World Heart Day
-
World Heart Day: హృదయ ఆరోగ్యానికి ఐదు జాగ్రత్తలు
గుండె జబ్బు.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య ఆరోగ్య సమస్య. ఇది అన్ని వయసుల వారినీ చుట్టుముడుతోంది. ఇటీవలికాలంలో యువతలోనూ ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవనశైలిలో మార్పుల కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంపొందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29న ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటారు.ఒక వైద్య అధ్యయనంలోని వివరాల ప్రకారం కుటుంబ చరిత్ర, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఊబకాయం, శారీరక శ్రమ లేకపోవడం, మద్యపానం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ మొదలైనవన్నీ హృదయ ఆరోగ్య సమస్యలకు కారణంగా నిలుస్తుంటాయి. అయితే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఐదు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.మద్యం, ధూమపానానికి దూరంగుండె ఆరోగ్యంగా ఉండాలంటే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండటం చాలా అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ధూమపానం అనేది ధమనుల పనితీరును దెబ్బతీసుస్తుంది. ఫలితంగా గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు పెరుగుతుంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. మద్యపానం రక్తపోటును పెంచుతుంది. గుండె పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. దీర్ఘకాలిక గుండె జబ్బుల ముప్పును గణనీయంగా పెంచుతుంది.అలసటపై నిర్లక్ష్యం వద్దుగుండెకు సంబంధించి ఏ చిన్న సమస్య వచ్చినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో సమస్యలు మొదలైనవి తీవ్రమైన గుండె సమస్యలకు సూచన కావచ్చు. ఇటువంటి సమయంలో వెంటనే చికిత్స తీసుకోవాలి. హృదయ స్పందన రేటు పెరగడం, విపరీతంగా అలసిపోయినట్లు అనిపించడం హృదయ ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు.నిద్రలేమిని విస్మరించొద్దునిద్రలేమి సమస్య ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుంది. ఆరోగ్యకరమైన దినచర్యలో నిద్ర ఒక ముఖ్యమైన భాగం. ప్రతి రోజూ రాత్రి కనీసం 6 నుంచి 8 గంటల నిద్ర అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా, హృదయ సంబంధ సమస్యలను నివారించవచ్చు. చక్కని నిద్ర పలు వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.ఒత్తిడిని జయించండి అధిక ఒత్తిడి ఆరోగ్యానికి ప్రమాదకరం. దీర్ఘకాలిక ఒత్తిడి గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని వైద్యులు చెబుతుంటారు. ఒత్తిడి కారణంగా కార్టిసాల్ హార్మోన్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్‌ను మరింతగా పెంచుతుంది. అందుకే ఒత్తిడికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి.వ్యాయామం తప్పనిసరిఫిట్నెస్పై శ్రద్ధ చూపడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం ప్రతీ రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. నడక, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. వ్యాయామం చేసే అలవాటు శరీర బరువును తగ్గించడంలో, కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. -
గుండె జబ్బు హఠాత్తుగా వచ్చేది కాదు!
నెల రోజుల క్రితం కదిరికి చెందిన డిగ్రీ చదువుతున్న ఓ యువకుడు ఇంట్లో కుప్పకూలి పోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళితే హార్ట్ఎటాక్ అని తేలింది. ఇంత చిన్న వయసులో గుండెపోటు రావడమేమిటని వైద్యులే ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. వారం రోజుల క్రితం అనంతపురానికి చెందిన 33 ఏళ్ల ఐటీ ఉద్యోగి గుండె నొప్పిగా ఉందని ఓ ఆస్పత్రికి వెళ్లారు. ఇంతలోనే సమస్య తీవ్రమైంది. చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. కారణమేమంటే తీవ్రమైన గుండె పోటు అని వైద్యులు చెప్పారు. ఎందుకిలా? నేడు వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో హృదయం గురించి సవివరంగా తెలుసుకుందాం! సాక్షి ప్రతినిధి, అనంతపురం: జీవన శైలి మార్పులు, ఆహార సమతుల్యత పాటించకపోవడం వెరసి గుండెకు పెనుముప్పు తెచ్చిపెడుతున్నాయి. గుండె జబ్బు ఒక్కసారే వచ్చి పడేది కాదు. అంతకుముందు ఎన్నో సంకేతాలు చిట్టి గుండె నుంచి వస్తూ ఉంటాయి. జాగ్రత్త పడమని సూచిస్తుంటాయి. అయితే, వాటిని పెద్దగా పట్టించుకోకపోవడం చేటు తెస్తోంది. చివరికి ప్రాణాలూ తోడేస్తోంది. ఒక్క అనంతపురం రాష్ట్రంలో గడిచిన నాలుగేళ్లలో 3 వేల పైగా జబ్బులకు రూ. 450 కోట్లు ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం ఖర్చు చేస్తే, అందులో రూ.129 కోట్లు పైగా గుండెజబ్బులకే కేటాయించడం చూస్తే పరిస్థితి తీవ్రతను అంచనా వేయచ్చు. ప్రభుత్వాలు సైతం ఏటా సెప్టంబర్ 29న ప్రపంచ గుండె దినోత్సవం ఏర్పాటు చేసి గుండె గురించి ప్రజల్లో అవగాహన కల్పించేలా యత్నం చేస్తోంది కూడా. ఈ ఏడాది థీమ్ "హృదయాన్ని ఉపయోగించండి గుండె గురించి తెలుసుకోండి". అనే నినాదంతో మరింతగా ప్రజల్లో దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలను పెద్ద ఎత్తున్న నిర్వహిస్తోంది కూడా. పల్లెలకూ పాకిన మాయదారి జబ్బు.. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా గుండెపోటు కేసులు వచ్చేవి. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకూ జీవనశైలి జబ్బులు ఎగబాకడం విస్మయం కలిగిస్తోంది. ప్రస్తుతం ప్రతి పది మందిలో ఒకరు గుండె సంబంధిత సమస్యను ఎదుర్కొంటున్నట్టు ఇండియన్ కార్డియాలజీ సొసైటీ ఇటీవల హెచ్చరించింది. జాగ్రత్తలు పాటించడంలో కనబరిచే నిర్లక్ష్యమే శాపమవుతోందని స్పష్టం చేసింది. యువకుల్లోనూ.. ఒకప్పుడు 55 ఏళ్లు దాటితేగానీ గుండె సంబంధిత జబ్బులొచ్చేవి కావు. కానీ నేడు 35 ఏళ్లకే గుండెపోటు కేసులు నమోదవుతున్నాయి. గుండెపోటును సైలెంట్ కిల్లర్‌గా వైద్యులు అభివర్ణిస్తున్నారు. గుండె పోటుకు రకరకాల కారణాలు చుట్టుముడుతున్నాయి. మధుమేహం, రక్తపోటు వంటివి కూడా ఆజ్యం పోస్తున్నట్టు హృద్రోగ నిపుణులు పేర్కొంటున్నారు. గుండె జబ్బులకు ప్రధాన కారణం.. పొగాకు, ఆల్కహాల్ విపరీతంగా తీసుకోవడం అధిక రక్తపోటు ఉంటే, నియంత్రణలో ఉంచుకోలేకపోవడం చెడు కొలె్రస్టాల్ అంటే ఎల్డీఎల్ (లో డెన్సిటీ లిపిడ్స్) ఉండటం శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ నూనెల (ట్రైగ్లిజరాయిడ్స్) శాతం వయసుకు, ఎత్తుకు మించి బరువు(ఊబకాయం) మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడంలో నిర్లక్ష్యం కుటుంబ చరిత్ర ప్రభావం కాపాడుకోవాలి ఇలా రోజూ 40 నిముషాలకు తగ్గకుండా వ్యాయామం. కొవ్వులున్న ఆహారం తగ్గించి పీచు ఆహారం ఎక్కువగా తీసుకోవడం (కూరగాయలు, ఆకుకూరలు, పళ్లు, చిరు ధాన్యాలు) బరువును అదుపులో ఉంచుకోవడం. ఒత్తిడి తగ్గించుకోవడం ఆరుమాసాలకోసారి 2డీ ఎకో వంటివి చేయించడం చెడు కొలెస్ట్రాల్‌ను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు రక్త పరీక్షలు చేయించడం బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవడం వ్యాయామమే శ్రీరామరక్ష గుండెజబ్బుల రాకుండా ఉండాలంటే రోజూ 40 నిముషాల నడక లేదా జాగింగ్, స్విమ్మింగ్ చేయాలి. కూల్‌డ్రింక్స్ తీసుకోకూడదు. రోజుకు 3 గ్రాములకు మించి ఉప్పు, నెలకు 500 మిల్లీ లీటర్ల మించి ఆయిల్ వాడకూడదు. ముఖ్యంగా పదే పదే మరిగించిన నూనెతో చేసినవి తింటే గుండెకు ఎక్కువ ముప్పు ఉంటుంది. పొగతాగడం, మద్యం అనేవి ఎప్పుడూ గుండెకు శత్రువులే. –డాక్టర్ వంశీకృష్ణ, హృద్రోగ నిపుణులు, అనంతపురం ఉచితంగా కార్పొరేట్ స్థాయి వెద్యం ప్రస్తుత రోజుల్లో చిన్న వయసు వారికీ గుండె సమస్యలు తలెత్తుతున్నాయి. జంక్ ఫుడ్, మద్యం, ధూమపానంతోనే సమస్యలు తెచ్చుకుంటున్నారు. సూపర్ స్పెషాలిటీలో కార్పొరేట్ స్థాయిలో హృద్రోగులకు సేవలు అందిస్తున్నాం. అటువంటి శస్త్రచికిత్సలు ప్రైవేట్‌గా చేసుకోవాలంటే రూ.లక్షలు వెచ్చించాలి. ఇప్పటి వరకూ దాదాపు 400 వరకు ఆంజియోప్లాస్టీ,యాంజోగ్రామ్ ఆపరేషన్లు విజయవంతంగా చేశాం. – డాక్టర్ సుభాష్‌చంద్రబోస్, కార్డియాలజిస్టు (చదవండి: జ్వరం వస్తే చాలు!.. పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకుంటున్నారా? అలా వాడితే..) -
25 ఏళ్లకే గుండె సమస్యలు..గోల్డెన్ అవర్‌లో ఇలా చేస్తే ప్రాణాలు కాపాడొచ్చు
సాక్షి, భీమవరం(ప్రకాశం చౌక్): ఈ బిజీ జీవితంలో ఒత్తిడులు, శారీరక శ్రమ లేకపోవడం మన గుండెను ప్రమాదంలోకి నెడుతోంది. మారిన ఆహార అలవాట్లు గుండె నాళాలను దెబ్బతీస్తున్నాయి. ఈ రోజు వరల్డ్ హార్ట్ డే.. అందువల్ల మన గుండెను మనం ఎంత ప్రమాదంలోకి నెడుతున్నామో తెలుసుకోవాల్సిన అవసరముంది. మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏటా 10 నుంచి 20 శాతం గుండె వ్యాధుల కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మందు, సిగరెట్లు, కల్తీ ఆహారం, అధిక నూనెలతో కూడిన ఆహారం గుండెకు ప్రమాదకరం. ఒకసారి గుండెపోటు వచ్చిన వాళ్లు తప్పనిసరిగా అలవాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. గతంలో 45 ఏళ్లు దాటాక గుండెపోటు వచ్చేది. ఇప్పుడు 25 ఏళ్లకే వస్తుంది. ఈ నేపథ్యంలో ఏటా సెప్టెంబర్ 29న వర్డల్ హార్ట్‌డే నిర్వహిస్తూ గుండెను ఎలా రక్షించుకోవాలో చెబుతున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ పీఆర్కే వర్మ గుండెను ఎలా కాపాడుకోవాలో వివరించారు. గోల్డెన్ అవర్‌లో చికిత్స ముఖ్యం గుండెపోటు వచ్చిన వక్తికి అత్యవసరంగా వాడే రెండు రకాల మాత్రాలున్నాయి. అవి ASPIRIN 325 mg, Sorbitrate 5 mg.. గోల్డెన్ అవర్(మొదటి ఆరు గంటలు)లో ఆస్పత్రిలో చేరితో గుండెపోటు వచ్చిన వ్యక్తికి అత్యవసర ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలను కాపాడుకోవచ్చు. తర్వాత పేషేంట్ గుండెకు సంబంధించి ఈసీజీ, ఈకో, యాంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించి గుండె పరిస్థితి తెలుసుకుని సరైన వైద్యం అందించవచ్చు. కరోనా తర్వాత గుండె సమస్యలు పెరుగుతున్నాయి. కోవిడ్ వల్ల రక్తం గడ్డకట్టే అవకాశం ఉంది. దాంతో గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గత ఐదేళ్లుగా గుండె వ్యాధుల కేసులు ఏటా 10 నుంచి 20 శాతం పెరుగుతున్నాయి. ప్రతి ఏడాది జిల్లాలో 10 వేల నుంచి 20 వేల కేసులు ఉంటున్నాయి. ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీ గుండె వైద్యం అంటే లక్షల్లో ఖర్చు చేయాల్సి వచ్చేది. వైఎస్సార్ పుణ్యమా అని ఇప్పుడు పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీలో గుండెకు ఉచిత వైద్యం అందుతోంది. నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆరోగ్యశ్రీను అద్భుతంగా అమలు చేయడంతో గుండెకు సంబంధించి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిల్లో గుండెకు సంబంధించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. భీమవరం వర్మ ఆస్పత్రి, తణుకు యాపిల్ ఆస్పత్రి, ఏలూరు ఆశ్రమం ఆస్పత్రి, ఏలూరు విజయ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీలో గుండె వ్యాధులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. జన్యుపరంగానూ గుండెపోటు గుండె పోటు ఇప్పుడు 20 ఏళ్లు దాటిన వారిలోనూ వస్తుంది. కొందరికి జన్యుపరంగా వస్తుంది. ఇక ముఖ్యంగా మద్యపానం, ధూమపానం చేయడం, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, బీపీ, సుగర్, ఊబకాయం వల్ల గుండెపోటు వచ్చే అవకాశముంది. అధిక ఒత్తిడి వల్ల బీపీ పెరిగి గుండెపోటుకు దారితీయవచ్చు. ఆందోళన వల్ల కూడా గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. గుండెపోటు ఎలా గుర్తించాలి గుండెపోటు వచ్చినప్పుడు ఛాతి మధ్య భాగంలో బరువుగా ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. చెమటలు పడతాయి, నడిచినా, మెట్లు ఎక్కినా ఆయాసం వస్తుంది. ఈ లక్షణాలు ఉంటే వెంటనే గుండె వైద్య నిపుణులు ఉన్న ఆస్పత్రికి వెళ్లాలి. చాలా మంది గుండెపోటును గ్యాస్ నొప్పిగా తీసుకుని సొంత వైద్యం లేదా స్థానికంగా ఉండే క్లినిక్‌ల్లో వైద్యం చేయించడానికి ప్రయత్నిస్తారు. గుండెపోటు రాకుండా ఉండాలంటే.. మద్యపానం, ధుమపానం మానాలి. ప్రతి రోజూ వ్యాయమం చేయాలి. పాస్ట్‌ఫుడ్, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహరం తీసుకోరాదు. కనీసం 45 నిమిషాలు నడవాలి. రోజుకు కనీసం 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. బీపీ, సుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. ఒత్తిడికి గురికాకుండా ఉల్లాసంగా ఉండాలి. -
మూడు పదులు నిండకుండానే 'గుండెపోట్లు'.. కారణాలివే..
సాక్షి, హైదరాబాద్: అతని పేరు కట్టా అభిజిత్‌రెడ్డి... తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు. కేవలం 22 ఏళ్ల వయసున్న అభిజిత్‌రెడ్డి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. కెమికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేసి... రూ. 58 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం పొందిన ఆ యువకుడు.. అందులో చేరేలోపే గుండెపోటుతో హఠాన్మరణం చెందడం కుటుంబ సభ్యులు సహా అందరినీ కలిచివేసింది. ఇలా కొందరు యువకులు గుండెపోట్లబారిన పడి హఠాన్మరణం చెందడం తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతోంది. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే నేపథ్యంలో ఇందుకుగల కారణాలపై కథనం. హృద్రోగాలకు కారణాలు అనేకం.. యుక్త వయసులోనే గుండెపోటు బారినపడటం ఇటీవల కాలంలో పెరిగిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దేశంలో మధుమేహం, రక్తపోటు, ఊబకాయం, కుటుంబ చరిత్ర, అసాధారణ లిపిడ్ ప్రొఫైల్, ఇతర ప్రమాద కారకాలు ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధ వ్యాధులు సంభవిస్తున్నాయంటున్నారు. పెరిగిన గుండె చికిత్సలు... కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం ఆయుష్మాన్ భారత్ నివేదిక ప్రకారం 2021లో దేశంలో 4.69 లక్షల గుండె సంబంధిత చికిత్సలు జరిగాయి. అందుకోసం రూ. 3,200 కోట్లు ఖర్చు చేశారు. 21–30 ఏళ్ల వయసులో గుండె చికిత్సలు చేయించుకున్న వారిలో 8 శాతం మంది సింగిల్ స్టెంట్లు వేయించుకున్నారు. రెండు శాతం డబుల్ స్టెంట్లు చేయించుకున్నారు. అంటే స్టెంట్లు వేయించుకున్నవారు 10 శాతం ఉన్నారు. అదే వయసుగల రోగుల్లో వాల్వ్ మారి్పడి చేయించుకున్న వారు 20 శాతం మంది, గుండె రంధ్రం పూడిక ఆపరేషన్లు చేయించుకున్న వారు 14 శాతం మంది, బైపాస్ సర్జరీలు చేయించుకున్నవారు ఒక శాతం మంది ఉన్నారు. అలాగే గుండెపోటు వచ్చి మందులు వాడేవారు 2 శాతం మంది ఉన్నారు. 31–40 ఏళ్ల వయసులో గుండె చికిత్స చేయించుకున్న వారిలో 40 శాతం మంది స్టెంట్లు వేయించుకున్నారు. బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నవారు మూడు శాతం ఉన్నారు. వాల్వ్ మార్పిడి చేయించుకున్నవారు 10 శాతం ఉన్నారు. గుండె రంధ్రం పూడిక ఆపరేషన్ చేయించుకున్నవారు 2 శాతం ఉన్నారు. మందులు వాడేవారు ఐదు శాతం ఉన్నారు. వ్యాయామం చేయని వారు 50 శాతం.. దేశంలో 18 ఏళ్లు పైబడిన వారిలో వ్యాయామం సరిగా చేయనివారు 50 శాతం వరకు ఉన్నారు. సరాసరి ఏడాదికి 5 నుంచి 7 లీటర్ల మద్యం తాగుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల వల్ల 20–25 శాతం ముందస్తు మరణాలు సంభవిస్తున్నాయని నివేదికలు చెబుతున్నాయి. ఆయా కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కాలేజీ కరోనా తర్వాత యువతలో గుండెపోట్లు పెరిగాయి.. గతంతో పోలిస్తే యువకుల్లో గుండెపోట్లు పెరిగాయి. కరోనా తర్వాత అవి మరింత ఎక్కువయ్యాయి. దీనికి ప్రధానం కారణం ఒత్తిడి. రాత్రి నిద్ర తక్కువ పోవడం వల్ల పగలు ఒత్తిడి పెరుగుతుంది. కోవిడ్ తర్వాత ఇన్ఫెక్షన్ వల్ల రక్తం గడ్డకట్టే గుణం పెరిగింది. రక్తం చిక్కబడి బ్రెయిన్, లంగ్స్, గుండెలో ఎక్కడైనా గడ్డకట్టొచ్చు. దీంతో గుండెపోట్లు పెరుగుతున్నాయి. ఒక్కోసారి గుండె వేగం నిమిషానికి 200 దాటి కొట్టుకుంటోంది. దీనివల్ల కూడా గుండెపోట్లు వస్తున్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు రాత్రివేళల్లో పనిచేయడం వల్ల హార్మోన్ల సమస్యలతో గుండెపోట్లు వస్తున్నాయి. కనీసం 6–7 గంటల నిద్ర ఉండాలి. కనీసం 45 నిమిషాలు నడవాలి. – డాక్టర్ శేషగిరిరావు, గుండె వైద్య నిపుణుడు, హైదరాబాద్ చదవండి: గుట్టుచప్పుడుగా ‘గుండెపోటు’.. ఇలా గుర్తుపట్టొచ్చు -
World Heart Day: లైట్ తీసుకోవద్దు, మరి ఏం చేయాలి?
-
జిమ్ చేసి కండలు పెంచితే చాలా? గుండె కోసం ఏం చేయాలి?
సాక్షి, హైదరాబాద్: గత 20 ఏళ్లలో యువతలో గుండెపోటు 200 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో మరణించేవారిలో దాదాపు 50శాతం మంది భారతీయులే. మరీ ముఖ్యంగా కోవిడ్-19 కారణంగా కార్డియాక్ అరెస్ట్ కేసులు పెరుగుతుండటం గమనార్హం. గుండె సమస్యల కారణంగా 40-50 సంవత్సరాల వయస్సు వారే ఎక్కువగా చనిపోతున్నారు. ఫిట్‌గా, సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు కనిపిస్తూ కూడా గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి కాలంలో నటుడు సిద్ధార్థ్ శుక్లా , నటి మందిరా బేడీ భర్త రాజ్ కౌశల్ వంటి ప్రముఖుల మరణాలే ఇందుకు ఉదాహరణ. ఆహార అలవాట్లు జీవనశైలిలో మార్పులే కారణమని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన శరీరంలో అతి కీలకమైన గుండెకు ఒక్కసారి సమస్య వచ్చిందంటే.. దాన్ని సరి చేయడం అంత తేలిక కాదు. అందుకే నివారణే ముఖ్యం. రోజులు, నెలలు సంవత్సరాలబడి నిమిషానికి 70-80 సార్లు కొట్టుకునే గుండెను లైట్ తీసుకుంటే మూల్యం చెల్లించక తప్పదు. మన వాహనాల ఇంజీన్లను ఎలారిపేర్ చేస్తామో శుభ్రం చేసుకుంటామో,దాని కోసం ఎంత శ్రద్ధ పెడతామో మన హృదయంపై అంతకంటే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. టైం లేదు లాంటి కుంటి సాకులు చెబితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. టీవీ చూసేందుకు, పేపర్ చదివేందుకు, స్మార్ట్‌ఫోన్ కోసమే కాదు వ్యాయామంకోసం కూడా కొంత సమయాన్ని వెచ్చించాల్సిందే. గుండె జబ్బులకు ఒక ముఖ్యమైన కారకం ఒత్తిడి. తీవ్రమైన ఒత్తిడి గుండెపోటుకు దారితీస్తుందని. దీర్ఘకాలిక ఒత్తిడి గుండె ధమనుల లోపలి పొరల్లో వాపుకు కారణమవుతుంది. అలాగే రక్తం గడ్డకట్టడంతో పాటు గుండెపోటుకు దారితీస్తుందని ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌లు చెబుతున్నారు. పోటీ ప్రపంచంలో కాలంతో పరిగెడుతున్న క్రమంలో జీవనశైలిలో స్పష్టమైన మార్పులతోపాటు ధూమపానం పెరుగుదలలాంటి ముఖ్యమైన మార్పులను మనం మర్చి పోకూడదు, అంటే వేళా పాళా లేని ఆహార అలవాట్లకు తోడు ఫాస్ట్ ఫుడ్ కల్చర్, విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, తీవ్ర ఒత్తిడి, డెడ్లైన్లు. దీనికి తోడు కాలుష్యం ముఖ్యంగా మెట్రో నగరాల్లో తన ప్రభావాన్ని భారీగానే చూపుతోంది. కాలుష్యంతో ధమనులవాపు, గుండెపోటు ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది. ప్రతి భారతీయుడు యూరోపియన్ల కంటే మూడు రెట్లు, చైనీయుల కంటే ఆరు రెట్లు ఎక్కువ, జపనీస్ కంటే ఇరవై రెట్లు ఎక్కువగా గుండెపోటుకు గురవుతున్నారు. అందులోనూ మధుమేహం ఉన్న వ్యక్తికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఆరు రెట్లు ఎక్కువ. ఆరోగ్యకరమైన గుండె కోసం వారానికి ఐదు సార్లు రోజుకు 45 నిమిషాలు వేగంగా నడవడంవల్ల గుండెపోటు వచ్చే అవకాశాలను 20శాతం తగ్గించవచ్చు. ఒకేసారి 45 నిమిషాలు సాధ్యం కాకపోయినా, ఉదయం 25 నిమిషాలు, సాయంత్రం 25 నిమిషాలుగా కూడా డివైడ్ చేసుకోవచ్చు. ఒత్తిడిని జయించి, గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మంచి వ్యాయామం కావాలి. గుండె ఆరోగ్యానికి నడక ఉత్తమమైంది. వాకింగ్, సైక్లింగ్‌తోపాటు యోగా, ఏరోబిక్స్‌ను మిక్స్ చేసి ఎక్సర్సైజ్ చేయవచ్చు. లిఫ్ట్ బదులు, మెట్లు ఎక్కండి. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఇది మరో బెస్ట్ ఐడియా. టీ విరామాన్ని వ్యాయామ బ్రేక్‌గా మార్చుకోవడం మరో మార్గం. ఇందుకోసం ప్రతి ఆఫీసులో ట్రెడ్మిల్ ఏర్పాటు చేసుకోండి. అయితే రోజూ 10 నుండి -20కి.మీ రన్నింగ్ లేదా జాగింగ్‌కి చేస్తే గుండెకు, శరీరానికి హానికరం ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. జిమ్‌లో విపరీతంగా కసరత్తు చేసి చక్కటి బాడీబిల్డింగ్ పెంచుకున్నంత మాత్రాన గుండె ఆరోగ్యంగా ఉన్నట్టు కాదు అనేది గమనించాల్సిన ముఖ్య అంశం. 25 శాతం గుండె జబ్బులకు ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదు. 30-40శాతం మంది ఎలాంటి బ్లాక్స్ లేకుండానే గుండెపోటుకు గురవుతున్నారు. కుటుంబంలో ఎవరికైనా 60 సంవత్సరాల కంటే తక్కువ వయస్సులో గుండెపోటు వచ్చినా, ఆకస్మిక మరణం సంభవించినా ఆయా కుటుంబాల్లోని వారికి గుండె సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంది. అలాగే మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారు, ధూమపానం అలవాటు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ చేయించు కోవాలి. ఇది 20 సంవత్సరాల వయస్సులోనే మొదలు కావాలి. 30 సంవత్సరాల వయస్సులోపు వారు ప్రతి సంవత్సరం బ్లడ్ కొలెస్ట్రాల్ స్థాయిలను చెక్ చేయించుకోవాలి. -
ఆ వయసులోపు వారిలో కూడా పెరుగుతున్న గుండెపోటు..
మారుతున్న జీవనశైలి, స్తబ్దమైన యాంత్రిక జీవనం, పెరుగుతున్న మానసిక ఒత్తిడి, సమయ పాల నలేని ఆహారం, రక్తపోటు, షుగర్ వ్యాధితో పాటు శరీర బరువుపై అదుపుకోల్పోవడం, వైద్య పరీక్షలకు నిర్లక్ష్యం చేయడం వల్ల గుండె సమస్యలకు ప్రధాన కారణం అవుతుంది. దీంతో పాటు మధుమేహం అధిక ముప్పుగా మారింది. అధిక రక్తపోటు, ఊబకాయ సమస్యలూ తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రెండేళ్లుగా సహజంగా గుండెపోటు మరణాలు పెరిగాయి. దీనికితోడు కరోనా మహమ్మారి వల్ల రెట్టింపు అయ్యాయి. ప్రమాదవశాత్తు కాకుండా వయసుతో సంబంధం లేకుండా చోటుచేసుకునే మరణాల్లో ఎక్కువగా గుండె పోటుతోనే అనేది చేదునిజం. బుధవారం వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ప్రత్యేక కథనం. జిల్లాలో 35శాతం బాధితులు ఉమ్మడి జిల్లాలో గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారు 35శాతం ఉన్నట్లు అంచనా. వీరిలో మగవారు 22శాతం, మహిళలు 13 శాతం ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం, పట్టణాల్లో వీరి 56శాతం ఉంటుందని వైద్యాధికారుల తేల్చారు. ఆకస్మిక సమస్య ఎదురైన వారిలో 10శాతం మాత్రమే చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. 20ఏళ్ల లోపు వారికి.. గుండె పోటు చాలా తక్కువగా 50 ఏళ్లు దాటిన వృద్ధులకు మాత్రమే వచ్చేది. కానీ ప్రస్తుతం 20ఏళ్ల వయసు యువకుల దగ్గర నుంచి 70ఏళ్ల వరకు వస్తుంది. ప్రధాన కారణంగా అధిక ఒత్తిడి, ధూమపానం, మద్యం, చిన్న వయస్సులో షుగర్ రావడం, బీపీ, ఫాస్ట్‌ఫుడ్, లావు పెరగడం, చెడు కొలాస్ట్రాల్ వల్ల దారితీస్తున్నాయి. ఆస్పత్రికి వచ్చే 100రోగులలో 70శాతం మంది గుండె సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు. 50 నుంచి 60శాతం పెరిగాయి జిల్లాలో కోవిడ్ వల్ల 50నుంచి 60శాతం మందికి గుండె సంబంధిత సమస్యలు పెరిగాయి. కరోనా సోకిన 7నుంచి 10రోజుల మధ్య కాలంలో ఈ సమస్య బాగా వేధిస్తుంది. గతంలో అధిక కొలెస్ట్రాల్, బీపీ, షుగర్, మద్యం, సిగరెట్ వల్ల సమస్య ఉండేది. అధిక ఆయాసం, గుండె నొప్పి ఉంటే వెంటనే కార్డియాలజిస్ట్ దగ్గర సరైన చికిత్స తీసుకోవాలి. అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. – మహేష్ బాబు, కార్డియాలజిస్ట్, మహబూబ్‌నగర్ వ్యాయామం లేకపోవడం వల్లే.. చిన్నారులు నిత్యం టీవీ ఎదుట కూర్చొని చిరుతిండి తినడంతో పాటు ఎలాంటి వ్యాయామం లేకుండా ఉండటం వల్ల అధికంగా ఊబకాయం పెరిగి చిన్న వయస్సులో గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఉద్యోగులు పనులు పూర్తి చేసుకొని ఎలాంటి వ్యాయామం లేకుండా నిద్రపోవడం. తెలియకుండానే కొవ్వు పెరిగి రక్తంలో బ్లాక్స్ ఏర్పాటు అవుతాయి. దీంతో గుండె, మెదడు స్ట్రోక్ వస్తోంది. రోజు 45నిమిషాల పాటు వ్యాయామం చేసి, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకుంటే మంచిది. మాంసం వారానికి ఒక్కసారి మాత్రమే తీసుకోవాలి. – బాలశ్రీనివాస్, జనరల్ ఫిజీషియన్, మహబూబ్‌నగర్ చదవండి: Skin Care: ముడతలు, మచ్చలు, మృతకణాల నివారణకు అరటి తొక్క ఫేస్ మాస్క్.. -
World Heart Day: గుండెను గడ్డ కట్టించి, నిల్వచేశారు!
World Heart Day: గుండె మార్పిడి అంటేనే, కఠినమైన, క్లిష్టమైన ప్రక్రియ. దాత శరీరం నుంచి గుండెను వేరు చేసిన తరువాత నిర్దిష్ట సమయంలోగా దాన్ని దాతకు అమర్చాల్సి ఉంటుంది. గుండెను ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోవడమే దీనికి కారణం. ఫ్రిడ్జ్‌లో పెడితే కణజాలం పై మంచు స్ఫటికాలేర్పడి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో గుండెతోపాటు ఇతర అవయవాలను కూడా కొంచెం ఎక్కువకాలం నిల్వచేసే పద్ధతులపై ప్రపంచవ్యాప్తంగా చాలా పరిశోధనలు జరుగుతున్నాయి. వీటిల్లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త బోరిస్ రుబిన్ స్కీ విజయం సాధించారు. గుండె కణజాలాన్ని అతిశీతల ఉష్ణోగ్రతల్లో భద్రపరచడమే కాకుండా, ఆ తరువాత అది మళ్లీ కొట్టుకునేలా కూడా చేయగలిగారు ఈయన. చదవండి: చనిపోయినా.. మరో ఎనిమిది మందిని బతికించొచ్చు! ఎప్పుడో 16 ఏళ్ల క్రితం రుబిన్స్కీ ‘‘ఐసోకోరిక్ సూపర్ కూలింగ్’’పేరుతో అభివృద్ధి చేసిన ఓ టెక్నిక్కు మరింత పదును పెట్టి అవయవ కణజాలంపై మంచు స్ఫటికాలు ఏర్పడకుండానే నిల్వ చేయగలిగారు. ఒక ద్రవంలో అవయవాన్ని లేదా భద్రపరచాల్సిన పదార్థాన్ని ఉంచి అందులోకి గాలి చొరబడకుండా చేయడం దీంట్లోని ప్రత్యేకత. మూలకణాల సాయంతో అభివృద్ధి చేసిన గుండె కణజాలాన్ని తాము ఈ పద్ధతి ద్వారా –3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయగలిగామని, ఒకరోజు నుంచి మూడు రోజులపాటు దీన్ని నిల్వ చేసి చూడగా ప్రతిసారి అది మళ్లీ కొట్టుకుందని రూబిన్స్కీ తెలిపారు. చదవండి: భరించలేని నెలసరి సమస్యలా? ఈ 10 చిట్కాలు ట్రై చేయండి.. -
గుండె లయ తప్పుతోంది
సాక్షి, హైదరాబాద్: శరీరానికి కనీస వ్యాయామం లేని ఉన్నత, మధ్య తరగతి ప్రజల్లోనే కాదు....రోజంతా కాయ కష్టం చేసే పేదల్లోనూ హృద్రోగ సమస్యలు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. గత ఆరేళ్లలో ఆరోగ్యశ్రీలో జరిగిన చికిత్సలను పరిశీలిస్తే నిరుపేదల్లో హృద్రోగుల సంఖ్య ఏ విధంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. 2014–15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ వ్యాప్తంగా 19,442 మంది ఆరోగ్యశ్రీ పథకంలో గుండె చికిత్సలు చేయించుకున్నారు. 2019 నాటి కి ఈ సంఖ్య 75 వేలు దాటింది. వీటిలో సగానికిపైగా గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే నమోదు కావడం విశేషం. ఇదిలా ఉంటే నగదు చెల్లించి చికిత్స లు పొందిన వారే కాకుండా సీఎంఆర్ ఎఫ్, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్, ఈఎస్ఐ, ఆర్టీసీ, రైల్వే, ట్రాన్స్‌కో, జెన్కో వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులు వీరికి అదనం. బాధితుల్లో 60 శాతం మంది 40 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో గుండె ఆరోగ్యంపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. జీవనశైలిలో పెద్ద తేడా లేకపోవడమే ఆర్థిక సరళీకరణ విధానాల తర్వాత నగరంలో అనేక ఐటీ, అనుబంధ కంపెనీలు వెలిశాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి. కంపెనీలు ఆయా ఉద్యోగులకు టార్గెట్లు ఇస్తుండటంతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇదే సమయంలో చేతిలో పుష్కలంగా డబ్బు ఉండటంతో వీకెండ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. మద్యం, మాంసాహారాలకు అలవాటుపడ్డారు. ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారానికి బదులు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో రెడీమేడ్‌గా లభించే ఆహార పదార్థాలను, హానికరమైన శీతల పానియాలను ఎక్కువగా తీసుకుంటున్నారు .అంతేకాదు... పల్లె, పట్టణం అనే తేడా లేకుండా మారుమూల ప్రాంతాల్లోని ప్రజల జీవనశైలిలోనూ అనేక మార్పులు వచ్చాయి. ఫలితంగా ఆహార వ్యవహారాల్లో పేద, ధనికులు అనే తేడా లేకుండా పోయింది. బస్తీల్లోనే కాదు పల్లేల్లోనూ ఫాస్ట్ç ఫుడ్ సెంటర్లు, బార్లు, వైన్ షాపులు వెలిశాయి. ఇక శరీరానికి కనీస వ్యాయామం లేకపోవడంతో రక్తనాళాల్లో కొవ్వు పేరుక పోతోది. దీనికి తోడు చిన్న వయసులోనే అనేక మంది హైపర్ టెన్షన్, మధుమేహం వంటి రుగ్మతల భారినపడుతున్నారు.విటమిన్ల లోపం కూడా పరోక్షంగా గుండె జబ్బులకు కారణం అవుతుంది. ఒకప్పుడు ఆరు పదుల వయసు దాటిన వారిలే కన్పించే ఈ గుండె జబ్బులు ప్రస్తుతం పాతికేళ్ల లోపు యువకుల్లో వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. జీవనశైలి, ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. సాధ్యమైనంత వరకు ఆహారంలో పీచుపదార్థ్దాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. రక్తపోటు, మధుమేహాన్ని అదుపులో ఉంచుకునేందుకు రోజుకు కనీసం 45 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా విటమిన్ లోపాన్ని అధిగమించవచ్చు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను మెరుగు పర్చుకోవడం ద్వారా విటమిన్ లోపాలను, ఇన్ఫెక్షన్లను అధిగమించొచ్చు. మాంసం, కొవ్వు పదార్థాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలి పార్కులు, ఇతర అహ్లాదకరమైన వాతావరణంలో గడపడం ద్వారా ఒత్తిడిని జయించవచ్చు. – డాక్టర్ ఆర్వి కుమార్, డాక్టర్ సాయిసుధాకర్ ఆరోగ్య స్పృహ పెరిగింది ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం పేద, మధ్య తరగతి ప్రజల్లోనూ ఆరోగ్య స్పృహ పెరిగింది. జిల్లా, మండల కేంద్రాల్లోనూ కార్డియాలజీ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఛాతిలో ఏమాత్రం తేడా అనిపించినా వెంటనే సమీపంలో ఉన్న కార్డియాలజీ సెంటర్లకు వెళ్లి ఈసీజీ పరీక్షలు చే యించుకుంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం హృద్రోగ చికిత్సలు ఎక్కువగా జరుగుతుండటానికి ఇది కూడా ఓ కారణం. – డాక్టర్ గోఖలే, కార్డియాలజిస్ట్ -
30 ఏళ్లకే నిట్టనిలువునా కూలిపోతున్నారు
గుండెజబ్బు అంటే ముసలివాళ్లకు మాత్రమే వచ్చే సమస్య అని ఒకప్పుడు అనుకునేవాళ్లు! ఇప్పుడు ఆ తారతమ్యమేమీ లేదు. ఇరవై, ముప్పై ఏళ్లకే నిట్టనిలువునాకూలిపోతున్నవారిని.. గుండెజబ్బుల సమస్యలతో బతుకీడ్చే వాళ్లనూ చూస్తూనే ఉన్నాం! మారుతున్న జీవనశైలి అనండి.. తినే తిండిలో తేడాలనండి.. ఇంకేదైనా కారణం చెప్పండి. ఏటా కోటీ డెభ్బై తొమ్మిది లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నది మాత్రం వాస్తవం. అందుకే ఈ సమస్యపై అవగాహన మరింతపెంచేందుకు, తద్వారా ప్రాణాలను కాపాడేందుకు.. ఈ నెల 29న వరల్డ్ హార్ట్ డే నిర్వహిస్తున్నారు! గుండెజబ్బులపై సామాన్యుల్లో అవగాహన మరింత పెంచే లక్ష్యంతో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ , ప్రపంచ ఆరోగ్య సంస్థ 1999 నుంచి ఈ వరల్డ్ హార్ట్ డేను నిర్వహించడం మొదలుపెట్టాయి. అప్పట్లో వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆంటోనీ బేస్ డి లూనా ఆలోచనల నుంచి పుట్టుకొచ్చింది ఈ వార్షిక వేడుక. ఇప్పటివరకు సుమారు 100 దేశాల్లో ఏటా సెప్టెంబర్ 29ని వరల్డ్ హార్ట్ డేగా జరుపుకుంటున్నారు. 2025 నాటికల్లా ప్రపంచం మొత్తమ్మీద గుండెజబ్బులతోపాటు ఐదు అసాంక్రమిక వ్యాధుల ద్వారా జరుగుతున్న ప్రాణనష్టాన్ని కనీసం 25 శాతం తగ్గించాలన్న ప్రపంచ నాయకుల సంకల్పం కూడా ఈ వేడుకల ప్రాముఖ్యతను మరింత పెంచింది. ఎందుకంటే అసాంక్రమిక వ్యాధుల ద్వారా సంభవిస్తున్న మరణాల్లో సగం గుండె జబ్బుల కారణంగానే చోటు చేసుకుంటున్నాయి కాబట్టి. గుండెపోటు, గుండెజబ్బులకు కారణాలు? నివారించేందుకు ఉన్న మార్గాలు వంటి అంశాలపై ఆ రోజున పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గుండె సమస్యలతో ఏటా సంభవిస్తున్న 1.79 కోట్ల మరణాల్లో కనీసం 80 శాతం వాటిని నివారించే అవకాశం ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కారణాలు ఎన్నో... గుండెజబ్బులు, గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. కొందరికి పుట్టుకతోనే ఈ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. తగిన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాలే చాలామందిలో గుండెజబ్బు లేదా పోటు వచ్చేందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కారణాల్లో ఎన్ని మనకు అన్వయిస్తాయో... సమస్య మన దరి చేరేందుకు అంతే స్థాయిలో అవకాశాలు పెరుగుతాయన్నమాట. కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, వేళాపాళా లేకుండా తినడం, ఇతర అలవాట్ల కారణంగా శరీరంలో చెడు కొవ్వులు పెరిగి ధమనుల్లో గార లాంటి పదార్థం పేరుకుపోయి గుండెబ్బులు లేదా పోటుకు దారి తీస్తుందన్నది మనకు తెలిసిన విషయమే. ధమనుల్లో గార పేరుకుపోవడం శరీరంలోని ఏ భాగంలోనైనా జరగవచ్చు. గుండె ధమనుల్లో పేరుకుపోతే కరోనరీ ఆర్టరీ డిసీస్ అని పిలుస్తారు. కాళ్ల ప్రాంతంలో సంభవిస్తే పెరిఫరీ ఆర్టీరియల్ డిసీజ్ అని పిలుస్తారు. మహిళల్లో గుండె జబ్బుల లక్షణాలు వేరుగా ఉంటాయా? ఛాతీ మధ్యభాగంలో నొప్పి అనిపించడం పురుషుల్లో కనిపించే గుండెజబ్బు లక్షణం. ఛాతీలోని నొప్పి ఎడమ చేతివైపు ప్రసారం కావడం, దవడలోనూ నొప్పి ఉండటం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడటం కూడా పురుషుల్లో గుండెజబ్బు లక్షణాలే. మహిళల విషయానికి వస్తే.. కొంతమందిలో ఇదే రకమైన లక్షణాలు కనిపించవచ్చు. కానీ నొప్పి భుజాలు, మెడ, చేతులు, కడుపు, వెన్నువైపు ప్రసరించే అవకాశం ఉంటుంది. మహిళల్లో గుండెజబ్బు లక్షణం అజీర్తిని పోలి ఉంటుంది. అప్పుడప్పుడూ నొప్పి వచ్చిపోతూ ఉండవచ్చు. కొంతమందిలో అసలు నొప్పి లేకుండా కూడా ఉంటుంది. వివరించలేని యాంగ్జైటీ, వికారం, తలతిరగడం, గుండె కొట్టుకునే వేగం ఎక్కువ కావడం, చెమటలు పట్టడం మహిళల్లో కనిపించే గుండెజబ్బు లక్షణాలు. బాగా నిస్సత్తువను అనుభవించిన తరువాత మహిళల్లో గుండెజబ్బు వచ్చే అవకాశం ఎక్కువ. అంతేకాకుండా.. పురుషులతో పోలిస్తే మహిళల్లో మొట్టమొదట వచ్చే గుండెపోటు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మహిళలకు ఈస్ట్రోజెన్ ద్వారా గుండెజబ్బుల నుంచి రక్షణ ఉంటుంది కదా? ఈస్ట్రోజెన్ వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరుగుతుందన్నది వాస్తవమే. అయితే రుతుస్రావం నిలిచిపోయిన తరువాత మహిళల్లో గుండెజబ్బు అవకాశాలు ఎక్కువవుతాయి. మధుమేహం, రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే ఈస్ట్రోజెన్ ద్వారా లభించే రక్షణ బలహీనపడుతుంది. గుండె జబ్బులను గుర్తించే పద్ధతులేమిటి? యాంజియోగ్రామ్ ఒకటి. ధమనుల్లోకి అపాయకరమైన రసాయనం కాని ఒకదాన్ని పంపి ఎక్స్ రే సాయంతో రక్త ప్రవాహాన్ని పరి శీలిస్తారు. ఆ ఎక్స్ రే ఛాయాచిత్రాల సాయంతో ధమనుల్లో ఏమైనా అడ్డంకు లు ఏర్పడ్డాయా? అన్నది పరిశీలిస్తారు. ఇది కాకుండా.. ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈకేజీ) అనేది గుండెజబ్బులను గుర్తించేందుకు ఉన్న ఇంకో పద్ధతి. ఇందులో గుండె తాలూకూ ఎలక్ట్రికల్ యాక్టివిటీని పరిశీలిస్తారు. గుండె ఎంత క్రమబద్ధంగా కొట్టుకుంటోంది? గుండె కవాటాల పరిమాణం, స్థానం, గుండెకు ఏమైనా నష్టం జరిగిందా? అన్నది ఈ ఈకేజీ ద్వారా తెలుస్తుంది. మందులు, కొన్ని పరికరాల సాయంతో గుండె కొట్టుకునే క్రమంలో ఉన్న తేడాలను సరిచేయవచ్చు. అధిక రక్తపోటుకు,గుండెకు లింకేమిటి? ధమనుల్లో ప్రవహించే రక్తం నాడుల గోడలను ఎంత శక్తితో కొట్టుకుంటాయో చెప్పేదే రక్తపోటు. అధిక రక్తపోటు అంటే.. గుండె పనిచేసేందుకు ఎక్కువ కష్టపడుతోందని అర్థం. చిన్న చిన్న ధమనులు బిరుసుగా మారినప్పుడు కూడా రక్తపోటు ఎక్కువ అవుతుంది. వీటిద్వారా కూడా రక్తాన్ని ప్రవహించేలా చేసేందుకు గుండె ఎక్కువ శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది. ఈ కారణంగా ధమనులు బలహీనపడతాయి. వాటిల్లో పాచిలాంటిది పేరుకుపోయే అవకాశాలు ఏర్పడతాయి. హైపర్ టెన్షన్ అంటే..? రక్తపోటును సాధారణంగా సిస్టోలిక్, డయాస్టోలిక్ అన్న రెండు ప్రమాణాల్లో చెబుతూ ఉంటారు. సిస్టోలిక్ ప్రమాణం 120 మిల్లీమీటర్ల ఎంఎంహెచ్‌జీ (మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కురీ)గానూ, డయాస్టోలిక్ ప్రమాణం 80గానూ ఉండటం గుండె ఆరోగ్యంగా పనిచేస్తోందనేందుకు నిదర్శనం. సిస్టోలిక్ రక్తపోటు 140, డయాస్టోలిక్ ప్రమాణం 90 ఎంఎంహెచ్‌జీగా ఉంటే దాన్ని హైపర్ టెన్షన్‌గా పరిగణిస్తారు. గుండె కుంచించుకుపోయినప్పుడు ధమనుల గోడలపై పడే ఒత్తిడిని సిస్టోలిక్గా... గుండె వ్యాపించినప్పుడు ఉండే ఒత్తిడిని డయాస్టోలిక్గా వ్యవహరిస్తారు. గుండె జబ్బులు వారసత్వంగా వస్తాయా? కొన్ని కుటుంబాల్లో గుండెజబ్బులు వారసత్వంగా ఉండే అవకాశం ఉంది. అయితే అధిక రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి గుండెజబ్బుల కారకాలు వారసత్వంగా వచ్చినప్పటికీ జీవనశైలి మార్పులు, వ్యాయామం తదితర చర్యల ద్వారా తరువాతి తరం వారు గుండెజబ్బులు రాకుండా చేసుకోవచ్చు. ఆహారం పాత్ర ఏమిటి? గుండెజబ్బుల నివారణలో ఆహారం పాత్ర చాలా కీలకమైంది. తాజా కాయగూరలు, పండ్లు తీసుకోకపోతే, పశు సంబంధిత కొవ్వులు ఎక్కువగా తీసుకుంటే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి. మద్యపానం కూడా గుండె సమస్యలను ఎక్కువ చేస్తాయి. కొవ్వులు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దీర్ఘకాలం గుండెకు శ్రీరామ రక్ష అని శాస్త్రవేత్తలు చెబుతారు. -
గుండె జబ్బులకు కారణాలేంటి?
పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. గుండెను పదికాలలపాటు భద్రంగా ఉంచుకోవాలంటే తినే ఆహారం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గుండె జబ్బులకు కారణాలు, వాటికి తీసుకొవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి ఈ కింది వీడియోని క్లిక్ చేయండి. -
పాతికేళ్లకే గుండెకి తూట్లు
పట్టుమని పాతికేళ్లు కూడా ఉండవు. అయినా గుండె జబ్బులు వచ్చేస్తున్నాయి. 25–40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో గుండెపోట్లు అధికంగా వస్తున్నాయని తాజా అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. 1990 నుంచి 2016 మధ్య కాలంలో భారత్‌లో గుండె జబ్బులు 50 శాతం పెరిగాయి. భారత్‌లో ఏటా సంభవించే మరణాల్లో 17 శాతం గుండె జబ్బుల కారణంగా జరిగేవే. దేశంలో 80 లక్షల నుంచి కోటి మంది గుండెపోటు రోగులున్నారు. ఇది ప్రపంచంలో 40 శాతానికి సమానం. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే 2000 సంవత్సరం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోనూ గుండె జబ్బులు, గుండెపోట్లు ఎక్కువ అవుతూ ఉండటం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కడంతో పల్లెలకూ ఓ విధమైన పట్టణ సంస్కృతి పాకింది. నగర ప్రాంతాలతో పోలిస్తే గ్రామాల్లో పొగరాయుళ్లు ఎక్కువ. అందుకే పల్లెల్లో గుండె జబ్బులు ఎక్కువైపోతున్నాయి. గ్రామీణ భారతంలో గుండె జబ్బులు పురుషుల్లో 40 శాతం, మహిళల్లో 56 శాతం వరకూ ఎక్కువైనట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులతో వచ్చే మరణాలు తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా ఉంటే, గుండెపోట్లు వచ్చి మరణించేవారు ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువ. భారత్ ఇప్పటికే మధుమేహ వ్యాధిలో ప్రపంచ దేశాలకు రాజధానిగా మారింది. షుగర్ వ్యాధి హార్ట్ ఫెయిల్యూర్‌కి దారితీస్తూ భారత్‌లో గుండె వ్యాధిగ్రస్తుల సంఖ్యను పెంచేస్తోంది. -
మీరు హార్ట్ హీరోలు అవొచ్చు
వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మీరు హార్ట్ హీరోలు అవొచ్చు. ఇందుకు కొండలెత్తాల్సిన అవసరమేమీ లేదు. మీ వయసు ఎంతైనా.. రక్తపోటు పరీక్ష చేయించుకుంటే చాలు. మీరో బుల్లి హార్ట్ హీరో. దీంతోపాటు ధూమపానం లాంటి అలవాట్లను తక్షణమే మానేసి, ఆరోగ్యకరమైన తిండి తినడం అలవాటు చేసుకుంటే 35 ఎంఎం హార్ట్ హీరో అయిపోవచ్చు. వీటన్నింటితోపాటు రోజూ కనీసం అరగంట సేపు వ్యాయామం చేయడం మొదలుపెట్టారనుకోండి. సూపర్ హార్ట్ హీరో మీరే! మీరొక్కరే ఆరోగ్యంగా మారిపోతే మజా ఏముంటుంది చెప్పండి. అందుకే మీరు ఎలా హార్ట్ హీరో అయ్యారో చుట్టుపక్కల వాళ్లకూ చెప్పండి. వీలైతే వరల్డ్హార్ట్డే. ఓఆర్జీ వెబ్సైట్లోకి వెళ్లి ఓ పోస్టర్ సిద్ధం చేయండి. పది మందికీ తెలిసేలా ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఓ సెల్ఫీ కూడా పడేయండి. చివరగా ఒక్క మాట హీరోయిజం ఒకట్రెండు రోజులకు మాత్రమే పరిమితం చేయొద్దు. మీ గుండెను భద్రంగా ఉంచే పనులు జీవితాంతం చేస్తూనే ఉండండి. ఇంకో ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే... మీకిష్టమైన వారిని రోజుకు ఒక్కసారి హత్తుకుంటే చాలు.. ఆక్సిటోసిన్ అనే రసాయనం విడుదలై గుండె జబ్బులు రాకుండా చేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ ఆక్సిటోసిన్ కణజాలం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది కాబట్టి గుండెకు అత్యంత అరుదైన పరిస్థితుల్లో మాత్రమే కేన్సర్ సోకుతుందని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
చిరునవ్వుతో గుండె పదిలం
సాక్షిప్రతినిధి,చెన్నై: మానవ జీవితంలో ప్రతి ఒక్కరికి మానసిక ఒత్తిడులు తప్పవని అయితే నిత్యం చిరునవ్వుతో మెలగడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులను దూరం చేసుకోవచ్చునని డాక్టర్ జి.సెం గోట్టువేల్ అన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3230 వారి ఆధ్వర్యంలో ఆంధ్రా క్లబ్లో గురువారం వరల్డ్ హార్ట్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. డాక్టర్ మాట్లాడుతూ 2000 సంవత్సరం నుంచి వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాలు సాగుతున్నాయని, అంటు వ్యాధులు కాని ఇతర వ్యాధులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. ప్రతి ఏడాది 17.5 మిలియన్ల యువత గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తుందని, మరో పదేళ్లలో ఇది 23 మిలియన్లకు పెరిగే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్ననాటి గుండె వ్యాధులు ప్రారంభమవుతున్నా ఆలస్యంగా బయటపడుతుందని చెప్పారు. చాలా చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా 80 శాతం మరణాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకోవాలని సూచించారు. పొగ తాగకపోవడం, బలవర్థకమైన ఆహారం తీసుకోవడం, అధిక బరువును రాకుండా చూసుకోవడం, షుగర్, కొలెస్ట్రాల్ పట్ల అప్రమత్తంగా ఉండడం, నిరంతర వ్యాయామం అవసరమని చెప్పారు. చిరునవ్వుతో జీవించడం ద్వారా గుండె వ్యాధులు ఉన్న వారు కూడా పదేళ్ల పాటు తమ వ్యాధిని దూరం చేసుకోవచ్చని తెలిపారు. ప్రసంగం చివరలో రొటేరియన్లందరి చేత ఆహారపు అలవాట్లపై ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి వారు శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులకు అలవాటు పడాలని, పౌష్టికాహారం స్వీకరించడం ద్వారా వ్యాధికి దూరంగా ఉండవచ్చునని చెప్పారు. రొటేరియన్ నాగోజి మాట్లాడుతూ ప్రతి రోజు మనం అనేక డేలను జరుపుకుంటున్నామని, అన్నింటికంటే హార్ట్ డే ఎంతో ముఖ్యమన్నారు. హీరో జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మై కార్డియో అనే యాప్‌ను ప్రారంభించారు. ఈ యాప్‌కు ప్రతి ఒక్కరి ఎంతో ఉపయోగపడుతుందని ఒక రోజులో ఎన్ని క్యాలరీలు స్వీకరించారు, ఎన్నిక్యాలరీలు బర్న్ చేశారు అనే వివరాలను ఎప్పటికప్పుడు తెలుపుతూ ఆరోగ్య సంరక్షణ హెచ్చరికలను చేస్తుందని తెలిపారు. మంజులా కృష్ణన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్ సినీ నటుడు శివకుమార్ పాల్గొన్నారు. సాగుతున్నాయని, అంటు వ్యాధులు కాని ఇతర వ్యాధులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. చిన్ననాటి గుండె వ్యాధులు ప్రారంభమవుతున్నా ఆలస్యంగా బయటపడుతుందని చెప్పారు. చాలా చిన్న చిన్న జాగ్రత్తలను పాటించడం ద్వారా 80 శాతం మరణాలను నివారించవచ్చునని తెలిపారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ తమ జీవన శైలిని మార్చుకోవాలని సూచించారు. పొగ తాగకపోవడం, బలవర్థకమైన ఆహారం తీసుకోవడం, అధిక బరువును రాకుండా చూసుకోవడం, షుగర్, కొలెస్ట్రాల్ పట్ల అప్రమత్తంగా ఉండడం, నిరంతర వ్యాయామం అవసరమని చెప్పారు. మీ గుండెను మీరు ప్రేమించాలని, చిరునవ్వుతో జీవించడం ద్వారా గుండె వ్యాధులు ఉన్న వారు కూడా పదేళ్ల పాటు తమ వ్యాధిని దూరం చేసుకోవచ్చని తెలిపారు. ప్రసంగం చివరలో రొటేరియన్లందరి చేత ఆహారపు అలవాట్లపై ప్రతిజ్ఞ చేయించారు. డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రతి వారు శారీరక శ్రమతో కూడిన ఇంటి పనులకు అలవాటు పడాలని, పౌష్టికాహారం స్వీకరించడం ద్వారా వ్యాధికి దూరంగా ఉండవచ్చునని చెప్పారు. రొటేరియన్ నాగోజి మాట్లాడుతూ ప్రతి రోజు మనం అనేక డేలను జరుపుకుంటున్నామని, అన్నింటికంటే హార్ట్ డే ఎంతో ముఖ్యమన్నారు. హీరో జీవీ ప్రకాష్ మాట్లాడుతూ ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమంలో తాను పాల్గొనడం సంతోషకరమన్నారు. ఈ సందర్భంగా మై కార్డియో అనే యాప్‌ను ప్రారంభించారు. మంజులా కృష్ణన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా సీనియర్ సినీ నటుడు శివకుమార్ పాల్గొన్నారు. -
హృదయం పదిలం..
ఖైరతాబాద్: మెరుగైన జీవనం గడిపేందుకు ప్రతీ ఒక్కరు జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకోవాలని, నిత్యం వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గురువారం నెక్లెస్‌రోడ్డులో కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా (సీఎస్ఐ) ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తీశారు. దీనిని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో సీఎస్ఐ తెలంగాణ చాప్టర్ అధ్యక్షుడు శ్రీధర్ కస్తూరి, డాక్టర్ వై.వి.సుబ్బారెడ్డి, డాక్టర్ గణేష్, డాక్టర్ రమేష్, డాక్టర్ రమాకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. -
యంగ్ ఎటాక్
నేడు వరల్డ్ హర్ట్ డే హార్ట్ ఎటాక్స్ గురించి విన్నాం. నడి వయసులో వస్తుందని జాగ్రత్త పడతాం. హై కొలెస్ట్రాల్, హై బీపీ, హై షుగర్, హై స్ట్రెస్... వంటివి ఈ హార్ట్ ఎటాక్స్‌కి గట్టిగా ముడిపడి ఉన్నాయని తెలుసుకున్నాం. పురుషుల్లో ఎక్కువ, మహిళల్లో ఒక వయసు వరకు కాస్త తక్కువ అని చదివాం. కానీ ఇప్పుడు చిన్న వయసులో హార్ట్ ఎటాక్స్ వస్తున్నాయి! యంగ్‌గా ఉన్నప్పుడే ప్రాణాలు తీస్తున్నాయి. ఆలస్యం చేయకుండా లైఫ్స్టైల్లో మార్పులు తెచ్చుకోగలిగితే ఈ యంగ్ ఎటాక్స్‌ను నివారించుకోవచ్చు. ఒక 23 ఏళ్ల విద్యార్థి ఎమర్జెన్సీ విభాగానికి ఛాతీలో నొప్పి అంటూ వచ్చాడు. అతడిని చూసిన ఎమర్జెన్సీలోని ఫిజీషియన్స్ తొలుత దాన్ని సాధారణ ఛాతీ నొప్పిగానే భావించారు. ఎమర్జెన్సీకి ఛాతీ నొిప్పి అంటూ వచ్చిన వారికి ఈసీజీ తీసి పరీక్షించడం ఒక నియమం. డాక్టర్లనే అబ్బురానికి గురిచేస్తూ ఆ ఈసీజీలో గుండెపోటు వచ్చిన సూచనలు కనిపించాయి. అంతే... మరికొన్ని పరీక్షలు చేశారు. దాంతో అది గుండెపోటు అని స్పష్టంగా తెలిసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... అతడికి డయాబెటిస్, హైబీపీ, హైకొలెస్ట్రాల్ ఇలాంటి సమస్యలేవీ లేవు. ఆ కుర్రవాడితో మాట్లాడాక తెలిసిన విషయం ఏమిటంటే... అతడి రూమ్మేట్స్ విపరీతంగా పొగతాగుతుంటారు. ఆ పొగ (పాసివ్ స్మోకింగ్) ఇతడి మీద ప్రభావం చూపింది! ఒకప్పుడు... అంటే 1960లకు పూర్వం... రక్తనాళాలకు సంబంధించిన గుండెజబ్బులు (కరొనరీ ఆర్టరీ డిసీజ్) 40 ఏళ్లలోపు వారిలో కనిపించడం చాలా అరుదు. కరొనరీ ఆర్టరీ డిసీజ్ అనేది గుండె ధమనులకు సంబంధించిన వ్యాధి. ధమనులు అనే ఈ రక్తనాళాలే గుండెకు రక్తం, ఆక్సిజన్‌ను సరఫరా చేస్తాయి. గుండెజబ్బు కారణంగా ఈ ధమనులు సన్నబడి, రక్తం సరఫరా తగ్గిపోవడం లేదా ఒక్కోసారి రక్తప్రసరణ పూర్తిగా ఆగిపోవడం జరగవచ్చు. ఇలాంటప్పుడు ఛాతీలో నొప్పి రావచ్చు. ఈ కండిషన్‌ను యాంజినా పెక్టోరిస్ అంటారు. తగినంత రక్తసరఫరా జరగని సందర్భాల్లో గుండె కండరాలు చచ్చుపడిపోవడం ప్రారంభమవుతుంది. దాన్నే సాధారణంగా హార్ట్ ఎటాక్ (అక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ (ఏఎమ్ఐ) అంటారు. ఆ సమయంలో వచ్చే నొప్పిని గుండెపోటు అని పిలుస్తారు. ఈ 21వ శతాబ్దంలో కరొనరీ ఆర్టరీ డిసీజ్ బారిన పడే యువకుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పుడు దీన్ని ఆధునిక జీవనశైలి (నాగరికత) తీసుకువచ్చిన వ్యాధిగా చెప్పవచ్చు. మన దేశంలో గుండెపోటు అవకాశాలెక్కువ మిగతా పాశ్చాత్య దేశవాసులతో పోలిస్తే మన దేశవాసుల్లో కరొనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరీ ముఖ్యంగా ఇటీవల చిన్నవయసు వారిలోనే ఇది కనిపిస్తోంది. ఈ జబ్బు వచ్చిన అతి చిన్న వయసు వారిలో ఓ 14 ఏళ్ల చిన్నారి కూడా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. ఇక వయసు పెరుగుతుండటం ఈ జబ్బుకు ఒక రిస్క్ ఫ్యాక్టర్. స్థూలకాయమూ ఎక్కువే! పాశ్చాత్య దేశాలలో వచ్చే స్థూలకాయంతో పోలిస్తే మన దేశవాసుల్లో వచ్చే స్థూలకాయం కాస్తంత విభిన్నంగా ఉంటుంది. మన దేశవాసుల్లో ఊబకాయం ఎక్కువగా పొట్ట దగ్గర వస్తుంది. దీన్నే అబ్డామినల్ ఒబేసిటీ అంటారు. అధిక శాతం కొవ్వు నడుము వద్ద పెరగడం వల్ల ఇది కనిపిస్తుంది. దీన్నే ఆపిల్ షేప్డ్ ఊబకాయం అంటారు. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను మన పొట్ట దగ్గర్నుంచి మన కాలేయానికి నేరుగా రవాణా జరిగేలా చూస్తుంది. ఫలితంగా కాలేయంలో కొవ్వు చేరుతుంది. ఇలా కాలేయంలో కొవ్వు చేరడాన్ని ‘ఫ్యాటీ లివర్’గా పిలుస్తుంటారు. ♦ ఇక యువతలో డయాబెటిస్ కేసులు పెరుగుతుండటం కూడా గుండెపోటుకు దోహదం చేసే అంశాలలో ఒకటి. డయాబెటిస్ లేనివారితో పోలిస్తే డయాబెటిస్ ఉన్నవారిలో గుండెపోటు వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. ఒక్కోసారి అకస్మాత్తుగా మరణం కూడా సంభవించవచ్చు. గుండె రక్తనాళాల్లో / ధమనుల్లో క్లాట్స్ ఏర్పడే అవకాశాలు డయాబెటిస్ ఉన్న వ్యక్తుల్లో ఎక్కువ. అంతేకాదు... ఇలాంటివారికి కాళ్లు, మెదడులోని రక్తనాళల్లోనూ క్లాట్స్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ♦ మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఎక్కువవుతోంది. సమోసా, శ్నాక్స్‌లో ఇప్పుడు ఉప్పు ఎక్కువగా ఉంటోంది. దాంతోపాటు కొవ్వులు (ట్రాన్స్‌ఫ్యాట్స్) సైతం పెరుగుతున్నాయి. దీని వల్ల కూడా రక్తనాళాల్లో కొవ్వులు చేరి రక్తనాళాలను సన్నగా అయ్యేలా చేస్తున్నాయి. ఇది కూడా యువతలో గుండెపోటు పెరగడానికి ఒక ప్రధాన కారణం. ♦ మన యువతలో వ్యాయామం లేకపోవడం అన్నది పాఠశాల, కాలేజీ స్థాయిలోనే ప్రారంభమవుతోంది. మన విద్యావ్యవస్థలో వ్యాయామం కంటే చదువుల మీదే ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇక జిమ్‌లకు హాజరయ్యే యువత కూడా తమ కండరాలకు వ్యాయామం కల్పించడం కంటే కండరాల నిర్మాణం పైనే ఎక్కువగా దృష్టి నిలుపుతున్నారు కానీ ఏరోబిక్స్ శిక్షణపై దృష్టి కేంద్రీకరించడం లేదు. ఇప్పుడు యువత కనీసం రోజులో 30 - 60 నిమిషాలు వ్యాయామం చేయడం అవసరం. కానీ సమయం సరిపోవడం లేదనే సాకు మన దేశంలో చాలా ఎక్కువే. అధికశాతం యువకులు గుండెపోటు బారిన పడుతుండటానికీ ఇదీ ఒక ప్రధాన కారణమే. ♦ పాశ్చాత్యులతో పోలిస్తే భారతీయులలో రక్తనాళాలు చాలా సన్నగా ఉంటాయి. మరీ ముఖ్యంగా దక్షిణభారతీయుల్లో ఇవి మరీ సన్నగా ఉంటాయి. వీరికి మిగతావారితో పోలిస్తే గుండెపోటు రావడానికి కుటుంబ చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) కూడా ఒక కారణం. దాదాపు 25 శాతం మంది రోగుల్లో గుండెపోటుకు ఈ ఫ్యామిలీ హిస్టరీ అన్నదే ప్రధాన కారణం. ♦ కొన్ని వృత్తుల్లో ఎక్కువ పనిగంటలు, రాత్రుళ్లు సైతం పనిచేయాల్సి రావడం వల్ల చాలా ఎక్కువగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ♦ గుండెపోటు వల్ల కలిగే మరణాలు కేవలం ఆ కుటుంబపైనే కాకుండా సమాజం, దేశంపైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. అందుకే వాటిని నివారించడానికి అన్ని వైపుల నుంచి సమష్టిగా, సమీకృతంగా కృషి జరగాలి. లక్షణాలు సాధారణంగా చాలామందిలో ఛాతీనొప్పితో గుండెపోటు కనిపిస్తుంది. ఈ లక్షణం కనిపించే వారు 97.3 శాతం మంది, చెమటలు పట్టడం 11 శాతం మందిలో, వాంతులు లేదా వికారం 8.2 శాతం కేసుల్లో, శ్వాస ఆడకపోవడం 6.8 శాతం మందిలో కనిస్తాయి. ఈ వయసులో చాలా మందిలో వచ్చే గుండెపోటుకు కారణమైన నొప్పికి.. గ్యాస్, అజీర్ణం, అసిడిటీ కారణం అని భావిస్తుంటారు. వైద్య నిపుణులలో సైతం ఈ వయసు వారిలో బహుశా అది కరొనరీ ఆర్టరీ వ్యాధి వల్ల కావచ్చని చాలా తక్కువ మంది భావిస్తారు. ఈ అంశం కూడా చికిత్స ప్రారంభించడాన్ని ఆలస్యం చేస్తోంది. కారణాలు ♦ సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మృదువుగా ఉండాల్సిన రక్తనాళాలు గట్టిబారుతుంటాయి. దీన్నే అధెరో స్క్లిరోసిస్ అని వ్యవహరిస్తుంటారు. ఈ అథెరో స్క్లిరోసిస్ ప్రక్రియ మొదలైన ఏడాది వ్యవధిలోనే గుండెపోటు కనిపించవచ్చు. గతంలో సాధారణంగా 40 ఏళ్లకు పైబడ్డాక ఈ పరిణామం సంభవిస్తుండేది. అయితే ఇప్పుడు ఈ వయసు కంటే ముందే.. అంటే 25 నుంచి 30 ఏళ్లలోపే ఇలా రక్తనాళాలు గట్టిబారగడం కనిపిస్తోంది. కొందరిలో కొలెస్ట్రాల్ నిల్వలు చాలా నెమ్మదిగా రక్తనాళాల్లోకి చేరుతుంటాయి. కానీ కొందరిలో చాలా వేగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా పేరుకునే కొవ్వును ‘ప్లేక్స్’గా వ్యవహరిస్తుంటారు. ఈ ప్లేక్స్ రక్తనాళాల్లోకి ఎక్కువగా చేరడం వల్ల ధమనులు / రక్తనాళాలు సన్నబడి, గుండె కండరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఈ ప్లేక్స్ ఎక్కువగా చీలిపోయి క్లాట్స్ (అడ్డంకులు)గా మారి ఆకస్మికంగా గుండెకు రక్తసరఫరా తగ్గవచ్చు. ఫలితంగా గుండెపోటు రావచ్చు. ♦ యువతలో మాదక ద్రవ్యాలను తీసుకోవడం, ఆల్కహాల్ అలవాటు గుండెపోటుకు ఒక కారణం. ఈ అలవాట్ల వల్ల అథెరో స్క్లిరోసిస్ చిన్న వయసు నుంచే ప్రారంభమవుతుంది. ♦ పొగతాగడం అథెరోస్క్లిరోసిస్కూ... తద్వారా గుండెపోటుకు మరో ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ♦ జెండర్ అంశం కూడా గుండెపోటుకు ఒక ప్రధాన కారణం. మహిళలతో పోలిస్తే గుండెపోటు వచ్చే అవకాశాలు పురుషుల్లో ఎక్కువ. రుతుస్రావం ఆగిపోయే వరకు మహిళల్లో కనిపించే ఈస్ట్రోజెజ్ మహిళలకు ఒక రక్షణ కవచం. పురుషులు, మహిళలైన యువ రోగుల్లో గుండెపోటు నిష్పత్తిని పరిశీలిస్తే అది 20 : 1 గా ఉంటుంది. కానీ రుతుక్రమం ఆగిపోయాక మహిళలకూ గుండెపోటు అవకాశాలు సమానంగా ఉంటాయి. ♦ మారుతున్న ఆహారపు అలవాట్లను పరిగణనలోకి తీసుకుంటే ఆహారంలో గుండెకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) తగ్గడం, కీడు చేసే చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్), చెడు కొవ్వులైన ట్లైగ్లిసరైడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం అన్నది కూడా యువతలో గుండెపోటు పెరగడానికి దోహదం చేసే అంశాల్లో ప్రధానమైనదే. ♦ పొట్ట దగ్గర కొవ్వు పెరగడం (సెంట్రల్ ఒబేసిటీ), ఒత్తిడి (స్ట్రెస్)తో కూడిన ఆధునిక జీవనశైలి కూడా గుండెపోటును పెంచేవే. ♦ అధిక రక్తపోటు (హైబీపీ) కూడా గుండెపోటుకు దోహదం చేస్తుంది. -
తృప్తి, ఓర్పుతోనే హృదయం పదిలం
–శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ కర్నూలు(హాస్పిటల్): తృప్తి, ఓర్పుతోనే గుండె పదిలంగా ఉంటుందని శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో వరల్డ్ హార్ట్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా చక్రపాణియాదవ్ మాట్లాడుతూ.. ఒకరినొకరు అభిమానించుకుని, గౌరవించుకోవాలన్నారు. అప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. మహాత్ముడు అహింసామార్గంలో బ్రిటిష్ వారిని తరిమికొట్టాడాని, ఆయన ప్రసాదించిన స్వాతంత్య్రాన్ని అదే దృష్టితో కాపాడుకోవాలని సూచించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మొదటిసారిగా ఓపెన్‌హార్ట్ సర్జరీ నిర్వహించడం అభినందనీయమన్నారు. కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. వరల్డ్ హార్ట్ డేను కర్నూలులో మాత్రమే ప్రతి ఏటా నిర్వహించడం అభినందనీయమన్నారు. ఏపీ కార్డియాలజిస్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి. రమేష్‌బాబు మాట్లాడుతూ.. హృదయాన్ని ప్రేమించడం నేర్చుకోవాలని, అప్పుడే ఆరోగ్యంగా ఉంటారన్నారు. అనంతరం డాక్టర్ రమేష్‌బాబుకు విశిష్ట వ్యక్తిగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ పేర్కొంటూ శాసన మండలి చైర్మన్ చక్రపాణియాదవ్ చేతుల మీదుగా సన్మానించారు. ఆ తర్వాత కుమారి అంజలి కూచిపూడి అభినయం ఆకట్టుకుంది. చివరగా హైదరాబాద్‌కు చెందిన గాయకులు శరత్చంద్ర బృందం ఆలపించిన ఘంటసాల గీతాలు అలరించాయి. కార్యక్రమంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి, ఆంధ్రాబ్యాంక్ డీజీఎం గోపాలకృష్ణ, కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యదర్శి డాక్టర్ పి. చంద్రశేఖర్, సభ్యులు డాక్టర్ భవానీప్రసాద్, డాక్టర్ వసంతకుమార్, చంద్రశేఖర కల్కూర, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హృ‘దయనీయం’
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ గుండె (హృదయం) జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అకాల మరణానికి గురి చేసే గుండెజబ్బులపై వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా భారత్‌ను గుండెజబ్బులు పట్టిపీడిస్తున్నాయి. ప్రపంచంలో గుండె జబ్బు రోగుల్లో 60 శాతం మంది భారతీయులే కావడం దయనీయం. మనిషి మరణానికి 28 నుంచి 30 శాతం వరకు గుండె జబ్బులే కారణమని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సోమవారం వరల్డ్ హార్ట్‌డే జరుపుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కథనం. గుండె పోటు లక్షణాలు... గుండె జబ్బులలో ముఖ్యమైనది గుండె పోటు (హార్ట్ ఎటాక్). గుండె పోటు వచ్చిన వ్యక్తి ఛాతిలో నొప్పి రావడం మొదలై, విపరీతంగా చెమటలు పట్టడం, ఛాతినుంచి నొప్పి వీపు భాగానికి, భుజాలకు విస్తరించడం, ఎడమ చిటికెన వేలు నొప్పి పుట్టడం మొదలై దవడ వరకు వ్యాపించడం వంటివి లక్షణాలుగా చెప్పవచ్చు. గుండెకు రక్తం సరఫరా తగ్గినపుడు గుండెపోటు కాకుండా నొప్పితో కూడిన హెచ్చరికను (అన్స్టేబుల్ యాంజిన) గమనించవచ్చు. గుండె జబ్బు తీవ్రతను బట్టి గుండె పోటు వచ్చినప్పుడు అకస్మాత్తుగా చనిపోతారు. కొంతమందిలో గుండె వేగం మరీ తక్కువగా (60 సార్లకంటే తక్కువ), ఇంకొందరిలో మరీ వేగంగా (160 సార్లకంటే ఎక్కువ) ఉండటం కూడా గుండె పోటుకు దారి తీసే లక్షణం. ఎలాంటి నొప్పి, కష్టం లేకుండా కూడా కొన్ని సార్లు గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ప్రథమ చికిత్స... గుండె పోటు వచ్చినట్టు భావించిన రోగిని విశ్రాంతిగా కూర్చోబెట్టాలి. వెంటనే డిస్ప్రిన్, యాస్ప్రిన్ 150 మిల్లీ గ్రాముల మాత్రను 350 మిల్లీ గ్రాముల నీళ్లలో కరిగించి తాగించాలి. ఇలా చేయడం ద్వారా గుండెపోటుతో మరణించే అవకాశాలు 22 శాతం తగ్గుతాయి. ప్రథమ చికిత్సను ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఇవ్వవచ్చు. సోర్బిట్రేట్, ఐసార్డిల్ 5 మి.గ్రా. మాత్రను నాలుక కింద పెట్టడం ద్వారా గుండె నొప్పి నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. వీలైనంత త్వరగా ఈసీజీ తీసి గుండె పోటును నిర్ధారించి వెంటనే ఐసీయూలో వైద్యం పొందాలి. -
నేడు ప్రపంచ హృదయ దినం
-
హృదయం పదిలం
-
హృదయం.. పదిలం..!
- మనిషి అవయవాల్లో గుండె కీలకం - శారీరక వ్యాయామం చేయాలంటున్న వైద్యులు - నేడు ‘వరల్డ్ హార్ట్ డే’ నారాయణఖేడ్: మనిషి జీవనానికి కీలకమైన అవయవం గుండె. అలాంటి కీలకమైన గుండెకు కష్టం వస్తే శారీరక వ్యాధులు దీర్ఘకాలికంగా ఇబ్బందులకు గురి చేస్తాయి. దీంతో ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. గుండె పోటుతో కన్నుమూస్తున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతుండడం ఆందోళన కలిగించే విషయమే. గుండె సంబంధిత వ్యాధుల నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డేను నిర్విహస్తోంది. ఈ సందర్భంగా కథనం. జీవన శైలి మార్పుతో ప్రమాదం: మారిన మనిషి జీవన శైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. శారీరక శ్రమ తగ్గడంతో ప్రజలకు సరైన శారీరక వ్యాయామం జరగడం లేదు. ఒత్తిళ్లు పెరగడంతో మనిషి అనారోగ్యానికి గురవుతున్నాడు. ప్రతి పనికీ యంత్రాల వాడకం పెరగడంతో కాలి నడక పూర్తిగా తగ్గిపోతోంది. రోజుకు నాలుగడుగులు వేయలేని పరిస్థితిలో కొందరు ఉంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, యువకులే కాక అన్ని వృత్తుల వారికి శారీరక శ్రమ తగ్గింది. దీంతో శరీరంలో కొవ్వు పెరిగిపోయి స్థూలకాయులుగా మారుతున్నారు. అధిక బరువుతో బాధపడే వారిలో ఎక్కువ మంది హృద్రోగ సమస్యల బారిన పడుతున్నారు. శరీరంలో అతి కీలకమైన గుండెను కాపాడుకోవాలని వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు. జిల్లాలో అధికంగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లతో చేటు: ఆహారపు అలవాట్లలో నియంత్రణ లేకపోవడంతో గుండె వ్యాధులు వస్తున్నాయి. మితిమీరిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది. ముఖ్యంగా సిగరెట్, మద్యం అధికంగా సేవించడంతో గుండెపోటు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మద్యం సేవించేటపుడు రకరకాల నూనె పదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ పదార్థాలు, మాంసాహారాన్ని, కొవ్వు ఎక్కువగా ఉండే వాటిని అధికంగా తింటున్నారు. మద్యం, కొవ్వు పదార్థాలను తీసుకోవడంతో కొవ్వు శాతం పెరిగి హృద్రోగ సమస్యలకు దారితీస్తుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు పరీక్షలు చేయించుకుంటే తప్ప గుండె సమస్యలు ఉన్నట్లు తెలుసుకోలేకపోతున్నారు. దీంతో ఆలస్యంగా చికిత్సలు చేయించుకుంటుండడంతో అప్పటికే గుండె సమస్యలు పెరిగిపోయి హార్ట్ అటాక్‌తో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. శారీరక వ్యాయామంతో గుండె సమస్యలను దూరం చేసుకోవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. -
నేడు వరల్డ్ హార్ట్ డే
న్యూఢిల్లీ: ‘గుండె గది ఖాళీ.. ఉండిపోతావా..’ అంటూ పాత సిని మాలోలా పాట పాడుకోవాలన్నా.. ‘గుండె జారి గల్లంతయ్యిం దే..’ అని కొత్త సినిమా పాటను హమ్ చేయాలన్నా నిజంగా గుండె ఆరోగ్యంగా ఉండాలి కదా..! ‘గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి వ్యాయామం చేయాలనే మీమాంస చాలామందిలో ఉంటుంది.. అయితే దానికి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు.. మీరు చేసే ఏ వ్యాయామమైనా గుండె ఆరోగ్యంగా ఉండటానికి ఉపకరిస్తుంది..’ అని గుండెజబ్బుల నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి గుండెజబ్బులపై చాలామందికి అపోహలుంటాయ్..! వాటిని అధిగమిస్తూ సరైన నిపుణుల సలహాలను పాటిస్తే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.. మరింత కాలం గుండెను పదిలంగా కాపాడుకోవచ్చు..’ అని ప్రముఖ హృద్రోగ నిపుణుడు అశోక్ సేథ్ అంటున్నారు. ‘మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి చాలా శారీరక శ్రమకు గురిచేసే బరువులు ఎత్తడం, జిమ్‌కు వెళ్లి గంటల తరబడి వ్యాయామం చేయక్కరలేదు.. 45 నిమిషాలపాటు బ్రిస్క్ వాక్ లేదా ఏరోబిక్ వ్యాయామం చేసినా చాలు మీ గుండె పదిలంగా ఉంటుంది..’ అని ఆయన వివరిం చారు. ‘మహిళల్లో హృద్రోగం వచ్చే అవకాశాలు వచ్చే చాలా తక్కువనే ఆపోహలున్నాయి. నిజానికి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వల్లే చనిపోయే వారికంటే హృద్రోగంతో చనిపోయేవారి సంఖ్య ఆరు రెట్లు ఎక్కువ..’ అని సేథ్ చెప్పారు. భారతదేశంలో మొదటి నుంచి మహిళల ఆరోగ్య విషయంలో వివక్ష కొనసాగుతూనే ఉంది.. పురుషుడికి ఏమాత్రం నలతగా ఉన్నా వెంటనే వైద్యుడి దగ్గరకు పరిగెడతాడు.. అదే మహిళలు ఎంత అనారోగ్యంతో బాధపడుతున్నా ఆస్పత్రికి పోయేందుకు ఇష్టపడరు.. వారిలో ఎటువంటి శారీరక ఇబ్బందినైనా భరించే శక్తి ఎక్కువగా ఉండటం వల్ల చిన్న చిన్న అనారోగ్యాలకు వైద్యం పొందేందుకు సుముఖత చూపించరు..’ సేథ్ వివరించారు. ‘ఎప్పుడైనా వైద్య పరీక్షలు చేయించుకున్నప్పటికీ క్యాన్సర్ కారక పరీక్షలు చేయించుకుంటా రు తప్ప ఎంతో అవసరమైన హృద్రోగ పరీక్షలు చేయించుకోరు..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీలోని మ్యాక్స్ ఆస్పత్రిలో హృద్రోగ నిపుణుడైన డాక్టర్ కె.కె.తల్వార్ మాట్లాడుతూ ‘మహిళల్లో ఉన్న ఈస్ట్రోజెన్ హార్మోన్లను వారికి ఉన్న కొన్ని అలవాట్లు (ఉదాహరణకు పొగతాగడం, సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం, గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి) నశింపజేస్తుండటంతో హృద్రోగానికి గురవుతున్నారు. మెనోపాజ్ దశ దాటిన తర్వాత దీని తీవ్రత ఎక్కువగా ఉంటోంది..’ అని వివరించారు. ‘యుక్తవయస్కుల్లో హృద్రోగం వచ్చే అవకాశాలు చాలా తక్కువనే అపోహ ఉంది.. 50 లేదా 60 ఏళ్లు దాటిన వారిలో మాత్రమే హృద్రోగం వచ్చే అవకాశాలు ఎక్కువ అన్న విషయంలో నిజంలేదు. ప్రస్తుత జీవన విధానంలో జంక్ ఫుడ్, మద్యం, పొగతాగడం, ఒత్తిడి పెరిగిపోవడం తదితర కారణాల వల్ల 30 ఏళ్ల యువతలో కూడా హృద్రోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ’ని ఆయన వివరించారు. మ్యాక్స్ ఆస్పత్రికి వచ్చే హృద్రోగ కేసుల్లో 20 శాతంవరకు 30-40 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారే అని తల్వార్ చెప్పారు. దక్షిణాసియా దేశాలతో పోలిస్తే పాశ్చాత్య దేశాల యువతలో ఈ వ్యాధి పీడితుల సంఖ్య 5-10 శాతం తక్కువగానే ఉంది. ‘ఏంజియోగ్రఫీ చేయించుకోవడానికి వస్తున్న వారిలో 5-7 శాతం మంది 35 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం..’ అని చెప్పారు. ‘ఛాతీలో ఎడమవైపు వచ్చే అన్ని నొప్పులూ గుండెపోటుగానే పరి గణించనవసరం లేదు’ అని సునీత చౌదరి అనే హృద్రోగ నిపుణురాలు తెలిపారు. ‘ఫలానా బ్రాండ్‌కు సంబంధించిన వంట నూనె లు వాడండి.. మీరు గుండెజబ్బులకు దూరంగా ఉన్నట్లే..’ అని టీవీల్లో, పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తున్న ప్రకటనలను చూసి మోసపోవద్దని హృద్రోగనిపుణులు చెబుతున్నారు. ‘కొవ్వు సంబంధ పదార్థాలు గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.. వాటి కి దూరంగా ఉంటే చాలు.. మీ గుండె పదిలంగా ఉన్నట్లే’ అని తల్వార్ తెలిపారు. నిత్యం వంటల్లో ఒకే రకమైన బ్రాండ్ నూనెను వాడకుండా అప్పుడప్పుడు బ్రాండ్ మారుస్తుండటం మంచిదని పలువురు వైద్యులు సూచిస్తున్నారు. ‘గుండె ఆరోగ్యానికి బాదం పప్పు, అక్రోట్ ఎంతో మేలు చేస్తాయి.. ప్రతిరోజూ నీటిలో 8-10 బాదంపప్పు గింజలను నానబెట్టి దానికి స్వీకరిస్తే మంచిది..’ అని సేథ్ వివరించారు.