Latest version
-
దీని అవతారాలు అన్ని... ఇన్నీ కావు!
టెక్నాలజీ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న వేళ ప్రపంచం కొత్త రంగులు పులుముకుంటోంది. ఈ రోజు మనం వాడుతున్న స్మార్ట్‌ఫోన్ ఒకప్పుడు ఇలా ఉండేది కాదని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం స్మార్ట్‌ఫోన్ అని మాత్రమే కాకుండా కంప్యూటర్, కెమరా, వాహనాలు ఇతరత్రా అన్నీ కూడా అనేక పరిణామాలు చెందుతూ వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఓ లేటెస్ట్ ఎలక్ట్రిక్ వెహికికల్ తయారవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతున్న కాలానికి అనుగుణంగా అనేక ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కెనడియన్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ ఎన్వో (ENVO) డ్రైవ్ సిస్టమ్స్ ప్రోటోటైప్ రూపంలో ఒక 'యుటిలిటీ పర్సనల్ ట్రాన్స్పోర్టర్'ను అభివృద్ధి చేస్తోంది. ఇది చూడటానికి చాలా సింపుల్‌గా ఉన్నప్పటికీ బహుళ ప్రయోజనాలకు అనుగుణంగా మార్చుకోవచ్చు. కంపెనీ ఈ సింపుల్ ఎలక్ట్రిక్ వెహికల్ 'వీమో వెలోమొబైల్'ను ఇటీవలే ప్రదర్శించింది. ఇది కంపెనీ ఒకటైన e-ATVని పోలి ఉంటుంది. ఈ వాహనాలను వినియోగదారుడు తనకి తగిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. వీటిని ఆపరేట్ చేయాలంటే వినియోగదారుడు నిలబడితే సరిపోతుంది. అయితే దీనికి డిటాచబుల్ లేదా ఫోల్డబుల్ సీటుని అమర్చుకోవచ్చు. ఆ సమయంలో కూర్చుని ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. ఈ వాహనాలను మినీ ట్రక్, గోల్ఫ్ కార్ట్, పవర్డ్ కార్గో డాలీ, రైడ్ ఆన్ లాన్ మూవర్, స్నో ప్లాఫ్, లిట్టర్ క్యారీయింగ్ బ్యాక్‌కంట్రీ రెస్క్యూ వంటి వాహనాల మాదిరిగా మాత్రమే కాకుండా.. పూర్తిగా క్లోజ్ చేసి ఒక మైక్రో కారు మాదిరిగా కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే వినియోగదారుడు ఈ వాహనాన్ని తన అవసరానికి అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉందని స్పష్టంగా అర్థమైపోతోంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలు 3-కిలోవాట్ ఇన్-వీల్ మోటార్లు, డెక్ లోపల ఎనిమిది రిమూవబుల్ బ్యాటరీల ద్వారా శక్తిని పొందుతాయి. ఇందులో 12 కిలోవాట్ బ్యాటరీ ఒక చార్జ్‌తో గరిష్టంగా 100 నుంచి 200 కిమీ పరిధిని అందిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిమీ కాగా.. 640 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇవి సుమారు 250 నుంచి 350 కేజీల బరువును లాగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇదీ చదవండి: రూ.760 జీతం నుంచి.. లక్షల కోట్ల కంపెనీ సారధిగా - ఎవరీ నాయక్ కంపెనీ ఈ ఎలక్ట్రిక్ వాహనాలను 2025 డిసెంబర్ నాటికి డెలివరీలను చేయనున్నట్లు సమాచారం, అంత కంటే ముందు బుకింగ్స్ స్వీకరించే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక వివరాలను కంపెనీ వెల్లడించాల్సి ఉంది. ఈ వెహికల్స్ బేస్ మోడల్ ధరలు 14,000 డాలర్లు, భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 10 లక్షల కంటే ఎక్కువని తెలుస్తోంది. Images Source -
Google: ఆండ్రాయిడ్ 12 ఎప్పుడంటే..
Android 12 update: ఆండ్రాయిడ్ 12 అప్డేట్పై గూగుల్ కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. నవంబర్ రెండో వారంలోపు లేటెస్ట్ వెర్షన్‌ను యూజర్ల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈలోపే ఆండ్రాయిడ్ అప్డేట్(లేటెస్ట్)కు సంబంధించిన కోడ్‌ను ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్‌లో అప్లోడ్ చేసింది. మరికొన్ని వారాల్లో రాబోతున్న గూగుల్ పిక్సెల్ ఫోన్లతో లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్డేట్ను అందించబోతోంది గూగుల్. ఆ తర్వాత శామ్సంగ్, వన్‌ప్లస్, ఒప్పో, రియల్మీ, టెన్కో, వివో, షియోమీ డివైజ్‌లకు ఇవ్వనుంది. పూర్తిస్థాయిలో ఆండ్రాయిడ్ సంబంధిత ఫోన్లకు 12-వెర్షన్ ఈ ఏడాది చివరిలోపు ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ 12 బేటా వెర్షన్ ద్వారా(పిక్సెల్ డివైస్లతోనే) ఫీడ్‌బ్యాక్ తీసుకున్న గూగుల్.. ఆండ్రాయిడ్ 12 సోర్స్‌ను ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్టు(AOSP)లో ఉంచేసింది. చదవండి: ఇంటర్నెట్తో ఇక చాలా కష్టం! ఫ్రెండ్లీ ఫీచర్స్‌తో పాటు ప్రైవసీ డ్యాష్‌బోర్డ్, డైనమిక్ బిల్ట్ లాక్ స్క్రీన్, డైనమిక్ స్క్రీన్ లైటింగ్‌తో పాటు కెమెరా ఎఫెక్ట్స్, ఫొటోల ఎడిటింగ్ ఎఫెక్ట్ అనుభవాల్ని అందించబోతోంది నయా వెర్షన్. ఇక ఆండ్రాయిడ్ 12 వెర్షన్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అక్టోబర్ 27-28 తేదీల్లో జరగబోయే ఆండ్రాయిడ్ డేవ్ సమ్మిట్‌లో తెలియజేయనున్నారు. 2010 నుంచి ఆండ్రాయిడ్‌లో ఒక్కో వెర్షన్‌ను రిలీజ్ చేస్తూ వస్తున్న గూగుల్.. ప్రస్తుతం ఆండ్రాయిడ్‌లో 11 వెర్షన్‌ని నడిపిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఐఫోన్లలో ఐవోఎస్ 15 వెర్షన్లు నడుస్తోంది. గూగుల్ క్రోమ్ వాడుతున్నారా..! ఐతే బీ కేర్‌ఫుల్...! ఈ 26 యాప్స్ ఇవి చాలా డేంజర్.. చెక్ చేస్కోండి! -
Windows 11: వచ్చిందోచ్.. మీ కంప్యూటర్ సపోర్ట్ చేస్తుందా?
మైక్రోసాఫ్ట్ వినియోగదారులకు శుభవార్త ! మైక్రోసాఫ్ట్ సంస్థ సరికొత్త అప్డేట్ విండోస్ 11ని విడుదల చేసింది. ఉచితంగానే ఈ సరికొత్త వెర్షన్‌ని మైక్రోసాఫ్ట్ సంస్థ ఇండియాలోని వినియోగదారులకు మైక్రోసాప్ట్ అందుబాటులోకి తెచ్చింది. అనువుగా ఉందా ? ప్రస్తుతం విండోస్ 10 వెర్షన్‌పై పని చేస్తున్న ల్యాప్‌టాప్, కంప్యూటర్లే విండోస్ 11 వెర్షన్‌పై పని చేయడానికి అనువుగా ఉన్నాయి. అయితే ఇందులో కూడా అన్ని విండోస్ 11కి కాంపాటిబుల్ కావు. పీసీ హెల్త్ చెకప్ వంటి యాప్‌ల ద్వారా మన దగ్గరున్న ల్యాపీ లేదా పీసీ విండోస్ 11 వెర్షన్‌కి అనువుగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు. ఇలా పొందండి కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్ అప్డేట్ ఆప్షన్ని ఎంచుకోవాలి. అక్కడున్న విండోస్ అప్డేట్లో అప్డేట్పై క్లిక్ చేయాలి. సిస్టమ్ అప్డేట్కి అనువుగా ఉంటే అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేస్తే.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి ముఖ్యమైన ఫీచర్లు మైక్రోసాఫ్ట్ చెబుతున్నదాని ప్రకారం యూజర్ ఇంటర్ఫేస్లో చాలా మార్పులు జరిగాయి. అదే విధంగా పెర్ఫామెన్స్ కూడా మెరుగ్గా ఉంటుంది. టాస్క్‌బార్, స్టార్ట్ బటన్లలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.విండోస్ 8 నుంచి వస్తోన్న లైవ్ టైటిల్స్ ఆప్షన్ని తొలగించారు. యూఐలో క్విక్ యాక్షన్స్కి చోటు కల్పించారు. మైక్రోసాఫ్ట్ స్టోర్ యాప్, డైరెక్ట్ స్టోరేజీ, ఆటో హెచ్డీఆర్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి. కొత్తవన్నీ 11 పైనే ఇప్పటికే ఆసూస్, హెచ్‌పీ, లెనోవాల నుంచి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న ల్యాప్‌టాప్, పర్సనల్ కంప్యూటర్లకు ఇప్పటికే విండోస్ 11ని అందించినట్టు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అతి త్వరలోనే ఏసర్, డెల్‌లు కూడా ఈ జాబితాలో చేరుతాయని ఆ సంస్థ ప్రకటించింది. చదవండి: కోట్లమంది చిరాకు.. డిలీట్ ఫేస్బుక్ ట్రెండ్! గ్యాప్‌లో కుమ్మేసిన ట్విటర్, టెలిగ్రామ్ -
ఐఫోన్లలో కొత్త సమస్యలా?.. ఇలా చేయండి
iphone iOS 15 Update Bugs: ఐఫోన్ యూజర్లకు కొత్త సమస్య వచ్చిపడింది. ఐవోఎస్ 15 అప్డేట్తో గుడ్‌న్యూస్ అందించిన యాపిల్.. ఆ తర్వాత ఎదురవుతున్న ‘స్టోరేజ్ ఫుల్’ బగ్ విషయంలో మాత్రం త్వరగతిన పరిష్కారం చూపించడం లేదు. యాపిల్ తన ఐఫోన్ యాజర్ల (ఐఫోన్ 6ఎస్ మోడల్ మొదలు తర్వాతి వెర్షన్లు) కోసం ఈ మధ్యే ఐవోఎస్ 15 అప్డేట్ తీసుకొచ్చింది. 2021 సెప్టెంబరు 20 నుంచి ఈ అప్డేట్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అప్డేట్ చేసుకున్న వెంటనే యూజర్లకు ‘ఫోన్ మొమరీ ఫుల్’ అనే పాప్-అప్ చూపిస్తోందట. దీంతో వేల మంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఇక ఈ సమస్యపై కంగారుపడాల్సిన అవసరం లేదని యాపిల్ చెబుతోంది. iPhone storage almost full బగ్ పరిష్కారం కోసం సింపుల్‌గా ఫోన్‌ను రీస్టార్ట్ చేయమని సూచిస్తోంది. కానీ, అలా చేసినా కూడా చాలామందికి సమస్య తీరడం లేదంట. పైగా కొందరికి ఫోన్లో ఉన్న స్పేస్ కంటే.. ఎక్కువ స్టోరేజ్ చూపిస్తోందని చెప్తున్నారు. ఇక ఐఫోన్లతో పాటు ఐప్యాడ్‌లలోనూ ఇదే తరహా సమస్య ఎదురవుతోందట. సమస్య గురించి ప్రస్తావిస్తున్న వాళ్లందరికీ ఓపికగా రిప్లైలు ఇస్తున్న యాపిల్.. సమస్య ఏంటన్నది మాత్రం చెప్పడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ.. ఐవోఎస్ 15 వెర్షన్ అప్డేట్ చేసుకున్న ఐఫోన్లలో ఇన్స్టాగ్రామ్ యాప్ సరిగా పని చేయడం లేదని తెలుస్తోంది. వీడియోలు, స్టోరీల విషయంలో సౌండ్ పని చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు కొందరు. అయితే ఇన్స్టాగ్రామ్ 206.1 వెర్షన్ మాత్రం ఈ బగ్‌ను ఆటోమేటిక్‌గా ఫిక్స్ చేసుకోవడం విశేషం. యాపిల్ సపోర్ట్ కమ్యూనిటీ ఫోరమ్‌లోనూ స్టోరేజ్ బగ్ ఇష్యూ తలెత్తడం కొసమెరుపు. ఇక యాపిల్ యూజర్ల కోసం 14.8 నుంచి ఐవోఎస్ 15 అప్డేట్కి చేరింది. తద్వారా ఫోన్ పనితీరులో మరింత మెరుగు అవుతుందని యాపిల్ పేర్కొంది. ముఖ్యంగా కనెక్టివిటీ, ఫోకస్, ఎక్స్ప్లోర్ విభాగంలో అప్డేట్ బాగా పని చేస్తుందని చెబుతోంది. ప్రస్తుతం బగ్ ఫిక్స్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు యాపిల్ ప్రతినిధి ఒకరు తెలిపారు. కానీ, ఎంత టైం పడుతుందనేది చెప్పలేదు. చదవండి: యాపిల్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 13పై రూ.46వేల వరకు.. -
‘సబ్‌నౌటిక: బిలో జీరో’ నేడే విడుదల
ఓపెన్ వరల్డ్ సౖర్వేవల్ యాక్షన్–అడ్వెంచర్ వీడియోగేమ్ ‘సబ్‌నౌటిక’ 2014 నుంచి గేమర్స్‌ను ఆకట్టుకుంటూనే ఉంది. తాజా వెర్షన్ ‘సబ్‌నౌటిక: బిలో జీరో’ నేడు విడుదల అవుతుంది. ఏలియన్ ఎన్విరాన్మెంట్ను ఎక్స్ప్లోర్ చేయడం, సౖర్వేవ్ కావడం గేమ్ ప్లాట్. ప్లాట్‌ఫామ్స్: మైక్రోసాప్ట్ విండోస్, ప్లేస్టేషన్–4,5, ఎక్స్‌బాక్స్ వన్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్, ఎస్ ► ఫ్యూచర్ టెన్స్ వీడియో వారిది–భాష మనది! వీడియో టైటిల్స్, డిస్క్రిష్షన్స్, కాప్షన్స్ స్థానిక భాషలలో ఆటోమెటిక్‌గా ట్రాన్స్లెషన్ చేసే కొత్త ఫీచర్‌ను వీడియో స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ తీసుకురానుంది. వెబ్ ఇంటర్ఫేస్, మొబైల్ యాప్ రెండిట్లోనూ ఈ సౌకర్యం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇంగ్లీష్ నుంచి పోర్చ్‌గీస్, టర్కిష్లకు మాత్రమే ఇది పరిమితం. స్థానిక భాషలకు ఉన్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నారు. ►సోషల్ మీడియా ట్విట్టర్ టిప్ జార్ సోషల్ మీడియా ప్లాట్ఫ్లామ్ ట్విట్టర్ ‘టిప్ జార్’ అనే కొత్త ఫీచర్‌ను తీసుకువస్తుంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమకు నచ్చిన కంటెంట్ క్రియేటర్లకు ఎంతో కొంత డబ్బును డొనేట్ చేయవచ్చు. సెలెక్ట్ యూజర్లు (జర్నలిస్టులు, నిపుణులు...మొదలైవారు) ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్‌లో ట్విట్ చేసేవారికే ఇది పరిమితం. -
మైక్రోసాఫ్ట్ నుంచి ఆఫీస్ 2016
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తాజాగా ఆఫీస్ 365 సాఫ్ట్వేర్ ప్యాకేజికి లేటెస్ట్ వెర్షన్ ఆఫీస్ 2016ని ప్రవేశపెట్టింది. వ్యాపార సంస్థలకు ఇది స్టాండర్డ్, ప్రొఫెషనల్ ప్లస్ ఫార్మాట్లలో లభిస్తుంది. ధర రూ. 24,844-రూ. 33,911గా ఉంటుందని మైక్రోసాఫ్ట్ తెలిపింది. మధ్య స్థాయి ప్యాకేజీ విద్యార్థుల కోసం పర్పెచ్యువల్ ప్యాకేజీ ధర రూ. 5,999, బిజినెస్ ఎడిషన్ రేటు రూ. 18,499గా ఉంటుందని పేర్కొంది. ఆఫీస్ 365ని ఇప్పటికే ఉపయోగిస్తున్న యూజర్లకు కొత్త ఆఫీస్ 2016 యాప్స్‌ను ఉచితంగా అందిస్తున్నామని మైక్రోసాఫ్ట్ ఆఫీస్ డివిజన్ (ఇండియా) డెరైక్టర్ అలోక్ లాల్ తెలిపారు. 1 టెరా బైట్ వన్ డ్రైవ్ క్లౌడ్ స్టోరేజితో ఆఫీస్ 2016 లభిస్తుందని వివరించారు. విరివిగా వినియోగంలో ఉన్న వర్డ్, పవర్‌పాయింట్, ఎక్సెల్, అవుట్‌లుక్, యాక్సెస్ వంటి ప్రోగ్రామ్‌లు ఆఫీస్ 2016 యాప్స్‌లో ఉంటాయి. క్లౌడ్ ఆధారిత ఆఫీస్ 365 సబ్స్క్రిప్షన్ ఫీజు వార్షికంగా రూ. 3,299 (ఒక్క యూజరు) నుంచి రూ. 33,911 (ప్రొఫెషనల్ ప్లస్) దాకా ఉంటుంది. -
ఈ నెల 29న విండోస్ 10 ఆవిష్కరణ
న్యూఢిల్లీ సహా 13 నగరాల్లో రిలీజ్ ఉచితంగా అప్‌గ్రేడ్ పరిమిత కాలానికే న్యూఢిల్లీ: సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన ఆపరేటింగ్ సిస్టమ్‌లో లేటెస్ట్ వెర్షన్, విండోస్ 10ను జులై 29న ప్రపంచవ్యాప్తంగా 13 నగరాల్లో ఆవిష్కరించనుంది. న్యూయార్క్ సిటీ, సిడ్నీ, టోక్యో, బీజింగ్ తదితర ఇతర నగరాలతో పాటు న్యూఢిల్లీ కూడా ఈ జాబితాలో ఉంది. ఇప్పటిదాకా ఉన్న విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లను ఉపయోగిస్తున్న వారు కొత్త వెర్షన్‌కు ఉచితంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు పరిమిత కాలం పాటు మైక్రోసాఫ్ట్ ఆఫర్ ఇస్తోంది. విండోస్ 8/8.1 లేదా 7 వెర్షన్‌ను ఉపయోగిస్తున్న డివైజ్‌లకు ఉచిత అప్‌గ్రేడ్ సదుపాయాన్ని కల్పిస్తోంది. పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్, స్మార్ట్‌ఫోన్స్, ఇతర గ్యాడ్జెట్స్‌ను ఒకదానితో మరొకటి అనుసంధానించుకుని ఉపయోగించుకునేందుకు కొత్త వెర్షన్ ఉపయోగపడుతుంది. కొత్త శకానికి నాంది... పర్సనల్ కంప్యూటింగ్‌కు సంబంధించి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం కొత్త శకానికి నాంది పలకగలదని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల చెప్పారు. ఫోన్స్ నుంచి మైక్రోసాఫ్ట్ తొలి హోలోగ్రాఫిక్ కంప్యూటర్ దాకా ప్రతి డివైజ్ పైనా ఇది పనిచేస్తుందని మైక్రోసాఫ్ట్ వరల్డ్‌వైడ్ పార్ట్నర్ కాన్ఫరెన్స్ 2015లో పాల్గొన్న సందర్భంగా ఆయన తెలిపారు. పర్సనల్ కంప్యూటింగ్, ఉత్పాదకతను పెంచుకోవడం, మరింత మెరుగైన క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించడమనే మూడు అంశాలపై మైక్రోసాఫ్ట్ ప్రధానంగా దృష్టి సారిస్తోందని నాదెళ్ల పేర్కొన్నారు. కంపెనీపరమైన కొత్త ప్రణాళికల గురించి వ్యాపార భాగస్వాములకు వివరించేందుకు మైక్రోసాఫ్ట్ ఏటా పార్ట్నర్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది.