
మధుబాబు (వృత్తంలో) తొలగించిన రాళ్లు
అయిజ: కడుపునొప్పితో బాధపడుతున్న ఓ యువకుడికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అర కిలో రాళ్లను తొలగించారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం మేడికొండకు చెందిన తిప్పన్నమారెమ్మ కుమారుడు మధుబాబు (30) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. కొన్ని రోజులుగా మూత్రం సరిగా రాకపోవడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు.
అయితే, కడుపు నొప్పి ఎక్కువ కాగా.. గ్రామస్తులు పలువురు విరాళాలు సేకరించి అయిజలోని సాయి శివ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ జనరల్ సర్జన్ బ్రహ్మారెడ్డి మంగళవారం శస్త్రచికిత్స చేసి మధుబాబు మూత్ర కోశంలో ఉన్న రాళ్లను తొలగించారు. ఫాస్ఫేట్ ఎక్కువ కావడంతో పదిహేనేళ్లుగా మధు కడుపులో రాళ్లు పెరుగుతూ వచ్చాయని డాక్టర్ బ్రహ్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment