ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్‌ని ఉపయోగించుకోవాలనే ఐడియా శుద్ధ దండుగ వ్యవహామని టెస్లా కార్ల అధినేత, ప్రపంచ కుబేరుడు ఈలాన్ మస్క్ అన్నారు. ఫైనాన్షియల్ టైమ్ష్ నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ కార్ అనే సమ్మిట్‌లో మాట్లాడుతూ ఈలాన్ మస్క్ ఈ అభిప్రాయం వ్యక్తం చేశారు.
పెట్రోల్,డీజిల్‌కు ప్రత్యామ్నయంగా సంప్రదాయేతర ఇంధన వనరులు ఉపయోగించాలనే ప్రచారం గత కొంత కాలంగా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్‌ను ఉపయోగించాలంటూ కొందరు చెబుతున్న విషయం మస్క్ దగ్గర ప్రస్తావించగా... ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ బ్యాడ్ ఛాయిస్, ఎనర్జీని ద్రవ రూపంలో నిల్వ చేయాలన్నా అతి భారీ ట్యాంకులను నిర్మించాల్సి ఉంటుంది. ఇక అది వాయురూపమైతే నిల్వ చేసే పరిమాణం ఎంత పెద్దగా ఉండాలనేది చెప్పడమే కష్టం. కాబట్టి ఎనర్జీ స్టోరేజికి హైడ్రోజన్ వాడాలనుకోవడం శుద్ధ దండగ అంటూ తెలిపాడు మస్క్.
మరోవైపు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ మాత్రం ఎనర్జీ స్టోరేజీకి హైడ్రోజన్ ఎంతో చక్కగా పనికొస్తుందని చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇండస్ట్రీ, ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్‌కి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే అభిప్రాయానికి కట్టుబడి ఉంటోంది.
Comments
Please login to add a commentAdd a comment