సాక్షి,ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలనుమూటగట్టుకున్నాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) ఆందోళనకు తోడు, చమురు సంక్షోభం, స్టాక్‌మార్కెట్ల పతనానికి మరింత తోడయ్యాయి.దీంతో స్టాక్‌మార్కెట్ చరిత్రలోనే ఒక రోజులోనే ఇంత భారీ పతనం నమోదుకాలేదు. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఏకంగా 2450 పాయింట్లు కుప్పకూలింది. బ్యాంకింగ్, ఆటో సహా అన్ని రంగాలు అమ్మకాలతో కుదేలయ్యాయి. చివరికి సెన్సెక్స్ 1942 పాయింట్లు కుప్పకూలి 35643 వద్ద, నిఫ్టీ 538 పాయింట్ల పతనంతో 10451 వద్ద ముగిసాయి. 10451, తద్వారా సెన్సెక్స్ 36వేల కీలక మద్దతు స్థాయికి దిగువన, నిఫ్టీ 10500 స్థాయికి దిగువన ముగిసింది. యస్ బ్యాంకు, బీపీసీఎల్, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐషర్ మెటార్స్, ఐవోసీ, యూపీఎల్ మాత్రమే లాభపడ్డాయి. చమురు షాక్‌తో ఓన్‌జీసీ, వేదాంతా, రిలయన్స్‌టాప్ లూజర్స్‌గా నిలవగా, వీటితోపాటు జీ ఎంటర్‌టైన్‌మెంట్, ఇండస్ బ్యాంకు, టాటా స్టీల్, టాటా మోటార్స్, గెయిల్ భారీగా నష్టపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment