దేశంలో ఉత్పత్తి చేసే ముడిచమురుపై అదనపు ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని (ఎస్‌ఏఈడీ లేదా విండ్‌ఫాల్) టన్నుకు రూ.9050కు తగ్గిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అక్టోబరు 18 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయి. ఇంతకు ముందు సెప్టెంబరు 29న ముడిచమురుపై విండ్‌ఫాల్ పన్ను టన్నుకు రూ.12200గా ఉంది. గతంతో పోలిస్తే రూ.3050కు తగ్గింది. డీజిల్ ఎగుమతులపై లీటర్‌కు రూ.5గా ఉన్న విండ్‌ఫాల్ సుంకాన్ని రూ.4 చేశారు. లీటర్ విమాన ఇంధనంపై సుంకాన్ని రూ.3.5 నుంచి రూ.1కు తగ్గించారు. పెట్రోల్‌పై సున్నా సుంకం కొనసాగుతుంది.
డీజిల్ అమ్మకంపై లీటర్‌కు రూ.5.5 నుంచి రూ.5కి, విమాన ఇంధనంపై లీటర్‌కు రూ.3.5 నుంచి రూ.2.5కు పన్ను తగ్గించినట్లు ప్రభుత్వం తెలిపింది. సవరించిన పన్నులు సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి వస్తాయి.
రష్యా ఉక్రెయిన్ దాడి నేపథ్యంలో భారత కంపెనీలు రష్యా నుంచి తక్కువ ధరకు ముడి చమురు దిగుమతి చేసుకున్నాయి. దాంతో దేశీయంగా చమురు ఉత్పత్తి చేస్తున్న కంపెనీలపై జులై 1, 2022 నుంచి వాటి చమురు అమ్మకాలపై కేంద్రం మొదటగా విండ్‌ఫాల్ పన్నులను విధించింది.
Comments
Please login to add a commentAdd a comment