న్యూఢిల్లీ: భారత సీనియర్ సీమర్ మొహమ్మద్ షమీ ఎడమ కాలి మడమకు లండన్‌లో శస్త్రచికిత్స జరిగింది. దీంతో వచ్చేనెలలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్‌కు పూర్తిగా అతను దూరమయ్యాడు. జూన్‌లో జరిగే టి20 ప్రపంచకప్ కల్లా అతను కోలుకుంటాడని జట్టు వర్గాలు భావిస్తున్నాయి.
33 ఏళ్ల పేసర్ చివరిసారిగా గత ఏడాది భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో బరిలోకి దిగాడు. ‘ఆపరేషన్ సక్సెస్ అయింది. కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది. త్వరగా కోలుకొని నడవాలనుంది’ అని షమీ ‘ఎక్స్’లో ట్వీట్ చేశాడు. షమీ వేగంగా కోలుకోవాలని ఎప్పట్లాగే కెరీర్‌ను కొనసాగించాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్‌లో ఆకాంక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment