సాక్షి,ముంబై : సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ప్రైవేట్ రంగ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే అద్దె బకాయిలు చెల్లించలేక పలు విమాన సర్వీసులను రద్దు చేసింది మరోవైపు జీతాలు చెల్లించడంలో విఫలం కావడంతో జీతాలివ్వకపోతే విధులకు రాలేమని పైలట్లు తేల్చిపారేశారు. ఈ పరిస్థితి కొనసాగుతుండగానే తాజాగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎయిర్‌లైన్ మీద మరో బాంబు వేసింది. బకాయిలు చెల్లించని కారణంగా ఇకపై ఇంధన సరఫరా చేయబోమని శుక్రవారం ప్రకటించింది. దీంతో మూలిగే నక్కమీద మీద తాటిపండులా అయిపోయింది జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి.
కాగా రుణ భారం, నిధుల సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నజెట్ ఎయిర్‌వేస్ వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. దాదాపు 119 విమానాలతో సర్వీసులు నడిపిన జెట్ ఎయిర్‌వేస్ ప్రస్తుతం లీజులు కట్టలేక మరో 15 విమానాలను పక్కన పెట్టినట్లు జెట్ ఎయిర్‌వేస్ రెండు రోజుల క్రితం ప్రకటించింది. దీంత మొత్తం 69 విమానాలను నిలిపివేసి నట్టయింది. దాదాపు 16 వేల మంది సిబ్బందికి మార్చి నెల వేతనాలు బకాయి పడిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment