పట్నా: చిన్న పిల్లలు తెలిసి తెలియక నాణేలు, చిన్న చిన్న వస్తువులు మింగుతుంటారు. ఇది సాధారణంగా జరిగే విషయమే. ఈ మధ్యకాలంలో కొందరు బంగారం, మొబైల్ ఫోన్లను కూడా కడుపులో దాచేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ఓ వ్యక్తి ఏకంగా గ్లాస్‌నే మింగేశాడనే వార్త వైరల్‌గా మారింది. ఈ విచిత్రమైన సంఘటన బిహార్‌లో చోటుచేసుకుంది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఆసుపత్రిలో చేరగా.. అతన్ని పరిశీలించిన వైద్యులు అసలు విషయం తెలిసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
55 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో ఆదివారం బీహార్‌లోనిని ముజఫర్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. వెంటనే వైద్యులు ఎక్స్‌రే తీయగా బాధితుడి కడుపులో గ్లాస్ ఉన్నట్లు గుర్తించారు. ఎండోస్కోపిక్ ప్రక్రియ ద్వారా పురీషనాళం నుంచి గ్లాస్‌ను బయటకు తీసేందుకు ప్రయత్నించినా అది సాధ్యపడలేదు. దీంతో ఆపరేషన్ చేసి బయటకు తీశారు. అయితే అది కడుపులోకి ఎలా వెళ్లిందనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.
చదవండి: Singer Parvathi: ఒక్క పాటతో కదిలిన యంత్రాంగం.. వెంటనే ఊరికి బస్సు తీసుకొచ్చింది
గ్లాస్ కడుపులోకి ఎలా వెళ్లిందనే విషయంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు. కాగా తాను చాయ్ తాగేటప్పుడు గ్లాస్‌ను కూడా మింగినట్లు బాధితుడు చెబుతుండగా.. అది నమ్మశక్యంగా లేదని వైద్యులు కొట్టిపారేశారు. ఆహారనాళంలో గ్లాస్ పట్టదని, మలద్వారం నుంచే వెళ్లి ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. బాధితుడు వైశాలి జిల్లాలోని మహువాకు చెందినవాడని పేర్కొన్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
చదవండి: 62 ఏళ్ల బామ్మ పర్వత శ్రేణి ట్రెక్కింగ్! ఫిదా అవుతున్న నెటిజన్లు
Comments
Please login to add a commentAdd a comment