
ప్రపంచంలోనే అతి చిన్న హార్డ్‌డిస్కు!
లండన్: సమాచారాన్ని నిల్వ చేసేందుకు శాస్త్రవేత్తలు ఓ కొత్త పద్ధతి కనుగొన్నారు. ప్రతీరోజూ ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కోట్ల గిగాబైట్ల(జీబీ) సమాచారం తయారవుతోంది. దీన్ని నిక్షిప్తం చేయడానికి కావలసిన సమాచార నిల్వ సామర్థ్యం కూడా కీలకమే. శాస్త్రవేత్తలు మొదట ఒక క్లోరిన్ అణువులో ఒక కిలోబైట్(కేబీ) సమాచారాన్ని నిల్వ చేశారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఇప్పటిదాకా మనుషులు రాసిన పుస్తకాలన్నీ ఒక చిన్న పోస్టల్ స్టాంపు పరిమాణంలో సరిపెట్టేయవచ్చు. ఇప్పటికి వారు ప్రతీ చదరపు అంగుళంపై 500 టెరాబైట్ల సమాచారాన్ని నిల్వ చేయడంలో సఫలీకృతులయ్యారు.