Heart Transplants
-
అరుదైన ఘటన: మ్యూజియంలో ఆమె గుండె..16 ఏళ్ల తర్వాత ఆ మహిళే..
ఏదైన కారణం చేత మన శరీరంలో కొన్ని అవయవాలను తీసేస్తే గనుక మనం వాటిని చూసే అవకాశం ఉండదు. వైద్యులు కూడా శస్త్ర చికిత్స చేసే టైంలో తొలగించిన అవయవాన్ని మన కుటుంబ సభ్యులకు చూపిస్తారు. ఐతే మన శరీరం నుంచి వేరుచేసిన అవయవాలను చూడటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఇక్కడొక మహిళకు మాత్రం తన గుండెను తాను చూసుకునే అరుదైన అవకాశం లభించింది. అది కూడా మ్యూజియంలో అంటే నమ్మశక్యంగా లేదు కదా!. అసలేం జరిగిందంటే..లండన్‌లోని హాంప్‌షైర్‌లోని రింగ్వుడ్కి చెందిన 38 ఏళ్ల జెన్నిఫర్ సుట్టన్ ప్రస్తుతం చాలా బిజీ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంది. ఆమె విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడూ కొండలపై నడవడానికి, కొన్ని రకాల వ్యాయామాలు చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు గ్రహించింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా నిర్బంధ కార్డియోమయోపతి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల శరీరంలో రక్తాన్ని పంపు చేసే గుండె సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది. ఆమె త్వరితగతిన గుండె మార్పిడి చేయించుకోనట్లయితే చనిపోతుందని డాక్టరు చెబుతారు. సుట్టన్‌కు అప్పుడు 22 ఏళ్ల వయసు. ఓ పక్క వేగంగా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఆమెకు 2007లో తనకు సరిపోయే మరొకరి గుండె లభించినట్లు తెలిసింది. ఆ తర్వాత సుట్టన్‌కు చకచక గుండె మార్పిడి సర్జరీ జరిగిపోవండ వంటివి జరిగిపోయాయి. కానీ ఆమె ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యింది. ఎందుకంటే 13 ఏళ్ల వయసులో సుట్టన్ అదే ఆపరేషన్ కారణంగా అమ్మను కోల్పోయింది. ఐతే సట్టన్కి సర్జరీ అనంతరం స్ప్రుహలోకి రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆ తదనంతరం తన గుండెను సుట్టన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్కి లండన్ హంటేరియన్లోని హోల్బోర్న్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతిచ్చింది. దీంతో సరిగ్గా ఆమె 16 సంవత్సరాల తర్వాత తన గుండెను చూసుకుంది. ఇది తన శరీరీంలో ఉండేది కదా అనే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందని, ఇది తనకు అసాధ్యమైన గొప్ప బహుమతిగా అభివర్ణించుకుంది సుట్టన్. ఈ గుండె తనని 22 సంవత్సారాలు జీవించగలిగేలా చేసిందని అందుకు గర్వంగా ఉందని చెబుతోంది. దాత వల్లే కదా ఈ రోజు బతికబట్టగట్టిగలిగాను అందువల్ల అవయవ దానాన్ని పోత్సహించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రణాళికలను వాయిదా వేసే అలవాటు ఉన్నవారిని ఈ రోజు నుంచే అలాంటి చర్యలను తీసుకునేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను బిజీ లైఫ్‌తో ఉన్నానని, తన హృదయాన్ని పదిలంగా ఉంచుకుని సాధ్యమైనంత ఎక్కువ కాలం బతికేలా ఆరోగ్యంగా ఉండేందకు యత్నిస్తానని ఆనందంగా చెబుతోంది సుట్టన్. (చదవండి: పనోడి సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..) -
World Heart Day: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు!
World Heart Day: గుండె మార్పిడి అంటేనే, కఠినమైన, క్లిష్టమైన ప్రక్రియ. దాత శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత నిర్దిష్ట సమయంలోగా దాన్ని దాతకు అమర్చాల్సి ఉంటుంది. గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడమే దీనికి కారణం. ఫ్రిడ్జ్‌లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు ఈయన. చదవండి: చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు! ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రుబిన్స్కీ ‘‘ఐసోకోరిక్ సూపర్ కూలింగ్’’పేరుతో అభివృద్ధి చేసిన ఓ టెక్నిక్కు మరింత పదును పెట్టి అవయవ కణజాలంపై మంచు స్ఫటికాలు ఏర్పడకుండానే నిల్వ చేయగలిగారు. ఒక ద్రవంలో అవయవాన్ని లేదా భద్రపరచాల్సిన పదార్థాన్ని ఉంచి అందులోకి గాలి చొరబడకుండా చేయడం దీంట్లోని ప్రత్యేకత. మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన గుండె కణజాలాన్ని తాము ఈ పద్ధతి ద్వారా –3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయగలిగామని, ఒకరోజు నుంచి మూడు రోజులపాటు దీన్ని నిల్వ చేసి చూడగా ప్రతిసారి అది మళ్లీ కొట్టుకుందని రూబిన్స్కీ తెలిపారు. చదవండి: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి.. -
'హార్ట్' ఆఫ్ గోల్డ్‌గా చెన్నై
చెన్నై : గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు చెన్నై మహా నగరంలోని ఆసుపత్రులు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఈ శస్త్ర చికిత్స కోసం వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులంతా చెన్నైకి క్యూ కడుతున్నారు. గత ఐదేళ్ల కాల వ్యవధిలో దాదాపు 145 గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు చెన్నైలోనే జరిగాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తొమ్మిదేళ్ల మహాలక్ష్మీకి గతేడాది చెన్నైలోనే గుండెమార్పిడి శస్త్ర చికిత్స జరిగింది. ఆ పాప ఇప్పుడు స్కూల్‌కి వెళ్తుంది. బాగా చదువుకుని కార్డియాలజిస్ట్ అయి పలువురు ప్రాణాలు నిలబెడతానని చెబుతుంది. గతేడాది ఈ పాపకు బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను అమర్చారు. అలాగే కర్ణాటకకు చెందిన గణేష్ అనే వ్యాపారీ ఇటీవలే చెన్నైలో ఈ శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని చెబుతున్నాడు. అంతేకాకుండా ఏడు కేజీలు తగ్గానని... అయిన సాధారణంగానే ఉన్నానని చెబుతున్నాడు. తన వ్యాపారాన్ని ఇంకా విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిపాడు. అలాగే తన తల్లిదండ్రులను చూసుకుంటూ... తన ఆరోగ్యాన్ని పట్ల జాగ్రత్త వహిస్తున్నట్లు చెప్పాడు. డోనర్ నుంచి గుండెను ఎవరికైనా అమర్చే క్రమంలో...ఆ గుండెను వాహనంలో తరలిస్తున్న క్రమంలో ఎటువంటి ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా గ్రీన్ కారిడార్ పేరుతో చెన్నై పోలీసులు తరలిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు గుండెను తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. మరీ అత్యవసర పరిస్థితుల్లో హెలికాప్టర్లు కూడా ఇందుకోసం వినియోగిస్తున్న విషయాన్ని ఫోర్టీస్ సెంటర్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ అండ్ ట్రాన్స్‌ప్లంట్ డైరెక్టర్ డాక్టర్ సీకే బాలకృష్ణ వెల్లడించారు. అవయువ దానం అనేది తమిళనాడులో ప్రజల ఉద్యమంగా సాగుతుందన్న సంగతి తెలిసిందే. 2008లో తిరుక్రున్రంకు చెందిన హితేంద్రన్ రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్‌డెడ్ స్థితికి వెళ్లాడు. అతని అవయవాలను దానం చేసేందుకు తల్లిదండ్రులు ముందుకు వచ్చారు. హితేంద్రన్ గుండె 9 ఏళ్ల చిన్నారికి అమర్చారు. ఈ సంఘటన తమిళనాడులో అవయవ దానంపై చైతన్యాన్ని రగిల్చింది. ఈ సంఘటన తరువాతనే ఆవయవదాన పథకం అదే ఏడాది అక్టోబరులో ఆవిర్భవించిన విషయం విదితమే.