ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్
నా వయసు 30 ఏళ్లు. నా బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిగా వంచినప్పుడు క్లిక్ మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. పరిష్కారం చెప్పండి. - చంద్రశేఖర్, విజయవాడ
మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటేటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి.
నా వయసు 58 ఏళ్లు. నేను గత ఐదేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. నేను ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నానని డాక్టర్ చెప్పారు. గత కొంతకాలంగా క్యాల్షియమ్ ఇస్తున్నారు. అయినా నాకు నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే కిడ్నీలో రాళ్ల సమస్య వచ్చే అవకాశం ఉందని నాకు ఈ మధ్య తెలిసింది. అప్పట్నుంచి చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వగలరు. రమాసుందరి, నిడదవోలు
ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఇచ్చే మందుల్లో భాగంగా ఆయన క్యాల్షియమ్‌ను సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్‌తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా...‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్‌లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు మరోసారి మీ డాక్టర్ గారిని సంప్రదించండి.
డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి
చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్,
హైదరాబాద్
పంచకర్మ చికిత్స...
ఆయుర్వేద కౌన్సెలింగ్
పంచకర్మ చికిత్సలతో చాలా రకాల (సాధారణంగా మందులతో పూర్తిగా నయం కాని పక్షవాతం, సెరెబ్రల్‌పాల్సీ, సెరిబెల్లార్ అటాక్సియా, పార్కిన్‌సోనిజం వంటి) వ్యాధులను నయం చేయవచ్చని విన్నాం. పంచకర్మ అంటే ఏమిటో వివరించండి. - సుచిత్ర, విశాఖపట్నం
ఐదు విశిష్టమైన ప్రత్యేక చికిత్స ప్రక్రియల్ని ‘పంచకర్మలు’గా ఆయుర్వేదం వర్ణించింది. అవి ‘వమన, విరేచన, నస్య, వస్తి, రక్తమోక్షణ’ ప్రక్రియలు. సుశ్రుతాచార్యుడు చెప్పిన రక్తమోక్షణకు బదులుగా ‘వస్తి’ కర్మలోనే రెండు రకాలు చెప్పాడు చరకమహర్షి (అనువాసనవస్తి, నిరూహవస్తి). వీటినే శోధన కర్మలని కూడా అంటారు. అంటే శరీరాన్ని శుద్ధిచేయటానికి ఉపకరిస్తాయన్నమాట. కాబట్టి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కూడా సందర్భోచితంగా వీటిని ఆచరించుకోవచ్చు. దాని వల్ల దేహదారుఢ్యం కలిగి, మానసిక ఉల్లాసంతో, పంచజ్ఞానేంద్రియ పటుత్వంతో సంపూర్ణ ఆయుష్కుడుగా జీవిస్తాడు. అదేవిధంగా వ్యాధి లక్షణాలన్ని తాత్కాలికంగా తగ్గించే శమన చికిత్సలతో బాటు, అవసరమైన పంచకర్మల్ని చేస్తే వ్యాధి సంపూర్ణంగా తగ్గిపోవడానికి దోహదపడుతుంది. ఇదీ శోధన కర్మకి అర్థం. అయితే ఏ వ్యాధి ఎంత మేరకు తగ్గుతుందన్నది వ్యాధి లక్షణాలు, రోగబలం, రోగి బలం, ఉపద్రవాస్థలపై ఆధారపడి ఉంటుంది.
ఏ వ్యక్తికి, ఏ రోగంలో, ఏ విధమైన పంచకర్మ చేయాలో నిర్ణయించడం, కేవలం అనుభజ్ఞులైన ఆయుర్వేద వైద్య నిపుణులకు మాత్రమే సాధ్యం. చాలా సహేతుకంగా, శాస్త్రబద్ధంగా ఆచరింపజేయాలి. లేకపోతే ప్రాణాలకు కూడా ప్రమాదకరం. వీటికి ముందుగా చేసే పూర్వకర్మలు (స్నేహస్వేదకర్మలు, ఆయిల్ మసాజ్, స్టీమ్‌బాత్), పంచకర్మ అనంతరం చేసే పశ్చాత్ కర్మల (జఠరాగ్నివర్ధక, బలవర్ధక ఆహారవిహారాల) గురించి ఎంతగానో వివరించింది ఆయుర్వేదం. అదేవిధంగా ధారాచికిత్స, శిరోవస్తి, కటివస్తి, గ్రీవావస్తి, ఉత్తరవస్తి మొదలగు వాటి వల్ల చాలా ప్రయోజనాలు సమకూరుతాయి. ఉదాహరణకు నిద్రలేమి, ఆందోళన, మానసిక ఒత్తిడి, స్పాండిలైటిస్, కీళ్లనొప్పులు, కండరాల వ్యాధులు, సంతానలేమి, శుక్రకణ క్షీణత మొదలైన వికారాలలో పైన పేర్కొన్న చికిత్స మార్గాల ద్వారా చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. అయితే పైన చెప్పిన స్నేహ, స్వేదకర్మలనే (పూర్వకర్మలు) పంచకర్మలని భావిస్తుంటారు. కానీ అది సరికాదు. ఇవి కూడా మంచి ఫలితాలనిస్తాయి.
వస్తి కర్మ : మలమార్గంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్‌కి ఏ ద్రవ్యాన్నైనా అతివేగంగా పీల్చుకునే శోషణ క్రియా సామర్థ్యం చాలా ఎక్కువ. ఈ మార్గం ద్వారా కొన్ని ఔషధ తైలాలని, కషాయాలని... క్రమబద్ధంగా ప్రవేశపెట్టడాన్ని వస్తికర్మ అంటారు. ఈ మందుల్ని లోనికి పంపడానికి, ప్రాచీనకాలంలో ఒక పరికరం వాడుతుండేవారు. అది మేక తాలూకు ‘మూత్రాశయం’. (యూరినరీ బ్లాడర్‌ను సంస్కృతంలో ‘వస్తి’ అంటారు. అందువల్ల ఈ ప్రక్రియకు వస్తికర్మ అని పేరు పెట్టారు). వాతరోగాలకు వస్తికర్మ అద్భుతమైన చికిత్స. పిత్తరోగాలలో ‘విరేచన కర్మ’, కఫరోగాలకు ‘వమనకర్మ’ లను పేర్కొన్నారు.
మీరు ఉదాహరించిన పక్షవాతం, పార్కిన్‌సోనిజం, సెరెబెల్లార్ ఎటాక్సియా మొదలైనవి ఆయుర్వేద శాస్త్రం వాతరోగాలుగా పరిగణించింది. వీటిలో కేవలం మందులకు అంతగా గుణం కనిపించదు. వస్తికర్మను, సుశిక్షితుడైన ఆయుర్వేద నిపుణులు శాస్త్రోక్తంగా (అంటే పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మలను... ప్రీఆపరేటివ్, ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్) అమలు చేస్తే చాలావరకు మంచి ఫలితాలతో గుణం కనిపిస్తుంది.
ఏదిఏమైనా, వస్తికర్మని నెలలో వారం రోజుల పాటు, కనీసం, ఆరునెలల నుంచి ఒక ఏడాది వరకు ప్రయోగించాల్సిన అవసరం ఉండవచ్చు. కాబట్టి ఇది చేయించుకోవాలంటే రోగికి అవగాహన, సహనం, ఆశావహదృక్పథం చాలా అవసరం. వీటితో బాటు ఆహార, విహార, వ్యాయామాలు, కొన్ని ఔషధాలు కూడా వైద్యుడు నిర్ణయిస్తాడు. అప్పుడే సరైన ఫలితం కనిపిస్తుంది.
గమనిక : పంచకర్మలు సునాయాసంగా తమకు తాముగా ఆచరించే చికిత్సలు కావు. ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలోనే చేయాల్సిన చికిత్సలవి.
డాక్టర్ వి.ఎల్.ఎన్. శాస్త్రిఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్
మంచి నిద్రకోసం చేయాల్సినవి...
స్లీప్ కౌన్సెలింగ్
ఈమధ్య నాకు నిద్ర బాగా తగ్గింది. రాత్రివేళ బాగా నిద్రపట్టడం లేదు. టాబ్లెట్లు వాడకుండా నేచురల్‌గానే నిద్రపట్టే మార్గాలు చెప్పండి. - శరత్‌కుమార్, ఒంగోలు
రాత్రి వేళల్లో మీరు నిద్రించే వ్యవధి తగ్గినా, ఆ మర్నాడు పగలంతా ఉల్లాసంగా ఉన్నప్పుడు మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మంచి నిద్ర కావాలనుకునే వాళ్లు ఈ కింది సూచనలు పాటించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవి... పొగతాగే అలవాటును పూర్తిగా మానేయాలి.
బెడ్‌రూమ్ నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. మరీ చల్లగానూ, మరీ వేడిగా లేకుండా చూసుకోవాలి. నిద్ర సమయంలో గదిలో ఎక్కువ వెలుగు లేకుండా చూసుకోవాలి. సాయుంత్ర వేళలనుంచి కాఫీలు, టీలను, కెఫిన్ ఉండే కూల్‌డ్రింక్స్ తీసుకోకండి. రాత్రిపూట గోరువెచ్చని నీటితో స్నానం చేయూలి. {పతీ రోజూ ఒకే నిర్ణీత వేళకి నిద్రపొండి. పగటి పూట చిన్న కునుకు (పవర్ న్యాప్) మాత్రమే చాలు. ఎక్కువసేపు నిద్రపోవద్దు. రాత్రి బాగా నిద్ర పట్టాలంటే పగలు కనీసం అరగంట సేపరుునా పగటి వెలుగులో (డే లైట్) గడపాలి. పగలు వుసక వెలుగు రూమ్‌లలో గడిపేవారికి రాత్రివేళల్లో సరిగా నిద్రపట్టదు.
గోరు వెచ్చని పాలు తాగాలి. పాలలో ట్రిప్టోఫ్యాన్ అనే అమైనో ఆసిడ్ ఉంటుంది. దాని వల్ల బాగా నిద్ర పడుతుంది. నిద్రకు వుుందు పుస్తకాలు చదవడం వంటివి చేయువద్దు. నిద్రకు ముందు ఆల్కహాల్ అస్సలు తీసుకోకూడదు. కొందరిలో ఆల్కహాల్ నిద్ర పట్టడానికి దోహదం చేసినా అది గాఢనిద్ర దశలోకి వెళ్లనివ్వదు. దాంతో నిద్రలేచాక రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు. అందుకే వుద్యం తాగాక నిద్ర వచ్చినా మెలకువ తర్వాత అలసటంతా తీరిపోరుున రిఫ్రెషింగ్ ఫీలింగ్ ఉండదు.
డాక్టర్ రమణ ప్రసాద్
స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్,
సికింద్రాబాద్