తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సరకులు.. అనే కాన్సెప్ట్‌ను కోరుకునే వారికి ఈ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ భలే యూజ్ అవుతుంది. ఇందులో 5 కేజీల వరకు సరకులను సర్దిపెట్టుకోవచ్చు. ఈ కంటైనర్‌లో చాలా రకాల ధాన్యాలు, పొడి ఆహారం, బీన్స్, గింజలు, చక్కెర, కాఫీ గింజలు వంటివి స్టోర్ చేసుకోవచ్చు. దీనికి మూత కూడా ఉండటంతో ఇందులో నిల్వ ఉన్న పదార్థాలు తాజాగా ఉంటాయి.
ఎలుకలు, కీటకాలు వంటి సమస్యలు తలెత్తవు. ఇలాంటి కంటైనర్స్‌ని సులభంగా క్యాంపింగ్స్‌కి, లాంగ్ డ్రైవ్స్‌కి తీసుకెళ్లొచ్చు. దీని మూతపైన కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్, దానికీ చిన్న మూత ఉంటాయి. అందులో మసాలా ప్యాకెట్స్, పోపు దినుసులను వంటివి పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌తో స్థలం ఆదా అవడమే కాకుండా వంటిల్లూ శుభ్రంగా కనిపిస్తుంది. ధర 15 డాలర్లు (రూ.1,249)
Comments
Please login to add a commentAdd a comment