ఏదైన కారణం చేత మన శరీరంలో కొన్ని అవయవాలను తీసేస్తే గనుక మనం వాటిని చూసే అవకాశం ఉండదు. వైద్యులు కూడా శస్త్ర చికిత్స చేసే టైంలో తొలగించిన అవయవాన్ని మన కుటుంబ సభ్యులకు చూపిస్తారు. ఐతే మన శరీరం నుంచి వేరుచేసిన అవయవాలను చూడటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ ఇక్కడొక మహిళకు మాత్రం తన గుండెను తాను చూసుకునే అరుదైన అవకాశం లభించింది. అది కూడా మ్యూజియంలో అంటే నమ్మశక్యంగా లేదు కదా!.
అసలేం జరిగిందంటే..లండన్‌లోని హాంప్‌షైర్‌లోని రింగ్‌వుడ్‌కి చెందిన 38 ఏళ్ల జెన్నిఫర్ సుట్టన్ ప్రస్తుతం చాలా బిజీ జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంది. ఆమె విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడూ కొండలపై నడవడానికి, కొన్ని రకాల వ్యాయామాలు చేయడానికి చాలా కష్టపడుతున్నట్లు గ్రహించింది. దీంతో ఆమె వైద్యులను సంప్రదించగా నిర్బంధ కార్డియోమయోపతి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీని వల్ల శరీరంలో రక్తాన్ని పంపు చేసే గుండె సామర్థ్యం చాలా పరిమితంగా ఉంటుంది.
ఆమె త్వరితగతిన గుండె మార్పిడి చేయించుకోనట్లయితే చనిపోతుందని డాక్టరు చెబుతారు. సుట్టన్‌కు అప్పుడు 22 ఏళ్ల వయసు. ఓ పక్క వేగంగా ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వ్యక్తుల వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ఆమెకు 2007లో తనకు సరిపోయే మరొకరి గుండె లభించినట్లు తెలిసింది. ఆ తర్వాత సుట్టన్‌కు చకచక గుండె మార్పిడి సర్జరీ జరిగిపోవండ వంటివి జరిగిపోయాయి. కానీ ఆమె ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యింది. ఎందుకంటే 13 ఏళ్ల వయసులో సుట్టన్ అదే ఆపరేషన్ కారణంగా అమ్మను కోల్పోయింది. ఐతే సట్టన్‌కి సర్జరీ అనంతరం స్ప్రుహలోకి రావడంతో తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఆ తదనంతరం తన గుండెను సుట్టన్ రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్‌కి లండన్ హంటేరియన్‌లోని హోల్‌బోర్న్ మ్యూజియంలో ప్రదర్శనగా ఉంచేందుకు అనుమతిచ్చింది. దీంతో సరిగ్గా ఆమె 16 సంవత్సరాల తర్వాత తన గుండెను చూసుకుంది. ఇది తన శరీరీంలో ఉండేది కదా అనే ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందని, ఇది తనకు అసాధ్యమైన గొప్ప బహుమతిగా అభివర్ణించుకుంది సుట్టన్.
ఈ గుండె తనని 22 సంవత్సారాలు జీవించగలిగేలా చేసిందని అందుకు గర్వంగా ఉందని చెబుతోంది. దాత వల్లే కదా ఈ రోజు బతికబట్టగట్టిగలిగాను అందువల్ల అవయవ దానాన్ని పోత్సహించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. ప్రణాళికలను వాయిదా వేసే అలవాటు ఉన్నవారిని ఈ రోజు నుంచే అలాంటి చర్యలను తీసుకునేలా ప్రోత్సహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తాను బిజీ లైఫ్‌తో ఉన్నానని, తన హృదయాన్ని పదిలంగా ఉంచుకుని సాధ్యమైనంత ఎక్కువ కాలం బతికేలా ఆరోగ్యంగా ఉండేందకు యత్నిస్తానని ఆనందంగా చెబుతోంది సుట్టన్.
(చదవండి: పనోడి సాయంతో పేషెంట్‌కి సర్జరీ..దెబ్బతో ఆ వైద్యుడి..)
Comments
Please login to add a commentAdd a comment