iphone iOS 15 Update Bugs: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య వచ్చిపడింది. ఐవోఎస్ 15 అప్‌డేట్‌తో గుడ్‌న్యూస్ అందించిన యాపిల్.. ఆ తర్వాత ఎదురవుతున్న ‘స్టోరేజ్ ఫుల్’ బగ్ విషయంలో మాత్రం త్వరగతిన పరిష్కారం చూపించడం లేదు.
యాపిల్ తన ఐఫోన్ యాజర్ల (ఐఫోన్ 6ఎస్ మోడల్ మొదలు తర్వాతి వెర్షన్‌లు) కోసం ఈ మధ్యే ఐవోఎస్ 15 అప్‌డేట్ తీసుకొచ్చింది. 2021 సెప్టెంబరు 20 నుంచి ఈ అప్‌డేట్‌ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అప్‌డేట్ చేసుకున్న వెంటనే యూజర్లకు ‘ఫోన్ మొమరీ ఫుల్’ అనే పాప్-అప్ చూపిస్తోందట. దీంతో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై కంగారుపడాల్సిన అవసరం లేదని యాపిల్ చెబుతోంది.
iPhone storage almost full బగ్ పరిష్కారం కోసం సింపుల్‌గా ఫోన్‌ను రీస్టార్ట్ చేయమని సూచిస్తోంది. కానీ, అలా చేసినా కూడా చాలామందికి సమస్య తీరడం లేదంట. పైగా కొందరికి ఫోన్‌లో ఉన్న స్పేస్ కంటే.. ఎక్కువ స్టోరేజ్ చూపిస్తోందని చెప్తున్నారు. ఇక ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లలోనూ ఇదే తరహా సమస్య ఎదురవుతోందట. సమస్య గురించి ప్రస్తావిస్తున్న వాళ్లందరికీ ఓపికగా రిప్లైలు ఇస్తున్న యాపిల్.. సమస్య ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు.
ఇన్‌స్టాగ్రామ్‌లోనూ..
ఐవోఎస్ 15 వెర్షన్ అప్‌డేట్ చేసుకున్న ఐఫోన్లలో ఇన్‌స్టాగ్రామ్ యాప్ సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. వీడియోలు, స్టోరీల విషయంలో సౌండ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు. అయితే ఇన్‌స్టాగ్రామ్ 206.1 వెర్షన్ మాత్రం ఈ బగ్‌ను ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేసుకోవడం విశేషం.
యాపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్‌లోనూ స్టోరేజ్ బగ్ ఇష్యూ తలెత్తడం కొసమెరుపు. ఇక యాపిల్ యూజర్ల కోసం 14.8 నుంచి ఐవోఎస్ 15 అప్‌డేట్‌కి చేరింది. తద్వారా ఫోన్ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్ పేర్కొంది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్, ఎక్స్‌ప్లోర్ విభాగంలో అప్‌డేట్ బాగా పని చేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం బగ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యాపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఎంత టైం పడుతుందనేది చెప్పలేదు.
చదవండి: యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు..
Comments
Please login to add a commentAdd a comment