స్వలింగ సంపర్కుడి ఇంట్లో మనిషి ఎముకలు! | - | Sakshi
Sakshi News home page

స్వలింగ సంపర్కుడి ఇంట్లో మనిషి ఎముకలు!

Published Sun, Nov 26 2023 2:10 AM | Last Updated on Sun, Nov 26 2023 10:41 AM

- - Sakshi

లైంగిక దాడికి పాల్పడి, అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు.

తమిళనాడు: తంజావూరు సమీపంలో అరెస్టయిన స్వలింగ సంపర్కుడి ఇంటి ఆవరణలో తవ్వగా ఎముకలు బయటపడ్డాయి. వివరాలు.. తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని చోళపురానికి చెందిన నకిలీ సిద్ధ వైద్యుడు కేశవ మూర్తి(47). గతేడాది 3వ తేదీన మందు కోసం వచ్చిన అదే ప్రాంతానికి చెందిన డ్రైవర్‌ అశోక్‌రాజ్‌(27)కు మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి, అతడిని హత్య చేసి మృతదేహాన్ని ఇంటి వెనుక పూడ్చిపెట్టాడు. దీంతో పోలీసులు కేశవమూర్తిని అరెస్టు చేసి, జరిపిన విచారణలో అశోక్‌రాజ్‌ను హత్య చేసి ముక్కలుగా నరికి ఇంట్లోనే మసాలా వేసి కాలేయాన్ని వండి తిన్నట్టు తెలిపాడు.

అలాగే నవంబర్‌ 27, 2021, 30వ తేదీన అదే ప్రాంతానికి చెందిన తప్పిపోయిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ అనస్‌ (26)ని కూడా హత్య చేసి, అతని శరీర భాగాలను ముక్కలుగా చేసి ఇంటి పెరట్లో పూడ్చిపెట్టాడు. కొన్ని భాగాలను వండుకుని తిన్నట్టు తెలిపాడు. ఈ ఘటనలో మహ్మద్‌ అనాస్‌ మృతదేహాన్ని పోలీసులు ఇంకా వెలికితీయకపోగా.. ఇతడిని కూడా కేశవ మూర్తి హత్య చేసి ఉంటాడని పోలీసులు సందేహించారు.

ఈ కేసులో చోళపురంలో ఉన్న సిద్ధ వైద్యుడు కేశవమూర్తి ఇంటిలో, వేలిముద్రల నిపుణులు ఏడీఎస్పీ హేమ, సహాయ సహాయకుడు రామచంద్రన్‌ (27) సమక్షంలో తిరువిడైందూరు డీఎస్పీ జబర్‌ సిద్ధిక్‌ నేతృత్వంలో కేశవ మూర్తి ఇంట్లో విచారణ చేపట్టారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి పోలీసు జాగిలాలు సోదాలు చేశాయి. ప్రొక్‌లైన్‌ సాయంతో ఇంటిపక్కన చెట్లు, ఇంటిముందు పచ్చిమిర్చి మొక్క. అరటి చెట్లను నరికి తొలగించారు. వరుసగా 2 చోట్ల 3 అడుగుల లోతు తవ్వగా 30కి పైగా ఎముకలు బయటపడ్డాయి. వాటిని తంజావూరు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement