పాట్నా: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌కు చెందిన గువహటి-బరౌనీ పైప్‌లైన్‌ను బిహార్‌లో ధ్వంసం చేశారు దుండగులు. ఖగడియా జిల్లా బకియా గ్రామంలో పైప్‌ను కట్ చేసి ఆయిల్‌ను లీక్ చేశారు. దీంతో వేల లీటర్ల చమురు నేలపాలైంది. ఆయిల్ పైప్ లీకైన విషయం తెలియగానే సమీప గ్రామస్థులు వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. చమురు కోసం ఎగబడ్డారు.
మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పైప్ లీకైన తర్వాత వేల లీటర్ల చమురు రోడ్డుపై, పొలాలపై పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను మాత్రం ఇంకా గుర్తించలేదు.
ఐఓసీ అధికారులు హుటాహుటిన పైప్ లీకైన ప్రదేశానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమ ఇంజనీర్లను పిలిపించి లీకేజీని రిపేర్ చేశారు. అయితే పైప్ ఎలా లీకైందనే విషయం ఐఓసీ ఇంజనీర్లకు మాత్రమే తెలిసి ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పొరపాటున ఇక్కడ ఏమైనా జరిగి ఉంటే పెను విపత్తు సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు.
చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు..
Comments
Please login to add a commentAdd a comment