![Record Level Of Crude Oil Parcel Reached To Visakhapatnam Port - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/25/ship.jpg.webp?itok=TBMi8PUx)
టెక్సాస్ నుంచి విశాఖ రేవుకు చేరిన క్రూడాయిల్ షిప్
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నం పోర్టుకు అతి పెద్ద క్రూడాయిల్ పార్సిల్ ఆదివారం చేరుకుంది. విశాఖ పోర్టు చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి క్రూడాయిల్ తీసుకురావడం ఇదే మొదటిసారని పోర్ట్ ట్రస్ట్ అథారిటీ అధికారులు తెలిపారు.
టెక్సాస్ నుంచి పోర్టు అధికారులు 2.72 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్‌ను తీసుకొచ్చారు. ఈ క్రూడాయిల్ తీసుకొచ్చిన భారీ షిప్ ఆదివారం సాయంత్రం పోర్టుకు చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. విశాఖలో పోర్టు ఏర్పడినప్పటి నుంచి ఇంత భారీ మొత్తంలో క్రూడాయిల్ రావడం ఇదే మొదటిసారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment