.అతని శరీరంలో నుంచి వస్తువులన్నీ తీసేసినప్పటికీ అతని ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతానికి కుదుటపడలేదని చెప్పారు.
వ్యక్తి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. బాధితుడి కడుపులో అన్ని వస్తువులు ఉండటం తెలిసి తాము కూడా షాక్ అయ్యామని చెప్పారు. అవన్నీంటిని అతడు ఎలా, ఎప్పుడూ మింగాడో తెలీదని అన్నారు. కానీ అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, కడుపు నొప్పి గురించి అప్పుడప్పుడు చెప్పేవాడని తెలిపారు. ఆసుపత్రిలో చేరే కొన్ని రోజుల ముందు నొప్పి ఎక్కువై నిద్ర కూడా పోకపోవడంతో డాక్టర్లను సంప్రదించినట్లు చెప్పారు. ఎంతమంది వైద్యుల వద్దకు తీసుకెళ్లినా, వారు అతని నొప్పి వెనుకగల కారణాన్ని నిర్ధారించలేకపోయారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment