hard disk
-
జేబులో పట్టే హార్డ్‌డిస్క్: 1 టీబీ డేటా..
కంప్యూటర్లోని సమాచారాన్ని భద్రపరచుకోవడానికి ఇదివరకు ఫ్లాపీ డిస్క్‌లు, కాంపాక్ట్ డిస్క్‌లు, డిజిటల్ వీడియో డిస్క్‌లు ఉపయోగించేవారు. ఇప్పుడు వాటికి కాలం చెల్లింది. ఇటీవలి కాలంలో సమాచారాన్ని భద్రపరచుకోవడానికి పెన్‌డ్రైవ్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి.పెన్‌డ్రైవ్‌ల సామర్థ్యానికి మించిన సమాచారాన్ని భద్రపరచుకోవడానికైతే ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లు ఉన్నాయి. ఇప్పటి వరకు వాడుకలో ఉన్న ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌లు కొంచెం భారీగా ఉంటాయి. వీటిని తేలికగా జేబులో వేసుకుని వెళ్లడం సాధ్యమయ్యే పనికాదు. అయితే, కొరియన్ డిజైనర్ జున్హో హాన్ అచ్చంగా కంప్యూటర్ డెస్క్టాప్పై కనిపించే ఫోల్డర్ ఆకారంలోని ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను రూపొందించాడు.పాతకాలం ఫ్లాపీ డిస్క్ కంటే చిన్నగా కనిపించే ఈ ఎక్స్టర్నల్ హార్డ్‌డిస్క్‌ను జేబులో వేసుకుని ఎక్కడికైనా సులువుగా తీసుకుపోవచ్చు. అలాగని దీని సామర్థ్యం తక్కువేమీ కాదు. ఏకంగా 1 టీబీ డేటాను ఇందులో నిక్షిప్తం చేసుకోవచ్చు. యూఎస్బీ-సీ పోర్ట్ ద్వారా దీన్ని వాడుకోవచ్చు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. -
హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రవికుమార్ దాచిన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్, ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ చైర్మన్ రవికుమార్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లు, హార్డ్ డిస్క్‌లను తమ వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సైతం సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్క్‌లను సైతం సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్‌ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
Phone Tapping Case: పగలు చేశారా? రాత్రి చేశారా?
నల్లగొండ/ హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాల్ని సేకరణ దిశగా దర్యాప్తు బృందం తీవ్రంగా యత్నిస్తోంది. ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కేసు వీగిపోయే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కీలకంగా భావిస్తున్న హోంగార్డు, ఎలక్ట్రిషియన్ల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో SIB(స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో)లో ఆధారాలు ధ్వంసం చేసిన ఎలక్ట్రిషియన్, హోంగార్డులను విడివిడిగా పోలీసులు విచారించారు. ‘‘ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎంత డబ్బు ఇచ్చారు?. జనవరి 4వ తేదీన ఎస్ఐబీలోకి రమ్మని ఎవరు పిలిచారు?. ఆ టైంలో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా?. అసలు ఎస్ఐబీ కార్యాలయంలోకి కట్టర్లతో ఎలా వెళ్లారు?.. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన హార్డ్ డిస్క్‌లను, పెన్‌డ్రైవ్, ఇతర డివైజ్‌లను డే టైంలో ధ్వంసం చేశారా? నైట్‌టైంలో ధ్వంసం చేశారా?. ఎస్ఐబీ ఆఫీస్‌లో కాకుండా వేరే చోట కూడా ధ్వంసం చేశారా?’’ ఇలాంటి ప్రశ్నలు ఆ ఇద్దరికి సంధించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ధ్వంసం అయిన పరికరాలు దొరక్కపోతే కోర్టు కేసు కొట్టేసే అవకాశం ఉంది. అందుకే ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు వృథా కాకుండా చూడాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం అన్వేషణ కొనసాగిస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్ట్? ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో నల్లగొండకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మునుగోడు ఉప ఎన్నికల టైంలో పలువురు నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారనే అభియోగాలతో ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. నల్లగొండలో సర్వర్ రూం ఏర్పాటు చేసుకుని ఈ ఇద్దరూ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అధికారులు చెబుతున్నారు. అప్పట్లో ఓ మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యే ఫోన్లను ఎప్పటికప్పుడు వీళ్లు అబ్జర్వ్ చేసినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొందరు అధికారుల హస్తం ఉందని భావిస్తున్నారు. రాధాకిషన్ అస్వస్థత ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టై.. ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు అస్వస్థతకు గురయ్యారు. రెండోరోజు విచారణ సందర్భంగా.. హైబీపీకి ఆయన గురైనట్లు సమాచారం. అయితే బంజారాహిల్స్ పీఎస్‌లోనే ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. -
ప్రపంచంలో తొలి 22 టీబీ హార్డ్ డ్రైవ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్డ్ డిస్క్ డ్రైవ్స్ తయారీ దిగ్గజం వెస్టర్న్ డిజిటల్.. అల్ట్రాస్టార్ డీసీ హెచ్‌సీ570 పేరుతో భారత్‌లో 22 టీబీ కన్వెన్షనల్ మ్యాగ్నెటిక్ రికార్డింగ్ (సీఎంఆర్) హార్డ్ డ్రైవ్‌ను ప్రవేశపెట్టింది. ఆప్టినండ్ టెక్నాలజీతో ఇది తయారైంది. ఈ స్థాయి సామర్థ్యం గల సీఎంఆర్ హార్డ్ డ్రైవ్‌ను ప్రపంచంలో తొలిసారిగా తయారు చేసిన ఘనత తమదేనని కంపెనీ తెలిపింది. క్లౌడ్ సేవల కంపెనీలు, పెద్ద సంస్థలకు వ్యయ భారం తగ్గుతుందని వివరించింది. -
‘ఐటీ గ్రిడ్స్’ నుంచి 3 హార్డ్‌డిస్క్‌లు మాయం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్ కీలక సమాచారంతో పరారైనట్లు సైబరాబాద్ పోలీసులు అనుమానిస్తున్నారు. సంస్థ సర్వర్ల నుంచి కీలక సమాచారం డిలీట్ చేయడంతోపాటు మూడు హార్డ్‌డిస్క్‌లతో అశోక్ ఉడాయించారని భావిస్తున్నారు. దీంతో అశోక్ కోసం గాలిస్తున్న సైబరాబాద్ పోలీసులు అతను డిలీట్ చేసిన సమాచారం రిట్రీవ్ చేయడం కోసం సైబర్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారం తీసుకుంటున్నారు. ఏపీ ప్రభుత్వ అండదండలు ఉన్న నేపథ్యంలో అశోక్ ఏపీలోనే తలదాచుకున్నాడని అనుమానిస్తున్నారు. అశోక్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని పాస్‌పోర్ట్ వివరాలతో అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులకు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయడానికి సిద్ధమవుతున్నారు. (డేటా చోర్.. బాబు సర్కార్) ఓట్లు తొలగిస్తున్నారంటూ ఫిర్యాదు... ఐటీ గ్రిడ్స్ సంస్థపై సోమవారం మరో కేసు నమోదైంది. హైదరాబాద్ మధురానగర్‌కు చెందిన జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సార్ నగర్ పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు. తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా తయారు చేయించుకున్న ఈ యాప్‌లో ఇతర పార్టీలకు చెందిన వారిని అక్రమంగా ఓటర్ లిస్టు నుంచి తొలగించే కుట్ర ఉందని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఈ మేరకు ‘సేవామిత్ర’వ్యవహారంపై దర్యాప్తు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. అశోక్, కమలేష్, అబ్దుల్ సమా మరికొందరు కలిసి టీడీపీ అనుకూలంగా లేని వారిని టార్గెట్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత, రహస్య డేటాను ప్రైవేట్ సంస్థకు అప్పగించడంతోపాటు యాప్‌లో ఉంచి సర్వే చేస్తున్నారని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. (ఏపీ ప్రభుత్వ పాత్రపై.. అనుమానాలు) ఈ యాప్ ఉన్న ట్యాబ్‌లతో బూత్ స్థాయిలో ఓటర్ల వద్దకు వెళ్తున్న టీడీపీ క్యాడర్... ఏపీ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన వారిని 10 నుంచి 15 రకాల ప్రశ్నలు అడుగుతున్నారని, ఇలా టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను గుర్తించి కౌన్సెలింగ్ పేరుతో బెదిరించి వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు సదరు సంస్థ ప్రయత్నిస్తోందని దశరథరామిరెడ్డి ఆరోపించారు. టీడీపీని వ్యతిరేకించే వారి వివరాలను ఆయా కార్యకర్తలు టీడీపీలోని కీలక వ్యక్తికి పంపిస్తున్నారని, ఈ స్థాయిలో జరిగే కుట్రలో ఆయా వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేవలం ఓట్లు తొలగించడమే కాకుండా వారిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టి ప్రభుత్వ పథకాలు చేరకుండా కుట్ర పన్నుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేశారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) దీంతో ఐటీ గ్రిడ్స్‌కు చెందిన నిర్వాహకులపై ఐపీసీలోని 420, 419, 467, 468, 471, 120 (బీ) సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. తాజా కేసు నేపథ్యంలో అశోక్‌ను పట్టుకోవడానికి హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ప్రాథమికంగా వారు సేకరించిన సమాచారం ప్రకారం అశోక్ విజయవాడ చుట్టుపక్కల తలదాచుకున్నట్లు గుర్తించారు. అతని కోసం రెండు బృందాలు బయలుదేరి వెళ్లాయి. అశోక్‌ను పట్టుకొని అన్ని కోణాల్లోనూ విచారిస్తే ఈ స్కాం వెనుక ఉన్న ఏపీ ప్రభుత్వ, టీడీపీ పెద్దల పేర్లు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. (చంద్రబాబు, లోకేశ్ మార్గదర్శనంలో...క్యాష్ ఫర్ ట్వీట్!) -
హార్డ్‌డిస్క్‌లకు కాలం చెల్లినట్లేనా?
కంప్యూటర్లు, ల్యాప్టాపలలో బోలెడంత బరువుండే హార్డ్ డిస్క్‌లకు ఇక కాలం చెల్లినట్లే కనిపిస్తోంది. ఎందుకంటారా? శ్యాంసంగ్ కంపెనీ ఏకంగా నాలుగు టెరాబైట్ల సమాచారాన్ని ఇముడ్చుకోగల మెమరీ కార్డును ఆవిష్కరించింది మరీ! అంతేకాదు.. ఈ మెమరీ డివైజ్‌లోకి ఏదైనా ఫైల్‌ను నిక్షిప్తం చేయడం కూడా చాలా వేగంగా జరిగిపోతుంది. సెకనుకు 540 మెగాబిట్ల వేగంతో ఫైళ్లను చదవడం.. 520 మెగాబిట్ల వేగంతో రాయడం చేస్తుంది ఈ మెమరీ కార్డు. ఇంకోలా చెప్పాలంటే ఒకే రెండు సెకన్లలో ఓ మోస్తరు హెచ్డీ సినిమా మొత్తాన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. ఒక్కో మెమరీ సెల్లో తాము మూడు స్థానంలో నాలుగు బిట్ల సమాచారాన్ని నిక్షిప్తం చేయగలిగామని ఇందుకోసం మూడు బిట్ల ఎస్ఎస్డీ కంట్రోలర్, టర్బోరైట్ టెక్నాలజీలను వాడామని శాంసంగ్ ప్రతినిధి ఒకరు వివరించారు. ఈ మెమరీ కార్డులో 64 పొరలున్న వీ–ఎన్ఏఎన్డీ మైక్రోప్రాసెసర్లు 32 వాడామని ఫలితంగా ఇతర నాలుగు టెరాబైట్ల సామర్థ్యం ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేయగలదని చెప్పారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న 2.5 అంగుళాల సైజు డ్రైవ్‌లకు కొత్త 4 టెరాబైట్ల మెమరీకార్డు తోడవనుందని.. ఇదే టెక్నాలజీతో తాము స్మార్ట్ఫోన్లలోనూ మెమరీ సామర్థ్యాన్ని పెంచగలమని శాంసంగ్ చెబుతోంది! -
ప్రపంచంలోనే అతి చిన్న హార్డ్డిస్కు!
లండన్: సమాచారాన్ని నిల్వ చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతి కనుగొన్నారు. ప్రతీరోజూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల గిగాబైట్ల(జీబీ) సమాచారం తయారవుతోంది. దీన్ని నిక్షిప్తం చేయడానికి కావలసిన సమాచార నిల్వ సామర్థ్యం కూడా కీలకమే. శాస్త్రవేత్తలు మొదట ఒక క్లోరిన్ అణువులో ఒక కిలోబైట్(కేబీ) సమాచారాన్ని నిల్వ చేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటిదాకా మనుషులు రాసిన పుస్తకాలన్నీ ఒక చిన్న పోస్టల్ స్టాంపు పరిమాణంలో సరిపెట్టేయవచ్చు. ఇప్పటికి వారు ప్రతీ చదరపు అంగుళంపై 500 టెరాబైట్ల సమాచారాన్ని నిల్వ చేయడంలో సఫలీకృతులయ్యారు. -
క్లౌడ్ స్టోరేజ్‌లో బెస్ట్, బెటర్...
క్లౌడ్ డ్రైవ్స్లేని టెక్ జీవితం కష్టతరంగా మారింది. ఇవి అందుబాటులోకి రాకముందు డాటాను సెండ్ చేసుకోవడంలో ఎన్ని కష్టాలు పడినా... ఇప్పుడు మాత్రం వీటిని ఉపయోగించుకోవడం సులభం. డాటా మొత్తాన్ని ఆన్లైన్లో సేవ్ చేసుకుని అవసరమైనప్పుడు, అవసరమైనచోట వాటిని యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదే ‘క్లౌడ్ స్టోరేజ్’ ఇచ్చే సదుపాయం. హార్డ్ డిస్క్ ఉన్నట్టుండి క్రాష్ అయినా, పీసీ అందుబాటులో లేకపోయినా, ఫార్మాట్ అయినా, పొరపాటున డిలీట్ అయినా, క్లౌడ్ స్టోరేజ్‌లో డాటాను దాచి ఉంచడం ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్, అప్లికేషన్ల రూపంలో అందుబాటులో ఉన్న క్లౌడ్‌స్టోరేజ్ సర్వీసుల గురించి... బెస్ట్ ఆఫ్ ఓవరాల్ డ్రైవ్స్.. జీ మెయిల్ ద్వారా కొంచెం ఎక్కువ డాటాను పంపాలంటే.. వెంటనే పలకరించే పరిమితులు పోయాయి. 25 ఎమ్బీ ని మించిన డాటాను పంపాలంటే.. అవకాశమే లేదు అనే రోజులు పోయాయి... టక్కున గూగుల్ డ్రైవ్ ప్రత్యక్షం అవుతోంది. డోంట్ వర్రీ. మీరు గూగుల్‌డ్రైవ్ ద్వారా డాటాను పంపండి... అనే సజెషన్ వస్తుంది. జీమెయిల్ ద్వారా అవసరమైన డాటాను పంపడానికి అవకాశం దొరుకుతోంది. ఇదంతా క్లౌడ్ స్టోరేజ్ పుణ్యమే. ఫైల్స్‌ను ముక్కలుగా చేసి పంపేరోజులు పోయి, ఒకేసారి మొత్తంగా పంపడానికి అవకాశముంది. జీమెయిల్, గూగుల్ ప్లస్‌ల విషయంలో గూగుల్ డ్రైవ్ ఉపయోగకరంగా ఉంది. వీటి ద్వారా డాటాను పంపడానికి, డాటాను సేవ్ చేసుకోవడానికి గూగుల్ డ్రైవ్ సాయమందిస్తుంది. 15 జీబీ స్టోరేజ్‌ను ఉచితంగా అందిస్తుంది. గూగుల్ డ్రైవ్‌ను విండోస్ ఫోన్ కోసం అప్‌గ్రేడ్ చేయలేదు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ లపై పనిచేస్తుంది. విండోస్ విషయంలో బెస్ట్.. మైక్రోసాఫ్ట్ అందిస్తున్న సేవ ఇది. విండోస్ - 8 ఆపరేటింగ్ సిస్టమ్స్ లుక్ అండ్ ఫీల్‌ను మార్చేసిన ఫీచర్ ఇది. బిల్ట్ ఇన్ అప్లికేషన్‌గా ఇది విండోస్ - 8 ను ప్రభావితం చేసింది. 7 జీబీ వరకూ ఉచిత స్టోరేజీకి అవకాశం ఉంటుంది. విండోస్ ఓఎస్ పై పనిచేసే డెస్క్టాప్ను వాడేవారికి, ఫోన్ వాడేవారికి ఉపయోగకరమైనది. ఉచిత పరిమితి దాటిపోతే, తక్కువ ధరలోనే ఎక్కువ స్టోరేజ్ స్పేస్ అందిస్తుంది స్కై డ్రైవ్. విండోస్ ఓఎస్ విషయంలో బెస్ట్ స్కై డ్రైవ్. బెస్ట్ ఆఫ్ ఫ్రీ సర్వీస్.. వెబ్‌సైట్స్ నడిపేవారికి ఇది బెస్ట్ ఫ్రీ సర్వీస్. 50 జీబీ డాటాను అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సైట్ లో లింక్ ఇచ్చి డాటాను నెట్లో అందుబాటులో పెట్టడానికి అవకాశం ఉంది. వన్ ఆఫ్ ది బెస్ట్.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది మెచ్చిన క్లౌడ్ స్టోరేజీ సేవ డ్రాప్‌బాక్స్. వేరు వేరు డివెజైస్లలో, వేరు వేరు ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై పనిచేస్తుంది డ్రాప్ బాక్స్. డ్రాప్ బాక్స్ ద్వారా మల్టీ యూజర్లు డాటాను షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ప్రైవేట్‌గా కూడా ఉంచుకోవచ్చు. డాటాను డ్రాప్ బాక్స్‌లో పడేసి కంప్యూటర్, ఫోన్స్, టాబ్లెట్ల ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ విండోస్, మ్యాక్ ఓఎస్ఎక్స్, లైనక్స్, ఆండ్రాయిడ్, ఐఓఎస్, బ్లాక్‌బెర్రీ ఓఎస్‌లపై పనిచేస్తుంది డ్రాప్‌బాక్స్. టెక్ట్స్ఫైల్స్, ఫోటోలు వేటినైనా... కాన్ఫిడెన్స్‌తో షేర్ చేసుకోండి అని హామీ ఇస్తోంది డ్రాప్ బాక్స్. 2 జీబీ వరకూ స్టోరేజ్‌కు అవకాశం ఉంటుంది. - జీవన్‌రెడ్డి. బి