World Heart Day: గుండె మార్పిడి అంటేనే, కఠినమైన, క్లిష్టమైన ప్రక్రియ. దాత శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత నిర్దిష్ట సమయంలోగా దాన్ని దాతకు అమర్చాల్సి ఉంటుంది. గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడమే దీనికి కారణం. ఫ్రిడ్జ్‌లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు ఈయన.
చదవండి: చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు!
ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రుబిన్‌స్కీ ‘‘ఐసోకోరిక్ సూపర్ కూలింగ్’’పేరుతో అభివృద్ధి చేసిన ఓ టెక్నిక్‌కు మరింత పదును పెట్టి అవయవ కణజాలంపై మంచు స్ఫటికాలు ఏర్పడకుండానే నిల్వ చేయగలిగారు. ఒక ద్రవంలో అవయవాన్ని లేదా భద్రపరచాల్సిన పదార్థాన్ని ఉంచి అందులోకి గాలి చొరబడకుండా చేయడం దీంట్లోని ప్రత్యేకత. మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన గుండె కణజాలాన్ని తాము ఈ పద్ధతి ద్వారా –3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయగలిగామని, ఒకరోజు నుంచి మూడు రోజులపాటు దీన్ని నిల్వ చేసి చూడగా ప్రతిసారి అది మళ్లీ కొట్టుకుందని రూబిన్‌స్కీ తెలిపారు.
చదవండి: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి..
Comments
Please login to add a commentAdd a comment