Dollor
-
మళ్లీ కనిష్టాల దిశగా రూపాయి
ముంబై: ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా నాల్గవరోజు మంగళవారం కనిష్టాల దిశగా పయనించింది. 21పైసలు నష్టంతో 76.50 వద్ద ముగిసింది. భౌగోళిక ఉద్రిక్తతలు, దేశం నుంచి విదేశీ నిధుల ప్రవాహం, ఈక్విటీ మార్కెట్ల బలహీనత, అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ (రెండేళ్ల గరిష్ట స్థాయిలో 101.02కు అప్) బలోపేత ధోరణి వంటి అంశాలు దీనికి ప్రధాన కారణం. ట్రేడింగ్‌లో 76.34 వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 76.25 గరిష్ట– 76.53 కనిష్ట స్థాయిల్లో కదలాడింది. చదవండి: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్..! -
రష్యా-ఉక్రెయిన్ వార్... భారత్‌కు ఇదే గోల్డెన్ ఛాన్స్..! అమెరికాకు చెక్..!
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా, ఐరోపా సహా వివిధ దేశాలు రష్యాపైనా ఆంక్షలు విధించాయి. ఎన్నడూ లేనంతగా రష్యా ఆంక్షలను ఎదుర్కొంటుంది. ప్రపంచ దేశాల్లో అత్యధిక ఆంక్షలను కల్గిన దేశంగా రష్యా తయారైంది. ఇక ఐరోపా దేశాలు స్విఫ్ట్ సిస్టం నుంచి కూడా తొలగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిను ప్రవేశపెట్టాలని ఎస్బీఐ తన రిపోర్ట్‌లో అభిప్రాయపడింది. డాలర్ అధిపత్యం..! అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికన్ డాలర్ తన అధిపత్యాన్ని ఎప్పటినుంచో చెలాయిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు వ్యాపారాలు పూర్తిగా డాలర్‌తోనే నడుస్తున్నాయి. అమెరికన్ డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఇతర కరెన్సీను తెచ్చేందుకు పలు దేశాలు ఆలోచనలో ఉన్నాయి. కాగా గతంలోనే రష్యా తన రూబుల్ అంతర్జాతీయీకరణపై దృష్టి సారించింది. ఇప్పుడు ఉక్రెయిన్‌తో పోరు నేపథ్యంలో అమెరికా, ఐరోపా ఆంక్షల కారణంగా రష్యా వివిధ దేశాలతో నేరుగా ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధపడింది. ఈ నిర్ణయమే భారత్‌కు కలిసి రానుంది. తెరపైకి కొత్త అంతర్జాతీయ కరెన్సీ..! అమెరికాతో పాటుగా యూరప్ దేశాలు రష్యాపై భారీ ఆంక్షలను విధించడంతో తెరపైకి కొత్త అంతర్జాతీయ కరెన్సీ వాడకంపై ప్రతిపాదనలు వస్తున్నాయి. పశ్చిమ దేశాల ఆంక్షలను అధిగమించేందుకు రూపాయి-రూబుల్ లేదా రూబుల్ యువాన్ వాణిజ్యాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది భారత కరెన్సీ అంతర్జాతీయీకరణకు అవకాశంగా మారుతుందని ఎస్బీఐ తన నివేదికలో తెలిపింది. అంతేకాకుండా డాలర్‌కు ప్రత్యామ్నాయాల కోసం ప్రపంచం అన్వేషిస్తోందని, రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా మారడానికి ఇది సరైన సమయమని ఈ నివేదిక తెలిపింది. ప్రస్తుత పరిస్థితిని చూస్తుంటే అమెరికా కరెన్సీ డాలర్ ఆధిపత్యం మరికొన్ని దశాబ్దాల పాటు కొనసాగవచ్చు. అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలుదేశాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. ప్రస్తుతం రష్యాపై ఆంక్షల నేపథ్యంలో మాస్కో యువాన్ - రూబుల్ లేదా రూపాయి-రూబుల్ కోసం బ్యాక్ డోర్ చర్చలు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంతో చెల్లింపులు చేసే అంశాన్ని కూడా కొంతమంది ప్రతిపాదిస్తున్నట్లు ఎస్బీఐ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్ తెలిపారు. ప్రత్యామ్నాయం కోసం..! స్విఫ్ట్ పేమెంట్ సిస్టం నుంచి రష్యాను తొలగించడంతో ఆ దేశం భారీగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో రష్యా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.రష్యాపై విధిస్తోన్న ఆంక్షల నేపథ్యంలో రూపాయి అంతర్జాతీయీకరణ ఆలోచనకు అడుగులు పడేలా చేసిందని ఈ నివేదిక అభిప్రాయపడింది. ప్రత్యామ్నాయ చెల్లింపు, పరిష్కార విధానాలను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని కూడా వెల్లడి చేస్తోందని తెలిపింది. భారత్ రూపాయిను అంతర్జాతీయం మారకంగా వాడే గోల్డెన్ ఛాన్స్ ఇదే అంటూ నివేదికలో ఎస్బీఐ పేర్కొంది. కొన్ని ఇబ్బందులు..! రూపాయి అంతర్జాతీయ కరెన్సీగా వినియోగిస్తే ఇబ్బందులు కూడా లేకపోలేదు. ద్రవ్య పరపతి విధానం సంక్లిష్టమవుతుంది. అయితే అంతర్జాతీయ ట్రాన్సాక్షన్స్ వ్యయం మాత్రం తగ్గుతుందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రూపాయి మారకం మరింత నష్టపోకుండా ఆర్బీఐ చర్యలు చేపడుతోంది. భారత్‌కు బంపరాఫర్..! ప్రపంచదేశాలకు రష్యా క్రూడాయిల్‌ను భారీగానే సరఫరా చేస్తోంది. ఆంక్షల నేపథ్యంలో ఇది కాస్త ఇబ్బందిగా మారింది. కాగా భారత్‌కు ముడిచమురును డిస్కౌంట్ పైన అధికంగా ఇస్తామని రష్యా ప్రతిపాదించింది. ఇప్పటికే రష్యన్ చమురు సంస్థలు ఎంతో తక్కువ ధరకు చమురు ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. రష్యా జరిపే వాణిజ్యలో రూపాయి-రూబుల్ ప్రవేశపెడితే ఇరుదేశాలకు లాభం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: ఉక్రెయిన్‌పై బాంబుల మోత..! రష్యా దాడులను చెక్ పెట్టేందుకు గూగుల్ భారీ స్కెచ్..! -
రూపాయికి క్రూడ్ కష్టాలు
ముంబై: రూపాయి అయిదు రోజుల వరుస లాభాలకు మంగళవారం బ్రేక్ పడింది. డాలర్ మారకంలో 29 పైసలు క్షీణించి 74.84 వద్ద స్థిరపడింది. తూర్పు ఐరోపా దేశాల్లో నెలకొన్న భౌగోళిక, రాజకీయ సంక్షోభంతో సరఫరా సమస్యలు తలెత్తవచ్చనే భయాలతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు నాలుగు శాతం ఎగిశాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర 98.79 డాలర్లకు చేరింది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూస్తున్నాయి. దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ అగడం లేదు. ఈ అంశాలు రూపాయి పతనానికి కారణమైనట్లు ట్రేడర్లు తెలిపారు. ఇంట్రాడేలో రూపాయి 31 పైసలు క్షీణించి 74.86 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ అనిశి్చతులతో ఫారెక్స్ ట్రేడర్లు రిస్క్ ఆఫ్ వైఖరి ప్రదర్శించారు. ఫెడ్ సమావేశ నిర్ణయాలు వెలువడేంత వరకు రూపాయి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతోంది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ దిలీప్ పర్మార్ తెలిపారు. -
అయ్యో రూపాయి! వరుసగా మూడోరోజూ క్రాష్..!
ముంబై: డాలర్ మారకంలో రూపాయి పతనం కొనసాగుతోంది. మంగళవారం మరో 16 పైసలు క్షీణించి 75.52 వద్ద ముగిసింది. రూపాయికిది వరసగా మూడోరోజూ నష్టాల ముగింపు కాగా.., మొత్తం 73 పైసలు పతనమైంది. ఫారెక్స్ మార్కెట్లో మంగళవారం ఉదయం 75.41 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో 75.66 వద్ద కనిష్టాన్ని 75.16 గరిష్టాన్ని తాకింది. ‘‘అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ కొన్నేళ్ల గరిష్టస్థాయి వద్ద ట్రేడ్ అవుతోంది. యూఎస్ ట్రెజరీ ఈల్డ్స్ 1.6% పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 80 డాలర్ల స్థాయిని దాటింది. ఈ అంశాలు దేశీయ కరెన్సీపై ఒత్తిడిని పెంచాయి. స్వల్పకాలం పాటు రూపాయి 74.90 – 75.80 పరిధిలో ట్రేడ్ అవ్వొచ్చు’’ అని రిలయన్స్ సెక్యూరిటీస్ సీనియర్ రీసెర్చ్ హెడ్ శ్రీరామ్ అయ్యర్ తెలిపారు. గతేడాది(202) ఏప్రిల్‌లో రూపాయి 76.87 స్థాయి వద్ద జీవితకాల కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. చదవండి: Economy: ఎకానమీలో వెలుగు రేఖలు -
నిఫ్టీ పదహారువేల మార్క్ దాటేనా?
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్రవ్య విధాన కమిటీ నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలే ఈ వారం స్టాక్ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అంతర్జాతీయ పరిణామాలు, దేశీయ ఈక్విటీ పట్ల విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, వ్యాక్సినేషన్ తదితర అంశాలు కూడా మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చని అంటున్నారు. పైన పేర్కొన్న అంశాలతో పాటు డాలర్ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ‘‘విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతున్నప్పటికీ.., ప్రాథమిక మార్కెట్లో ఐపీఓలకు లభిస్తున్న అపూర్వ ఆదరణతో స్టాక్ మార్కెట్లో ఇప్పటికీ సానుకూల వాతావరణం కొనసాగుతోంది. ఈ వారంలోనూ సూచీలు పరిమిత శ్రేణిలోనే ట్రేడ్ అవ్వొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని ఎదుర్కొవల్సి వస్తుంది. దిగువస్థాయిలో 15,600 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని శామ్కో సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ నిరాళీ షా తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న మిశ్రమ సంకేతాలతో దేశీయ మార్కెట్ రెండోవారమూ అమ్మకాల ఒత్తిడికి లోనైంది. ఆటో, బ్యాంకింగ్, ఇంధన, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లలో విక్రయాలు తలెత్తడంతో గతవారంలో సెన్సెక్స్ 388 పాయింట్లు, నిఫ్టీ 93 పాయింట్లను నష్టపోయాయి. అందరి చూపు ఆర్బీఐ వైపు... ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం(ఆగస్ట్ 4న) ప్రారంభం కానుంది. పాలసీ కమిటీ నిర్ణయాలను ఆగస్ట్ ఆరున ఆర్బీఐ ఛైర్మన్ శక్తికాంత్‌దాస్ వెల్లడించనున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చని ఆర్థివేత్తలు భావిస్తున్నారు. అయితే ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణ అంశాలపై ఆర్బీఐ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. స్థూల ఆర్థిక, ఆటో విక్రయ గణాంకాలు... ఆటో కంపెనీలు జూలై వాహన విక్రయ గణాంకాల విడుదలను ఆగస్ట్ ఒకటి నుంచి వెల్లడించడం షురూ చేశాయి. పలు కంపెనీలు వాహన ధరల్ని పెంచిన నేపథ్యంలో వాహన అమ్మకాలపై ధరల పెంపు ప్రభావం ఉండొచ్చు. కావున ఈ రంగ స్టాకులు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్ అవ్వొచ్చు. ఇక ఆగస్ట్ రెండో తేదిన (సోమవారం) జూలై నెలకు సంబంధించిన మార్కిట్ పారిశ్రామిక రంగ పీఎంఐ గణాంకాలు, జూన్ మాసపు తయారీ రంగపు డాటా 4వ తేదిన(బుధవారం) వెల్లడికానున్నాయి. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు... దేశీయ కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాల ఘట్టం కీలక దశకు చేరుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అవంతీ ఫీడ్స్, అల్కేమ్ అమైన్స్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్, బీపీసీఎల్, సిప్లా, డాబర్, ఇమామీ, ఎస్కార్ట్స్, గెయిల్, గ్లెన్‌మార్క్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో, వోడాఫోన్ ఐడియా, నాల్కో, ఇన్ఫోఎడ్జ్, పీఎన్బీ, ఎస్బీఐ, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్ వంటి ప్రధాన కంపెనీలు వాటి జూన్ త్రైమాసిక ఆర్థిక గణాంకాలను వెల్లడించనున్నాయి.ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. నాలుగు ఐపీఓలు... ప్రాథమిక మార్కెట్లో ఐపీఓల సందడి కొనసాగుతోంది. ఈ వారంలో ఒకేరోజు నాలుగు కంపెనీలు ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. దేవయాని ఇంటర్నేషనల్, విండ్లాస్ బయోటెక్, ఎక్సారో టైల్స్, కృష్ణా డయాగ్నటిక్స్ తదితర కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఈ నాలుగు ఇష్యూలు ప్రాథమిక మార్కెట్ ఇన్వెస్టర్ల నుంచి మొత్తం రూ.3,614 కోట్లను సమీకరించనునున్నాయి. ఈ ఐపీఓలు ఆగస్ట్ నాలుగవ తేదీ (బుధవారం)న ప్రారంభమై.., ఎనిమిదో తేది (శుక్రవారం) ముగియనున్నాయి. ఆగస్ట్ 6న గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ లిస్టింగ్... హెల్త్‌కేర్ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ అనుబంధ సంస్థ గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్స్ షేర్లు శుక్రవారం(ఆగస్ట్ 6న) ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓను ఈ జూలై 27– 29 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 695–720 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1,514 కోట్లు సమకూర్చుకుంది. ఐపీఓ చివరి రోజు నాటికి 44.17 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.720తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.130–150 మధ్య ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. నాలుగో నెలలో అమ్మకాలే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో నెలలోనూ విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐలు) నికర అమ్మకందారులుగా నిలిచారు. దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి ఎఫ్ఐఐలు ఈ జూలైలో రూ.23,193 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. గతేడాది మార్చి నెల తర్వాత ఎఫ్ఐఐలు ఒక నెలలో ఈ స్థాయిలో అమ్మకాలకు పాల్పడటం ఇదే తొలిసారి. గతవారంలో ఏకంగా రూ.10,288 విలువైన షేర్లను అమ్మారు. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకు ధీటుగా దేశీయ ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపడుతూ సూచీలకు భారీ పతనాన్ని అడ్డుకుంటున్నారు. ఈ నెలలో డీఐఐ రూ.18,394 కోట్ల షేర్లను కొన్నారు. గత ఒక్క వారంలోనే రూ.8,206 కోట్ల షేర్లను కొన్నారు -
రూపాయికి ఒకేరోజు 52 పైసలు లాభం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుసగా ఆరవ ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాటన పయనించింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం ఏకంగా 52 పైసలు బలపడి 71.14 వద్ద ముగిసింది. ఈ ఆరు రోజుల్లో రూపాయి 125 పైసలు బలపడింది. అమెరికా–చైనా ఉద్రిక్తతలు తగ్గాయన్న అభిప్రాయాలు, వడ్డీరేట్ల తగ్గింపునకు సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌పై అమెరికా ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందన్న వార్తలు డాలర్‌ను బలహీన ధోరణికి నెట్టగా, ఇదే విషయం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచింది. దీనికితోడు కొంత దిగువకు వచ్చిన క్రూడ్ ఆయిల్ ధరలు, భారత్ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల కొనుగోళ్ల వంటి అంశాలూ రూపాయికి కలిసివచ్చాయి. బుధవారం రూపాయి 71.66 వద్ద ముగిసింది. గురువారం 71.46 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఒకదశలో 71 స్థాయినీ తాకింది. మొత్తంమీద తాజా పరిస్థితిని చూస్తుంటే డాలర్ మారకంలో రూపాయి విలువ సమీప కాలంలో 70 నుంచి 72 శ్రేణిలో ట్రేడవుతుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. గతేడాది అక్టోబర్ 9వ తేదీన డాలరుతో రూపాయి మారకం విలువ చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. -
రూపాయి ఒకేరోజు లాభం 39 పైసలు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు 39 పైసలు లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 68.50 వద్ద ముగిసింది. రూపాయికి ఇది గట్టి నిరోధ స్థాయి. 68.50 స్థాయిని కోల్పోయిన వెంటనే రూపాయి గతంలో వేగంగా మరింత క్షీణించింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, ఎన్నికల అనంతరం మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాల నేపథ్యంలో రూపాయి రెండు నెలల క్రితం 68 స్థాయినీ చూసింది. అయితే అటు తర్వాత ఇటీవలి అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు, ఈక్విటీ మార్కెట్ల పతనం, డాలర్ బలోపేతం, క్రూడ్ ధరలు తిరిగి ఆందోళనకర స్థాయికి చేరుతుండడం వంటి అంశాలు రూపాయికి ప్రతికూలంగా మారాయి. తాజా పరిణామాలు తక్షణం రూపాయి సెంటిమెంట్‌ను బలపరిచినా, క్రూడ్ ధరల పెరుగుదల, డాలర్ పటిష్టస్థాయి, అంతర్జాతీయ, దేశీయ ఆర్థిక అనిశ్చితులు దీర్ఘకాలంలో రూపాయి విలువను ఆందోళనకు గురిచేసేవే అని నిపుణుల అంచనా. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలపడ్డం, క్రూడ్ ఆయిల్ ధరల తక్షణ ఉపశమనం, శుక్రవారం కేంద్ర బడ్జెట్ అంశాలు తక్షణ రూపాయి బలోపేతం నేపథ్యం. -
ఎక్కే విమానం.. దిగే విమానం
విదేశీ ప్రయాణం అంటే భారతీయులకు తగని మోజులా ఉంది. ఎక్కే విమానం దిగే విమానంగా తెగ తిరిగేస్తున్నారు. గత అయిదేళ్లలోనే భారతీయులు విదేశీ ప్రయాణాలకు పెడుతున్న ఖర్చు భారీగా పెరిగింది. ఏకంగా 253 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర దేశాల్లో పర్యాటక ప్రాంతాలను చూడాలన్న ఆసక్తి, అత్యున్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడం గత కొంత కాలంగా బాగా పెరిగిపోయింది. దీంతో విదేశీయానాలు పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం 112 కోట్లు ఖర్చు పెడితే, 2018 సంవత్సరం వచ్చేసరికి ఆ ఖర్చు 28 వేల కోట్లకు పెరిగిపోయింది. ఇది ఏకంగా 253 రెట్లు ఎక్కువ. ఇక విదేశాల్లో చదువుల విషయానికి వచ్చేసరికి 2014లో 3వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది వచ్చేసరికి ఆ ఖర్చు 14 వేల కోట్లకు పెరిగింది. 2017లో భారత్ నుంచి వివిధ దేశాలకు 2.3 కోట్ల మంది ప్రయాణికులు తరలివెళ్లారు. విదేశీ ప్రయాణాలకు భారతీయులు పెడుతున్న ఖర్చు ఏ స్థాయిలో జరుగుతోందని అంటే, భారత దేశ వాణిజ్య లోటుపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. చమురు, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై పడుతున్న వాణిజ్య లోటుతో, ఈ విదేశీ ప్రయాణాల కారణంగా పడుతున్న ప్రభావం ఇంచుమించు సరిసమానంగా ఉంటోంది. ఎందుకీ ప్రయాణాలు ? లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత భారతీయులు విదేశాలకు రెక్కలు కట్టుకొని వెళ్లిపోతున్నారు. ఈ పథకం ద్వారా ప్రతీ పౌరుడు 2013–14లో వంద కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేయవచ్చునన్న పరిమితులు ఉండేవి. దానిని ఇప్పుడు ఏకంగా 2,50,00 డాలర్లకు పెంచేశారు. అంతేకాకుండా విదేశాల్లో క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని వాడుకునే సదుపాయం కూడా ఉంది. ఇవన్నీ కూడా విదేశీ ప్రయాణాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ‘2017 వరకు రూపాయి విలువలో పెద్దగా హెచ్చుతగ్గుల్లేవు. అంతేకాకుండా బ్యాంకుల్లో ఫైనాన్స్ కూడా సులభమైపోయింది. ప్రయాణాల కోసం ప్రత్యేకంగా లోన్ సౌకర్యం లేకపోయినప్పటికీ పర్సనల్ లోన్స్ పెట్టుకొని మరీ విదేశాలు చుట్టేసి వస్తున్నారు‘ అని ముంబైకి చెందిన ఒక బ్యాంకు అధికారి వెల్లడించారు. అయితే విదేశాల్లో పెట్టుబడులు, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి మాత్రం తగ్గిపోతున్నాయి. ఎందుకంటే విదేశాల్లో భారతీయులు మనీ ఇన్వెస్ట్ చేయడం, విదేశాల్లో జరిగే లావాదేవీలపై ఆర్బీఐ ఒక కన్నేసి ఉంచుతోంది. దీంతో విదేశాలకు వెళ్లి చూసి వచ్చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. -
ఐగేట్ నికర లాభం 7.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ సంస్థ ఐగేట్ గతేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కు 3.31 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌కు ఆర్జించిన నికర లాభం(3 కోట్ల డాలర్లు)తో పోల్చితే 7.5 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర ఆదాయం 27 కోట్ల డాలర్ల నుంచి 10 శాతం వృద్ధితో 30 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది. ఉత్తర అమెరికా మార్కెట్లో భారీ డీల్స్ కారణంగా నికర ఆదాయం పెరిగిందని వివరించింది. ఈ సంస్థ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్ధిక సంవత్సరంగా పాటిస్తుంది. గతేడాది కంపెనీ పనితీరు పట్ల కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో అశోక్ వేమూరి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది భారీ డీల్స్‌ను సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. 9 మంది కొత్త క్లయింట్లు లభించారని, వీటిల్లో ఐదు ఫార్చ్యూన్ 1000 కంపెనీలు ఐదున్నాయని వివరించారు. ఇక పూర్తి సంవత్సరానికి కంపెనీ నికర లాభం 10 కోట్ల డాలర్ల నుంచి 36 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, నికర ఆదాయం 107 కోట్ల డాలర్ల నుంచి 8 శాతం వృద్ధితో 115 కోట్లకు పెరిగాయి. -
రూపాయి నెల రోజుల గరిష్టానికి
ముంబై: స్టాక్ మార్కెట్ల జోరుతో దేశీ కరెన్సీ విలువ కూడా పుంజుకుంది. సోమవారం డాలరుతో రూపాయి మారకం విలువ 38 పైసలు ఎగబాకి 61.52 వద్ద స్థిరపడింది. ఇది నెల రోజుల గరిష్టస్థాయి కావడం గమనార్హం. ఎగుమతిదారులు, బ్యాంకులు డాలర్లను భారీగా విక్రయించడం కూడా రూపాయికి బలాన్నిచ్చిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికాలో ఇటీవల వెలువడిన ఉద్యోగ గణాంకాలు నిరుత్సాహకరంగా ఉండటంతో అక్కడి ఫెడరల్ రిజర్వ్ ఉద్దీపనల ఉపసంహరణ(ట్యాపరింగ్) జోరును తగ్గించే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో అంతర్జాతీయంగా పలు ప్రధాన కరెన్సీలతో డాలరు విలువ బలహీనపడేందుకు దారితీసిందని ఫారెక్స్ డీలర్లు చెప్పారు. క్రితం ముగింపు 61.90తో పోలిస్తే పటిష్టంగా 61.52 వద్ద సోమవారం రూపాయి ట్రేడింగ్ ప్రారంభమైంది. చివరకు 0.61 శాతం లాభంతో 61.52 వద్ద స్థిరపడింది. డిసెంబర్ 11 తర్వాత(61.25) రూపాయి మళ్లీ ఈస్థాయిలో ముగియడం ఇదే తొలిసారి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 376 పాయింట్లు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. -
2013లో డీల్ మార్కెట్ డీలా
ముంబై: ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న బలహీనతలను అద్దం పడుతూ 2013లో డీల్ మార్కెట్ డీలా పడింది. దేశీయ కంపెనీలకు సంబంధించిన దేశ, విదేశీ కొనుగోళ్లు, విలీనాల కార్యకలాపాలు మందగించి 31.5 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 12% తక్కువకాగా, 2009లో మాత్రమే ఇంతకంటే తక్కువ స్థాయిలో 21.5 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ జరిగాయి. థామ్సన్ రాయిటర్స్ రూపొందించిన వివరాల ప్రకారం డీల్స్ పరిమాణం సైతం దాదాపు 13% తగ్గింది. 2012లో 1,107 డీల్స్ నమోదుకాగా, 2013లో 967కు పరిమితమయ్యాయి. నాలుగో క్వార్టర్లో జరిగిన డీల్స్ విలువ 7.1 బిలియన్ డాలర్లుకాగా, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే దాదాపు 30% తగ్గాయి. అయితే మూడో క్వార్టర్‌తో పోలిస్తే మాత్రం 29% అధికం. సగటు పరిమాణం ఓకే గతే డాదితో పోలిస్తే డీల్స్ సగటు పరిమాణం 2013లో 7.61 కోట్ల డాలర్లకు చేరింది. గతంలో ఇది 7.35 డాలర్లుగా నమోదైంది. దేశీయ విలీనాలు, కొనుగోళ్లపై ఆర్థిక మందగమనం భారీ ప్రభావాన్నే చూపింది. దీంతో దేశీయ డీల్స్ 69% క్షీణించి 5.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతంలో 2004లో మాత్రమే ఇంతకంటే తక్కువగా 2 బిలియన్ డాలర్ల డీల్స్ జరిగాయి. వీటిలో అధిక శాతం అంటే 1.5 బిలియన్ డాలర్ల డీల్స్ మెటీరియల్స్ రంగంలో నమోదయ్యాయి. మొత్తం దేశీయ డీల్స్ పరిమాణంలో ఇవి 29.4%కు సమానం. అయితే గతేడాదితో పోలిస్తే ఈ రంగంలో జరిగిన డీల్స్ 75.4% తక్కువ. కాగా, మరోవైపు ఇదే కాలంలో దాదాపు 57% అధికంగా 24.7 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ డీల్స్ జరిగాయి. దేశీయ కంపెనీలకు సంబంధించిన డీల్స్ 49.5% పుంజుకుని 19.4 బిలియన్ డాలర్లను తాకాయి. గతేడాదిలో ఇవి 19.4 బిలియన్ డాలర్లు మాత్రమే. ఇంధనం, విద్యుత్ రంగాల విలీనాలు, కొనుగోళ్లు 173% పెరిగి రూ. 6.7 బిలియన్ డాలర్లకు చేరగా, హెల్త్‌కేర్ కంపెనీల డీల్స్ దాదాపు 25% ఎగసి 5 బిలియన్ డాలర్లను తాకాయి. -
రూపాయి రికవరీకి బ్రేక్
ముంబై: నాలుగు రోజులుగా రికవరీబాటలో నడుస్తున్న దేశీ కరెన్సీ మళ్లీ నష్టాల్లోకి జారింది. డాలరుతో రూపాయి మారకం విలువ బుధవారం 21 పైసలు నష్టపోయింది. క్రితం ముగింపు 62.36తో పోలిస్తే 62.57 వద్ద ముగిసింది. దిగుమతిదారులు.. ప్రధానంగా చమురు రిఫైనర్ల నుంచి తాజాగా డాలర్లకు డిమాండ్ జోరందుకోవడం, దేశీ స్టాక్ మార్కెట్ల పతనం ప్రభావంతో రూపాయి సెంటిమెంట్ బలహీనపడిందని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. గడిచిన నాలుగు రోజుల్లో దేశీ కరెన్సీ 135 పైసలు(2.12శాతం) పుంజుకున్న సంగతి తెలిసిందే. -
71 లక్షల కోట్ల డాలర్లకు షాడో బ్యాంకింగ్ వ్యవస్థ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా షాడో బ్యాంకింగ్ వ్యవస్థ పరిమాణం గతేడాది 5 లక్షల కోట్ల డాలర్ల(ట్రిలియన్) మేర ఎగిసి 71 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో భారత్ సహా పలు దేశాల బ్యాంకులు ఆయా షాడో బ్యాంకింగ్ సంస్థలకి ఇచ్చిన నిధుల పరిమాణం కూడా పెరిగింది. స్విట్జర్లాండ్‌కి కేంద్రంగా పనిచేసే ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల బోర్డు ఎఫ్ఎస్బీ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. నియంత్రణ వ్యవస్థ పరిధిలోకి రాకుండా జరిగే బ్యాంకింగ్ లావాదేవీలు మొదలైన వాటిని షాడో బ్యాంకింగ్ వ్యవస్థగా పరిగణిస్తారు. ఈ కార్యకలాపాలు భారీ స్థాయిలో పెరిగిపోతుండటం.. ఆర్థిక స్థిరత్వానికి ముప్పు తెచ్చిపెట్టగలవని ఇటీవలి ఆర్థిక సంక్షోభం తెలియజెప్పడంతో ఇటువంటి వాటిపై ఆందోళనలు నెలకొన్నాయి. బ్యాంకులు స్వయంగా రుణాలివ్వడం వల్ల వచ్చే రిస్కులతో పాటు, ఇతరత్రా రుణాలు మంజూరుకు మధ్యవర్తిత్వ షాడో బ్యాంకింగ్ సంస్థలపై ఆధారపడటం వల్ల వచ్చే రిస్కులూ భారత్, ఇండోనేషియా, సౌదీలో భారీగా పెరిగాయని ఎఫ్ఎస్బీ పేర్కొంది. -
బంగారం దిగుమతుల విలువ తగ్గింపు
న్యూఢిల్లీ: బంగారం టారిఫ్ విలువ తగ్గింది. 10 గ్రాములకు 440 డాలర్లుగా ఉన్న ఈ విలువ 417 డాలర్లకు (5%)తగ్గింది. వెండి విషయంలో ఈ విలువ యథాపూర్వం కేజీకి 738 డాలర్లుగా కొనసాగనుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ నెలారంభంలో ఔన్స్(31.1గ్రా)కు 1322 డాలర్ల వద్ద ఉన్న పసిడి విలువ గత రాత్రి 1266 డాలర్లకు పడిపోయిన నేపథ్యంలో ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ సెంట్రల్ (సీబీఈసీ) తాజా నిర్ణయం తీసుకుంది. బంగారంపై 10 శాతం దిగుమతి సుంకాన్ని ఈ నిర్దేశిత విలువపై విధిస్తారు. అంటే తాజా టారీఫ్ విలువ ప్రకారం దిగుమతి సుంకం 44 డాలర్ల నుంచి 41.7 డాలర్లకు (3.2 డాలర్ల వ్యత్యాసం) తగ్గుతుంది. రూపాయిల్లో ఈ తగ్గుదల దాదాపు రూ. 200 వుంటుంది. ఈ మేరకు గురువారం స్పాట్ మార్కెట్లో బంగారం ధర తగ్గుతుంది.