ముంబై: రూపాయి అయిదు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. డాలర్ మారకంలో 29 పైసలు క్షీణించి 74.84 వద్ద స్థిరపడింది. తూర్పు ఐరోపా దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ సంక్షోభంతో సరఫరా సమస్యలు తలెత్తవచ్చనే భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగు శాతం ఎగిశాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 98.79 డాలర్లకు చేరింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి.
దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ అగడం లేదు. ఈ అంశాలు రూపాయి పతనానికి కారణమైనట్లు ట్రేడర్లు తెలిపారు. ఇంట్రాడేలో రూపాయి 31 పైసలు క్షీణించి 74.86 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతులతో ఫారెక్స్ ట్రేడర్లు రిస్క్ ఆఫ్ వైఖరి ప్రదర్శించారు. ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడేంత వరకు రూపాయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతోంది’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పర్మార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment