రుణమాఫీ అమలుకు కొత్త సాఫ్ట్ వేర్!
Published Wed, Sep 10 2014 8:28 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 PM
హైదరాబాద్: రైతు రుణమాఫీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సాఫ్ట్‌వేర్ ను రూపొందిస్తుంది. లబ్దిదారుల ఎంపికకు ఏపీ సర్కార్ సాఫ్ట్ వేర్ ను వినియోగించుకోనున్నదని అధికారులుత తెలిపారు.
డబుల్ ఎంట్రీలు, నకిలీ లబ్దిదారులను ప్రభుత్వం రూపొందించే సాఫ్ట్ వేర్ ద్వారా ఏరివేస్తామంటుని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈనెల 15 తర్వాత లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.
రుణమాఫీ అమలుకు 6వేల కోట్లు సర్కార్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ప్రభుత్వానికి రుణాల వివరాలు సమర్పించిన ఎస్ బీఐ, ఆంధ్రాబ్యాంక్, సిండికేట్, మిగిలిన బ్యాంకులకు 15 వరకు గడువు ఇస్తారని, వాయిదాల పద్దతిలో చెల్లింపులు చేయాలనే యోచనలో సర్కార్ ఉన్నట్టు సమాచారం.
Advertisement