storages
-
రూ.1.25 లక్షల కోట్లతో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం
న్యూఢిల్లీ: దేశంలో సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమం అమలుకు రూ.1.25 లక్షల కోట్లకుపైగా నిధులు వెచి్చంచనున్నారు. అలాగే వచ్చే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యాన్ని సృష్టించనున్నారు. ఇందులో భాగంగా 11 రాష్ట్రాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల(పీఏసీ) పరిధిలో నిర్మించిన 11 గోడౌన్లను మోదీ ప్రారంభించారు. రాబోయే ఐదేళ్లలో వేలాది గోదాములు నిర్మించబోతున్నట్లు ఆయన ఈ సందర్భంగా చెప్పారు. 500 పీఏసీల పరిధిలో గోదాముల నిర్మాణానికి, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. 18,000 పీఏసీలను కంప్యూటీకరించే ప్రాజెక్టును ప్రారంభించారు. దేశంలో ఆహార ధాన్యాల నిల్వకు సరైన సదుపాయాలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సమస్యను గత ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోలేదని తప్పుపట్టారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రూ.1.25 లక్షల కోట్లలో వ్యయంతో రాబోయే ఐదేళ్లలో 700 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం సృష్టించే పథకానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. రైతులు తమ పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చని, వాటిపై రుణం పొందవచ్చని, మార్కెట్లో సరైన ధర లభించినప్పుడు పంటలు విక్రయించుకోవచ్చని తెలియజేశారు. కేబినెట్ భేటీకి యాక్షన్ ప్లాన్‌తో రండి కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచన లోక్‌సభ ఎన్నికలు మరో 100 రోజులలోపే జరుగనున్న నేపథ్యంలో మార్చి 3వ తేదీన కేంద్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ భేటీని ఆయన కీలకంగా భావిస్తున్నారు. స్పష్టమైన, ఆచరణ యోగ్యమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని కేబినెట్ సమావేశానికి హాజరు కావాలని మంత్రులకు ఆయన సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు శనివారం వెల్లడించాయి. కేబినెట్ భేటీలో మంత్రులంతా వారి యాక్షన్ ప్లాన్ సమరి్పంచాలని ప్రధానమంత్రి పేర్కొన్నట్లు తెలియజేశాయి. -
బ్యాచ్‌లర్స్‌కి బెస్ట్ ఛాయిస్ ఇది.. 5కేజీల సరుకులు స్టోర్ చేసుకోవచ్చు
తక్కువ ప్లేస్‌లో ఎక్కువ సరకులు.. అనే కాన్సెప్ట్‌ను కోరుకునే వారికి ఈ ఫుడ్ స్టోరేజ్ కంటైనర్ భలే యూజ్ అవుతుంది. ఇందులో 5 కేజీల వరకు సరకులను సర్దిపెట్టుకోవచ్చు. ఈ కంటైనర్‌లో చాలా రకాల ధాన్యాలు, పొడి ఆహారం, బీన్స్, గింజలు, చక్కెర, కాఫీ గింజలు వంటివి స్టోర్ చేసుకోవచ్చు. దీనికి మూత కూడా ఉండటంతో ఇందులో నిల్వ ఉన్న పదార్థాలు తాజాగా ఉంటాయి. ఎలుకలు, కీటకాలు వంటి సమస్యలు తలెత్తవు. ఇలాంటి కంటైనర్స్‌ని సులభంగా క్యాంపింగ్స్కి, లాంగ్ డ్రైవ్స్‌కి తీసుకెళ్లొచ్చు. దీని మూతపైన కూడా చిన్న స్టోరేజ్ ప్లేస్, దానికీ చిన్న మూత ఉంటాయి. అందులో మసాలా ప్యాకెట్స్, పోపు దినుసులను వంటివి పెట్టుకోవచ్చు. ఈ డివైస్‌తో స్థలం ఆదా అవడమే కాకుండా వంటిల్లూ శుభ్రంగా కనిపిస్తుంది. ధర 15 డాలర్లు (రూ.1,249) -
ఆక్సిజన్ కొరతకు చెక్!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రులకు ఆక్సిజన్ కొరత తీరనుంది. ఆక్సిజన్ అందక ఎవరూ చనిపోకూడదనే ఉద్దేశంతో భారీగా లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌కు భారీగా డిమాండ్ ఏర్పడింది. సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేస్తున్నా అప్పుడప్పుడు అనుకోని అంతరాయాలు ఏర్పడుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆధ్వర్యంలోని 22 ఆస్పత్రులు, ఇతర బోధనాస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయనుంది. అలాగే కొన్నింటి సామర్థ్యాన్ని పెంచాలని భావిస్తోంది. దీంతో అదనంగా 4,500 పడకలకు లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులోకి రానుంది. ఫలితంగా ఆయా ఆస్పత్రులకు ఇక పైప్లైన్ల ద్వారా నిరంతరంగా ఆక్సిజన్ అందుబాటులో ఉండనుంది. వారం రోజుల్లో హైదరాబాద్‌లోని టిమ్స్, కింగ్ కోఠి, ఛాతి, ఉస్మానియా సహా మొత్తం 9 ఆస్పత్రుల్లో లిక్విడ్ ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తర్వాత కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మహబూబ్‌నగర్ బోధనాస్పత్రి, ఆదిలాబాద్ రిమ్స్, సంగారెడ్డి బోధనాస్పత్రి ఇలా 22 చోట్ల అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం ఉస్మానియా ఆస్పత్రిలో అందుబాటులో ఉన్న 6 కిలోలీటర్ల ఆక్సిజన్ సామర్థ్యాన్ని మరో 20 కిలోలీటర్లకు పెంచుతారు. అలాగే నిజామాబాద్ బోధనాస్పత్రిలో 6 కిలోలీటర్ల సామర్థ్యం ఉంటే, దాన్ని 20 కిలోలీటర్లకు పెంచనున్నారు. వందకు మించి ఉంటే ఆక్సిజన్ ట్యాంకులు రాష్ట్రంలో కరోనా చికిత్సలు అందిస్తున్న 42 ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రస్తుతం 4,673 ఆక్సిజన్ పడకలున్నాయి. వీటికి జిల్లాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉండటంతో మరో 4,500 పడకలకు లిక్విడ్ ఆక్సిజన్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. గాంధీ ఆస్పత్రిలో 1,000 ఆక్సిజన్ పడకలుంటే, 26 కిలోలీటర్ల సామర్థ్యం ఉన్న భారీ ట్యాంక్ అక్కడ మాత్రమే ఉంది. దీంతో 100 పడకలకు మించి ఉన్న ప్రభుత్వాస్పత్రులకు లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. టిమ్స్‌లో 21 కిలోలీటర్ల ట్యాంక్‌ను ఏర్పాటు చేయడంతో పాటు వరంగల్ ఎంజీఎంలో 10 కిలోలీటర్ల సామర్థ్యాన్ని 20 కిలోలీటర్లకు పెంచనున్నారు. ఇక వందలోపు పడకలున్న ప్రభుత్వాస్పత్రులకు మరో 6 వేల సిలిండర్లను కొనుగోలు చేయనున్నారు. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులను గుజరాత్‌కు చెందిన రెండు ప్రముఖ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 10 వేల పడకలకు సరిపోయే ఆక్సిజన్ పైప్లైన్లు వేశారు. ట్యాంకులను నెలకొల్పాక వెంటనే పడకలకు ఆక్సిజన్ అందుబాటులోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. ప్రైవేట్‌లో మూడు చోట్లే ట్యాంకులు హైదరాబాద్‌లో పేరొందిన మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో మాత్రమే లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. పైగా అవి కూడా భారీ సామర్థ్యం కలిగినవి కావని చెబుతున్నారు. మిగిలిన ప్రైవేట్ ఆస్పత్రులన్నీ సిలిండర్లపైనే ఆధారపడుతున్నాయని, ఒక్కోసారి సిలిండర్ల సరఫరా సకాలంలో రాకపోతే రోగులు ఇబ్బంది పడే ప్రమాదముందని అంటున్నారు. చాలా సందర్భాల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పడకలున్నా, ఆక్సిజన్ సిలిండర్లు లేక రోగులను చేర్చుకోవడం లేదని ఒక అధికారి వ్యాఖ్యానించారు. -
ఉల్లి కుళ్లకుండా నిల్వ చేసే పద్ధతి..!
రైతు పంట పండించిన సీజన్లో కన్నా కొద్ది నెలలు నిల్వ చేయగలిగితే మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంది. త్వరగా కుళ్లిపోయే స్వభావం ఉన్న ఉల్లిపాయలను నిల్వ చేయడం సమస్యలతో కూడిన విషయం. అయితే, మధ్యప్రదేశ్ డెడ్ల జిల్లా ధర్‌కు చెందిన యువ రైతు రోహిత్ పటేల్(21) గత ఏడాది ఎగ్జాస్ట్ ఫాన్లతో ఉల్లిపాయలను సమర్థవంతంగా నెలల తరబడి నిల్వ చేసే పద్ధతిని కనిపెట్టారు. ఈ కథనాన్ని గతంలోనే ‘సాక్షి సాగుబడి’ పాఠకులకు అందించింది. ఖర్చు పెద్దగా లేకపోవడం, నిల్వ నష్టాన్ని పది శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం రోహిత్ పటేల్ సాధించిన విజయం. ఈ కథనం స్ఫూర్తితో.. వికారాబాద్ జిల్లా జిన్గుర్తి గ్రామంలోని ఏకలవ్య ఫౌండేషన్ సేంద్రియ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను అదే పద్ధతిలో నిల్వ చేస్తున్నారు. ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ నిపుణుడు రమాకాంత్ అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.. పక్కా భవనంలోని 850(17“50) చదరపు అడుగుల గదిలో ఏప్రిల్ 20 నుంచి ఈ పద్ధతిలో ఉల్లిపాయలను నిల్వ చేస్తున్నారు. ప్రతి 100–105 చదరపు అడుగులకు ఒక్కొక్క ఎగ్జాస్ట్ ఫాన్ చొప్పున మొత్తం 8 ఫాన్లను ఏర్పాటు చేశారు. ఇవి నిరంతరాయంగా పనిచే స్తూ ఉల్లిపాయలు కుళ్లిపోకుండా కాపాడుతున్నాయి. తొలుత గదిలో గచ్చుపైన 9 అంగుళాల ఎత్తున సిమెంటు ఇటుకలు పేర్చి.. దానిపైన ఇనుప మెష్ పరిచారు. 100 అడుగులకోచోట ఎగ్జాస్ట్ ఫ్యాన్ల కోసం ఇటుకలు పేర్చారు. వాటిపైన 2.5 అడుగుల ఎత్తున మెష్‌ను పీపాలా గుండ్రంగా చుట్టి.. దానిపైన ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చారు. చివరిగా అడుగున్నర మందాన దాదాపు 200 క్వింటాళ్ల ఉల్లిపాయలను నిల్వ చేశారు. మరో 200 క్వింటాళ్ల వరకు ఇదే చోట నిల్వ చేయడానికి అవకాశం ఉందని రమాకాంత్ ‘సాక్షి సాగుబడి’తో చెప్పారు. పెద్ద పాయలైతే ఎక్కువ పరిమాణంలో నిల్వ చేయవచ్చు. పెద్ద పాయలను 3 అడుగుల మందాన కూడా పోసి నిల్వ చేసుకోవచ్చంటున్నారు. నీడలో బాగా ఆరబెట్టిన ఉల్లిపాయలలో నుంచి కుళ్లిపోయిన వాటిని జాగ్రత్తగా తీసేసి నిల్వచేసుకోవటం చాలా ముఖ్యమని ఆయన అంటున్నారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఆగకుండా తిరగాల్సిందేనని రమాకాంత్(83747 21751) సూచించారు. సిమెంటు ఇటుకలు, ఇనుప మెష్‌పైన ఉల్లిపాయలు పోస్తున్న దృశ్యం -
తమలపాకు నిల్వ ఉండేలా చర్యలు చేపట్టాలి