Indian Oil Corp (IOC)
-
ఆయిల్ పైప్ లైన్‌ను కట్ చేసిన దుండగులు.. పెట్రోల్ కోసం ఎగబడ్డ జనం
పాట్నా: ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్‌కు చెందిన గువహటి-బరౌనీ పైప్‌లైన్‌ను బిహార్‌లో ధ్వంసం చేశారు దుండగులు. ఖగడియా జిల్లా బకియా గ్రామంలో పైప్‌ను కట్ చేసి ఆయిల్‌ను లీక్ చేశారు. దీంతో వేల లీటర్ల చమురు నేలపాలైంది. ఆయిల్ పైప్ లీకైన విషయం తెలియగానే సమీప గ్రామస్థులు వందల సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. చమురు కోసం ఎగబడ్డారు. మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.పైప్ లీకైన తర్వాత వేల లీటర్ల చమురు రోడ్డుపై, పొలాలపై పడినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులను మాత్రం ఇంకా గుర్తించలేదు. ఐఓసీ అధికారులు హుటాహుటిన పైప్ లీకైన ప్రదేశానికి చేరుకున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి తమ ఇంజనీర్లను పిలిపించి లీకేజీని రిపేర్ చేశారు. అయితే పైప్ ఎలా లీకైందనే విషయం ఐఓసీ ఇంజనీర్లకు మాత్రమే తెలిసి ఉండాలని పోలీసులు పేర్కొన్నారు. పొరపాటున ఇక్కడ ఏమైనా జరిగి ఉంటే పెను విపత్తు సంభవించి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. చదవండి: వలపు వలలో చిక్కి రూ.28 కోట్ల కొకైన్ స్మగ్లింగ్.. చివరకు.. -
నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో.. అపోలో హాస్పిటల్స్‌కి గోల్డెన్ ఛాన్స్ !
Apollo Hospitals may replace Indian Oil: హెల్త్ సెక్టార్లో దశాబ్ధాల అనుభవం కలిగిన అపోలో హాస్పిటల్స్‌కి వైద్యపరంగా ఎన్నో మైళ్లు రాళ్లు అధిగమించింది. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో సైతం మరో ఘనత సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో లిస్టయిన కంపెనీలను స్మాల్‌క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ కంపెనీలుగా పరిగణలోకి తీసుకుంటారు. ఇందులో లార్జ్ క్యాప్ కంపెనీల్లో టాప్ 50 కంపెనీల షేర్ల విలువ, బదలాయింపు, ట్రేడింగ్‌లు ఎంతో కీలకం. నిత్యం వార్తల్లో మార్కెట్ హెచ్చు తగ్గులకు సంబంధించి వచ్చే వార్తలు కూడా ఈ టాప్ 50 కంపెనీలకు సంబంధించినవే ఉంటాయి. ఎన్ఎస్ఈ టాప్ 50 లిస్టులో చోటు సాధించడం ఆశామాషీ వ్యవహారం కాదు. ఇప్పుడు అపోలో హాస్పిటల్ ఈ ఘనత సాధించేందుకు అడుగు దూరంలో ఉంది. ఎడిల్వైజ్ ఆల్టర్రేటివ్ రీసెర్చ్ అందిస్తున్న వివరాల ప్రకారం ప్రతీ ఏడు ఫిబ్రవరి మధ్యలో ఎన్ఎస్ఈ తన టాప్ 50 జాబితాను సవరిస్తుంది. కంపెనీల పనితీరు, షేర్ల ట్రేడింగ్ ఆధారంగా కొన్ని కంపెనీలు కొత్తగా ఈ లిస్టులో చేరుతుండగా మరికొన్ని స్థానం కోల్పోతాయి. కాగా ప్రస్తుత అంచనాల ప్రకారం ఫిబ్రవరిలో చేపట్టే సెమీ యాన్యువల్ ఇండెక్స్ రివ్యూలో అపోలోకి టాప్ 50 కంపెనీల జాబితాలో చోటు దక్కవచ్చని మార్కెట్ వర్గాల అంచనా. ఇండియన్ ఆయిల్ స్థానాన్ని అపోలో భర్తీ చేయవచ్చని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రచురించింది. ఇటీవల కాలంలో అపోలో హాస్పిటల్స్ షేర్లు మార్కెట్లో ఎక్కువగా ట్రేడింగ్ జరుగుతున్నాయి. అపోలో షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతీ రోజు 175 మిలియన్ డాలర్ల ట్రేడింగ్ ఈ షేర్ల మీద జరుగుతోంది. వీటికి సంబంధించి రోజువారి సగటు ట్రేడింగ్ వాల్యూమ్ 1.7గా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ నుంచి పెట్టుబడులు వెనక్కి తరలిపోతున్నాయి. తాజా పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అపోలోకి టాప్ 50లో చోటు దక్కడం ఖాయమంటున్నారు. -
బీఎస్–6 ఇంధనం వచ్చేసింది..
న్యూఢిల్లీ: వాహన కాలుష్యాన్ని మరింత తగ్గించే బీఎస్–6 ప్రమాణాల పెట్రోల్, డీజిల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో శుద్ధమైన ఇంధనాన్ని వినియోగిస్తున్న అతి తక్కువ దేశాల సరసన భారత్ కూడా చేరింది. రేటులో మార్పులు లేకుండా పాత ధరకే వీటిని విక్రయిస్తున్నట్లు చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలియజేశాయి. సాధారణంగా లీటరుకు కనీసం రూ. 1 పెంచాల్సి ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో ఆ మేరకు సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నాయి. ‘దేశవ్యాప్తంగా మాకున్న 68,700 పెట్రోల్ బంకుల్లో నూటికి నూరు శాతం బీఎస్–6 పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుపుతున్నాం‘ అని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ తెలిపారు. కాలుష్య ప్రమాణాలు మారినా.. రేటులో మార్పేమీ లేదని చెప్పారు. ఐవోసీకి దాదాపు సగం మార్కెట్ వాటా ఉంది. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే బీఎస్–4 ప్రమాణాల నుంచి బీఎస్–6కి మారిన ఘనత భారత్‌కు మాత్రమే దక్కుతుందని సింగ్ చెప్పారు. వాస్తవానికి ప్రభుత్వం నిర్దేశించిన ఏప్రిల్ 1 డెడ్‌లైన్ కన్నా మూడు వారాల ముందునుంచే బీఎస్–6 అమ్మకాలు ప్రారంభించామన్నారు. అటు బీపీసీఎల్ కూడా తమ 16,000 పెట్రోల్ బంకుల్లో బీఎస్–6 గ్రేడ్ ఇంధన విక్రయాలు ప్రారంభించినట్లు తెలిపింది. నవరి నుంచే తమ రిఫైనరీల్లో కొత్త గ్రేడ్ ఇంధన ఉత్పత్తి ప్రారంభమైందని, ప్రస్తుతం తమకున్న మొత్తం 16,400 పైచిలుకు బంకుల్లో దీని విక్రయం మొదలుపెట్టామని హెచ్‌పీసీఎల్ సీఎండీ ఎంకే సురానా తెలిపారు. 2010లో యూరో3కి సరిసమానమైన బీఎస్–3 ఇంధనాలు అందుబాటులోకి వచ్చాయి. అటుపైన బీఎస్–4కి మళ్లడానికి ఏడేళ్లు పట్టింది. ఆ తర్వాత బీఎస్–5 జోలికి వెళ్లకుండా దానికన్నా మెరుగైన బీఎస్–6 ఇంధనాలు వచ్చాయి. పాత ఇంధనాలతో పోలిస్తే బీఎస్–6లో కాలుష్యకారక సల్ఫర్ పరిమాణం అత్యంత తక్కువగా 10 పీపీఎం (పార్ట్స్ పర్ మిలియన్) ఉంటుంది. బీఎస్–3లో 350 కాగా.. బీఎస్–4లో 50 పీపీఎం. -
జెట్ ఎయిర్వేస్కు ఐవోసీ షాక్
సాక్షి,ముంబై : సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అద్దె బకాయిలు చెల్లించలేక పలు విమాన సర్వీసులను రద్దు చేసింది మరోవైపు జీతాలు చెల్లించడంలో విఫలం కావడంతో జీతాలివ్వకపోతే విధులకు రాలేమని పైలట్లు తేల్చిపారేశారు. ఈ పరిస్థితి కొనసాగుతుండగానే తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎయిర్‌లైన్ మీద మరో బాంబు వేసింది. బకాయిలు చెల్లించని కారణంగా ఇకపై ఇంధన సరఫరా చేయబోమని శుక్రవారం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద మీద తాటిపండులా అయిపోయింది జెట్ ఎయిర్వేస్ పరిస్థితి. కాగా రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నజెట్ ఎయిర్వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్వేస్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. దీంత మొత్తం 69 విమానాలను నిలిపివేసి నట్టయింది. దాదాపు 16 వేల మంది సిబ్బందికి మార్చి నెల వేతనాలు బకాయి పడిన సంగతి తెలిసిందే.